మీరట్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ | Delhi Meerut Launch PM Modi | Sakshi
Sakshi News home page

మీరట్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ

Feb 22 2026 1:15 PM | Updated on Feb 22 2026 1:38 PM

Delhi Meerut Launch PM Modi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీ - మీరట్  రాపిడ్ రైల్ మెట్రోను ప్రారంభించారు. 180 కిలోమీటర్ల వేగంతో ఈ మెట్రో రైల్ ప్రయాణించనుంది. 55 నిమిషాల్లో 82 కిలోమీటర్ల దూరంలోని గమ్యాన్ని చేరుకుంటుంది. మెట్రో రైల్ రాకతో ఘజియాబాద్, మీరట్ రూట్ లో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. 30 వేల కోట్ల రూపాయలతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టారు. ఘజియాబాద్, మోదీ నగర్, మీరట్  మధ్య ఈ మెట్రో రైలు రాకపోకలు సాగించనుంది.

భారత రవాణా ముఖచిత్రంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమయ్యింది. దేశంలోనే తొలి రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్‌) ‘నమో భారత్’ రైలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక కారిడార్‌తో పాటు, మీరట్ మెట్రోను కూడా ప్రధానమంత్రి  ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రధాని ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
 

సారాయ్ కాలే ఖాన్ మెట్రో స్టేషన్ వద్ద ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ఉన్న కీలకమైన 5 కిలోమీటర్ల మేర విస్తరించిన చివరి సెక్షన్‌ను ప్రధాని ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు రాజధాని పరిసర ప్రాంతాల మధ్య సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ చరిత్రాత్మక ఘట్టం నేపథ్యంలో సారాయ్ కాలే ఖాన్ ప్రాంగణమంతా ఇప్పటికే పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన అధికారులు, ప్రారంభోత్సవానికి ముందే స్టేషన్ పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు.  ఈ ప్రాజెక్టు ద్వారా మీరట్- ఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలకు ప్రపంచస్థాయి ప్రయాణ అనుభూతి కలగనుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఈ ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement