ప్రతీ నిర్ణయం పేదల కోసమే..

Union Education Minister Dharmendra Pradhan Comments On PM Narendra Modi - Sakshi

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

తమ ప్రభుత్వానికి పేదలే ప్రధానమని, ప్రధాని మోదీ ప్రతి నిర్ణయాన్ని పేదలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్య వర్గ సమావేశాల తొలిరోజు విశేషాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, గరీబ్‌ కల్యాణ్‌ యోజనపై తొలిరోజు సమావేశాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్, హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ బలపర్చారని తెలిపారు.

గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద దేశంలోని 80 కోట్ల మంది జనాభాకు లబ్ధి చేకూరుతోందన్నారు. కరోనా సంకట కాలంలో ఈ పథకం పేదలకు ఎంతో మేలు చేసిందని, గత 25 నెలలుగా రూ.2.6 లక్షల కోట్లను పేదలకు అందించామని చెప్పారు. 2014 మేలో అధికారం చేపట్టినప్పుడు ప్రధాని మోదీ తొలిసారి చేసిన ప్రసంగంలో ఇచ్చిన హామీ మేరకు పేదలు, మహిళలు, యువత, దళితులు, బడుగు, బలహీనవర్గాల కోసం తమ ప్రభు త్వం పని చేస్తుందని ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పా రు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, సౌభాగ్య, ప్రతి ఇం టికి నల్లా నీరు, జన్‌ధన్‌ బ్యాంకు ఖతాలు, ముద్ర యోజన వంటి పథకాలు మంచి ఫలి తాలు ఇచ్చాయని పేర్కొన్నారు.

కోవిడ్‌ ప్రభా వం ఉన్నా.. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలతో గత 8 ఏళ్లలో విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు పెరిగాయని.. మన దేశం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోనే మహా శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దడం ఆత్మ నిర్భర్‌ భారత్‌ లక్ష్యమన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top