3.56 కోట్ల నకిలీ అకౌంట్లు గుర్తింపు | 3.56 Cr fake/duplicate accounts identified for 2015-16 under PAHAL | Sakshi
Sakshi News home page

3.56 కోట్ల నకిలీ అకౌంట్లు గుర్తింపు

Feb 6 2017 6:16 PM | Updated on Sep 5 2017 3:03 AM

3.56 కోట్ల నకిలీ అకౌంట్లు గుర్తింపు

3.56 కోట్ల నకిలీ అకౌంట్లు గుర్తింపు

పీఏహెచ్‌ఎల్‌ పథకం అమలు తర్వాత దేశవ్యాప్తంగా 3.56 కోట్ల నకిలీ అకౌంట్లను గుర్తించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రత్యక్ష్‌ హన్స్‌తంత్రి లాభ్‌(పీఏహెచ్‌ఎల్‌) పథకం అమలు తర్వాత దేశవ్యాప్తంగా 3.56 కోట్ల నకిలీ అకౌంట్లను గుర్తించారు. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభలో రాత పూర్వక సమాధానం ఇచ్చారు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 3.56 కోట్లు నకిలీ బ్యాంకు అకౌంట్లను గుర్తించినట్లు చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ సబ్సిడీ కింద రూ.40,569 కోట్లు, 2015-16 ఆర్థిక సంత్సరానికి రూ.16,074 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు.

వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం వల్ల(పీఏహెచ్‌ఎల్‌ పథకం ద్వారా), అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పడిపోవడం తదితర కారణాల వల్ల 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 24,495 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. 2017 జనవరి నెల వరకూ కోటి ఐదు లక్షల మంది ఎల్‌పీజీ వినియోగదారులు స్వచ్ఛందంగా ఎల్‌పీజీ సబ్సిడీని వదులుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement