గ్యాస్‌ కనెక్షన్లు పెంచండి: ఎంపీ వినోద్‌ | Increase the Gas Connections: MP Vinod | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కనెక్షన్లు పెంచండి: ఎంపీ వినోద్‌

Sep 12 2017 1:24 AM | Updated on Aug 9 2018 8:51 PM

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్‌ కనెక్షన్ల మంజూరు సంఖ్యను పెంచాల్సిందిగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు ఎంపీ వినోద్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్‌ కనెక్షన్ల మంజూరు సంఖ్యను పెంచాల్సిందిగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు ఎంపీ వినోద్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయనను కలసిన వినోద్‌ వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే గ్యాస్‌ డీలర్లకు ఇస్తున్న కమీషన్‌ను పెంచాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

తెలంగాణలోని గ్రామీణ పాంత్రాల్లో గ్యాస్‌ సరఫరాకు వీలుగా రాష్ట్ర ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వినోద్‌ మీడియాతో మాట్లాడుతూ మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రదాన్‌ను కలసిన వారిలో గ్యాస్‌ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దీపక్‌సింగ్‌ గెహ్లాట్‌ తదితరులు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement