Rajnath Singh
-
భాగ్యనగరంలో..‘విజ్ఞాన్ వైభవ్ 2 కే 25’ (ఫొటోలు)
-
#AeroIndia2025 : ఆకాశంలో అద్భుతాలు చేసిన యుద్ధ విమానాలు (ఫోటోలు)
-
ఏరో ఇండియా ప్రదర్శన..ఆకట్టుకున్న విమానాల విన్యాసాలు (ఫొటోలు)
-
అంబరమంటే సంబరం..నేటి నుండి ఏరో ఇండియా ప్రదర్శన (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో యుద్ధ విమానం తయారీ..సత్తా చాటిన ‘వెమ్ టెక్నాలజీస్’
బెంగళూరు: ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా-2025 ఎగ్జిబిషన్లో ఈసారి హైదరాబాద్‌కు చెందిన రక్షణ రంగ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ సత్తా చాటనుంది. డీఆర్డీవోతో కలిసి వెమ్ టెక్నాలజీస్ తయారుచేసిన అత్యాధునిక అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ) యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఏరో ఇండియా షో ప్రారంభంలో భాగంగా ఫిబ్రవరి 10న ఆవిష్కరించనున్నారు.వెమ్ టెక్నాలజీస్ ‘ఏఎంసీఏ’ యుద్ధ విమానంలోని కీలక మాడ్యూల్స్‌ను తయారు చేయడమే కాకుండా పూర్తి విమానాన్ని హైదరాబాద్‌లోనే అసెంబుల్ చేసింది. యుద్ధ విమానాల ఫ్యుసిలేజ్‌లు,జనరేటర్ల తయారీలో వెమ్ టెక్నాలజీస్ పేరు గాంచింది. రక్షణ రంగ విమానాలు, హెలికాప్టర్లకు అవసరమైన ఆన్ బోర్డ్ సిస్టమ్‌లను కూడా వెమ్ తయారు చేస్తోంది. ఇండియన్ ఆర్మీ,నేవీ,ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన పలు రకాల వెపన్ సిస్టమ్స్‌ను కూడా కంపెనీ పూర్తి దేశీయంగా అభివృద్ధి చేస్తుండడం విశేషం. ఇటీవలే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ‘అసీబల్’ను వెమ్ అభివృద్ది చేసింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో హైదరాబాద్ రోజురోజుకు వృద్ధి చెందుతోందనడానికి ‘ఏఎంసీఏ’ యుద్ధ విమానం పూర్తిగా ఇక్కడ తయారవడమే నిదర్శనమని పలువురు రక్షణరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.Witness the power of innovation!The AMCA takes center stage in its first-ever full-scale display at the India Pavilion, Aero India 2025 pic.twitter.com/edDrb0Hde5— DRDO (@DRDO_India) February 9, 2025 -
పాక్ ఆక్రమిత కశ్మీర్ ‘భారత్ కిరీటంలో రత్నం’
జౌన్పూర్ (యూపీ): Pakistan Occupied Kashmir)పాక్ ఆక్రమిత కశ్మీర్ మన దేశపు కిరీటంలో రత్నం లాంటిదని, అది లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమని రక్షణ మంత్రి (Rajnath Singh)రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. (Jammu Kashmir)జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంపొందించే కుట్రను పాకిస్తాన్ కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. జౌన్పూర్ జిల్లా నిజాముద్దీన్ పూర్ గ్రామంలో బీజేపీ సీనియర్ నేత జగత్ నారాయణ్ దూబే ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ అక్కడ విలేకరులతో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్.. ఆ దేశానికి ఉగ్రవాదాన్ని, భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించే విదేశీ భూభాగం తప్ప మరేమీ కాదన్నారు. అక్కడ ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను కూల్చివేయాలని, లేదంటే తగిన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. పాక్ నేత అన్వర్ ఉల్హక్ భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రక్షణ మంత్రి మండిపడ్డారు. మత ప్రాతిపదికన భారత్‌కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు పాక్ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, ప్రస్తుతం అత్యధికంగా 5జీని ఉపయోగిస్తున్న భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
7 కోట్ల రుద్రాక్షలతో... ద్వాదశ జ్యోతిర్లింగాలు
మహాకుంభ్‌నగర్/లఖ్నో: ఇసుకేస్తే రాలని భక్తజన సందోహం నడుమ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కన్నులపండువగా కొనసాగుతోంది. వేడుకకు వేదికైన త్రివేణి సంగమానికి ప్రపంచం నలుమూలల నుంచీ భక్తులు వెల్లువెత్తుతూనే ఉన్నారు. శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మేళాలో పాల్గొన్నారు. వీఐపీ ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అక్షయ వటవృక్షం, పాతాళ్పురీ మందిర్, సరస్వతీ కూప్‌ను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. బడే హనుమాన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఇంతటి వేడుకలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. ‘‘మహా కుంభమేళా ఏ మతానికో, ప్రాంతానికో చెందినది కాదు. భారతీయతను ప్రతిబింబించే అతి పెద్ద సాంస్కృతిక పండుగ. భారత్‌ను, భారతీయతను అర్థం చేసుకునేందుకు చక్కని మార్గం’’అని అభిప్రాయపడ్డారు. మహా కుంభమేళాలో పలు విశేషాలు భక్తులకు కనువిందు చేస్తున్నా యి. మహాకుంభ్‌నగర్ సెక్టర్ 6లో ఏకంగా 7.51 కోట్ల రుద్రాక్షలతో రూపొందించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో లింగాన్ని 11 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడ ల్పు, 7 అడుగుల మందంతో రూపొందించారు. వాటి తయారీలో వాడిన రుద్రాక్షలను 10 వేల పై చిలుకు గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ సేకరించినట్టు నిర్వాహకుడు మౌనీ బాబా తెలిపారు. వాటిలో ఏకముఖి నుంచి 26 ముఖాల రుద్రాక్షల దాకా ఉన్నట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం 22న ప్రయాగ్‌రాజ్‌లో సమావేశం కానున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్ అభివృద్ధికి సంబంధించి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతకుముందు యోగి కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించనున్నారు. -
‘పీఓకే’పై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
జమ్ము:పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లేకుండా జమ్ముకశ్మీర్(Jammukashmir) అసంపూర్ణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnathsingh) అన్నారు.అఖ్నూర్ సెక్టార్‌కు సమీపంలోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్ వద్ద 9వ సాయుధ దళాల వెటరన్స్ డే నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్(Pakistan) అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.పాకిస్తాన్‌కు పీఓకే విదేశీ భూభాగం అవుతుంది తప్ప మరొకటి కాదన్నారు.అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను తయారు చేస్తోందని మండిపడ్డారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హఖ్ ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు.కశ్మీర్ పట్ల గత ప్రభుత్వాలు భిన్న వైఖరిని అనుసరించాయన్నారు.దీంతో ఇక్కడి సోదరసోదరీమణులు ఢిల్లీకి చేరువ కాలేకపోయారన్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానించడం మా ఎన్డీయే ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ ప్రజలకు, ఢిల్లీకి మధ్య దూరాన్ని చెరిపివేసేలా ఆయన పని చేస్తున్నారని ప్రశంసించారు.గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీవోకేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్‌లో భాగమేనని, తాము దానిని దానిని తీసుకుంటామన్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్లో శాంతి నెలకొందన్నారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆజాదీ నినాదాలు, నిరసనలతో ప్రతిధ్వనిస్తోందన్నారు. కాగా,పీఓకే ప్రజల స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడిన పార్టీలన్నింటినీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించడాన్ని భారత విదేశాంగ శాఖ గతంలో తప్పు పట్టింది. పాకిస్తాన్లో పీఓకే విలీనాన్ని ఆమోదించని వారిని, వ్యతిరేక ప్రచారం నిర్వహించేవారిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించవచ్చునన్న నిబంధన పీఓకే తాత్కాలిక రాజ్యాంగంలో ఉండడం గమనార్హం. -
‘రక్షణ’లో సంస్కరణలు
న్యూఢిల్లీ: 2025ను రక్షణ సంస్కరణల ఏడాదిగా కేంద్రం ప్రకటించింది. త్రివిధ దళాల ఆధునీకరణ, మెరుగైన సమన్వయం, నిరంతర యుద్ధ సన్నద్ధతతో పాటు ఆధునిక పరిజ్ఞానాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం తదితరాలే లక్ష్యంగా నూతన సంవత్సరంలో రక్షణ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం 9 సూత్రాలతో కూడిన సమగ్ర రక్షణ సంస్కరణల ప్రణాళికను రూపొందించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర పడింది. త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ దేశ భద్రతకు, సార్వ భౌమత్వ పరిరక్షణకు పెద్దపీట వేసేలా కనీవినీ ఎరగని రీతిలో త్రివిధ దళాలను సన్నద్ధం చేసేందుకు ఈ సంస్కరణలు బలమైన పునాదులు వేస్తాయని రాజ్‌నాథ్ వెల్లడించారు. త్రివిధ దళాల సంయుక్త కమాండ్ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ సామర్థ్యాలను మరింతగా ఏకీకృతం చేయడం ద్వారా యుద్ధ సమయాల్లో, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో రక్షణ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని రక్షణ శాఖ భేటీ అభిప్రాయపడింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సంయుక్త సైనిక కమాండ్లు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కమాండ్లోనూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో కూడిన యూనిట్లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లోని భద్రతాపరమైన సవాళ్లు తదితరాలను తిప్పికొట్టేందుకు పూర్తి సమన్వయంతో సాగుతాయి. ఈ త్రివిధ దళాలు ఇప్పటిదాకా విడివిడిగా కమాండ్ల కింద వేటికవే స్వతంత్రంగా పని చేస్తూ వస్తున్నాయి. అవి పరస్పరం మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం చాలా ఉందని భేటీ అభిప్రాయపడింది. 9 సూత్రాల రక్షణ సంస్కరణ ప్రణాళికలో ముఖ్యాంశాలు...→ దేశీయ రక్షణ సామర్థ్యం ప్రపంచ స్థాయి ప్రమా ణాలను అధిగమించే దిశగా నిరంతర కృషి. అందుకోసం బలగాల అవసరాలను ఎప్పటి కప్పు డు గుర్తించడం, వాటిని యుద్ధ ప్రాతిపది కన తీర్చడం.→ ఇందుకోసం రక్షణ సంబంధిత కొనుగోళ్లు, ఆయుధ సేకరణ ప్రక్రియలను వీలైనంతగా సరళతరం చేయడం, వాటిలో అనవసర జాప్యాలను నివారించడం.→ ప్రపంచవ్యాప్తంగా పలు ఆధునిక సైనిక శక్తుల్లోని అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం, వాటిని మన పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడం→ భారతీయ సంస్కృతి, ఆలోచనా ధోరణులను గర్వకారణంగా చర్యలు చేపట్టడం→ సైబర్, స్పేస్‌తో పాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్, హైపర్సోనిక్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలకు పెద్దపీట→ రక్షణ రంగంలో భావి సంస్కరణలకు మరింతగా ఊతం. తద్వారా భద్రతా దళాలను మరింత శక్తిమంతంగా, సాంకేతికంగా సాటి లేని శక్తిగా మార్చడం. భిన్నమైన డొమైన్లలో సమగ్ర కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహించగలిగేలా తీర్చిది ద్దడం.→ రక్షణ, పౌర, ప్రైవేటు రంగాల మధ్య మరింతగా పరిజ్ఞాన బదిలీకి వీలు కల్పించడం. వ్యాపార సరళీకరణ కోసం ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వా మ్యాలకు ప్రోత్సాహం.→ రాబోయే కొన్నేళ్లలో రక్షణ ఎగుమతుల్లో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చి దిద్దడం. విదేశీ తయారీదారులతో భారత రక్షణ పరిశ్రమ సంయుక్తంగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు చేయూత.→ మాజీ సైనికుల సంక్షేమంపై మరింత దృష్టి. వారి అనుభవానికి పెద్దపీట. -
పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం.. రాజ్‌నాథ్‌తో రాహుల్ గాంధీ
ఢిల్లీ: పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సభ వెలుపల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ గులాబీ పూలు, జాతీయ పతకాన్ని అందించారు. ఆ ఘటన సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదానీ అంశం ఉభయ సభల్ని కుదిపేస్తుంది. అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై సభలో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల్లో ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వస్తున్న రాజ్‌నాథ్ సింగ్‌కు కూటమి నేతలు గులాబీ పూలు, జాతీయ జెండాలు చేతికి ఇచ్చి తమ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రాహుల్ రాహుల్ స్వయంగా వెళ్లి ఇవ్వడంతో వాటిని రాజ్‌నాథ్ స్వీకరించారు.#WATCH | Delhi | In a unique protest in Parliament premises, Congress MP and LoP Lok Sabha, Rahul Gandhi gives a Rose flower and Tiranga to Defence Minister Rajnath Singh pic.twitter.com/9GlGIvh3Yz— ANI (@ANI) December 11, 2024 నవంబర్ 20న నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్యపై నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి. అదానీ సమస్యపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి,. జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఫండింగ్ చేసే ఒక సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీనిపై చర్చ జరపాలని పట్టుబట్టింది. దీంతో ఉభయ సభల్లో వాయిదా పర్వం కొనసాగుతుంది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిన్న వాయిదా పడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. -
చైనాకు చెక్.. పుతిన్‌తో భారత్ భారీ ఒప్పందం
ఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహాకారంపై చర్చించారు. రష్యా స్నేహితులకు భారత్ అన్నివేళలా అండగా నిలుస్తుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో రష్యాతో భారత ప్రభుత్వం భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది.రష్యా పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ఒప్పందంపై చర్చించారు. రాడార్ వ్యవస్థకు సంబంధించిన భారీ రక్షణ ఒప్పందాన్ని రష్యాతో భారత్ కుదుర్చుకుంది. సుమారు నాలుగు బిలియన్ డాలర్ల ఖరీదైన ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రాడార్ వ్యవస్థ వోరోనెజ్ రాడార్(Radar Voronezh)ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నది. ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు తుది దశలో ఉన్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.దేశ రక్షణ విషయంలో కేంద్రం టెక్నాలజీని పెంచే ఉద్దేశంతో ముందడుగు వేసింది. మిస్సైల్ బెదిరింపుల్ని గుర్తించి, ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే రాడార్ వ్యవస్థ కొత్త టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది. అయితే, అల్మాజ్-ఆంటే కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రేడార్లను ఉత్పత్తి చేస్తున్నది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, రేడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉన్నది.Russia is talks to sell gigantic radar to india.Almaz-Antey’s Voronezh radar detects missiles, aircraft, and threats up to 6,000–8,000 km, supporting Russia’s missile defence network. pic.twitter.com/AmCWaX01Rs— Abhimanyu Manjhi (@AbhimanyuManjh5) December 10, 2024ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రాడార్లతో పసికట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనున్నారు. అధునాతన రాడార్ వ్యవస్థ చైనా, దక్షిణ, మధ్య ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా ముప్పును గుర్తించగలదు. దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను వోరోనేజ్ రాడార్ వ్యవస్థ గుర్తిస్తుందని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వద్దే ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకోనున్నట్లు రష్యా చెబుతోంది.ఇక, ఇటీవల అల్మేజ్-ఆంటే బృందం భారత్‌లో పర్యటించింది. మేకిన్ ఇండియాలో భాగంగా సుమారు 60 శాతం రాడార్ వ్యవస్థను భారతీయ కంపెనీల ఉత్పత్తులతోనే నిర్మించనున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గలో దీన్ని ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ అడ్వాన్స్డ్ డిఫెన్స్ , ఏరోస్పేస్ సౌకర్యాలు ఉన్నాయి. -
బాపూఘాట్ అభివృద్ధికి.. 222.27 ఎకరాలు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో బాపూఘాట్ అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉన్న 222.27 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. మహాత్మాగాంధీ చితాభస్మాన్ని కలిపిన ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఏర్పాటు చేయనున్న బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాతి్వకతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బాపూఘాట్ వద్ద గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్, చేనేత ప్రచార కేంద్రం, ప్రజావినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. ఇందుకోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని కోరారు. కొత్త విమానాశ్రయాలకు అనుమతివ్వండి తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ప్రజలకు రవాణా వసతులను మెరుగుపర్చడంలో భాగంగా కొత్త విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీని రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ నుంచి పొందిందని వివరించారు. 253 ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని..ఈ మేరకు విమానాశ్రయ పనులకు, విమానాలు నడిపేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇక కొత్తగూడెం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా అంతర్గాం, ఆదిలాబాద్‌లలోనూ విమానాశ్రయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో భేటీల్లో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఆర్.రఘురామిరెడ్డి, కడియం కావ్య తదితరులు ఉన్నారు. -
హైపర్ సోనిక్ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: భారత సైనిక దళాల్లో మరో కీలక అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయంతంగా పరీక్షించారు. గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా అత్యధిక వేగంతో దూసుకెళ్లి, శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా మిస్సైల్ కలిగి ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది.ఈ పరీక్షను చరిత్రాత్మక ఘట్టంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. క్రిటికల్, అడ్వాన్స్డ్ మిలటకీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేరామంటూ ßæర్షం వ్యక్తంచేశారు. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకునే విషయంలో కీలక మైలురాయిని అధిగమించామని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అద్భుతమైన ఘనత సాధించామని ఉద్ఘాటించారు. డీఆర్డీఓతోపాటు సైనిక దళాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.ప్రత్యేకతలేమిటి? ⇒ దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)తోపాటు పలు ప్రభుత్వం, ప్రైవేట్ రంగ సంస్థలు సహకారం అందించాయి. ఇది వివిధ రకాల పేలోడ్స్‌ను 1,500 కిలోమీటర్లకు పైగా దూరానికి మోసుకెళ్లగలదు. ప్రయాణం మధ్యలో దిశను మార్చుకోగలదు. ⇒ సాధారణంగా హైపర్‌సానిక్ మిస్సైల్స్ పేలుడు పదార్థాలు లేదా అణు వార్హెడ్లను మోసుకెళ్తాయి. ధ్వని వేగం కంటే ఐదు రెట్లు అధిక వేగంతో దూసుకెళ్తాయి. అంటే గంటకు 1,220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ⇒ కొన్ని అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ మిస్సైల్స్ ధ్వని వేగం కంటే 15 రెట్లు వేగంతో ప్రయాణిస్తాయి. ⇒ ప్రస్తుతం రష్యా, చైనా దేశాలు హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఫ్రా న్స్, జర్మనీ, ఆ్రస్టేలియా, జపాన్, ఇరాన్, ఇజ్రా యెల్ తదితర దేశాలు సైతం ఈ తరహా క్షిప ణుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ⇒ చెనా సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాలని ఇండియా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ⇒ తదుపరి తరం ఆయుధ వ్యవస్థలు, డ్రోన్లు, కృత్రిమ మేధ(ఏఐ)తో పని చేసే ఆయుధాలు, పరికరాల అభివృద్ధికి భారత్ ప్రాధాన్యం ఇస్తోంది. ⇒ పృథీ్వ, ఆకాశ్, అగ్ని తదితర క్షిపణులను డీఆర్డీఓ గతంలో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. -
జార్ఖండ్‌లో కూటమి పార్టీలు ఆరిపోయిన టపాసులు: కేంద్ర మంత్రి
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. జేఎంఎం నేతృత్వంలోని పార్టీలు ఆరిపోయిన టపాసులని, బీజేపీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లే శక్తివంతమైన రాకెట్ అని అభివర్ణించారు. ఆయన రాష్ట్ర రాజధాని రాంచీలోని హతియాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.‘‘రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో స్పష్టంగా తెలుస్తోంది. దీపావళి పండుగ ఇప్పుడే ముగిసిపోయింది. జేఎంఎం, కాంగ్రెస్ , ఆర్జేడీ పార్టీలు ఇప్పుడు దీపావళి క్రాకర్స్‌తో కలిసిపోయాయి. కానీ, బీజేపీ మాత్రమే జార్ఖండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిమంతమైన రాకెట్. జేఎంఎం ఆదివాసీల రక్తాన్ని పీల్చుకుంది. వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. జార్ఖండ్‌కు చొరబాటుదారులు ఎందుకు వస్తున్నారని నేను హేమంత్ సోరెన్‌ను అడుగుతున్నా. రాష్ట్రంలోని గిరిజన జనాభా 28 శాతానికి ఎందుకు తగ్గిపోయింది?. బీజేపీకి రెండు పర్యాయాలు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో జార్ఖండ్ నిలబెడతాం. మేం జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని మార్చడమే కాకుండా వ్యవస్థను కూడా మారుస్తాం’’అని అన్నారు.మరోవైపు.. సోమవారం జార్ఖండ్‌లోని గర్వాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. జేఎంఎం కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతుగా ఉన్నందుకు జేఎంఎం నేతృత్వంలోని కూటమిని ‘చొరబాటుదారుల కూటమి’గా అభివర్ణించారు. ‘‘జార్ఖండ్‌లో బుజ్జగింపు రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతు ఇవ్వడంలో బిజీగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది గిరిజన సమాజానికి, దేశానికి పెనుముప్పు. ఈ సంకీర్ణ కూటమి.. చొరబాటుదారుల కూటమి’’ అని మోదీ అన్నారు. ఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అస్సాంలోని తేజ్‌పూర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి కొన్ని ప్రాంతాలలో వివాదాలను పరిష్కరించడానికి భారత్- చైనాలు దౌత్య, సైనిక చర్చలు జరుపుతున్నాయని అన్నారు.ఇరు దేశాల నిరంతర ప్రయత్నాల తర్వాత ఏకాభిప్రాయం కుదిరింది. సైనిక బలగాల క్రమశిక్షణ, ధైర్యం వల్లే ఈ విజయం సాధించాం. ఏకాభిప్రాయ ప్రాతిపదికన శాంతి పునరుద్ధరణ ప్రక్రియను కొనసాగిస్తామని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల దృఢమైన నిబద్ధత, అద్భుతమైన ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు.యువతకు నిజమైన స్పూర్తిదాయకంగా ఉంటూ, అంకితభావంతో మాతృభూమికి సేవ చేస్తున్న సైనికులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వైమానిక యోధులు సవాళ్లను ఎదుర్కోవడానికి నిత్యం సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. వైమానిక దళ సిబ్బంది అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. ఇది కూడా చదవండి: స్టార్మర్ దీపావళి వేడుకలు -
దేశ రక్షణలో రాజీలేదు: రాజ్‌నాథ్
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ విషయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా రాజీపడేది లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అత్యాధునిక పరికరాలు, ఆధునిక సాంకేతికతను సమకూర్చడం ద్వారా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. యుద్ధ రంగానికి సంబంధించిన సవాళ్లలో మార్పుల నేపథ్యంలో కచ్చితమైన, అత్యంత వేగవంతమైన సమాచార వ్యవస్థ ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధంలో బలగాలకు సరైన సమయానికి అందే సమాచారమే గెలుపు, ఓటములను నిర్ణయిస్తుందని అన్నారు. యుద్ధ క్షేత్రంలోని వారికి సరైన సమయంలో కచ్చితమైన సమాచారాన్ని చేరవేస్తేనే శత్రువును దెబ్బకొట్టగలుగుతారన్నారు. అందుకు వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) రాడార్ కేంద్రాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాల్లో రూ.3,200 కోట్ల నిధులతో భారత నావికాదళం నిర్మిస్తున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సమాచారం, సాంకేతికత కీలకం ‘దేశ భద్రతలో అత్యంత కీలకమైన వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కానుండటంతో సంతోషంగా ఉంది. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరగడం కూడా ఆనందించాల్సిన విషయం. భారత రక్షణ రంగంలో డాక్టర్ కలాం అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. భారత్‌కు కొత్త సైనిక సాంకేతికతను అందించడంతో పాటు, ఒక తరం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఆయన స్ఫూర్తినిచ్చారు. కొత్తగా నిర్మించనున్న రాడార్ స్టేషన్‌తో భారత నౌకాదళ సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు సుదూర ప్రాంతాలకు విశ్వసనీయమైన, సురక్షితమైన సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్య, వైద్య రంగాల్లో సాంకేతికత కీలక భూమిక పోషిస్తుంది. కరోనా సమయంలోనూ అత్యవసర సేవలు సాఫీగా నడవడంలో సమాచారం, సాంకేతికత ఎంతో కీలకంగా వ్యవహరించాయి. భారతదేశం తన వాణిజ్య, భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవాలంటే, బలమైన సముద్ర దళంగా ఉండాలంటే పటిష్టమైన సమాచార వ్యవస్థను కలిగి ఉండటం అవసరం..’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. భవిష్యత్తు కోసం నిర్ణయాలు ఉండాలి ‘పర్యావరణంపై ప్రాజెక్ట్ ప్రభావం లేకుండా చూస్తాం. పర్యావరణానికి హాని కలుగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తాం. దేశ రక్షణ, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండొద్దు. దేశ భద్రతే ప్రధానం. ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఐదేళ్లే అధికారంలో ఉన్నా..భవిష్యత్తు కోసమే నిర్ణయాలు తీసుకోవాలి. వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటులో సంపూర్ణ సహకారం అందించిన సీఎం రేవంత్‌రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. దేశం రక్షణ విషయానికి వస్తే అంతా ఏకమవుతామని ఈ రాడార్ కేంద్ర శంకుస్థాపనతో నిరూపితమైంది..’ అని రక్షణ మంత్రి అన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం ‘కొత్త రాష్ట్రమైనా తెలంగాణకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. వ్యవసాయంలో అధునిక పద్ధతులు, అభివృద్ధితో దేశంలో తెలంగాణ కీలక భూమిక పోషిస్తోంది. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సంస్థలతో పాటు రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు గొప్ప పేరుంది. తాజాగా వీఎల్ఎఫ్ స్టేషన్ ప్రారంభమైతే స్థానిక ప్రజలకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది..’ అని రాజ్‌నాథ్ వివరించారు. అభివృద్ధి తప్ప ప్రకృతి అనర్ధాలు లేవు: సీఎం దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటును కొందరు వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ రాడార్ కేంద్రం ఏర్పాటుతో దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందని చెప్పారు. ఇప్పటికే అనేక రక్షణ రంగ సంస్థలతో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రదేశంగా ఉందని గుర్తుచేశారు. తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. రెండో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం మన ప్రాంతంలో రావడం గర్వకారణం. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దీనికి భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి నిర్ణయాలన్నీ 2017లో గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం సమంజసం కాదు. ఇక్కడ రామలింగేశ్వరస్వామి దర్శనానికి దారి వదలండి. విద్యా సంస్థల్లో స్థానికులకు అవకాశం కల్పించండి. వీఎల్ఎఫ్ కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని రక్షణశాఖ మంత్రికి నేను మాట ఇస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నౌకాదళ ముఖ్య అధికారి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి మాట్లాడుతూ.. భారత నావికాదళ కమ్యూనికేషన్ సామర్థ్యాలలో కొత్త అధ్యాయానికి ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు నాంది పలుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజ్‌నాథ్‌కు సీఎం, కేంద్రమంత్రుల స్వాగతం వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేటకు వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శంకుస్థాపనకు హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో అంతా రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రాజ్‌నాథ్ సాయంత్రం 4.01 గంటలకు హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుని 4.18 గంటలకు విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు. -
దామగుండం రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన రాజ్‌నాథ్ (ఫొటోలు)
-
రాడార్ ప్రాజెక్ట్ పై అపోహలు వద్దు ఏదైనా ప్రమాదం ఉంటే..
-
రాడార్ స్టేషన్‌పై అపోహలొద్దు : రాజ్‌నాథ్ సింగ్
సాక్షి,దామగుండం : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవిలో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్ (వీఎల్ఎఫ్) ఏర్పాటుపై అపోహలు వద్దని అన్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. మంగళవారం (అక్టోబర్ 15) రాజ్ నాథ్ సింగ్ నేవీ రాడర్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు.. దేశ భద్రతవేరు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అపోహపడుతున్నారు. పర్యావరణ సంరక్షణలో కేంద్రం దృఢనిశ్చయంతో ఉంది. స్థానికులపై ప్రభావం పడుతుందంటే పునరావాసం’ కల్పిస్తామని హామీ ఇచ్చారు.స్థానికులపై వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్)నుంచి ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. స్థానికుల ఆర్థిక ప్రగతికి వీఎల్ఎఫ్ దోహదపడుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయిని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. -
‘రాడార్’కు అనుమతులిచ్చింది వారే : సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: దేశ రక్షణలో తెలంగాణ కీలక అడుగు వేస్తోందని, డిఫెన్స్, ఆర్మీ విభాగాల్లో హైదరాబాద్ వ్యూహాత్మక స్థానంలో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ ఏర్పాటు చేయనున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు మంగళవారం(అక్టోబర్15) శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ‘వీఎల్ఎఫ్ స్టేషన్ పై కొందరు అపోహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో ఇలాంటి స్టేషన్ ఏర్పాటు చేసి 34 ఏళ్లు అవుతున్నా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. వివాదం చేసే వాళ్ళు దేశ రక్షణ కోసం ఆలోచన చేయాలి. అసలు బీఆర్ఎస్ హయాంలోనే రాడార్ స్టేషన్‌కు అనుమతులిచ్చారు. దేశ రక్షణపై వివాదాలు సృష్టించే వారికి కనువిప్పు కలగాలి. నేను, స్పీకర్ ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దేశ రక్షణ కోసం రాజకీయాలను వదిలి కేంద్రానికి సహకరిస్తున్నాను. కేంద్ర రక్షణ మంత్రి వేరే పార్టీ అయినా... నేను వేరే పార్టీ అయినా దేశ రక్షణ కోసం అందరం ఒకటే. వీఎల్ఎఫ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది’అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఓ వైపు మరణశాసనం..మరోవైపు సుందరీకరణ ఎలా: కేటీఆర్ -
కంటోన్మెంట్లో కారుణ్య నియామకాలు చేపట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా మహ మ్మారి వేళ కంటోన్మెంట్లో పనిచేసిన మున్సి పల్ కార్మికులు సుమారు వంద మందికి పైగా మృతి చెందారు.ఐదు శాతం కంటే ఎక్కువ మందికి కారుణ్య నియామకాలు చేపట్టవద్దని రక్షణ శాఖ నిబంధన ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించి కరోనా సమయంలో మృతి చెందిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఈటల రాజేందర్ తెలిపారు.జేసీఓపీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకారం18వ లోక్‌సభ ‘జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్’ చైర్మన్‌గా సోమవారం ఢిల్లీలోని కార్యాలయంలో ఎంపీ ఈటల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. ఆయనకు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమిటీకి ఈటల చైర్మన్ కాగా.. తొమ్మిదిమంది లోక్‌సభ ఎంపీలు, ఐదుగురు రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉంటారు. -
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఈటల భేటీ
ఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కంటోన్మెంట్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కరోనా సమయంలో పనిచేస్తూ దాదాపు 100 మందికి పైన పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మికుల అంశాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని కారుణ్య నియామకాలు చేపట్టాని కోరారు.కారుణ్య నియామకాలు ఐదు శాతం మించకూడదన్న నిబంధనను సడలించి , ఈ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
దామగుండం.. రాడార్ గండం!
సాక్షి, హైదరాబాద్: దామగుండం.. అడవుల్లో నేవీ రాడార్ నిర్మాణం ప్రతిపాదనతో ఈ ప్రాంతం వార్తలకెక్కింది. తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందని, అడవుల విధ్వంసానికి పాల్పడితే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీనే దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని సమాచారం. ఔషధ మొక్కలకు నిలయం.. వందల ఏళ్ల ఆలయం వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్టు పచ్చని చెట్లతో జీవవైవిధ్యానికి మారుపేరుగా ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలకు జీవనాధారంగా, జంతు జాతులు, పక్షులకు ఆలవాలంగా ఉంది. దాదాపు 206 రకాల జాతుల పక్షులకు ఈ అడవులు నెలవుగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలకు ఈ అడవి నిలయం. ఈ అడవుల మధ్యలోనే 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇలవేల్పుగా రామలింగేశ్వరుని కొలుస్తున్నారు. అడవి మధ్యలో దేవాలయానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. కాగా రాడార్ నిర్మాణం కోసం.. ఈ అడవుల్లోని 2,900 ఎకరాల భూమిని నావికాదళం అధికారులు స్వా«దీనం చేసుకోనున్నారు. అయితే ఈ క్రమంలో 12 లక్షల చెట్లను నరికివేస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీపంలో ఉన్న హైదరాబాద్‌కూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, పశు పక్షాదులకు నిలువ నీడ లేకుండా పోతుందని చెబుతున్నారు. ఇక రాడార్ చుట్టూ కంచె వేస్తే తాము ఆలయానికి వెళ్లి పూజలు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. తమ అడవిలో తాము పరాయివారిగా మారుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేమిటీ నేవీ రాడార్? నౌకలు, జలాంతర్గాముల (సబ్మెరైన్ల)తో సమాచార మార్పిడిని (కమ్యూనికేషన్) మెరుగుపరుచుకునేందుకు నావికాదళం వెరీ లోఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్లను నిర్మిస్తుంది. దామగుండం సముద్రమట్టానికి 460 మీటర్ల ఎత్తులో ఉన్నందున శత్రు దేశాల కళ్లు కప్పి సమాచార మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుందని, వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం ఎంతో అనుకూలమైనదని నేవీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో తమిళనాడులోని తిరునల్వేలిలో కట్ట»ొమ్మన్ రాడార్ స్టేషన్ మాత్రమే ఉంది. దీన్ని 1990లో నిర్మించారు. వాస్తవానికి దామగుండంలో రెండో స్టేషన్ నిర్మించాలని ఏళ్ల క్రితమే నిర్ణయించినా ముందుకుసాగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే కాకుండా ఇందుకోసం తూర్పు నావికాదళానికి కావాల్సిన 2,900 ఎకరాల భూమిని బదలాయించేందుకు అంగీకరించింది. ఈ స్టేషన్‌ను 2027 నాటికి పూర్తి చేయాలని నేవీ భావిస్తోంది. రాడార్ నిర్మాణంతో పాటు ఇక్కడ దాదాపు 3 వేల మంది నివాసం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. రేడియేషన్ ముప్పు ఉండదంటున్న శాస్త్రవేత్తలు సాధారణంగా రాడార్ వ్యవస్థ చాలా తక్కువ (3– 30 కిలోహెడ్జ్) రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. పైగా ఇక్కడ దాదాపు 450 మీటర్ల ఎత్తు టవర్లు ఉంటాయని, వీటివల్ల చుట్టుపక్కల ఉండే ఏ వస్తువుకు కానీ, వ్యక్తికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని రక్షణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర జలాల గుండా చొచ్చుకుపోయే ఫ్రీక్వెన్సీ తరంగాల ఆధారంగా సబ్ మెరైన్లలోని సిబ్బందితో సమాచార మార్పిడి జరుగుతుందని పేర్కొంటున్నారు. 12 లక్షల చెట్లు తొలగింపు అవాస్తవం! ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆటవీ శాఖ అధికారులు మాత్రం ఇది అవాస్తవం అంటున్నారు. నేవీకి అప్పగించే భూమిలో చాలావరకు చిన్న పొదలు, ఖాళీ ప్రదేశం మాత్రమే ఉందని, దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోరని చెబుతున్నారు. కేవలం 1.5 లక్షల చెట్లు తొలగించే అవకాశం ఉన్నట్లు ఫారెస్టు శాఖ అంచనా వేస్తోంది. రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రాంతం, ఇతర నిర్మాణాలు చేపట్టే ప్రదేశాల్లో మాత్రమే చెట్లను తొలగిస్తారు. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా 17.5 లక్షల మొక్కలు నాటేందుకు ఆటవీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అరుదైన జాతులు కనుమరుగు దామగుండం రాడార్ స్టేషన్ నిర్మాణంతో అడవుల్లో పచ్చదనం పోతుంది. అరుదైన జంతు జాతులు కనుమరుగవుతాయి. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. చెట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో లక్షలాది చెట్లను నరికేయడం చాలా దారుణం. సమీపంలోని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వాతావరణం కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రాజెక్టును వేరే ప్రాంతానికి తరలించాలి. – రుచిత్ ఆశ కమల్, క్లైమేట్ ఫ్రంట్ ఇండియా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మాకెవరూ సహకరించడం లేదు. అసలు రాడార్ స్టేషన్‌తో ఎలాంటి పరిణామాలు ఉంటాయో సరిగ్గా అవగాహన కల్పించే వాళ్లు కూడా లేరు. దీంతో అది నిర్మించిన తర్వాత నిజంగా ఏం జరుగుతుందో తెలియట్లేదు. – పి.వెంకట్‌రెడ్డి, పూడూరు గ్రామవాసి -
పాక్ మనతో స్నేహంగా ఉంటే..
పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ మనతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తే అది ఐఎంఎఫ్‌ను కోరుతున్న సాయానికి మించిన బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చి ఉండేవాళ్లమని పేర్కొన్నారు. కశీ్మర్లోని బందిపొర జిల్లా గురెజ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘జమ్మూకశీ్మర్ ఆర్థికాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2014–15లో ప్రకటించిన ప్యాకేజీ ఇప్పుడు రూ.90 వేల కోట్లకు చేరింది. ఇది ఐఎంఎఫ్‌ను పాక్ కోరుతున్న బెయిలౌట్ ప్యాకేజీ కంటే ఎంతో ఎక్కువ’’ అన్నారు. ‘‘పాక్ మిత్రులారా! ఇరుగుపొరుగు దేశాలైన మన మధ్య విభేదాలెందుకు? మన మధ్య సత్సంబంధాలుంటే మీకు ఐఎంఎఫ్ కంటే ఎక్కువే ఇచ్చి ఉండే వాళ్లం’’ అని మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ‘‘అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల నుంచి తెచ్చుకున్న అప్పులను పాక్ దురి్వనియోగం చేస్తోంది. ఉగ్రవాద ఫ్యాక్టరీని నడపటానికి వాడుతోంది. వారిని మనపైకి పంపుతోంది. అందుకే అంతర్జాతీయ వేదికలపై పాక్ ఒంటరైంది. మిత్ర దేశాలు సైతం దాన్ని దూరంగా పెట్టాయి’’ అని విమర్శించారు. – శ్రీనగర్ -
హేమంత్ అవినీతి సీఎం: రాజ్‌నాథ్
ఇట్ఖోరి (జార్ఖండ్): జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అత్యంత అవినీతిపరుడైన సీఎంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ఉన్నతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ఆడుకున్నారని విమర్శించారు. సోరెన్‌ను గద్దెదింపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ చేపట్టిన పరివర్తన్ యాత్రను ఇట్ఖోరిలో శనివారం రాజ్‌నాథ్ ప్రారంభించారు. హేమంత్ సోరెన్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. అవినీతి మరకలున్న వారిని భారత్ ఎప్పటికీ ఆమోదించబోదన్నారు. బీజేపీ సీఎంలు బాబూలాల్ మరాండి, అర్జున్ ముండా, రఘుబర్ దాస్‌లు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనలేదన్నారు. అధికారిక కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలను జార్ఖండ్ ప్రగతిని అడ్డుకుంటున్న స్పీడ్‌బ్రేకర్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్, రొహింగ్యా చొరబాటుదారులకు కొమ్ముకాస్తోందని రాజ్‌నాథ్ ఆరోపించారు. -
అఫ్జల్ గురుకు పూల మాల వేయాలా?: రాజనాథ్ సింగ్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.‘నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానూభూతి ప్రదర్శిస్తోంది. ఇటీవల పార్టీకి చెందిన నేత ఒమర్ అబ్దుల్లా పార్లమెంట్ మీద దాడి చేసిన దోషి అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. నేను ఒమర్ అబ్దులా అడుగుతున్నా.. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష బదులుగా పూలమాల వేయమంటారా?. ఆ పార్టీ జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌న పునరుద్ధరిస్తామని చెబుతోంది. ...కానీ, గత ఐదేళ్లలో రాష్ట్రంలో 40వేల ఉద్యోగాలు కల్పించాం. జమ్ము కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రజలు భారత్‌లో భాగం కోరుకునే స్థాయిలో మేము కశ్మీర్‌ను అభివృద్ధి చేస్తాం. పీవోకేలోని ప్రజలను పాకిస్తాన్ విదేశీలుగా చూస్తే.. భారత్ తమ సొంతవారిగా చూస్తుంది’ అని అన్నారు. ఇక.. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.చదవండి: అఫ్జల్ గురు ఉరిశిక్ష వల్ల ప్రయోజనం లేదు: ఒమర్ అబ్దుల్లా -
మోదీ సారథ్యంలో కశ్మీర్లో బీజేపీ ప్రచారం
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో చేపట్టే మొదటి విడత ఎన్నికల ప్రచారంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి తదితర 40 మంది కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయం ఇన్చార్జి అరుణ్ సింగ్ ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. నిర్ణీత గడువులోగా సవరించిన మరో జాబితా అందజేస్తే తప్ప, మూడు దశలకు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే ఉంటుందని ఆయన ఈసీకి వివరించారు. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25వ తేదీలతోపాటు నవంబర్ ఒకటో తేదీన మూడు విడతలుగా ఎన్నికలు జరుగనుండటం తెలిసిందే. -
23 నుంచి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటన
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 23 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆహ్వానం మేరకు ఆయన అమెరికా పయనమవుతున్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 26 వరకు అమెరికాలోనే ఉండనున్నారు.ఈ పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ అమెరికా రక్షణ మంత్రితో సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుని జాతీయ భద్రతా వ్యవహారాల సహాయకుడు జేక్ సుల్విన్తో కూడా రక్షణ మంత్రి భేటీ కానున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేస్తుందని భావిస్తున్నారు. అమెరికా రక్షణ పరిశ్రమతో రక్షణ మంత్రి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. Defence Minister Rajnath Singh will be undertaking an official visit to the United States from August 23 to 26, on the invitation of the US Secretary of Defence Lloyd Austin. During the visit, the Raksha Mantri will hold a bilateral meeting with his US counterpart Secretary… pic.twitter.com/YV3vzUQrTw— ANI (@ANI) August 21, 2024 -
కరుణానిధి స్మారక రూ.100 నాణెం విడుదల
సాక్షి, చెన్నై: డీఎంకే దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారక రూ.100 నాణేన్ని ఆదివారం చెన్నైలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. మొదటి నాణేన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందుకున్నారు. డీఎంకే ప్రభుత్వం ఏడాది పొడవునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలను జరిపింది. ఆయన ముఖచిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని కేంద్రం విడుదల చేసింది. ఆదివారం చెన్నై కలైవానర్ అరంగంలో జరిగిన వేడుకలో ఈ నాణేన్ని విడుదల చేశారు. కరుణ జీవిత ప్రస్థానంతో రూపొందించిన 7డీ టెక్నాలజీ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. -
రక్షణ కట్టుదిట్టం..
న్యూఢిల్లీ: చైనా కవ్వింపులు, పాక్ ముష్కరుల చొరబాట్లతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండే సైన్యంతోపాటు భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మరింత పటిష్టతే లక్ష్యంగా మోదీ సర్కార్ మరోమారు రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. 2024–25 ఆర్థికసంవత్సరంలో రక్షణ రంగానికి రూ.6,21,940.85 కోట్లు కేటాయించింది. అత్యాధునిక డ్రోన్లు, యుద్ధవిమా నాలు, నౌకలు, ఆయుధాలు, ఇతర సైనిక ఉపకరణాల కొనుగోలు కోసం ఏకంగా రూ.1,72,000 కోట్లను కేటాయించారు. తాజా కేంద్ర బడ్జెట్లో రక్షణరంగ వాటా 12.9 శాతానికి పెరగడం విశేషం. గత ఆర్థికసంవత్సరంతో పోలిస్తే ఈసారి రక్షణరంగానికి కేటాయింపులు 4.79 శాతం పెంచారు. రక్షణ రంగంలో స్వావలంబనే లక్ష్యంగా సైనిక ఉపకరణాల స్థానిక తయారీని మరింత ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. అందుకే స్థానిక ఉపకరణాల సేకరణ కోసం రూ.1,05,518.43 కోట్లను కేటాయించింది. దీంతో బీజేపీ సర్కార్ లక్షిత రక్షణరంగంలో ఆత్మనిర్భరత మరింతగా సాకారంకానుంది. లక్షల కోట్ల బడ్జెట్‌ను రక్షణరంగానికి కేటాయించిన విత్తమంత్రి నిర్మలకు కృతజ్ఞతలు అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘‘ ఆధునిక ఆయుధ సంపత్తి సమీకరణతో త్రివిధ బలగాల శక్తిసామర్థ్యాలు మరింత ద్విగుణీకృతం కానున్నాయి. దేశీయ సంస్థలు తయారుచేసిన సైనిక ఉపకరణాలు, ఆయుధాలతో దేశం రక్షణరంగంలోనూ ఆత్మనిర్భరతను వేగంగా సాధించనుంది’’ అని రాజ్‌నాథ్ అన్నారు.అగ్నిపథ్ పథకం కోసం రూ.5,980 కోట్లుగత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి సరహద్దుల వెంట రహదారుల నిర్మాణానికి కేటాయింపులు 30 శాతం పెరగడం విశేషం. బీఆర్వోకు కేటాయించిన రూ.6,500 కోట్ల నిధులతో సరిహద్దుల వెంట మౌలికవసతుల కల్పన మెరుగుపడనుంది. రక్షణరంగ పరిశ్రమల్లో అంకుర సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐడెక్స్ పథకానికి రూ.518 కోట్లు కేటాయించారు. అంకుర సంస్థలు, సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు, ఆవిష్కర్తలు ఇచ్చే కొత్త ఐడియాలను ఆచరణలో పెట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.కోస్ట్‌గార్డ్ ఆర్గనైజేషన్‌కు రూ.7,651 కోట్లు కేటాయించారు. తేజస్ వంటి తేలికపాటి యుద్ధవిమానాలను తయారుచేస్తూ నూతన విమానాల డిజైన్, రూపకల్పన, తయారీ కోసం కృషిచేసే హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు రూ.1,600 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం కోసం రూ.10,535 కోట్లు కేటాయించారు. ఎన్సీసీ కోసం రూ.2,726 కోట్లు, త్రివిధ దళాల్లో అగ్నిపథ్ పథకం నిర్వహణ కోసం రూ.5,980 కోట్లు కేటాయించారు. -
ఎయిమ్స్‌లో రాజ్‌నాథ్‌సింగ్
సాక్షి,ఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(73) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం(జులై11) ఉదయం రాజ్‌నాథ్ వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి ప్రైవేట్ వార్డులో ఆయనకు వెన్నునొప్పి సంబంధిత పరీక్షలు చేశారు. -
Rajnath Singh Birthday: ఫిజిక్స్ లెక్చరర్ నుంచి రక్షణ మంత్రి వరకూ..
ఆయన చదువుకునే రోజుల్లో తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం ఫిజిక్స్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. నేడు దేశ రక్షణమంత్రిగా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనే రాజ్‌నాథ్ సింగ్.దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పుట్టినరోజు నేడు. ఆయన 1951 జూలై 10న యూపీలోని చందౌలీలోని చకియాలో జన్మించారు. బీజేపీకి చెందిన సీనియర్ నేతలలో ఒకనిగా గుర్తింపు పొందారు. అయితే రాజ్‌నాథ్ సింగ్ అధ్యాపకునిగా తన కెరీర్ ప్రారంభించారనే సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజ్‌నాథ్ సింగ్ రైతు కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంబదన్ సింగ్. తల్లి పేరు గుజరాతీ దేవి. రాజ్‌నాథ్ తన ప్రారంభ విద్యను గ్రామంలోనే అభ్యసించారు. అనంతరం గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేశారు.రాజ్‌నాథ్ సింగ్ తొలుత యూపీలోని మీర్జాపూర్‌లోని కేబీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఫిజిక్స్‌లో లెక్చరర్‌గా చేరారు. మొదటి నుండి చాలా తెలివైన విద్యార్థిగా పేరొందిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యనిర్వాహకునిగానూ పనిచేశారు. 1974లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1977లో యూపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988లో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎమ్మెల్సీగా ఎన్నికై 1991లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీలో విద్యా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కాపీయింగ్ నిరోధక చట్టాన్ని, వేద గణితాన్ని ప్రవేశపెట్టారు.రాజ్‌నాథ్ సింగ్ 1994లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1999, నవంబరు 22న కేంద్ర ఉపరితల రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2000, అక్టోబర్ 28న యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. 2003, మే 24న కేంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాన్ని కూడా పర్యవేక్షించారు.2005 డిసెంబర్ 31న రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. 2009 డిసెంబర్ 19 వరకు ఈ పదవిలో కొనసాగారు. 2009లో ఘజియాబాద్ నార్త్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014, మే 26న ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 మే 30 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. అనంతరం రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడంతో ఆయన మరోమారు రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
2.70 లక్షల ఇళ్లు ఇవ్వండి: సీఎం రేవంత్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో తెలంగాణకు బీఎల్సీ మోడల్లో 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రికి వివరించారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. తెలంగాణలో రాష్ట్ర సర్కారు నిర్మించ తలపెట్టిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని కేంద్ర మంత్రికి తెలిపారు. వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్సీ) విధానంలో నిర్మించనున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ)– పీఎంఏవై (యూ) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను పీఎంఏవై (యూ) మార్గదర్శకాల ప్రకారం నిర్మిస్తామని వివరించారు. పీఎంఏవై (యూ) కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి, రూ.2,390.58 కోట్లు గ్రాంటుగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ.1,605.70 కోట్లే ఇచ్చారని, మిగతా నిధులు విడుదల చేయాలని కోరారు. స్మార్ట్‌సిటీ మిషన్ కాలపరిమితి పొడిగించండి స్మార్ట్‌సిటీ మిషన్ కింద చేపట్టిన పనులు పూర్తికానందున మిషన్ కాలపరిమితిని 2025 జూన్ వరకు పొడిగించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ నగరాల్లో పనులు చేపట్టినట్టు తెలిపారు. వరంగల్‌లో 45 పనులు పూర్తయ్యాయని, రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయని.. కరీంనగర్లో 25 పనులు పూర్తయ్యాయని, రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని వివరించారు. స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితి ఈ ఏడాది జూన్ 30తో ముగుస్తోందని.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనులు ముగిసేందుకు వీలుగా మరో ఏడాది పొడిగించాలని కోరారు. రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయించండి హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం 2,500 ఎకరాల రక్షణశాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్‌ను రేవంత్ కలిశారు. ర్యావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటున్న విషయాన్ని రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములు కీలకమని చెప్పారు. ఆర్సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములను వినియోగించుకుంటున్నందున.. బదులుగా రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలని కోరారు. భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని విజప్తి చేశారు. వరంగల్ సైనిక్ స్కూల్ ఇవ్వండి.. వరంగల్ నగరానికి కేంద్రం సైనిక్ స్కూల్ మంజూరు చేసినా.. గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం తెలిపారు. ఆ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిశాయని.. ఆ అనుమతులను పునరుద్ధరించాలని లేదా తాజాగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. నీట్‌పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించామని సీఎం రేవంత్ తెలిపారు. రక్షణ భూముల బదలాయింపు, మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలు, పీఎంఏవై ఇళ్ల విషయంలో విజ్ఞప్తులు అందజేశామని చెప్పారు. కేంద్ర మంత్రులను కలసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాం«దీలతో భేటీ రేవంత్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డిఫెన్స్ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరామని.. సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని చెప్పారు. యూపీలో మూడు, ఏపీలో రెండు సైనిక్ స్కూళ్లు ఉన్నాయని.. కానీ తెలంగాణలో ఒక్కటి కూడా లేదని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ పదేళ్ల పాటు అడగలేదని, ప్రధాని మోదీ ఇవ్వలేదని విమర్శించారు. నీట్ పరీక్ష నిర్వహణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఈ కేసును సీబీఐతో కాకుండా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఆ కేసును ఖతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘నీట్ పరీక్ష నిర్వహణలో మోదీ గ్యారంటీ ఏదీ? యువతకు మోదీ భరోసా ఏది?’అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే నా రాజకీయ జన్మ ప్రారంభమైంది: పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జన్మ కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైందని, చివరికి ముగిసేది కూడా కాంగ్రెస్‌లోనే అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డికి ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత పోచారం మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఎన్టీఆర్ పిలుపుతో తాను టీడీపీలో చేరానని, కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు పనిచేశానని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమర్థ పాలన అందిస్తున్నారని.. రైతులకు మంచి జరగాలనే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నానని చెప్పారు. -
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అటు పార్టీ, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన పనులపై వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. సోమవారం(జూన్24) సాయంత్రం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సికింద్రాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణాలకు కంటోన్మెంట్ భూముల అప్పగింత, సైనిక్ స్కూల్ తదితర అంశాలపై చర్చ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో రేవంత్ చర్చించారు. ఈ సమావేశంలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి,రఘురామరెడ్డి,బలరాం నాయక్,సురేష్ షెట్కార్,కిరణ్ కుమార్ రెడ్డి,రఘువీర్ రెడ్డి,కడియం కావ్య,గడ్డం వంశీ,రాజ్యసభ ఎంపీ అనిల్ కమార్ యాదవ్ మాజీమంత్రి కడియం శ్రీహరి,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సముద్ర జలాల్లో శాంతి స్థాపనే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: సముద్ర జలాల్లో శాంతి స్థాపనే తమ లక్ష్యమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సురక్షిత నౌకాయానం, రూల్–బేస్డ్ వరల్డ్ ఆర్డర్, యాంటీ పైరసీ, హిందూ మహా సముద్ర ప్రాంత(ఐవోఆర్) పరిధిలో శాంతి– స్థిరత్వం ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండో సారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్ తొలి పర్యటన విశాఖలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర భద్రతను మరింత పటిష్టం చేస్తామన్నారు. ఇండియన్ నేవీ ఉనికిని మరింత ప్రభావవంతంగా చేయడంపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్‌కు చెందిన స్నేహపూర్వక దేశాలు సురక్షితంగా ఉంటూ పరస్పర ప్రగతి పథంలో కలిసి ముందుకు సాగేలా ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. దేశ అభివృద్ధిలో నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోందనీ.. అంతర్జాతీయ వేదికగా భారత నౌకాదళ ఖ్యాతి పెరుగుతోందని ప్రశంసించారు. ఆర్థిక, సైనిక శక్తి ఆధారంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ దేశం ప్రమాదంలో పడకుండా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కలిగిన భారత నౌకాదళం భరోసానిస్తోందన్నారు. పాక్ పౌరుల్ని రక్షించి మానవత్వాన్ని ప్రపంచానికి చాటింది ఈ ఏడాది మార్చిలో అరేబియా సముద్రంలో 23 మంది పాకిస్తానీ పౌరులను సోమాలి సముద్రపు దొంగల బారి నుంచి విడిపించినప్పుడు నేవీ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ తీరు ప్రశంసనీయమన్నారు. జాతీయత, శత్రుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసేలా ఇండియన్ నేవీ సిబ్బంది వ్యవహరిస్తూ.. మానవత్వ విలువల్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని కొనియాడారు. భారతదేశ వాణిజ్య ప్రయోజనాలు ఐవోఆర్తో ముడిపడి ఉన్నాయనీ, వి్రస్తృత జాతీయ లక్ష్యాలను సాధించేందుకు నౌకాదళం సముద్ర సరిహద్దులను సంరక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. పెరుగుతున్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల ద్వారా భారత నౌకాదళం నిరంతరం బలపడుతోందన్నారు. షిప్‌యార్డ్‌లు విస్తరిస్తున్నాయనీ, విమాన వాహక నౌకలు బలోపేతమవుతున్నాయన్నారు. ఇండియన్ నేవీ కొత్త శక్తివంతమైన శక్తిగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఘన స్వాగతం తొలుత విశాఖలోని నేవల్ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ డేగాకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి చేరుకున్న రక్షణ మంత్రికి ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు. 50 మందితో కూడిన గార్డ్ ఆఫ్ హానర్‌తో సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రానికి చేరుకున్న ఆయన ఐఎన్ఎస్ జలాశ్వలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ నౌకలు, జలాంతర్గాములు, నేవల్ కమాండ్ విమానాల ద్వారా డైనమిక్ కార్యకలాపాలను వీక్షించారు, తూర్పు సముద్ర తీరంలో భారత నౌకాదళం కార్యాచరణ సంసిద్ధతని రాజ్‌నాథ్‌సింగ్ సమీక్షించారు. ‘డే ఎట్ సీ’ ముగింపులో భాగంగా స¯Œరైజ్ ఫ్లీట్ సిబ్బందితో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భోజనం చేశారు. గౌరవ వీడ్కోలు అనంతరం.. ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని ఢిల్లీకి పయనమయ్యారు. -
ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
న్యూఢిల్లీ: ఒడిశా సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒడిశా బీజేపీ కీలక నేత మాజీ కేంద్ర మంత్రి నేత ధర్మేంద్ర ప్రదాన్‌కు మోదీ3.0 కేబినెట్లో మళ్లీ బెర్త్ దక్కింది. దీంతో సీఎం రేసు నుంచి ఆయన తప్పుకున్నట్లయింది. మిగిలిన సీనియర్ నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు.సీఎం ఎవరనేది తేల్చడానికి బీజేపీ హైకమాండ్ ఇద్దరు అగ్రనేతలను సోమవారం(జూన్10) పరిశీలకులుగా నియమించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు భూపేందర్‌యాదవ్‌కు ఈ పని అప్పగించింది. 11న భువనేశ్వర్‌లో ఒడిషా బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 12న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారని ఒడిషా బీజేపీ ఇంఛార్జ్ విజయ్‌పాల్‌సింగ్ తోమర్ తెలిపారు. సీఎం పదవి రేసులో బ్రజరాజ్‌నగర్ ఎమ్మెల్యే సురేష్ పూజారీ, బీజేపీ స్టేట్ చీఫ్ మన్మోహన్ సమాల్‌తో పాటు సీనియర్ నేతలు కేవీ సింగ్, మోహన్ మాజీలు ఇప్పటివరకు ముందున్నారు. కాగా, రాష్ట్రంలోని 21 ఎంపీ సీట్లలోనూ బీజేపీ 20 గెలుచుకుంది. వరుసగా 24 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బిజూజనతాదల్‌ను మట్టి కరిపించి బీజేపీ ఒడిశా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. -
ఎన్డీయే కూటమి: ముగిసిన మంత్రివర్గ కసరత్తు
ఢిల్లీ: ఎన్డీయే కూటమిలో భాగంగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై శుక్రవారం జరిగిన కసరత్తు ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ అగ్రనేతల నేతృత్వంలో సుదీర్ఘంగా మంత్రివర్గ కూర్పుపై భేటీలు జరిగాయి. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలను ఒక్కొక్కరిని పిలిచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లు చర్చలు జరిపారు. ముందుగా ఎన్సిపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేతో బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబుతో మంత్రివర్గంపై చర్చలు జరిపారు. అయితే మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయిందా? లేదా? అనే అంశంపై అధకారికంగా స్పష్టత లేదు.ఇక.. ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ ఎల్లుండి( 9వ తేదీ) ప్రమాణస్వీకారం చేయటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వ కొలువుదీరనుంది. అందుకోసం శుక్రవారం భాగస్వామ్య పక్ష నేతలు మోదీని ఏకగ్రీవంగా ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మోదీ.. కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి మోదీ తెలిపారు. ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి అందజేశారు. -
ఓట్ల లెక్కింపు వేళ బీజేపీ నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు, మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన చర్యలపై బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. సోమవారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నేత బీఎల్ సంతోష్ తదితరులు హాజరయ్యారు. పోలింగ్ శాతం, బలాలు, బలహీనతలపై విశ్లేíÙంచారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ ఎన్నికలపైన, కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలాలు, బలహీనతలపై సమీక్ష జరిపాం. ఓటింగ్ శాతం, కొన్ని చోట్ల తక్కువ ఓటింగ్ నమోదుకు కారణాలపై సమగ్రంగా చర్చించాం. రాష్ట్రాల్లో కౌంటింగ్ సన్నాహాలు, అలాగే ఫలితాలు వెలువడ్డాక విజయోత్సవాల నిర్వహణపైనా చర్చించాం. హరియాణాలో బీజేపీ పరిస్థితి బాగాలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నడ్డా, అమిత్ షా మాజీ సీఎం ఖట్టర్‌తో ప్రత్యేకంగా చర్చించారు’అని తావ్డే తెలిపారు. -
తగ్గిన ఓటింగ్ శాతంతో బీజేపీకి దెబ్బ? రాజ్‌నాథ్ ఏమన్నారు?
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఇంకా ఒక దశ మిగిలివుంది. అయితే 2019తో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గింది. ఇది బీజేపీకి దెబ్బ అనే వాదన వినిపిస్తోంది. ఈ విషయమై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక మీడియా సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే అది బీజేపీకి ప్రతికూలమేమీ కాదని, ఓటింగ్ శాతం తగ్గడానికి ఎండవేడిమి ప్రధాన కారణమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.ఇండియా కూటమి విశ్వసనీయతపై పలు సందేహాలు ఉన్నాయని, ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో చాలా జాప్యం జరిగిందన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలు విభిన్న అభిప్రాయాలు కలిగినవని అన్నారు. ఇందుకు పంజాబ్‌లోని రాజకీయ పరిస్థితులే ఉదాహరణ అన్నారు. ఇండియా కూటమి ప్రజలకు ఉమ్మడి సందేశాన్ని ఇవ్వలేకపోయిందని, అందుకే ఈ కూటమిపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. ఈ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని చాలామంది భావిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈసారి కూడా బీజేపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.ఓటింగ్ శాతం తక్కువగా ఉండటానికి కారణం ఎండ వేడిమి అని అన్నారు. గత ఎన్నికల్లో ఇంతటి వేడి లేదన్నారు. ఈసారి దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీకి సీట్లు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ హయాంలో 25 శాతం మంది దారిద్య్ర రేఖ నుంచి బయటపడ్డారని, దేశంలో నిరుద్యోగం గతంలో కన్నా తగ్గిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. -
లోక్‌సభ ఎన్నికలు 2024: ముగిసిన ఐదో విడత పోలింగ్
Updatesసాయంత్రం 7 గంటలవరకు నమోదయిన సగటు పోలింగ్ శాతం 57.38బీహార్ - 52.35%జమ్మూ-కాశ్మీర్ - 54.21%జార్ఖండ్ - 61.90%లఢఖ్ - 67.15%మహారాష్ట్ర - 48.66%ఒడిస్సా- 60.55%ఉత్తరప్రదేశ్ - 55.80%పశ్చిమబెంగాల్ - 73%మధ్యాహ్నం 3 గంటల వరకు 47.53 శాతం పోలింగ్..లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ కొనసాగుతోందిప్రజలు తమ ఓటు హక్కు వినియోంగిచుకోవడానికి తరలి వస్తున్నారు.మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున 47.53 శాతం పోలింగ్ నమోదుబీహార్ 45.33 శాతంజమ్మూ అండ్ కాశ్మీర్ 44.90 శాతంఝార్ఖండ్ 53.90 శాతంలడఖ్ 61.26 శాతంమహారాష్ట్ర 38.77 శాతంఒడిశా 48.95శాతంఉత్తర ప్రదేశ్ 47.55 శాతంవెస్ట్ బెంగాల్ 62.72 శాతంమధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 36.73 శాతం పోలింగ్ నమోదైంది.బీహార్ 34.62%జమ్మూ కశ్మీర్ 34.79%జార్ఖండ్ 41.89%లడఖ్ 52.02%మహారాష్ట్ర 27.78%ఒడిశా 35.31%ఉత్తరప్రదేశ్ 39.55%పశ్చిమ బెంగాల్ 48.41%#LokSabhaElections2024 | 36.73% voter turnout recorded till 1 pm, in the fifth phase of elections. Bihar 34.62% Jammu & Kashmir 34.79%Jharkhand 41.89%Ladakh 52.02% Maharashtra 27.78% Odisha 35.31% Uttar Pradesh 39.55%West Bengal 48.41% pic.twitter.com/6cxi2tJsHq— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రబాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఆయన తల్లిదండ్రులు రాకేష్ రోషన్, పింకీ రోషన్, సోదరి సునైనా రోషన్‌తో కలసి ఓటు వేశారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Actor Hrithik Roshan, his sister Sunaina Roshan & their parents Rakesh Roshan and Pinkie Roshan cast their votes at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/5h8XFTRMvA— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రశివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.Uddhav Thackeray, his wife Rashmi and son Aaditya cast their vote in MumbaiRead @ANI Story | https://t.co/Ljg2V0qtYc#UddhavThackeray #AadityaThackeray #LokSabhaElections2024 pic.twitter.com/8nSagjge6V— ANI Digital (@ani_digital) May 20, 2024 మహారాష్ట్రనటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Mumbai: After casting his vote, actor Manoj Bajpayee says, "This is the biggest festival and everyone should vote as you will get this opportunity after 5 years. If you haven't voted then you have no right to complain..."#LokSabhaElections2024 pic.twitter.com/ECZH5TeBU8— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రక్రికెటర్ అజింక్య రహానే దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.LS Polls 2024: India cricketer Ajinkya Rahane, wife cast their vote in MumbaiRead @ANI Story | https://t.co/MyHmMbTF55#AjinkyaRahane #LokSabhaElections2024 pic.twitter.com/EUkJ5a0ZGR— ANI Digital (@ani_digital) May 20, 2024 దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.Sachin Tendulkar, son Arjun, cast vote in Lok Sabha electionsRead @ANI Story | https://t.co/Lz7fVhAoT0#SachinTendulkar #LokSabhaPolls #cricket #LSPolls #Elections2024 #TeamIndia pic.twitter.com/Vq2cgSgYCE— ANI Digital (@ani_digital) May 20, 2024 ఢిల్లీ:ఐదో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 23.66 శాతం ఓటింగ్ నమోదైంది.బీహార్- 21.11%జమ్మూ కశ్మీర్- 21.37%జార్ఖండ్- 26.18%లడఖ్- 27.87%మహారాష్ట్ర- 15.93%ఒడిశా- 21.07%ఉత్తరప్రదేశ్- 27.76%పశ్చిమ బెంగాల్- 32.70%#LokSabhaElections2024 | 23.66% voter turnout recorded till 11 am, in the fifth phase of elections. Bihar 21.11% Jammu & Kashmir 21.37% Jharkhand 26.18% Ladakh 27.87% Maharashtra 15.93% Odisha 21.07% Uttar Pradesh 27.76%West Bengal 32.70% pic.twitter.com/wr9kbCIwYN— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రమహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఓటు హక్కు వినియోగించుకున్నారు.థానేలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Maharashtra CM Eknath Shinde casts his vote at a polling booth in Thane. #LokSabhaElections2024 pic.twitter.com/RZvG01iVyY— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర:బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Veteran actor Dharmendra casts his vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/FqXmZ5jFPG— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: ఎంపీ హేమా మాలిని, ఆమె కూమార్తె ఇషా డియోల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.#WATCH | Mumbai, Maharashtra: Actress and BJP MP Hema Malini, her daughter and actress Esha Deol show indelible ink marks on their fingers after casting their votes at a polling booth in Mumbai #LokSabhaElections2024 pic.twitter.com/T3I2wmA0H0— ANI (@ANI) May 20, 2024 ఉత్తర ప్రదేశ్:కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరూ కుటుంబసభ్యులతో వచ్చిన ఓటు వేయాలని కోరుతున్నా.#WATCH | Lucknow, Uttar Pradesh: "I appeal to the voters of the country to cast their vote along with their family members...," says Defence Minister and BJP candidate from Lucknow Lok Sabha seat, Rajnath Singh after casting his vote #LokSabhaElections2024 pic.twitter.com/tf5Pz7hjO8— ANI (@ANI) May 20, 2024 ఉత్తర ప్రదేశ్: అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.అమేథీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Amethi Lok Sabha seat, Smriti Irani arrives at a polling station in Amethi to cast her vote for #LokSabhaElections2024Congress has fielded KL Sharma from this seat. pic.twitter.com/yAeOMBZZxP— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Bollywood actor Paresh Rawal shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/5FVCXjNMqn— ANI (@ANI) May 20, 2024 ఢిల్లీ: ఐదో విడత పోలింగ్ కొనసాగుతోందిప్రజలు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.ఉదయం 9 గంటల వరకు 49 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన పోలింగ్ శాతం 10.28 శాతం బీహార్ - 8.86% జమ్మూ-కాశ్మీర్ - 7.63% జార్ఖండ్ - 11.68% లఢఖ్ - 10.61% మహారాష్ట్ర - 6.33% ఒడిస్సా- 6.87% ఉత్తరప్రదేశ్ - 12.89% పశ్చిమబెంగాల్ - 15.35% #LokSabhaElections2024 | 10.28% voter turnout recorded till 9 am, in the fifth phase of elections.Bihar 8.86% Jammu & Kashmir 7.63%Jharkhand 11.68%Ladakh 10.51%Maharashtra 6.33%Odisha 6.87%West Bengal 15.35% pic.twitter.com/bNP5RqOg7d— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, సాన్య మల్హోత్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Actor Sanya Malhotra shows the indelible ink mark on her finger after casting her vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/ajbM69mtqJ— ANI (@ANI) May 20, 2024మహారాష్ట్ర: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మీడియాలో మాట్లాడారు.ఈ ఎన్నికల నాకు గొప్ప అవకాశం ఇచ్చాయి. ప్రజలను కలిసి.. ఆశీస్సులు తీసుకున్నా.#WATCH | Union Minister and BJP candidate from Mumbai North Lok Sabha seat, Piyush Goyal shows his inked finger after casting his vote at a polling station in Mumbai.#LokSabhaElections2024Congress has fielded Bhushan Patil from the Mumbai North seat. pic.twitter.com/81pfeAEiav— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.భారత్ అభివృద్ధి చెందాలిదానిని దృష్టితో పెట్టుకొని ఓటు వేశానుప్రజలు ఓటు వేయడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు.#WATCH | Actor Akshay Kumar shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.He says, "...I want my India to be developed and strong. I voted keeping that in mind. India should vote for what they deem is right...I think voter… pic.twitter.com/mN9C9dlvRD— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, డైరెక్టర్ జోయా అక్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Maharashtra: Actor Farhan Akhtar and Director Zoya Akhtar show their inked fingers after casting their votes at a polling station in Mumbai.#LokSabhaElections pic.twitter.com/ESpxvZNuGN— ANI (@ANI) May 20, 2024 ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. రికార్డు సంఖ్యలో ఓటు వేయండి: ప్రధాని మోదీప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కు వినియోగించుకోండిఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి"Vote in record numbers": PM Modi appeals voters to cast franchise in festival of democracyRead @ANI Story | https://t.co/CDSpNQxl1l#PMModi #LokSabhaElection2024 pic.twitter.com/pQIC7v0YRP— ANI Digital (@ani_digital) May 20, 2024 మహారాష్ట్ర: వ్యాపారవేత్త అనిల్ అంబాని ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Industrialist Anil Ambani casts his vote at a polling booth in Mumbai, for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/2CpXIZ6I0l— ANI (@ANI) May 20, 2024ఉత్తర ప్రదేశ్:మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చుంటున్నారు.#WATCH | Former Uttar Pradesh CM and BSP chief Mayawati shows her inked finger after casting her vote for #LokSabhaElections2024 at a polling station in Lucknow. pic.twitter.com/ZmtmwJg8Yq— ANI (@ANI) May 20, 2024 బిహార్‌బిహార్‌లోని ముజఫర్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ఓటు వేయడానికి మహిళలు క్యూలైన్లో నిల్చున్నారు. #WATCH | Bihar: Women queue up in large numbers at a polling booth in Muzaffarpur as they wait for voting to begin. #LokSabhaElections2024 pic.twitter.com/AgOrKHB8FX— ANI (@ANI) May 20, 2024 ఐదో విడత పోలింగ్ ప్రారంభమైందిVoting for the fifth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 49 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 35 Assembly constituencies in Odisha. pic.twitter.com/EZ1yEm7LJG— ANI (@ANI) May 20, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్ చేపడుతున్నారు. ఏడు దశలను చూస్తే ఈ ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కిపైగా చోట్ల విజయం సాధించడం విశేషం. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారైనా మెరుగైన ఓటింగ్ సాధించేలా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో భారీగా పాలుపంచుకోవాలని ముంబై, థానె, లక్నో నగర ఓటర్లకు ఈసీ ఆదివారం విజ్ఞప్తి చేసింది. బరిలో కీలక నేతలుకేంద్ర మంత్రులు రాజ్‌నాథ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్ ముంబై), కౌశల్ కిశోర్(మోహన్‌లాల్‌గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేపూర్), శంతను ఠాకూర్ (పశ్చిమబెంగాల్లోని బంగావ్), ఎల్జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ (బిహార్‌లోని హాజీపూర్), శివసేన శ్రీకాంత్ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్), బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సరణ్), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్(ముంబై నార్త్ సెంట్రల్)ల భవితవ్యం సోమవారమే ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. విపక్షాలు అధికారంలోకి వస్తే అయోధ్య బాలరామాలయం పైకి బుల్డోజర్లను పంపిస్తారని మోదీ తీవ్ర విమర్శలు, ఎన్డీఏ 400 చోట్ల గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్ విమర్శలతో ఐదో దశ ప్రచారపర్వంలో కాస్తంత వేడి పుట్టించింది. ఒడిశాలో ఐదు లోక్‌సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ కింద 35 ఎమ్మెల్యే స్థానాల్లోనూ సోమవారం పోలింగ్ జరగనుంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పోటీచేస్తున్న హింజీలీ అసెంబ్లీ స్థానంలో ఈరోజే పోలింగ్ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోదశ ముగిశాక 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో ఇప్పటిదాకా 379 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది.ఆరో దశ పోలింగ్ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనుంది. -
నిప్పుతో చెలగాటమా!
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల పేరిట హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ నిప్పుతో చెలగాటం ఆడుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఈసారి 400 స్థానాల్లో గెలిచి కొన్ని రాష్ట్రాల్లో మరింత మెరుగైన రాజకీయప్రతిభ కనబరచనుందని వ్యాఖ్యానించారు. పీటీఐతో ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు, అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. రాహుల్ గాంధీలో ఫైర్ లేదు ‘‘ రాహుల్ గాం«దీలో గొప్ప నాయకత్వ లక్షణం(ఫైర్)లేదుగానీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి విద్వేష మంటలు రాజేసే ఫైర్ చాలా ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సామాజిక సామరస్యాన్ని నాశనంచేస్తోంది. మత విద్వేషాలకు కారణమవుతోంది. ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తోంది. మేం గెలిస్తే ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి నిర్ణయాలను అమలుచేస్తాం.రాజ్యాంగపీఠికను బీజేపీ ఎన్నటికీ మార్చబోదు. రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్సే ఇప్పటికి 80 సార్లు రాజ్యాంగసవరణలు చేసింది. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగ పీఠికలోనూ మార్చులు చేశారు. జనాల్లో భయాలు పెంచి వారి మద్దతు సాధించాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. రిజర్వేషన్లు తొలగిస్తామని మాపై అబద్ధాల బురద చల్లుతోంది’’ ప్రశంసలో ఆంతర్యమేంటి?‘‘పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుస్సేన్ ఇటీవల రాహుల్ గాం«దీని నెహ్రూతో పోలుస్తూ ప్రశంసల్లో ముంచెత్తడం నిజంగా ఆందోళనకర విషయమే. భారత్‌ను అస్థిరపరచాలని చూసే శత్రుదేశం నేత రాహుల్‌ను ప్రశంసించడంలో ఉన్న ఆంతర్యమేంటో? అసలు పాక్‌తో కాంగ్రెస్‌కు ఉన్న సంబంధమేంటి? సంపద పంపిణీ విషయంలో శనివారం కూడా ఆయన పొగిడారు. ఆయన మాటల వెనుక బలమైన కారణం ఉండి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచి్చతంగా వివరణ ఇవ్వాలి. లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేద్దామని పాక్ ప్రయతి్నస్తోంది. కానీ పాక్‌కు అంత సత్తా లేదు’’ 400 సీట్లు ఖాయం ‘‘ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తుంది. బీజేపీ 370కిపైగా స్థానాల్లో గెలుస్తుంది. పశి్చమబెంగాల్లో మరిన్ని సీట్లు సాధిస్తాం. తమిళనాడులోనూ మెరుగవుతాం. కేరళలో బోణీ కొడతాం. ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ మెరుగైన సీట్లు సాధిస్తాం. ఛత్తీస్‌గఢ్‌లో క్లీన్‌స్వీప్ చేస్తాం. ఉత్తరప్రదేశ్‌లో 75 సీట్లదాకా గెలుస్తాం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలికలు, సీట్ల సర్దుబాటు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువ సీట్లు సాధిస్తాం. తొలి రెండు దశల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవ్వడం వల్ల బీజేపీకి వచి్చన నష్టమేమీ లేదు’’ సంపద పునఃపంపిణీ సరికాదు‘‘ కాంగ్రెస్ చెబుతున్నట్లు సంపదను పునఃపంపిణీ చేస్తామన్న విధానం సహేతుకంకాదు. అర్జెంటీనా, వెనిజులా దేశాలు దీనిని అమలుచేసి చేతులుకాల్చుకున్నాయి. విపరిణామాలను ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్ ఇలా చేస్తే భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలి వెనిజులా మాదిరిగా ద్రవ్యోల్బణం కట్టుతప్పుతుంది. భారత్‌పై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోతారు’’ పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే ‘‘ పాక్ ఆక్రమిత కశీ్మర్ ముమ్మాటికీ మనదే. అంతమాత్రాన పీవోకేను బలవంతంగా ఆక్రమించాల్సిన అవసరం లేదు. జమ్మూకశ్మీర్‌లో సాకారమైన అభివృద్ధిని చూశాక పీఓకే ప్రజలే భారత్‌లో విలీనంకావాలని కోరుకుంటున్నారు. జమ్మూకశీ్మర్‌లో సాయుధబలగాల ప్రత్యేక అధికారాల(ఏఎఫ్ఎస్పీఏ) చట్టంను తొలగించాల్సిన సమయం దగ్గరపడింది. దీనిపై కేంద్ర హోం శాఖ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. అయితే ఖచి్చతంగా ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం’’ సరిహద్దు చర్చలు సానుకూలం ‘‘ తూర్పు లద్దాఖ్‌లో చైనా, భారత్ జవాన్ల ఘర్షణ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతను సద్దుమణిగేలా చేసేందుకు చర్చల ప్రక్రియ సానుకూల వాతావరణంలో కొనసాగుతోంది. సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ నమ్మకం పెట్టుకుంది. చైనా కూడా అదే నమ్మకంతో చర్చలకు ముందుకొచి్చంది. సరిహద్దు వెంట మౌలికవసతుల పటిష్టానికి త్వరితగతిన ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తున్నాం. సరిహద్దు త్వరలో మరింత సురక్షితంగా ఉండబోతోంది’’ -
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ఢిల్లీ: పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించటంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆందోళన చెందినట్లు తెలిపారు. ఆయన శనివారం పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ఇండియా కూటమిపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ప్రతిపక్షాల కూటమి అసత్య ప్రచారం చేసి, ఓటర్లను గందరగోళానికి గురిచేస్తోంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తామని దుష్ప్రచారం చేస్తోంది. కానీ, కాంగ్రెస్ పార్టీనే రాజ్యాంగాన్ని 85 సార్లు సవరించింది. రాజ్యాంగంలో పీఠికలో సైతం మార్పులు చేసింది. అలాంటిది ప్రస్తుతం బీజేపీని నిందిస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చబోదు’’అని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.‘‘పాకిస్తాన్ రాహుల్ గాంధీపై అంత ప్రేమ చూపించటం వెనుక భారత్‌ను అస్థిర పరచాలనే కుట్ర ఉంది. అసలు పాక్ మాజీ మంత్రి రాహుల్ గాంధీపై చూపిన ప్రేమ చాలా ఆందోళన కలిగించింది. దానికి గల బలమైన కారణాన్ని భారత్ తెలుసుకోవాలనుకుంటుంది. సంపద పంపిణీతో వెనుజులా దేశం వలే ఆర్థిక వ్యవస్థ నాశనం చేయాలనుకుంటోంది. ...ద్రవ్యోల్బణం పెంచాలని చూస్తోంది. పాకిస్తాన్ భారత్‌లోని ఎన్నికలను ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తోంది’’అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్ ఎన్నికల్లో పాకిస్తాన్ ప్రభావం చూపనుందా? అని అడిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆ దేశానికి అంత సామర్థ్యం లేదని కొట్టిపారేశారు. ఇక.. ఇటీవల పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియోను ‘ఎక్స్’పోస్ట్ చేసి.. ‘రాహుల్ ఆన్ ఫైర్’అని క్యాప్షన్‌పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నాయకులు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. -
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్బీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో అమిత్ షా పాలొ్గని ప్రసంగిస్తారని పేర్కొంది. అలాగే వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారని తెలిపింది. -
నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ లక్నో స్థానం నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.నామినేషన్ దాఖలుకు ముందు, రాజ్‌నాథ్ సింగ్ నగరంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించి, స్థానిక దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఐదవ దశ పోలింగ్ మే 20న జరగనుంది. లక్నోతో పాటు మరో పదమూడు నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.లక్నో లోక్‌సభ స్థానంలో 2019 ఎన్నికలలో రాజ్‌నాథ్ సింగ్ 6.3 లక్షల ఓట్లు సాధించి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ శత్రుఘ్న సిన్హాను ఓడించారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై 2.72 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లవి అవినీతి ప్రభుత్వాలు
రాంగోపాల్‌పేట్ /సికింద్రాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ ఏర్పడితే నీతివంతమైన పాలన అందుతుందని ప్రజలు ఆశించారని, కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిమయంగా మారాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు. గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని, తమది అవినీతి రహిత ప్రభుత్వమని అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా ప్యాట్నీ సెంటర్లో నిర్వహించిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ కేంద్రంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అప్పుడు అవినీతి పెరిగిపోయిందని, ఆ పార్టీ నాయకుల మీద అవినీతి కేసులు నమోదై మంత్రులు కూడా జైలుకు వెళ్లారని ఆయన గుర్తుచేశారు. కానీ బీజేపీ అధికారంలో వచ్చిన పదేళ్లలో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కానీ, రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించి రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ధ్వజమెత్తారు. కాగా, కిషన్‌రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసని కులం, మతం, రంగును ఆయన చూడరని, ఇన్నేళ్ల రాజకీయాల్లో ఎలాంటి అవినీతి మరక ఆయనకు అంటలేదని అన్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్‌సభ స్థానాల నుంచి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. పదేళ్లలో పది లక్షల కోట్లు ఖర్చు పెట్టాం: కిషన్‌రెడ్డి గత పదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.719 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నైతిక విలువలకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేశానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను మరో మారు ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువతకు ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, మరో మారు మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కి రేపు అనేది లేదని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేది బీజేపీ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, ఈటల రాజేందర్, మర్రి శశిధర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, శ్యాంసుందర్‌గౌడ్, చీర శ్రీకాంత్ పాల్గొన్నారు. కోలాహలంగా నామినేషన్ దాఖలు చేసిన కిషన్‌రెడ్డి కిషన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం శుక్రవారం కోలాహలంగా సాగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ నేతలు లక్ష్మణ్ తదితరులతో కలసి కిషన్‌రెడ్డి దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ఎస్వీఐటీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ సభలో మాట్లాడారు. తర్వాత సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయానికి వెళ్లి సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. పార్టీ నేతలు లక్ష్మణ్, శ్యాంసుందర్‌గౌడ్, శారదామల్లేశ్, అజయ్‌కుమార్ ఆయన వెంట ఉన్నారు. కాగా, ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కూడా రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అవుట్ డేటెడ్ పార్టీ.. రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు
హైదరాబాద్,సాక్షి : కాంగ్రెస్ అవుట్‌డేటెడ్ పార్టీ.. దేశ రాజకీయాల్లో ఉనికిని కోల్పోతుంది అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియకు ముందు ఏర్పాటు చేసిన పార్టీ సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ కాలం చెల్లిపోయింది. దేశ రాజకీయాల్లో తన ఉనికిని కోల్పోయింది. బీజేపీ మాత్రం దేశ నిర్మాణం కోసమే రాజకీయాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఉద్దేశించి, తెలంగాణలోని అధికార పార్టీకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు ఘనత బీఆర్ఎస్కు కాదని, అనేక మంది త్యాగాల వల్లే దక్కుతుందని సూచించారు. గత కాంగ్రెస్ హయాంలో అవినీతి ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ..అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాలపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ.. మోదీ నాయకత్వంలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజ్గిరి)లకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. Secunderabad resonates with #PhirEkBaarModiSarkar My gratitude to Hon’ble Union Minister for Defence and Senior BJP leader Shri @rajnathsingh for joining & addressing the nomination rally in Secunderabad. The determination of the people of #Secunderabad in re-electing… pic.twitter.com/9EA3wDwtly — G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) April 19, 2024 బీఆర్ఎస్ను తరిమి కొట్టినందుకు గడిచిన పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఒక్క అవినీతి లేకుండా నరేంద్ర మోడీ పాలన చేస్తున్నాడని కేంద్ర క్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. ఖమ్మం బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహించారు. ఖమ్మం నగరంలోని జెడ్.పీ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి ప్రభుత్వాలే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి ప్రభుత్వాలే అని విమర్శించారు. ఈ ప్రభుత్వాల హయాంలో రైతులను మోసం చేసి యూరియా కుంభకోణం చేశాయని,రైతులపై భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు మోదీ ఆర్ధిక సాయం చేశారన్నారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370ని అమలు చేశామని గుర్తు చేశారు.మహిళలకు సమాన హక్కుల కోసం మోదీ ప్రభుత్వం చట్టాలను చేసిందన్నారు. ముస్లింల కోసం త్రిపుల్ తలాకును తొలగించామని,మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. బీజేపి అధికారంలోకి రాగానే దేశంలో ఓకే పౌరసత్వాన్ని తీసుకురాబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానిగా పనిచేసినప్పుడు పేదరికం తొలగిస్తామన్నారు కానీ ఇప్పటికీ పేదరికం అలానే ఉందన్నారు రాజ్ నాధ్ సింగ్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తెలుగు ప్రజలను 22 వేల మందికి పైగా విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీ దన్నారు.బీజేపిని గెలిపించి మూడోసారి మోదీని ప్రధాన మంత్రిని చేద్దామని ఖమ్మం ప్రజలు కూడా బీజేపిని ఆదరిస్తారన్నారు. -
Lok sabha elections 2024: ‘అమేథీ నుంచి పోటీ చేసే ధైర్యం లేదు’
పత్తనంతిట్ట(కేరళ): 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి ఓటమి పాలైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ దఫా మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసే ధైర్యం లేదని బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. యూపీలోని అమేథీలో పరాజయం పాలైన రాహుల్ అక్కడ్నుంచి కేరళలోని వయనాడ్‌కు వలసవచ్చారని ఎద్దేవా చేశారు. అయితే, మరోసారి ఆయన్ను ఎంపీగా చేయరాదని ఇప్పటికే వయనాడ్ ప్రజలు నిర్ణయించుకున్నట్లు తెలిసిందన్నారు. కేరళలోని పత్తనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. -
రాహుల్ గాంధీకి ధైర్యం లేదు: రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత 'రాహుల్ గాంధీ' అమేథీ నుంచి పోటీ చేస్తారనే వార్తలు పెద్దగా వినిపించాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇప్పటికి కూడా కాంగ్రెస్ తరపున అమేథీలో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది స్పష్టం కాలేదు. ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' పోటీ చేయనున్నట్లు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపైన కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2019లో అమేథీ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి పాలైన రాహుల్ గాంధీకి ఈసారి అక్కడి నుంచి పోటీ చేసే ధైర్యం లేదని బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఓటమి చవిచూసిన తరువాత కేరళకు వలస వెళ్లారని సింగ్ చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు వామపక్షాలు, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. సీఏఏ చట్టం వల్ల ఎవరి పౌరసత్వం ప్రభావితం కాబోదని సీనియర్ బీజేపీ నాయకుడు హామీ ఇచ్చారు. అంతరిక్ష రంగంలో దేశం సాధించిన విజయాలు మరియు భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్షయాన కార్యక్రమం అయిన గగన్‌యాన్ వంటి వివిధ రాబోయే ప్రాజెక్టులను కూడా ఆయన ప్రస్తావించారు. అనిల్ కె ఆంటోనీని ప్రశంసిస్తూ.. అతనికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కేరళలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అమెరికా స్పందన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఉగ్రవాదులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఉగ్రవాదులను హతమార్చేందుకు సరిహద్దులు దాటేందుకు భారత్ వెనుకాబోదని మోదీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ బుధవారం స్పందించారు. ‘ఈ విషయంలో ఇప్పటికే ఒకసారి స్పష్టత ఇచ్చాను. అమెరికా ఈ విషయంలో అస్సలు జోక్యం చేసుకోదు. కానీ భారత్, పాకిస్తాన్ దేశాలు సమరస్యంగా చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోవాలి’ అని మిల్లర్ అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు భారతదేశంలో చాలా దృఢమైన ప్రభుత్వం ఉంది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వారి ఇళ్ల వద్ద హతమార్చడానికి కూడా వెనకాడబోము’ అని అన్నారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘భారత దేశంలోని శాంతికి భంగం కల్గిస్తే.. ఉగ్రవాదలు పాకిస్తాన్లో ఉన్నా అంతం చేస్తాం’ అని అన్నారు. మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది.‘భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది’ అని పేర్కొంది. అంతకుముందు.. పాకిస్తాన్లో ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని బ్రిటన్‌కు చెందిన దీ గార్డియన్ పత్రిక ఓ నివేదిక విడుదల చేసింది. 2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్ పాటిస్తోందని పేర్కొంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్ పత్రిక పేర్కొనటం గమనార్హం. -
Lok sabha elections 2024: వికసిత భారత్ సంకల్ప పత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ‘భాజపా కా సంకల్ప్.. మోదీ కీ గ్యారంటీ–2024’ పేరుతో అధికార బీజేపీ సార్వత్రిక ఎన్నికల సంకల్ప పత్రాన్ని (మేనిఫెస్టో) విడుదల చేసింది. పేదలు, యువత, రైతులు, మహిళలకు (జీవైఏఎన్)లకు మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చిరు వ్యాపారులు, విశ్వకర్మలు, కారి్మకులకు భరోసా కల్పించారు. సురక్షిత, సమృద్ధ భారత్‌తోపాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అన్ని రంగాల్లో సమగ్ర వికాసం, సాంకేతికత, నవీన ఆవిష్కరణలు వంటి హామీలు ఇచ్చారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబి్ధపొందిన ఒక మహిళతోపాటు మరో ముగ్గురికి సంకల్ప పత్రం తొలి కాపీలను మోదీ అందజేశారు. అంతకంటే ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని నివాళులరి్పంచారు. రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో 27 మంది కమిటీ సభ్యులు సుమారు 15 లక్షల మంది నుంచి సలహాలు సూచనలు స్వీకరించి, సంకల్ప పత్రాన్ని రూపొందించారు. 24 అంశాలతో కూడిన 57 పేజీలతో మేనిఫెస్టోను సిద్ధం చేశారు. సంకల్ప పత్రంలోని 24 అంశాలు.. ‘2047 నాటికి వికసిత భారత్’ లక్ష్య సాధనే ధ్యేయంగా బీజేపీ మేనిఫెస్టోలో 24 కీలక అంశాలను చేర్చారు. పేద కుటుంబాల సేవ, మధ్యతరగతి కుటుంబాల విశ్వాసం, మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత, రైతులకు గౌరవం, మత్యకార కుటుంబాల సమృద్ధి, కారి్మకులకు గౌరవం, ఎంఎస్‌ఎంఈలక చేయూత, చిరు వ్యాపారులు, విశ్వకర్మల సాధికారత, సబ్కా సాథ్ సబ్ కా వికాస్, విశ్వబంధు భారత్, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, గ్లోబల్ తయారీ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, వారసత్వం–అభివృద్ధి, సుపరిపాలన, ఆరోగ్య భారత్, నాణ్యమైన విద్య, క్రీడల వికాసం, అన్ని రంగాల్లో సమగ్ర వికాసం, సాంకేతికత–నూతన ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల భారత్ వంటి అంశాలు ఉన్నాయి. బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ► ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడం ► 80 కోట్ల మంది పేదలకు మరో ఐదేళ్లపాటు ఉచిత రేషన్ ► ఐదేళ్లలో పేదల కోసం మరో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం ► దివ్యాంగులకు అనుకూలంగా ఇళ్ల నిర్మాణం ► దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లు ► వందేభారత్ రైళ్ల విస్తరణ ► ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా ► ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచడం ► 70 ఏళ్లుపైబడిన వయోజనులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్యం ► వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాలు ► రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వృద్ధులకు చేయూత ► ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ వర్తింపు ► మూడు కోట్ల మంది మహిళలను లఖ్పతీ దీదీలుగా మార్చే ప్రణాళిక ► పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పేదల నివాసాలకు ఉచిత విద్యుత్ సరఫరా ► మహిళాపారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ► ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ► మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు ► ఎప్పటికప్పుడు పంటలకు కనీస మద్దతు ధర పెంపు ► ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ► సేవారంగంలో స్వయం సహాయక సంఘాల అనుసంధానం ► గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎల్రక్టానిక్స్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచస్థాయి హబ్‌ల ఏర్పాటు ► విద్యుత్తు వాహనాల రంగానికి మరింత ప్రోత్సాహం ► రక్షణ, వంటనూనెలు, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి ► విదేశాల్లోని భారతీయుల భద్రతకు చర్యలు పదేళ్లుగా అభివృద్థి పథంలో భారత్: జేపీ నడ్డా వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో చెప్పేదే బీజేపీ మేనిఫెస్టో అని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పదేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, వచ్చే ఐదేళ్లు కూడా ఇది కొనసాగుతుందని నడ్డా వివరించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని, అందరి సహకారం, సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ విశ్వసిస్తోందని పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అవసరం: మోదీ దేశంలో ఉమ్మడి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత మేనిఫెస్టోల్లోనే ఈ హామీ ఇచి్చనప్పటికీ దాన్ని పూర్తి చేయలేకపోయామని చెప్పారు. గత సంకల్ప పత్రంలో ఇచి్చన ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి హామీలను నెరవేర్చామని గుర్తుచేశారు. ఆదివారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ మాట్లాడారు. సంకల్ప పత్రాన్ని ‘మోదీ కీ గ్యారంటీ’గా అభివరి్ణంచారు. వికసిత భారత్‌లో అంతర్భాగమైన యువ శక్తి, నారీ శక్తి, పేదలు, రైతులు అనే నాలుగు స్తంభాలను తమ సంకల్ప పత్రం బలోపేతం చేస్తుందని అన్నారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ దిశగా అడుగులు వేస్తామన్నారు. దేశాభివృద్ధికి అడ్డుగోడగా మారిన అవినీతిపై యుద్ధం కొనసాగిస్తామని వెల్లడించారు. అవినీతిపరులు ఎంతటివారైనా కటకటాల వెనక్కి పంపిస్తామని, ఇది తన గ్యారంటీ అని స్పష్టం చేశారు. గరీబ్, యువ, అన్నదాత, నారీ(జీవైఏఎన్)ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ సంకల్ప పత్రం రూపొందించామని పేర్కొన్నారు. దేశంలోని యువత ఆకాంక్షలను ఈ పత్రం ప్రతిబింబిస్తోందన్నారు. వందేభారత్, బుల్లెట్ రైళ్లను మరింత విస్తరిస్తామని తెలిపారు. ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు మార్గం పూర్తి కావొచి్చందని, ఇక ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌లో కూడా బుల్లెట్ రైలు మార్గాలు అందుబాటులోకి తీసుకొస్తామని, దీనిపై త్వరలో అధ్యయనం ప్రారంభిస్తామని చెప్పారు. ‘140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలే మోదీ మిషన్. జూన్ 4వ తేదీన ఎన్నికలు ఫలితాలు వచ్చాక వంద రోజుల్లోనే సంకల్ప పత్రాన్ని అమలు చేసే ప్రణాళికతో పని చేస్తున్నాం’ అని ప్రధానమంత్రి మోదీ వివరించారు. బీజేపీ మేనిఫెస్టోని విశ్వసించలేం: ఖర్గే బీజేపీ మేనిఫెస్టోపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ఘాటుగా స్పందించారు. గత పదేళ్ల కాలంలో పేదల కోసం ఏమీ చేయని ప్రధాని మోదీ ఇప్పుడు కొత్తగా హామీలు గుప్పించడం ఏమిటని ప్రశ్నించారు. అది మేనిఫెస్టో కాదు, జుమ్లా పత్రం అని మండిపడ్డారు. ‘‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచుతానని, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. గడిచిన పదేళ్లలో దేశంలోని ప్రజలందరికీ మేలు చేసేంత పెద్ద పని ఆయన ఏమీ చేయలేదు. పదేళ్లలో పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మోదీకి ఏమాత్రం ఆందోళన లేదు. పేదల సంక్షేమం కోసం ఏమీ చేయని ప్రధానమంత్రిని, బీజేపీ మేనిఫెస్టోను విశ్వసించలేం’’ అని ఖర్గే పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రికి 14 ప్రశ్నలను ‘ఎక్స్’ వేదికగా ఖర్గే సంధించారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా? ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీ సంగతేంటి? ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 46 శాతం ఎందుకు పెరిగాయి? మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడంలేదు? మహిళలపై అఘాయిత్యాలను ఎందుకు ఆపడం లేదు? 100 కొత్త స్మార్ట్ సిటీల సంగతేంటి? 2020 నాటికి గంగానదిని ప్రక్షాళన చేస్తామన్న హామీ ఎటుపోయింది? అంటూ మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నల వర్షం కురిపించారు. -
‘అమ్మ చనిపోయింది.. ఆఖరి చూపులకూ వెళ్లలేకపోయా’
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన 'ఎమర్జెన్సీ' రోజులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. తనను 18 నెలల పాటు జైలులో పెట్టిన నాటి ప్రభుత్వం తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా పెరోల్ ఇవ్వలేదన్నారు. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ చేసిన 'నియంతృత్వ' ఆరోపణలపై స్పందింస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ బ్రెయిన్ హెమరేజ్‌తో మరణించిన తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు. "ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి నాకు పెరోల్ ఇవ్వలేదు. ఇప్పుడు వారు ( కాంగ్రెస్ ) మమ్మల్ని నియంతలు అంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్‌నాథ్ సింగ్ వయస్సు 24 సంవత్సరాలు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1977 మార్చి వరకు కొనసాగిన జేపీ ఉద్యమంలో మిర్జాపూర్-సోన్‌భద్రకు ఆయన కన్వీనర్‌గా పనిచేశారు. "అప్పుడు నాకు కొత్తగా పెళ్లైంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన నన్ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు జైలుకు తీసుకెళ్లారు. ఏకాంత నిర్బంధంలో ఉంచారు" అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఒక సంవత్సరం జైలులో గడిపిన తరువాత, ఆయన్ను విడుదల చేస్తారా అని అడిగిన రాజ్‌నాథ్ సింగ్ తల్లికి ఎమర్జెన్సీని మరో సంవత్సరం పొడిగించారని బంధువు ఆమెకు తెలియజేశారు. ఆ దిగులుతో ఆమెకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి 27 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. తనకు పెరోల్ రాకపోవడంతో తల్లి అంత్య క్రియలకు వెళ్లలేకపోయానని, దీంతో తన సోదరులే అంత్యక్రియలు నిర్వహించారని వివరించారు. తాను జైలులోనే గుండు గీయించుకున్నానని తెలిపారు. -
పాకిస్తాన్‌కు చేతకాకపోతే మేము సిద్ధంగా ఉన్నాం: రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం విషయంలో పొరుగు దేశం పాకిస్తాన్‌పై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్తాన్‌కు చేతకాకపోతే.. భారత్ సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అంతేకానీ, ఉగ్రవాదంతో భారత్‌లో అస్థిర పరిచేందుకు ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని పాక్‌ను హెచ్చరించారు. ఈ మేరకు జరాజ్నాథ్ సింగ్ గురువారం జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘పాకిస్తాన్ అసమర్ధంగా ఉందని భావిస్తే.. ఉగ్రవాదాన్ని అంతం చేయటంలో సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉంది. భారత్‌లోకి ప్రవేశించి సరిహద్దులు దాటి తప్పించుకునే ఉగ్రవాదులను హతమార్చటంలో భారత్ వెనకడుగు వేయబోదు. ఉగ్రవాదులు భారత దేశంలోని శాంతికి భంగం కలిగిస్తే.. మేము పాకిస్తాన్లోకి ప్రవేశించి మరీ ఉగ్రమూకలను మట్టుపెడతాం. భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇతర దేశంపై దాడి చేయదు. పొరుగు దేశంలోని భూభాగాన్ని అక్రమించుకోదు. కానీ, ఎవరైనా భారత్‌లోని శాంతికి భంగం కలిగిస్తే.. ఏమాత్రం ఊరుకోం’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇక.. ఇటీవల పాక్‌లో చోటుచేసుకుంటున్న ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వెనక భారత్ హస్తం ఉన్నట్లు యూకేకు చెందిన ‘దీ గార్డియన్’ పత్రిక ఓ నివేదికను వెల్లడించిన విషయం తెలిసిందే. 2019 పుల్వామా దాడుల అనంతరం పాక్‌లోని ఉగ్రవాదులపై భారత్ దృష్టి పెట్టిందని.. ఈ విషయాన్ని ఇరుదేశాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి సేకరించిన సమాచారం మేరకే ఈ నివేదిక విడుదల చేసినట్లు గార్డియన్ పత్రిక వెల్లడించింది. గార్డియన్ పత్రిక ఆరోపణలపై భారత్ స్పందిస్తూ.. ‘పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. టార్గెట్ హత్యలు చేయటం భారత విధానం కాదు’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. ‘భారత్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాకిస్తాన్ దృఢమైన సంకల్పం, తమను తాము రక్షించుకునే సామర్థాన్ని చరిత్ర ధృవీకరిస్తుంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. -
Lok sabha elections 2024: ఉత్తమ ఫినిషర్ రాహుల్: రాజ్‌నాథ్
భోపాల్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెణుకులు విసిరారు. క్రికెట్లో మహేంద్ర ధోనీ మాదిరిగానే దేశ రాజకీయాలకు ఉత్తమ ఫినిషర్ రాహుల్ అని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ అధికారం నేడు ఏవో రెండు మూడు చిన్న రాష్ట్రాలకు పరిమితం కావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు కారణాలను ఆయన వివరిస్తూ..క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ ఎవరని ప్రశ్నించగా జనం ‘ధోనీ’అని సమాధానమిచ్చారు. భారత రాజకీయాల్లో బెస్ట్ ఫినిషర్ ఎవరని నన్ను ఎవరైనా అడిగితే రాహుల్ గాంధీ అనే బదులిస్తాను. ఎందుకంటే, ఆయన హయాంలోనే కీలక నేతలెందరో ఆ పార్టీని వీడారు’అంటూ రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. -
Lok Sabha elections 2024: రాజ్‌నాథ్ సారథ్యంలో మేనిఫెస్టో కమిటీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టో రూపకల్పనకు గాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బీజేపీ 27 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పార్టీ ఎన్నికల హామీలపై ఈ కమిటీ మేధో మథనం చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సూచనలను స్వీకరించనుంది. ఇందులో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, కిరెన్ రిజిజు, అర్జున్ ముండా, అర్జున్ రామ్ మేఘ్వాల్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్ర శేఖర్ ఉన్నారు. బీజేపీ పాలిత గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు డియో సాయి కూడా కమిటీలో ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే వంటి సీనియర్ నేతలకు కూడా బీజేపీ అధిష్టానం స్థానం కల్పించింది. క్రైస్తవులు, ముస్లింలకు ఆంటోనీ, మన్సూర్‌లు ప్రాతినిధ్యం వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ పేర్లు కమిటీలో లేవు. -
Bharat Shakti: అబ్బురపర్చిన ‘భారత్ శక్తి’ విన్యాసాలు..వీక్షించిన మోదీ (ఫొటోలు)
-
సవాల్ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ . భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపై దాడి చేయలేదని తెలిపిన కేంద్ర మంత్రి.. ఏ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోలేదని పేర్కొన్నారు. అదే ఒకవేళ ఏ దేశమైన భారత్‌కు సవాల్ విసిరితే.. తాము ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రక్షణమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ‘ఢిఫెన్స్ సమ్మిట్’లో గురువారం రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో భారత రక్షణ రంగంలో చోటుచేసుకున్న మార్పులను, అభివృద్ధి వంటి అంశాలపై సైతం చర్చించారు. భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్‌పై దాడికి దిగితే తమ బలగాలు ధీటుగా బదులిస్తాయని హెచ్చరించారు. తాము ఏ దేశంపైనా దాడి చేయలేదని.. ఎవరి భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదన్నారు. కానీ, ఎవరైనా తమపై కన్నెత్తి చూస్తే, తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే తగిన సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నామని చెప్పారు. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, రక్షణ రంగానికి తాము ప్రాధాన్యత పెంచామని కేంద్రమంత్రి తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను (స్వయంశక్తి) ప్రోత్సహించామని, స్వదేశీ ఉత్పత్తితోపాటు రక్షణ పరికారల ఎగుమతి, సైనిక ఆధునికీకరణపై దృష్టి సారించామని చెప్పారు.దీని వల్ల భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైందని పేర్కొన్నారు. చదవండి: విమానంలో సీట్ కుషనింగ్ మాయం! - ఏం జరిగిందంటే.. -
రూ.84,560 కోట్లతో సైనిక సామగ్రి
న్యూఢిల్లీ: దేశ సైనిక బలగాల యుద్ధ పటిమను గణనీయంగా పెంచే రూ.84,560 కోట్ల విలువైన పలు ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ)ఆమోదం తెలిపింది. కొత్త తరం యాంటీ ట్యాంక్ మందుపాతరలు, ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్లు, హెవీ వెయిట్ టోర్పెడోలు, మధ్యశ్రేణి, మల్టీ మిషన్ యుద్ధ విమానాలు, ఫ్లయిట్ రీఫ్యూయలర్ విమానాలు, అధునాతన రేడియో వ్యవస్థలు ఇందులో ఉన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. వీటి చేరికతో నేవీ, కోస్ట్‌గార్డ్, ఎయిర్‌ఫోర్స్ పాటవం గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. -
భారతీయ నౌకాదళంలోకి INS సంధాయక్
-
ఐఎన్ఎస్ సంధాయక్ జాతికి అంకితం.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం ఇచ్చారు. ఈరోజు విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ సంధాయక్ నౌకను జాతికి అంకితమిచ్చారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో.. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ ‘ఐఎన్ఎస్ సంధాయక్’ను నిర్మించింది. ఇది 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుంది. హెలిపాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, రెండు డీజిల్ యంత్రాలు అమర్చారు. తాజాగా దీన్ని జాతికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్క పాల్గొన్నారు. సంధాయక్ నౌకకు కమాండింగ్ అధికారిగా కెప్టెన్ ఆర్.ఎం.థామస్ వ్యవహరించనున్నారు. Indian Navy commissions its latest Survey Vessel #INSSandhayak, at Naval Dockyard, Vizag in the presence of Defence Minister@rajnathsingh. The event marks the formal induction into the Navy of the first of four Survey Vessel (Large) ships under construction at @OfficialGRSE… pic.twitter.com/6JFPkVNKkl — All India Radio News (@airnewsalerts) February 3, 2024 ఈ సందర్బంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ..‘భారత నౌకాదళ అమ్ములుపొదిలో ఐఎన్ఎస్ సంధాయక్ జలప్రవేశం సంతోషకరం. భారత నౌకాదళం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ప్రపంచ సముద్ర జలాల్లో కూడా భారత నౌకాదళం కీలక భద్రత చర్యలు చేపడుతోంది. భారత్‌కు ఎనిమిది వేల నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలను కూడా నౌకాదళం అదుపు చేసింది. సముద్ర జలాల్లో శాంతి సామరస్యం పరిరక్షించడమే ఇండియన్ నేవీ లక్ష్యం. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ నగరం. తూర్పు నౌకాదళం విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. విశాఖ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ నేవీ విస్తరణలో విశాఖ నగర పాత్ర మరువ లేనిది’ అని కామెంట్స్ చేశారు. #WATCH | Andhra Pradesh: Defence Minister Rajnath Singh addresses the Commissioning Ceremony of INS Sandhayak, at the Naval Dockyard in Visakhapatnam. He says, "If I talk about our naval power, the Indian Navy has become so strong that we have become the first responder in terms… pic.twitter.com/RO0vedn9WI — ANI (@ANI) February 3, 2024 -
Union Cabinet: జన నాయకుడు మోదీ
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర కేబినెట్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆ సందర్భంగా దేశ ప్రజలు మోదీపై కనబరచిన ప్రేమ, ఆప్యాయతలు ఆయన నిజమైన జన నాయకుడని మరోసారి నిరూపించాయని పేర్కొంది. ‘‘రామ మందిరం కోసం ప్రజలంతా కలసికట్టుగా ఉద్యమించిన తీరు కొత్త తరానికి తెర తీసింది. ఇదంతా మోదీ దార్శనికతతోనే సాధ్యపడింది’’ అని పేర్కొంది. భరత జాతి శతాబ్దాల కలను సాకారం చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కేబినెట్ ఈ సందర్భంగా తీర్మానం చేసింది. తీర్మాన ప్రతిని బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చదివి విని్పంచారు. ‘‘1947లో దేశానికి భౌతికంగా మాత్రమే స్వాతంత్య్రం వచి్చంది. దాని ఆత్మకు మాత్రం ఇన్నేళ్ల తర్వాత 2024 జనవరి 22న రామ్ లల్లా విగ్ర ప్రతిష్టాపన ద్వారా ప్రాణప్రతిష్ట జరిగింది. ప్రజలు కనబరిచిన ప్రేమాభిమానాల ద్వారా మీరు జన నాయకునిగా సుప్రతిష్టితులయ్యారు. రామ మందిర ప్రతిష్టాపన ద్వారా కొత్త తరానికి తెర తీసిన దార్శనికుడయ్యారు’’ అంటూ మోదీపై తీర్మానం ప్రశంసలు కురిపించింది. ‘‘ప్రజల్లో ఇంతటి ఐక్యత గతంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా కని్పంచింది. అది ఒక నియంతను ఎదిరించేందుకు జరిగిన ఉద్యమం. ఇదేమో దేశంలో నూతన శకానికి అయోధ్య రాముని సాక్షిగా నాంది పలికిన చరిత్రాత్మక క్షణాలకు సాక్షిగా నిలిచిన ఐక్యత’’ అని పేర్కొంది. ఈ సందర్భంగా కేబినెట్ భేటీలో ఆసాంతం భావోద్వేగాలు ముప్పిరిగొన్నాయని ఒక మంత్రి తెలిపారు. రాముని ప్రాణప్రతిష్టకు సాక్షిగా నిలిచిన మంత్రివర్గంలో భాగస్వాములుగా ఉండటం గర్వకారణమని కేబినెట్ సభ్యులంతా అభిప్రాయపడ్డట్టు చెప్పారు. ఇది కొన్ని జన్మలకు ఒకసారి మాత్రమే లభించే అరుదైన అవకాశమన్నారు. ఆ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్లు రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం ద్వారా వాటి దిగుమతిని తగ్గించుకునే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్ల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. అలాగే కోల్ ఇండియా, గెయిల్ భాగస్వామ్యంలో రూ.13,052 కోట్ల కోల్–ఎస్ఎన్జీ (సింథటిక్ నేచురల్ గ్యాస్), సీఐఎల్, బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంలో రూ.11,782 కోట్ల కోల్–అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. -
రక్షణ రంగ స్వావలంబనే ఏకైక లక్ష్యం: రాజ్‌నాథ్
తేజ్‌పూర్(అస్సాం): రక్షణలో స్వావలంబన సాధన కోసమే స్వదేశీ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. అస్సాంలో తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘‘ భారత్‌ను వ్యూహాత్మక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే రక్షణరంగంలో స్వావలంబన అవసరం. అందుకే దేశీయ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇందులోభాగంగా రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకుంటున్నాం. ఎగుమతులను నెమ్మదిగా పెంచుతున్నాం. దశాబ్దాలుగా దిగుమతి చేసుకుంటున్న 509 రకాల రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించి వాటి దిగుమతులను నిషేధించాం. త్వరలో మరో 4,666 రకాల రక్షణ విడిభాగాలనూ దేశీయంగానే తయారుచేయాలని ప్రతిపాదించాం. ఇది కూడా త్వరలోనే ఆచరణలోకి తెస్తాం. తొలిసారిగా స్వదేశీ రక్షణ తయారీ రంగ పరిశ్రమ రూ.1లక్ష కోట్ల మార్క్‌ను దాటింది. 2016–17 కాలంలో రూ.1,521 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు 10 రెట్లు పెరిగి రూ.15,920 కోట్లు దాటాయి’’ అని రాజ్‌నాథ్ చెప్పారు. దేశీయ రక్షణ రంగంలో ప్రధాని మోదీ కొత్త ఒరవడి తెచ్చారు’’ అన్నారు. -
పూంచ్‌లో మరణించిన బాధిత కుటుంబాలకు రాజ్‌నాథ్ సింగ్ పరామర్శ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై బుధవారం సమీక్షించిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పూంచ్ జిల్లాలో ఇటీవల ఆర్మీ అధికారుల దాడిలో మరణించిన బాధిత కుటుంబాలను కలిశారు. ఈ సంఘటనపై దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా రాజ్‌నాథ్ వెంట ఉన్నారు. అలాగే రాజౌరీ జిల్లాలో సైనికుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పౌరులను పరమర్శించారు. కాగా డిసెంబర్ 21న జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. సైనికులతో కూడిన రెండు వాహనాలు వెళుతుండగా.. ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. వెంటనే సైనికులు ప్రతిదాడి చేయగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. అనంతరం ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిర్బంధ తనిఖీలతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి. ఉగ్రదాడిపై దీనిపై విచారణ జరపడానికి సైన్యం ఘటనాస్థలి వెళ్లింది. సమీపంలోని గ్రామం నుంచి 8 మంది పౌరులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ముగ్గురు తోపాపీర్ ప్రాంతంలో చనిపోయి కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఆర్మీ అంతర్గత విచారణకు ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్ములో పర్యటించారు. పూంచ్, రజౌరీలో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ అధికారులు ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు.అయితే వీరు ముగ్గురు ఎలా మరణించారనే విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి ముందు పౌరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆర్మీకి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. భారత పౌరులను బాధపెట్టే ఏ పొరపాట" ఆర్మీ చేయలేదని అన్నారు. ‘మీరు దేశ రక్షకులు. అయితే దేశ భద్రతతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకునే బాధ్యత కూడా మీపై ఉందని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దేశ పౌరులను బాధపెట్టే తప్పులు మీరు చేయకూడదు’ అని తెలిపారు. -
సాయుధ దళాలు.. వినూత్నంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సాయుధ దళాలలో సంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే.. కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలు తేవాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. కొత్త ఆలోచనలు చేయకుండా చాలా కాలం ఒకే తరహా సంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. యువ అధికారులు తమలో నూతనత్వానికి, వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ( ఇఎ్క) జరిగింది. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 213 ఫ్లైట్ కేడెట్లు (వీరిలో 25 మంది మహిళలు) పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించి.. పరేడ్‌కు సమీక్ష అధికారిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యువ కేడెట్లు భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లోకి చేరడానికి సూచికగా వారందరికీ అధికారిక హోదా కల్పిస్తూ రాష్ట్రపతి కమిషన్ (అధికారిక బ్యాడ్జ్‌లను)ను ప్రదానం చేశారు. తర్వాత రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించారు. ‘‘నిరంతరం అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలు, ఆవిష్కర ణల మధ్య సమతుల్యత సాధించండి. సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తే.. మనం ఎండిపోయిన సరస్సులా మారిపోతాం. మనం ప్రవహించే నదిలా ఉండాలి. ఇందుకు సంప్రదాయంతోపాటు కొత్తదనాన్ని తీసుకురావాలి. వాయుసేన అధికారులుగా మీరు ఆకాశంలో ఎగురుతూ ఉండండి. ఎక్కు వ ఎత్తును తాకండి, కానీ నేలతో మీ సంబంధాన్ని కొనసాగించండి’’అని పిలుపునిచ్చారు. అకాడమీలో భారత వాయుసేనకు చెందిన అధికారులతోపాటు నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నుంచి 9 మంది, స్నేహపూర్వక దేశమైన వియత్నాం నుంచి ఇద్దరు అధికారులు కూడా ఫ్లయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నుంచి అవార్డులు అందుకున్నారు. శిక్షణలో టాపర్‌గా నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ రాష్ట్రపతి ఫలకాన్ని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్‌ను రాజ్‌నాథ్ చేతులమీదుగా అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లలో మెరిట్లో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అమరీందర్ జీత్ సింగ్‌కు రాష్ట్రపతి ఫలకం లభించింది. అంతకుముందు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, యువ కేడెట్లతో ప్రమాణం చేయించారు. ఆకట్టుకున్న కవాతు శిక్షణలో ప్రథమస్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ ఆదివారం నాటి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువ ఫ్లయింగ్ కేడెట్లు చేసిన కవాతు ఆకట్టుకుంది. పరేడ్ అనంతరం భారత వాయుసేన నిర్వహించిన వైమానిక ప్రదర్శన అలరించింది. సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృంద విన్యాసాలు, సుఖోయ్–30 ఎంకేఐ గగనతల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులతోపాటు యువ ఫ్లయింగ్ ఆఫీసర్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. -
రూ. 2.23 లక్షల కోట్లతో ‘రక్షణ’ కొనుగోలు ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: రూ.2.23 లక్షల కోట్ల విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) గురువారం ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలిక్టాపర్లను త్రివిధ దళాల కోసం రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. దీనివల్ల భారత సైనిక దళాలు మరింత శక్తివంతంగా మారుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారత్–పాకిస్తాన్, భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సమకూర్చుకోవాలని రక్షణ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. రూ.2.23 లక్షల కోట్లతో కొనుగోలు చేస్తే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో 98 శాతం స్వదేశంలోనే తయారవుతాయని రక్షణ శాఖ పేర్కొంది. -
Parliament Winter sessions 2023: రేపు అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: డిసెంబర్ నాలుగో తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. డిసెంబర్ రెండో తేదీన(శనివారం) అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని సంబంధిత రాజకీయ పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేంద్రం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్‌తోపాటు రాజకీయ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు పాల్గొంటారు. ప్రస్తుతం పార్లమెంట్ వద్ద 37 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సారి సెషన్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని, 12 బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ల తొలి అదనపు బిల్లులను ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తోంది. లోక్‌సభలో ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలంటూ నైతికవిలువల కమిటీ ఇచ్చిన సిఫార్సును ఈసారి సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులను సభ ముందు ఉంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లునూ ప్రవేశపెట్టే అవకాశముంది. -
రాష్ట్రంలో బీజేపీదే అధికారం
కీసర, గోల్కొండ/కంటోన్మెంట్: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుపొంది రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తొమ్మిదిన్నరేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఎంతమందికి భూమి ఇచ్చారో చెప్పాలనీ, ఇంటికో ఉద్యోగమన్న సీఎం రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని విచారణ చేపడుతామన్నారు. శుక్రవారం నాగారంలోని రాంపల్లిలో, కార్వాన్ నియోజకవర్గంలో, కంటోన్మెంట్లో నిర్వహించిన కార్యక్రమాల్లో రాజ్‌నాథ్ ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి పీఎం మోదీ చిత్తశుద్ధితో కృషి చేశారనీ, కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్థికసాయం అందించారని గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నమ్మడం లేదన్నారు. దేశాన్ని సమర్థవంతంగా పాలిస్తున్న బీజేపీ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్నారు. దశాబ్దాల తన పాలనలో దేశాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు అన్ని చోట్లా తిరస్కరించారని, ఇక్కడా అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ పరిపాలన దక్షత ఏమిటో ప్రజలకు తెలిసినందువల్లే వారు వరుసగా మోదీకి జై కొడుతున్నారని అన్నారు. నేడు దేశం ప్రపంచ అగ్రరాజ్యాల సరసన చేరిందంటే అది ప్రధాని మోదీ సమర్థపాలన, సరైన విధాన నిర్ణయాలే కారణమని చెప్పారు. పార్టీ అభ్యర్థులు ఏనుగు సుదర్శన్‌రెడ్డి (మేడ్చల్), టి.అమర్‌సింగ్ (కార్వాన్)కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్వాన్ నియోజకవర్గంలో గుడిమల్కాపూర్ చౌరస్తా నుంచి దర్బార్ మైసమ్మ దేవాలయం వరకు జరిగిన బీజేపీ రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని, బీజేపీ మాత్రమే ప్రజల పార్టీ అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కుటుంబ పాలనకు ప్రాధాన్యమిచ్చే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఓడించాలన్నారు. బీజేపీ ఏదైనా చెబితే తప్పకుండా చేసి తీరుతుందన్నారు. 1951లో ఏర్పడిన జనసంఘ్ తమకు పార్లమెంట్లో స్పష్టమైన మెజారిటీ వస్తే ఆర్టికల్ 370 రద్దు చేస్తామని మరుసటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు. అలాగే, అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని 1980 దశకంలో ప్రకటించిందన్నారు. చెప్పినట్లుగానే ఆర్టికల్ 370 రద్దు చేశామని, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తిచేసి జనవరిలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు బేకార్ అని వ్యాఖ్యానించారు. -
US-India Relations: బలమైన రక్షణ బంధం
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు శుక్రవారం ఢిల్లీలో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వీటిలో పాలుపంచుకున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, అరుదైన ఖనిజాల అన్వేషణ, అత్యున్నత సాంకేతికత వంటి రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, పశ్చిమాసియాలో పరిణామాలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడుకు అడ్డుకట్ట వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై మంత్రులు చర్చించుకున్నారు. అనంతరం చర్చల వివరాలను వెల్లడిస్తూ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ముంబైలో 26/11 ఉగ్ర దాడులకు, పఠాన్‌కోట్ దాడులకు పాల్పడ్డ ముష్కరులకు శిక్ష పడి తీరాల్సిందేనని ప్రకటన స్పష్టం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌కు మంత్రుల భేటీ స్పష్టమైన హెచ్చరికలు చేసిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంతో పాటు ఐసిస్ సహా ఉగ్ర సంస్థలన్నింటినీ నిర్మూలించేందుకు అన్ని దేశాలూ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచి్చనట్టు వివరించింది. ఫలప్రదం: జై శంకర్ అమెరికా మంత్రులతో చర్చ లు ఫలప్రదంగా సాగాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతోపాటు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలపై చర్చించుకున్నామని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతకముందు చర్చల ప్రారంభ కార్యక్రమంలో ఎస్.జైశంకర్ మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఈ చర్చలు ఒక అద్భుత అవకాశమని అభివరి్ణంచారు. భారత్–అమెరికా మరింత సన్నిహితం కావడంతోపాటు ఉమ్మడి నిర్మాణాత్మక గ్లోబల్ అజెండాను రూపొందించుకోవాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లక్ష్యమని గుర్తుచేశారు. ఇరు దేశాల సంబంధాలు ఇతోధికంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత, వృద్ధిశీల, భద్రతాయుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యమిస్తున్నట్టు బ్లింకెన్ తెలిపారు. అంతేగాక అంతర్జాతీయ శాంతి, భద్రత తదితరాల సాధనకు కూడా ఇరు దేశాలూ కలసికట్టుగా కృషి చేస్తున్నాయన్నారు. భారత్–అమెరికా సంబంధాలకు రక్షణ ఒప్పందాలు మూలస్తంభంగా నిలుస్తున్నాయని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. చైనా దూకుడుకు సంయుక్తంగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సంయుక్తంగా సాయుధ సైనిక వాహనాల తయారీ: ఆస్టిన్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కీలకమైన సాయుధ సైనిక వాహనాల సంయుక్త తయారీ విషయంలో తక్షణం ముందుకు వెళ్లాలని భారత్–అమెరికా నిర్ణయించినట్టు లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరు దేశాల సైనిక దళాల మధ్య సమాచార వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక వ్యవస్థల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచేందుకు ఉద్దేశించిన సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ (ఎస్ఓఎస్ఏ) ఒప్పందం ఖరారు తుది దశకు చేరిందని మంత్రి చెప్పారు. జీఈ ఎఫ్–414 జెట్ ఇంజన్లను భారత్‌లో తయారు చేసేలా జనరల్ ఎలక్ట్రిక్ ఏరో స్పేస్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకున్నాయన్నారు. అలాగే భారత్‌కు వీలైనంత త్వరగా అత్యాధునిక ఎంక్యూ–9బి డ్రోన్లను సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. ఇది 300 కోట్ల డాలర్ల ఒప్పందం. ఆగడాలకు అడ్డుకట్ట పడాల్సిందే: భారత్ కెనడాలో ఖలిస్తానీ శక్తుల ఆగడాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. మంత్రుల చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా మీడియాకు వెల్లడించారు. వాటికి అడ్డుకట్ట పడాల్సిందేనని బ్లింకెన్, లాయిడ్లకు రాజ్‌నాథ్ స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో భారత ఆందోళనను అర్థం చేసుకోగలమని వారు చెప్పారన్నారు. ప్రధానితో మంత్రుల భేటీ భారత్–అమెరికా ద్వైపాక్షిక బంధం ప్రపంచ శాంతికి, ప్రగతికి అతి పెద్ద చోదక శక్తిగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మంత్రుల స్థాయి భేటీ అనంతరం అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు బ్లింకెన్, ఆస్టిన్ ఇరువురు శుక్రవారం రాత్రి ఆయనతో సమావేశమయ్యారు. విదేశంగ మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా భేటీలో పాల్గొన్నారు. సదస్సు జరిగిన తీరును, తీసుకున్న నిర్ణయాలను వారు మోదీకి వివరించారు. ‘‘ప్రజాస్వామ్యం, బహుళత్వ విలువలపై భారత్, అమెరికాలకున్న ఉమ్మడి విశ్వాసం తిరుగులేనివి. ఇరు దేశాల మధ్య జరిగిన మంత్రుల స్థాయి చర్చలు ఆశించిన ఫలితాలు సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అంటూ భేటీ అనంతరం మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా శుక్రవారం మోదీకి ఫోన్ చేశారు. పశి్చమాసియా ఉద్రిక్తత తదితరాలపై నేతలు ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ యుద్ధ మేఘాలు తీవ్ర రూపు దాలుస్తుండటం, ఉగ్రవాదం, మతి లేని హింస భారీ జన నష్టానికి దారి తీస్తుండటం దారుణమన్నారు. బ్రెజిల్ జీ20 సారథ్యం సఫలం కావాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. -
‘కారు’ బేకార్: రాజ్‌నాథ్ సింగ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో కారు బేకార్ అయ్యిందని, ప్రజలు రెండుసార్లు అవకాశమిచ్చినా కేసీఆర్ తన కుటుంబానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు తప్ప.. ప్రజలు, నిరుద్యోగులు, దళితుల ఆకాంక్షలు నెరవేర్చలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. గత పదేళ్లలో తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఎత్తులు వేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ చేతిలో చిత్తుకావాల్సిందేనన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్లో ‘జనగర్జన’పేరిట బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర పథకాలను కేసీఆర్ అమలు చేయట్లేదు కేంద్ర పథకాలను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేయడంలేదని రాజ్‌నాథ్ విమర్శించారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’, నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే పీఎంఏవై పథకాలు లబ్ధిదారులకు చేరడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పీఎంఏవై కింద దాదాపు 4 కోట్ల మందికి సొంతింటి కల నిజం చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రజల చేతిని ఏనాడో వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చి న హామీలు నెరవేర్చలేదని, ఉద్యోగ ఖాళీలు ఉన్నా ఎందుకు భర్తీ చేయట్లేదో యువతకు సీఎం సమాధానం చెప్పాలన్నారు. ఏ పరీక్ష జరిగినా పేపర్లు లీకవుతున్నాయని విమర్శించారు. దళితులకు ఇచ్చిన మాట కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. ‘లక్ష్మి’..‘చేయి’ ఊపితేనో, ‘కారు’లోనో రాదు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చెప్పింది చేస్తుందని.. గుజరాత్ అభివృద్ధిలో దేశానికే మోడల్ అయ్యిందని పేర్కొన్నారు. 27 ఏళ్ల బీజేపీ పాలనలో గుజరాత్ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ‘తెలంగాణకు కేంద్రం అనేక నిధులు మంజూరు చేసింది. అనేక సంక్షేమ పథకాలు మంజూరు చేసింది. మూడు వందే భారత్ రైళ్లు మంజూరు చేసింది. కరోనా వంటి కష్టకాలంలోనూ దేశాన్ని అగ్రగామిగా నిలిపింది. కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు కూడా పంపిణీ చేసింది. దేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చింది..’అని గుర్తు చేశారు. జనవరి 24 నుంచి అయోధ్యలో రామాలయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏ ఒక్కరి పోరాట ఫలితంగానో ఏర్పడలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణ వెనుకబాటుకు నాడు కాంగ్రెస్ అనుసరించిన విధానాలే ప్రధాన కారణమని విమర్శించారు. ‘లక్ష్మి’.. ‘చేయి’ఊపితేనో..‘కారు’లోనో రాదు. కమలం వికసిస్తేనే వస్తుంది. కమలం గుర్తుకు ఓటేసి ‘లక్ష్మి’ని ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆవసరముందని వ్యాఖ్యానించారు. బీజేపీని ఆశీర్వదించండి: రాజేందర్ బీజేపీ–తెలంగాణ బంధం ఈనాటిది కాదని, 1997లో కాకినాడలో తెలంగాణకు అనుకూలంగా పార్టీ తీర్మానం చేసిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ప్రధాన మోదీ అని, తెలంగాణలో బీజేపీని ఆశీర్వదిస్తే కిలో కూడా తరుగులేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, ఉద్యోగాల భర్తీ చేపడతామని, ప్రజలకు ఉచిత విద్య–వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, పార్టీ నేత ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్,కాంగ్రెస్‌లను సాగనంపండి: కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘కుటుంబ, అవినీతి పాలన సాగిస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను సాగనంపి రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి..’అని విజ్ఞప్తి చేశారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టేందుకు కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆపార్టీని కాంగ్రెస్ పెంచి పోషించిందని విమర్శించారు. మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమన్నారు. -
తెలంగాణ ఎందుకు అభివృద్ధి కాలేదు?: రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతమైందని బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. జమ్మికుంటలో సోమవారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కుటుంబ అభివృద్ధి మాత్రమే జరుగుతోందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా అధికారాన్ని చేలాయిస్తున్నారని.. అధికారం లేకుండా కేసీఆర్ ఉండలేరని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వాజ్‌పేయి ప్రభుత్వ హాయంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతోందని, మరి తెలంగాణలో అభివృద్ధి ఎందుకు జరగడం లేదు? అని రాజ్‌నాథ్, బీఆర్ఎస్ సర్కార్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ మాత్రం 10 ఏళ్లలో వెనకబడిపోయిందని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. బీజేపీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కృష్టి కూడా ఉంది. కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ ఏర్పడలేదు. కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదు. హైదరాబాద్ తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదు. దేశానికి గుజరాత్ అభివృద్ధి మోడల్. అభివృద్ధి మంత్రంతోనే గుజరాత్లో 27 ఏళ్లుగా గెలుస్తోంది. విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కాంగ్రెస్ తీరే కారణం’ అని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. -
అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.. రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారతదేశం 2047 సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడాలంటే అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగిన బలమైన సాయుధ బలగాల అవసరముందని అన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. రక్షణ శాఖ అకౌంట్స్ విభాగంలో పలు డిజిటల్ సేవలను ప్రారంభించిన ఆయన త్రివిధ దళాలు తమకు అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను వినియోగించుకుంటూ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ సారాంశ్(రక్షా మంత్రాలయ అకౌంట్లు, బడ్జెట్, వ్యయం), బిశ్వాస్(బిల్లులు, పని విశ్లేషణ, ఈ-రక్షా ఆవాస్) డిజిటల్ సేవలను ప్రారంభించారు. రక్షణ శాఖ అకౌంట్స్ విభాగం 276వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణశాఖ అకౌంట్స్ విభాగం మొత్తం శాఖకే కవచంలా వ్యవహరిస్తోందని అన్నారు. అంతర్గత నిఘా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఎక్కడైనా అనుమానాస్పద వ్యవహారాలు చోటు చేసుకుంటే వెంటనే గుర్తించే వీలుంటుందన్నారు. దీనిద్వారా సమస్యను తొందరగా పరిష్కరించుకోవడమే కాదు, ప్రజల్లో రక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని కూడా పెంచవచ్చన్నారు. మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దబడాలంటే భార్య సాయుధ బలగాలకు అత్యంత ఆధునిక ఆయుధాలను, సామాగ్రిని అందించాల్సిన అవసరముందని అందుకు మనవద్ద ఉన్న ఆర్ధిక వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. దీనికోసం అవసరమున్న సేవలకు అందుబాటులో ఉన్న వనరుల మధ్య బ్యాలన్స్ కుదరాలని అన్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్లోని ఆయుధాలపై అధ్యయనం చేయడానికి అకౌంట్స్ శాఖలో ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇంతకాలం డీఏడీ పారదర్శకమైన, సమర్ధవంతమైన ఆర్దిక వ్యవస్థ ద్వారా దేశ రక్షణ సామర్ధ్యాన్ని పెంచిన విధానం అద్భుతమని, ఏదైనా వ్యవస్థలో అకౌంటింగ్ అనేది చాలా కీలకమైనదని రక్షణ అకౌంట్ విభాగం న్యాయబద్ధమైన రీతిలో అవసరాన్ని బట్టి వనరులను సమకూర్చుకోవాలని అన్నారు. వీలయితే సాంకేతికంగా ముందడుగు వేసే విధంగా ఐఐఎం, ఐసీఏఐ వంటి సంస్థలతో చేతులు కలపాలని తద్వారా డీఏడీ ఆర్ధిక మేధస్సు పెరుగుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: ఐఎఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ -
నన్నెవరూ ఆపలేరు
సాక్షి, హైదరాబాద్: ‘గవర్నర్‌గా రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో మహిళా మంత్రులెవరూ లేరు. కానీ ఉదయం గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసి సాయంత్రం ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణం చేయించడం సంతోషకరంగా భావించా’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం కోటా కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెచ్చినందుకు కృతజ్ఞతగా శనివారం రాజ్‌భవన్‌లో వివిధ రంగాల మహిళా ప్రముఖులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వెన్ను చూపితే ఇంకా వేగం పెంచుతా... ‘ఏదైనా అడ్డంకులొస్తే భావోద్వేగానికి గురై పనిచేయడం మానేసే అలవాటును మహిళలు వీడాలని గవర్నర్ తమిళిసై సూచించారు. గౌరవం లభించినా, లభించకపోయినా ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వంతో తన ప్రొటోకాల్ వివాదాన్ని మళ్లీ ప్రస్తావించారు. ‘ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ధైర్యంగా పని చేసుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. మీరొచ్చి నాకు పుష్పాన్ని ఇస్తే స్వీకరిస్తా. వెన్ను చూపిస్తే మాత్రం ఇంకా వేగంతో ముందుకుపోతా. దారిలో ముళ్లుంటే తీసి పడేసి ముందుకు సాగుతా. నాపై రాళ్లు రువ్వితే వాటితోనే కోటను నిర్మించుకుంటా. నన్ను పిన్నులతో గుచ్చినా వచ్చే ఆ రక్తంతోనే నా జీవిత చరిత్ర రాసుకుంటా. నన్ను ఎవరూ ఆపలేరు. నియంత్రించలేరు. విమర్శలు, అవమానాలను పట్టించుకోను. ఇదే నా సందేశం’అని గవర్నర్ తమిళిసై అన్నారు. బీజేపీలో నాడే 33% మహిళా కోటా.. బీజేపీలో మహిళా కోటాను అమలు చేయడంతో చాలా మంది ప్రతిభావంతులైన మహిళలు ఆ పార్టీలో చేరారని గవర్నర్ తమిళిసై అన్నారు. తాను గతంలో బీజేపీలో పనిచేసిన విషయం అందరికీ తెలుసని, ఈ విషయాన్ని దాచుకోనని చెప్పారు. ఇప్పుడు పరిపాలనపరమైన పదవికి మారానని గుర్తుచేశారు. నాటి బీజేపీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్ పార్టీ పదవుల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించి పార్టీ శాసనాన్ని ఆ మేరకు సవరించారని తెలిపారు. దీంతో చాలా మంది మహిళలు బీజేపీలో చేరారన్నారు. మహిళా రిజర్వేషన్లతో ఇకపై మహిళలూ రాజకీయాల్లో వచ్చేందుకు ఉత్సాహం లభిస్తుందన్నారు. ఈస్ట్రోజన్ (మహిళల హార్మోన్లు) చాలా శక్తివంతమైనదని, మహిళలు గొప్ప పాలనాదక్షులు అని తెలిపారు. రిజర్వేషన్లు 33 శాతమే కావచ్చని, 50% అవకాశాల కోసం కష్టపడాలని సూచించారు. రిజర్వేషన్లు బినామీలు, భార్యల కోసం కాదు ప్రధాని మోదీ బలమైన నాయకత్వంతోనే మహిళా రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని, ఇవి సమాజానికి ఉపయోగపడాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. బినామీలు, కుమార్తెలు, భార్యలు, తల్లులను రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం రిజర్వేషన్లను వాడకూడదని కోరారు. తాను రాజకీయ నేత కుమార్తె అయినప్పటికీ ఎన్నడూ ఆ కార్డును వాడుకోలేదన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి పైకి వచ్చినట్లు చెప్పారు. మహిళల చేతిలోకి పాలన వస్తే పేదరికం, అనారోగ్యం కనుమరుగు అవుతాయన్నారు. మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహిళా బిల్లుకు ఆమోదం తెలపడం గొప్ప విషయమన్నారు. రాజకీయాల్లో మహిళలు పురుషుల కంటే 10–20 రేట్లు ఎక్కువగా పనిచేస్తేనే పదవుల కోసం కేవలం పేర్లను పరిశీలిస్తారని, ఇస్తారో లేదో గ్యారెంటీ లేదని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు 50 రేట్లు అధికంగా పనిచేయాల్సి ఉంటుందనేది తన అభిప్రాయమన్నారు. -
ఐఏఎఫ్‌లోకి సీ–295 విమానం
ఘజియాబాద్: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లోకి మొదటి సీ–295 రకం రవాణా విమానం చేరింది. ఈ విమానాలు ఐఏఎఫ్ వ్యూహాత్మక రవాణా సామర్థ్యం పెంపులో కీలకంగా మారనున్నాయి. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీ–295 విమానాన్ని ఐఏఎఫ్‌లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజ్‌నాథ్ సర్వ ధర్మపూజ నిర్వహించారు. వైమానిక దళ చీఫ్ వీఆర్ చౌధరితోపాటు సీనియర్ అధికారులు, విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ ప్రతినిధులు పాల్గొన్నారు. వడోదర ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి పనిచేసే స్క్వాడ్రన్ నంబర్ 11కు సీ–295ను అందజేయనున్నారు. కేంద్రం 56 సీ–295 రవాణా విమానాల్ని కొనుగోలు చేసేందుకు ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో రూ.21,935 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి సీ–295 విమానాన్ని ఈ నెల 13న ఐఏఎఫ్ చీఫ్ అందుకున్నారు. ఈ విమానాలను ప్రస్తుతమున్న పాతకాలం ఆవ్రో– 748ల బదులు వినియోగించుకుంటారు. ఒప్పందంలో భాగంగా 16 విమానాల్ని ఎయిర్‌బస్ సంస్థ అందజేస్తుంది. మిగతా 40 విమానాల్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో కలిసి భారత్‌లోనే ఉత్పత్తి చేస్తుంది. వి డి భాగాల తయారీ పనులు హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. -
మణిపూర్ హింసాకాండలో 175 మంది బలి
ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ ఏడాది మే నెలలో హింసాకాండ మొదలైంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 175 మంది మరణించారని, 32 మంది అదృశ్యమయ్యారని, 1,108 మంది గాయపడ్డారని మణిపూర్ పోలీసు శాఖ వెల్లడించింది. మరణించిన 175 మందిలో 96 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు ఇంకా తీసుకెళ్లలేదని, అవి వివిధ ఆసుపత్రుల్లో మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది. అలాగే 9 మృతదేహాలను గుర్తించలేదని వివరించింది. దాడులు, ప్రతి దాడుల్లో 4,786 ఇళ్లు దహనమయ్యాయని తెలియజేసింది. మణిపూర్‌లో హింస మొదలైనప్పటి నుండి ఆయుధగారాల నుంచి 5,668 ఆయుధాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వీటిలో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు మళ్లీ స్వా«దీనం చేసుకున్నాయి. అల్లరి మూకల నుంచి భారీగా మందుగుండు సామగ్రి, బాంబులను కూడా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గృహ దహనాలకు సంబంధించి పోలీసులు 5,172 కేసులు నమోదు చేశారు. హింసాకాండకు సంబంధించి మొత్తం 9,332 కేసులు నమోదు చేశారు. 325 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని మణిపూర్ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అస్సాం రైఫిల్స్‌ను ఉపసంహరించాలి తమ రాష్ట్రం నుంచి అస్సాం రైఫిల్స్ దళాలను వెంటనే ఉపసంహరించాలని మణిపూర్ పౌర సమాజ సంస్థలతో కూడిన మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ(కాకోమీ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. అస్సాం రైఫిల్స్ జవాన్లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాకోమీ ప్రతినిధులు తాజాగా ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. -
Kargil Vijay Diwas: ఘర్ మే ఘుస్ కే...
ద్రాస్ (లద్దాఖ్): భారత్ తన గౌరవ ప్రతిష్టలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే సైనికులకు సహకారం అందించడానికి పౌరులందరూ సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం దేశమంతా విజయ్ దివస్ జరుపుకుంది. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాది దాటినా ఇంకా యుద్ధం కొనసాగుతోందని అంటే పౌరులు భాగస్వాములు కావడం వల్లేనని అభిప్రాయపడ్డారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ కవి్వంపు చర్యల్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన మన దేశ గౌరవాన్ని, మర్యాదని కాపాడుకోవడానికి ఎంత తీవ్రమైన చర్యలకైనా దిగుతామని హెచ్చరించారు. పొరుగుదేశం రెచ్చగొట్టే చర్యలకి దిగితే నియంత్రణ రేఖ దాటుతామన్నారు. ‘‘మన దేశంలో యుద్ధం పరిస్థితులు వస్తే సైనిక బలగాలకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. పరోక్షంగా తమ సహకారాన్ని అందిస్తారు. ఈ సారి అవసరమైతే ప్రత్యక్షంగా యుద్ధభూమిలో పాల్గొనాలని, దానికి తగ్గట్టు మానసికంగా సంసిద్ధులు కావాలని కోరుతున్నాను’’ అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునే అంశంలో మన సైన్యం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కార్గిల్ యుద్ధం సమయంలో భారత ఆర్మీ పాకిస్తాన్కేకాక యావత్ ప్రపంచానికి సందేశం పంపించిందన్నారు. పాకిస్తాన్ మనకి వెన్నుపోటు పొడవడంతో కార్గిల్ యుద్ధం వచి్చందన్నారు. అంతకు ముందు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల సమాధుల్ని సందర్శించి పుష్ఫగుచ్ఛాలుంచి నివాళులరి్పంచారు. ప్రధాని నివాళులు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘‘మన దేశ సైనికుల అపూర్వమైన విజయాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరులందరికీ నివాళులరి్పస్తున్నాను. దేశం కోసం త్యాగం చేసిన వారి గాథలన్నీ తరతరాలకు స్ఫూర్తి దాయకం’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ట్వీట్లో కార్గిల్ విజయ్ దివస్ భారత వీరుల ధైర్య గాథల్ని గుర్తు చేస్తుందని, ప్రజలందరికీ వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. అమరులందరికీ హృదయపూర్వక నివాళులరి్పస్తున్నట్టుగా పేర్కొన్నారు. 1999లో కార్గిల్‌ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారత్ విజయ దుందుభి మోగించింది. -
హాని చేయాలని చూస్తే బుద్ధి చెబుతాం
కాంకేర్(ఛత్తీస్‌గఢ్): భారత్‌కు ఎవరైనా హాని కలిగించాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పొరుగుదేశాన్ని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావిత కాంకేర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. పుల్వామా, ఉడి ఉగ్రదాడులకు ప్రతిగా 2016, 2019ల్లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌లను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా మారింది, ఇప్పుడు బలహీన దేశం ఎంతమాత్రం కాదని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో వామపక్ష తీవ్రవాద సంబంధ ఘటనలు ఇప్పుడు కేవలం 10–12 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యాయన్నారు. -
యూసీసీకి మతం రంగు పులమొద్దు: రాజ్‌నాథ్ సింగ్
జోద్పూర్: దేశంలో ఉమ్మడిపౌర స్మృతి(యూసీసీ) అమలు గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడినప్పుడల్లా ప్రతిపక్షాలు మతం కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. సమాజాన్ని చీల్చే రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు. యూసీసీకి మతం రంగు పులమొద్దని సూచించారు. రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆయన బుధవారం రాజస్తాన్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. మహిళల గౌరవాన్ని కాపాడే విషయంలో మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంకితభావంతో పని చేస్తోందన్నారు. -
భారత్ వాణిని ప్రపంచం ఆసక్తిగా వింటోంది
జమ్మూ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచ వేదికపై భారత్ పలుకుబడి, స్థాయి పెరిగిపోయాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ చెప్పే విషయాలను ప్రపంచ సమాజం ఇప్పుడు ఆసక్తిగా వింటోందని చెప్పారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ఏ విషయమైనా చెబితే, అంత సీరియస్‌గా తీసుకునేవారు కారని తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చాక 2014 తర్వాత అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో జాతీయ భద్రతపై జరిగిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టుల్లో ఆరు రోజుల పర్యటన సందర్భంగా పలు చారిత్రక ఒప్పందాలపై సంతకాలు చేసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ప్రధాని మోదీ పలుకుబడి పెరిగిందని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ‘బాస్’అంటూ మోదీని అభివరి్ణంచగా, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆటోగ్రాఫ్ తీసుకునేంత ప్రజాదరణ కలిగిన నేతగా కొనియాడిన నేపథ్యంలో మంత్రి ఈ మాటలన్నారు. ప్రధాని మోదీ హయాంలో భారత్ మరింత శక్తివంతంగా మారిందన్న ఆయన..అవసరమైన పక్షంలో సరిహద్దుల వెలుపల కూడా దాడి చేయగలదంటూ పొరుగుదేశం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’విధానం అంటే అర్థం ఏమిటో దేశంతోపాటు ప్రపంచమే తెలుసుకుందని వ్యాఖ్యానించారు. 2016, 2019ల్లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ..ఇందుకు సంబంధించిన నిర్ణయాలను ప్రధాని మోదీ కేవలం 10 నిమిషాల్లోనే తీసుకున్నారని, దీన్ని బట్టి ఆయన సామర్థ్యమేంటో తెలుస్తుందని రాజ్‌నాథ్ తెలిపారు. సరిహద్దుల లోపలే కాదు, వెలుపల కూడా ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను మన బలగాలు ధ్వంసం చేశాయన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోíÙంచడమే ప్రభుత్వ విధానంగా మార్చుకున్న దేశాలు ఈ ఆటను ఎక్కువ సేపు ఆడలేవన్న విషయాన్ని గ్రహించాలని ఆయన పాక్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. భారత్ కృషితో నేడు చాలా వరకు పెద్ద దేశాలు ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడుతున్నాయని చెప్పారు. కశీ్మర్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ద్వారా ఏమీ సాధించలేమన్న విషయం పాక్ తెలుసుకోవాలన్నారు. పాక్ ముందుగా తన సొంతింటిని చక్కదిద్దుకోవాలని హితవుపలికారు. పాక్ ఆక్రమిత కశీ్మర్ కూడా భారత్‌దేనని చెప్పారు. దీనిపై పార్లమెంట్ ఇప్పటికే పలు తీర్మానాలు చేసిందని గుర్తు చేశారు. జమ్మూకశీ్మర్‌లో తామూ భాగమేనంటూ పీవోకే ప్రజలు డిమాండ్ చేసే రోజులు ఎంతో దూరంలో లేవని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. -
బరాక్ ఒబామాపై బీజేపీ నేతలు ఫైర్..
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్బంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత దేశంలో మైనారిటీల భద్రత గురించి ప్రశ్నించాలని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై భారత ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మొదట వ్యాఖానించగా ఇప్పుడు రాజ్ నాథ్ సింగ్ కూడా ఘాటుగా స్పందించారు. బరాక్ ఒబామా వ్యాఖ్యలపై మొదట స్పందించిన నిర్మలా సీతారామన్.. మీ హయాంలో మొత్తం ఆరు ముస్లిం దేశాలపైన దాడులు జరిగాయని, దాదాపుగా 26 వేలకు పైగా బాంబులు వేశారు. ఆయన మాటలను ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరినీ ఒకే కుటుంబంగా పరిగణించే ఏకైక దేశం భారతదేశమని, ఈ విషయం ఒబామా మరచిపోకూడదని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో ఆయన ఎన్ని ముస్లిం దేశాలపై దాడులు చేశారన్నది కూడా ఆలోచించాలని అన్నారు. #WATCH | Defence Minister Rajnath Singh speaks on former US President Barack Obama's remarks about the rights of Indian Muslims "Obama ji should not forget that India is the only country which considers all the people living in the world as family members... He should also think… pic.twitter.com/k7Swn7HpW1 — ANI (@ANI) June 26, 2023 ఇది కూడా చదవండి: ప్రధానికి మణిపూర్‌లో పరిస్థితిని వివరించిన అమిత్ షా -
కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన సాయం సున్నా: కేటీఆర్
న్యూఢిల్లీ: తెలంగాణకు చేయూత నివ్వాలని గతంలో చాలాసార్లు కేంద్రాన్ని కోరామని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని, 9 ఏళ్లలో కేంద్రం పైసా సాయం కూడా చేయలేదని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కేటీఆర్ శుక్రవారం కలిశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. పటాన్చెరు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరణకు సహకరించాలని కోరామని పేర్కొన్నారు. కేంద్రం సహకరిస్తే సంతోషం.. లేదంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందని కేటీఆర్ తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి హైదరాబాద్ హబ్‌గా మారిందన్నారు. 2020లో హైదరాబాద్‌లో భారీగా వదరలు వచ్చినా కేంద్రం సాయం చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్లోస్కై వాక్స్ నిర్మిస్తున్నామని, ఉప్పల్‌లో స్కై వాక్‌ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్యాట్నీ నుంచి 18.8 కి.మీ స్కైవే నిర్మించాలని నిర్ణయించామని, స్కై కారిడార్‌తోపాటు ఇతర నిర్మాణాలకు సహకరించాలని కోరినట్లు చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్‌ను నాలుగు విషయాలు అడిగానని, అయిదుగురు కేంద్ర మంత్రులను 15 సార్లకు పైగా కలిశానని పేర్కొన్నారు. ‘తెలంగాణకు చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని కోరుతున్నాం. రాజీవ్ రహదారిలో స్కైవే నిర్మాణానికి 96 ఎకరాల కంటోన్మెంట్ల్యాండ్ అడిగాం. ల్యాండ్ ఫర్ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పాం. లీజ్ల్యాండ్స్ను జీహెచ్ఎంసీకి బదలాయించాలని కోరాం. ఎన్నిసార్లు అడిగినా కేంద్రం స్పందించడం లేదు. . రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం లోపం లేకుండా పోరాడుతున్నాం. స్పందించి ఇస్తే మంచింది.. లేకుంటే వాళ్ల ఖర్మ.’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి రండి.. బీజేపీలో కీలక పరిణామం! -
బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వండి
సాక్షి, చైన్నె: తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ప్రదాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవ సభ తాంబరంలో మంగళవారం రాత్రి జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అధ్యక్షతన జరిగిన సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తూ తమిళనాడు అంటే తనకు ఎంతో ఇష్టం అని, తమిళంలో ప్రసంగించాలన్న ఆశ ఉన్నా భాషా సమస్యతో తన మాతృభాష హిందీలోనే మాట్లాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. సిద్ధులు, ఆళ్వార్లు, నయన్మార్లు జీవించిన ఈ గడ్డకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడుకే పరిమితమై ఉన్న సెంగోల్ చరిత్రను ప్రపంచ దేశాలకు చాటిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. తమిళనాడులో అవినీతి రాజ్యమేళుతోందని ధ్వజమెత్తారు. తమిళనాడులో అధికారం లక్ష్యంగా బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు. అవినీతి రహిత పాలనను తమిళనాట బీజేపీ అందిస్తుందన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే ఆర్థికాభివృద్ధిలో భారత దేశం ముందంజలోకి వెళ్లడం ఖాయం అని పేర్కొన్నారు. మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారంలో సీఎం స్టాలిన్ రెండు నాల్కల ధోరణి అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. రష్యాని ఏలిన నియంత స్టాలిన్ పేరు కలిగిన నాయకుడు ఇక్కడ నియంత వలే వ్యవహరిస్తున్నాడని, ఆయన పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. -
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా గెలిచేది మేమే..
మధ్యప్రదేశ్: రాజ్ గడ్ లో జరిగిన కిసాన్ కళ్యాణ మహాకుంభ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అవసరానికి హిందువుగా అవతారం ఎత్తి ఆమె మధ్యప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే ప్రియాంక గాంధీ వచ్చారంటూ వ్యాఖ్యానించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. జబల్పూర్లో రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆమె నర్మదా నది వద్ద ప్రార్ధనలు నిర్వహించి ఆ నదిని జీవనదిగానూ, జీవాధారంగానూ వర్ణించడం వెనుక అసలు కారణం వేరే ఉందన్నారు కేంద్ర మంత్రి. ఈ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ రైతుల సాధికారతతోనే దేశం శక్తివంతంగా తయారవుతుందని అన్నారు. కొందరు రైతుని "అన్నదాత" అంటే మరికొంతమంది వారిని "జీవనదాత" అంటూ ఉంటారు. కానీ నా దృష్టిలో రైతులంటే "భాగ్యవిధాతలు" అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని విమర్శించాడనికి ఆయన ఇదే సభను వేదికగా చేసుకున్నారు. అవసరాన్ని బట్టి హిందువు అవతారం ఎత్తి ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి కొందరు వస్తుంటారు. ఈ మధ్య వారు ఆంజనేయ స్వామి గదను కూడా పట్టుకుని తిరుగుతున్నారు. అలాంటి వారిని నమ్మకండి. నర్మదా నదిని జీవనదిగా ముందు గుర్తించింది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చి ప్రజల్లో మంచి నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఆయన హయాంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ పెరిగింది, అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇక్కడ మహిళలు ఆర్మీలో చేరుతున్నారు, సియాచిన్ నౌకాదళ యుద్ధనౌకల్లో కూడా మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ బీజీపీ ప్రభుత్వాలు అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నాయని, ఇప్పుడు మీరొచ్చి ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కాంగ్రెస్ పార్టీ నాయకురాలినుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మతమార్పిడులు చేస్తే జైలుకే.. ఇద్దరు అరెస్టు -
సరిహద్దుకు ఎటువైపైనా దీటైన జవాబివ్వగలం
ససరాం: దేశ సరిహద్దుకు లోపల, వెలుపలా రక్షణ సన్నద్ధత, సామర్థ్యం విషయంలో భారత్‌కు తిరుగులేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. బాలాకోట్‌లో ఉగ్రస్థావరంపై వైమానిక దాడులు, పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంపై సర్జికల్ దాడులే భారత సత్తాకు సాక్ష్యాలన్నారు. బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినపుడు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని తెల్సి మోదీ వెంటనే రష్యా, ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులతో ఒక్కటే మాట చెప్పారు. అంతే. నాలుగు గంటలపాటు యుద్ధం స్తంభించింది. విద్యార్థులను వెనక్కి తెచ్చేశాం. మోదీ ఘనత చూసి ప్రపంచమే నోరెళ్లబెట్టింది’ అని అన్నారు. -
అమెరికాతో రక్షణ రోడ్డు మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో అమెరికా, భారత్ మధ్య పరస్పర సహకారానికి రోడ్డు మ్యాప్ ఖరారైంది. ఢిల్లీలో సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సుదీర్ఘంగా చర్చించి, ఈ మేరకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేశారు. రక్షణ పారిశ్రామిక రంగంతోపాటు రక్షణ ఉత్పత్తుల తయారీలో ఇకపై ఇరు దేశాలు సహకరించుకుంటాయి. ఫాస్ట్–ట్రాక్ టెక్నాలజీ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. గగతతల, భూ ఉపరితల యుద్ధానికి అవసరమైన ఆయుధాలను కలిసికట్టుగా తయారు చేసుకుంటాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ దేశం చైనా దూకుడు పెరుగుతున్న సమయంలో భారత్, అమెరికా మధ్య ఈ రోడ్డు మ్యాప్ ఖరారు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రెండు వారాల తర్వాత అమెరికాలో పర్యటించబోతున్నారు. రెండు దేశాల నడుమ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దుందుడుకు చర్యలు, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు భారత్–అమెరికా బంధం ఒక మూలస్తంభమని అభివర్ణించారు. భారత సైన్యం ఆధునీకరణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికా నడుమ రక్షణ రంగంలో సహకారం విషయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడానికే రోడ్డు మ్యాప్ ఖరారు చేసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం ‘పెంటగాన్’ వెల్లడించింది. ఫైటర్ జెట్ ఇంజన్లకు అవసరమైన ఆధునిక టెక్నాలజీని భారత్‌కు అందజేయానికి జనరల్ ఎలక్ట్రిక్స్ సంస్థ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే 30 ఎంక్యూ–9బీ ఆర్మ్డ్ డ్రోన్లను అమెరికా రక్షణ రంగ సంస్థ నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ రెండు అంశాల గురించి లాయిన్ అస్టిన్ వద్ద రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ద్వైపాకిక్ష రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి 2020 అక్టోబర్‌లో బేసిక్ ఎక్సే్ఛంజ్, కో–ఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ) కుదిరింది. -
మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్
న్యూఢిల్లీ: కీలకమైన మిత్రదేశమైన మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లను కానుకగా అందివ్వనుంది. మే ఒకటి నుంచి మూడో తేదీ వరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీటిని అందజేస్తారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొంతకాలంగా పెరుగుతున్న చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే దిశగా భారత్ తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని చెబుతున్నారు. పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా సాహిత్, రక్షణ మంత్రి మరియా దీదీతోనూ రాజ్‌నాథ్ చర్చలు జరుపుతారు. -
SCO Defence Ministers Meet: ఉగ్రవాదాన్ని పెకిలిద్దాం
న్యూఢిల్లీ: ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేయాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ విషయంలో షాంఘై కో–అపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సభ్యదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రభూతం ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమేనని, దాన్ని అంతం చేయాల్సిందేనని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎస్సీఓ సభ్యదేశాల రక్షణ శాఖ మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదానికి అండదండలు అందించేవారి పీచమణచాలని చెప్పారు. కూటమిలోని సభ్యదేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకొనేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేయాలని అన్నారు. చైనా, పాకిస్తాన్ తీరును పరోక్షంగా ఆయన తప్పుపట్టారు. ఎస్సీఓ సదస్సుకు రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. సభ్య దేశాల నడుమ విశ్వాసం, సహకారం మరింత బలోపేతం కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం శాంతి, భద్రతకు ఊతం ఇవ్వాలన్నదే తమ ఆశయమని వివరించారు. ఎస్సీఓ సదస్సుకు చైనా, రష్యా తదితర సభ్య దేశాల రక్షణశాఖ మంత్రులు హాజరయ్యారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హాజరు కాలేదు. ఆయన బదులుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు మాలిక్ అహ్మద్ ఖాన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. షాంఘై సహకార కూటమి 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. ఇందులో భారత్, రష్యా, చైనా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. 2017లో పాకిస్తాన్ శాశ్వత సభ్యదేశంగా మారింది. -
సరిహద్దుల్లో శాంతితోనే సత్సంబంధాలు
న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు సమస్యలన్నీ ద్వైపాక్షిక ఒప్పందాలకు లోబడి పరిష్కారం కావాల్సి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. గురువారం ఆయన చైనా రక్షణ మంత్రి లి షంగ్ఫుతో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి(ఎల్ఏసీ) మూడేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) దేశాల రక్షణ మంత్రుల సమావేశం కోసం లి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, లి సుమారు 45 నిమిషాలసేపు చర్చలు జరిపారు. ఇరువురు మంత్రులు సరిహద్దు వివాదాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి దాపరికాలు లేకుండా చర్చలు జరిపినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్ఏసీ వెంట నెలకొన్న వివాదాలు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, హామీలు, ఒడంబడికలకు లోబడి పరిష్కారం కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ‘సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని బట్టే రెండు దేశాల మధ్య సంబంధాల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఒప్పందాల ఉల్లంఘనలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని, ఉద్రిక్తతలు సడలిన తర్వాత మాత్రమే బలగాల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు’అని రక్షణ శాఖ ఆ ప్రకటనలో వివరించింది. -
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారినపడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో, రాజ్‌నాథ్ సింగ్.. హోం క్వారెంటైన్లో ఉన్నారు. అయితే, రాజ్‌నాథ్ సింగ్.. గురువారం వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉంది. కాగా, కోవిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఆ ఈవెంట్‌కు దూరం అయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్‌నాథ్ బాధపడుతున్నారని, డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన రెస్టు తీసుకుంటున్నట్లు ప్రకనటలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 13వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ఇక, మరణాలు కూడా ఎక్కవ సంఖ్యలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. Raksha Mantri #RajnathSingh has been tested positive for #COVID19 with mild symptoms and is now under home quarantine. He had attended Army's Commanders Conference yesterday at Manekshaw Centre. Praying for soonest recovery ! pic.twitter.com/WSe4jyPVbJ — Neeraj Rajput (@neeraj_rajput) April 20, 2023 -
ఆర్థిక వ్యవస్థలో బొగ్గు కీలక పాత్ర: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బొగ్గుని నల్ల బంగారంగా పేర్కొన్నారు. వాణిజ్య బొగ్గు గనుల ఏడో విడత వేలాన్ని రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘‘గడిచిన కొన్నేళ్లలో మన ఇంధన వినియోగం పెరిగింది. అది ఇక ముందూ వృద్ధి చెందుతుంది. ఈ అవసరాలను తీర్చేందుకు ఈ రోజు నుంచే చర్యలు తీసుకోవాలని’’ చెప్పారు. వ్యాపార సులభ తర నిర్వహణను ప్రోత్సహించేందుకు ముందస్తుగా ఉత్పత్తి ప్రారంభించిన వాటికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించే ఆదాయంలో 50 శాతాన్ని రాయితీగా ఇస్తున్నట్టు చెప్పారు. వచ్చే 40-50 ఏళ్లపాటు బొగ్గు వినియోగం కొనసాగుతుందని చెబుతూ.. భారీగా ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఆరు విడతల వేలంలో 87 బగ్గు గనులను వేలం వేశామని, ఇవన్నీ ఉత్పత్తి ఆరంభిస్తే ఏటా రూ.33,200 కోట్ల ఆదాయంతో పాటు లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) 106 గనుల వేలం.. ఏడో విడతలో వేలానికి ఉంచిన 106 గనుల్లో 61 బ్లాక్‌లు పాక్షికంగా అన్వేషించినవి కాగా, 45 పాక్షికంగా బొగ్గు నిక్షేపాల గురించి అన్వేషణ నిర్వహించినవి. 95 నాన్ కోకింగ్ కోల్ గనులు అయితే, 10 లిగ్నైట్ గనులు ఉన్నాయి. ఈ గనుల నుంచి వెలికితీసే బొగ్గు వినియోగంపై ఎలాంటి ఆంక్షలను ప్రభుత్వం పెట్టలేదు. బొగ్గు రంగంలో ప్రైవేటు కంపెనీలూ తగిన అవకాశాలను సొంతం చేసుకునేందుకు కేంద్ర సర్కారు లోగడ ఈ రంగానికి సంబంధించి ద్వారాలు తెరవడం తెలిసిందే. మరోవైపు ఆరో విడతలో వేలం వేసిన 28 గనులకు సంబంధించి ఒప్పందాలపై బొగ్గు శాఖ సంతకాలు పూర్తి చేసింది. (సహారా కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఇన్వెస్టర్లకు చెల్లింపులు) -
పార్లమెంట్లో రాహుల్ ప్రసంగంపై దుమారం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందంటూ గతవారం లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తాజాగా పార్లమెంట్ ఉభయసభల్లో రాజకీయ దుమారం రేపాయి. రాహుల్ తన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలోనూ అధికార బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. అదానీ-హిండెన్ బర్గ్ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు విమర్శించారు. అదానీ గ్రూప్ సంక్షోభంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. లోక్‌సభ సభ్యుడైన రాహుల్ గాంధీ లండన్‌లో భారత్‌ను అవమానించారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను సభలోని సభ్యులంతా తీవ్రంగా ఖండించాలని.. దేశానికి కాంగ్రెస్ నేత క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. మరోవైపు రాజ్యసభలోనూ రాహుల్ గాంధీ అంశంపై ప్రకంపనలు రేగాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తూ.. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని సీనియర్ నేత అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు పలువురు బీజేపీ మంత్రులు కూడా మద్దతు పలికారు. అయితే దీనిపై స్పందించిన విపక్ష కాంగ్రెస్ మంత్రులు.. గతంలో నరేంద్ర మోదీ కూడా వీదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని గుర్తు చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే గోయల్ వ్యాఖ్యలను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. సభలో సభ్యుడు కాని వ్యక్తిని పిలిచి క్షమాపణ చెప్పాలని అడగడం ఏంటని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే, నాశనం చేసే వారు దానిని రక్షించాలంటూ మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్, ఆప్ సైతం మద్దతు తెలిపాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. -
హోలీ వేడుకల్లో సందడి చేసిన యూఎస్ అత్యున్నత అధికారి
ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారిక నివాసంలో బుధవారం హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు జైశంకర్, కిరణ్ జిజు తోపాటు యూఎస్ అత్యున్నత అధికారి గినా రైమోండో పాల్గొన్నారు. ఆమె ముఖానికి రంగులు పులుముకుని, ఓ దండ ధరించి డ్రమ్ బీట్లకు లయబద్ధంగా స్టెప్లు వేసి సందడి చేశారు. ఆ వేడుకలో కృష్ణుడి వేషధారణలో ఒక కళాకారుడు అక్కడున్న ప్రేక్షకులను బాగా అలరించాడు. కాగా, ఇండో యూఎస్ సీఈవో ఫోరమ్‌లో పాల్గొనేందుకు యూఎస్ వాణిజ్య కార్యదర్శి రైమోండో న్యూఢిల్లీ వచ్చారు. ఆమె మార్చి 7 నుంచి 10 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈమేరకు ఆమె భారత్ యూఎస్‌ల మధ్య కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలకు మార్గం సుగమం చేసేలా వివిధ రంగాల సహకారంపై చర్చిస్తారు. గతేడాది యూఎస్ ఇండియా సీఈవో ఫోరమ్‌ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ఎంఎస్ రైమోండో గత నవంబర్లోనే ప్రారంభించారని యూఎస్ వాణిజ్య విభాగం పేర్కొంది. (చదవండి: నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్) -
రూ.6,828 కోట్లతో 70 శిక్షణ విమానాలు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం రూ.6,828 కోట్లతో 70 హెచ్‌టీటీ–40 బేసిక్ శిక్షణ విమానాల కోనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) బుధవారం ఆమోదం తెలియజేసింది. రానున్న ఆరేళ్లలో ఈ విమానాలు ఐఏఎఫ్‌కు అందనున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్లో వెల్లడించారు. హెచ్‌టీటీ–40 విమానాలను ప్రభుత్వ రంగంలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉత్పత్తి చేయనుందని భారత రక్షణ శాఖ తెలియజేసింది. తక్కువ వేగంతో నడిచే ఈ విమానాలతో వైమానిక దళం సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వొచ్చని పేర్కొంది. హెచ్‌టీటీ–40 విమానాల తయారీలో హెచ్ఏఎల్ సంస్థ ప్రైవేట్ పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయనుంది. దీనివల్ల 100కుపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 1,500 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. -
భద్రతపై రాజీ లేదు: రాజ్‌నాథ్
తిరువనంతపురం: ‘‘భారతదేశం పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది. అదే సమయంలో జాతీయ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోదు’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శివగిరి మఠం 90వ వార్షిక తీర్థయాత్రప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఆయన మాట్లాడారు. సంఘ సంస్కర్త నారాయణ గురు బోధనల స్ఫూర్తితోనే కేంద్రం ఆత్మ నిర్భర్ పథకాన్ని తెచ్చిందన్నారు. దేశాన్ని, సరిహద్దులను రక్షించేందుకు ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో తాను కృషి చేస్తుండగా, దేశ ఆత్మను పరిరక్షించేందుకు శివగిరి మఠం సాధువులు కృషి చేస్తున్నారన్నారు. -
భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక.. ‘మర్ముగోవా’ జల ప్రవేశం
ముంబై: భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక చేరింది. శత్రుదుర్భేద్యమైన మిసైల్ విధ్వంసక యుద్ధనౌక ‘మర్ముగోవా’ జలప్రవేశం చేసింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్ఎస్ మర్ముగోవాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిల్లయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘ఈరోజు స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నాం. ఏడాది క్రితమే మనం సిస్టర్ షిప్ విశాకపట్నంను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టాం. గత దశాబ్దకాలంలో యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో ఈ విజయం గొప్ప పురోగతిని సూచిస్తుంది. ఈ నౌకలకు నగరాల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించాం.’ అని తెలిపారు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్. మర్ముగోవా విశేషాలు.. ► ఈ యుద్ధనౌక రెండోతరానికి చెందిన స్టీల్త్ గైడెడ్ మిసైల్ విధ్వంసక నౌక. ► ప్రాజెక్టు 15బీ కింద ఈ యుద్ధ నౌకను రూపొందించారు. గోవాలోని ప్రముఖ పోర్టు సిటీ మర్ముగోవా నగరం పేరును ఈ వార్‌షిప్‌కు పెట్టారు. ► ఈ నౌక పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు కాగా.. బరువు సుమారు 7,400 టన్నులు. అత్యధికంగా 30 నాటిక్ మైళ్ల వేగంతో దూసుకెళ్తుందు. ►భారత నౌకాదళ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 4 విశాఖపట్నం క్లాస్ విధ్వంసక నౌకల్లో ఇది రెండోది. దీనిని మజాగాన్ డాక్ నౌకానిర్మాణ సంస్థ నిర్మించింది. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
తవాంగ్ ఘర్షణపై లోక్‌సభలో రాజ్‌నాథ్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తవాంగ్ సెక్టార్ ఘటనపై లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. చైనా ఆర్మీ మన భూభాగంలోకి వచ్చేందుకు యత్నించిందని, చైనా కుత్రంతానికి భారత బలగాలు దీటుగా బదులిచ్చాయని స్పష్టం చేశారు. భారత పోస్టును ఆక్రమించేందుకు చైనా జవాన్లు యత్నించినట్లు పేర్కొన్నారు. సరైన సమయంలో భారత బలగాలు స్పందించటంతో పీఎల్ఏ సైన్యం తోకముడుచుకుని తిరిగి వారి పోస్టులోకి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. భారత సైనికుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడలేదన్నారు. ‘డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్లో పీఎల్ఏ బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నించాయి. చైనా కుతంత్రాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. వారిని వెనక్కి వెళ్లేలా చేశాయి. ఈ అంశాన్ని దౌత్యపరమైన విధానంలో చైనా ముందుకు తీసుకెళ్తాం. మన సరిహద్దులను కాపాడేందుకు, ఎలాంటి సంఘటనలు ఎదురైనా తిప్పికొట్టేందుకు మన బలగాలు సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇస్తున్నాం. ఈ ఘర్షణలో ఇరువైపుల కొద్ది మంది సైనికులు గాయపడ్డారు. మన సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు, తీవ్రంగా గాయపడలేదు. మన బలగాలు సరైన సమయంలో స్పందించటంతో పీఎల్ఏ సైనికులు తిరిగి వారి వారి ప్రాంతానికి వెళ్లిపోయారు.’ - రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. తవాంగ్ ఘర్షణ తర్వాత డిసెంబర్ 11న స్థానిక కమాండర్ చైనా కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు రాజ్‌నాథ్. ఈ సందర్భంగా సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకే తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా కమాండ్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
తవాంగ్ ఘర్షణ: రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికల నడుమ తలెత్తిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిద ధళాల అధిపతులు, విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 9న జరిగిన ఘటనపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సరిహద్దులో ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై రాజ్‌నాథ్ మాట్లాడనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: భారత్-చైనా సరిహద్దు ఘర్షణ.. ప్రతిపక్షాలకు పార్లమెంట్లో గట్టి కౌంటర్ పడేనా? -
గుజరాత్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకులు.. సీఎం ఎంపికపై దృష్టి
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇక నూతన ముఖ్యమంత్రి ఎంపికపై దృష్టి సారించింది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం గాంధీనగర్‌లో సమావేశమై, తమ పార్టీ శాసనసభా పక్ష(సీఎల్పీ) నేతను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండాను బీజేపీ అధిష్టానం నియమించింది. సీఎల్పీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని బీజేపీ అధిష్టానం గతంలోనే ప్రకటించింది. భూపేంద్ర పటేల్ రాజీనామా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఆయన మంత్రివర్గం సైతం రాజీనామా సమర్పించింది. బీజేపీ నిర్ణయం ప్రకారం.. భూపేంద్ర పటేల్ ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి? -
‘పీఓకే’ను తిరిగి పొందటమే లక్ష్యం!.. రక్షణ మంత్రి హింట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పీఓకే ప్రజలపై పాకిస్థాన్ అకృత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యావసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. పీఓకేను తిరిగి చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమని సూత్రప్రాయంగా వెల్లడించారు. పీఓకేలోని గిల్గిత్, బాల్టిస్తాన్‌ను చేరుకున్నాకే.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి సాధించినట్లవుతుందన్నారు. 1947లో శ్రీనగర్‌లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించిన శౌర్య దివాస్ కార్యక్రమంలో మాట్లాడారు. ‘జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పడే ప్రారంభించాం. గిల్గిత్, బాల్టిస్తాన్ చేరుకున్నాకే మా లక్ష్యం నెరవేరుతుంది. పీఓకే ప్రజలపై పొరుగు దేశం అకృత్యాలకు పాల్పడుతోంది. దాని పర్యావసనాలు ఎదుర్కోక తప్పదు. ఉగ్రవాదం అనేది ఒక మతం కాదు. టెర్రరిస్టుల ఏకైక లక్ష్యం భారత్.’ అని పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. 2019, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయటం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజలపై వివక్ష తొలగిపోయిందన్నారు. ఇదీ చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం -
డర్టీ బాంబు అంటూ రష్యా గగ్గోలు...భారత రక్షణ మంత్రితో మొర
మాస్కో: ఉక్రెయిన్ డర్టీ బాంబు ప్రయోగించనుందంటూ ఒకటే గగ్గోలు పెడుతోంది రష్యా. ఉక్రెయిన్‌తో సహా పాశ్చాత్య దేశాలు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. కానీ రష్యా మాత్రం డర్టీ బాండు ఉపయోగిస్తోదంటూ ఉక్రెయిన్‌పై ఆరోపణలు చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వీడియో కాల్లో చైనీస్ రక్షణ మంత్రి వీ ఫెంఘేతో ఈ విషయమై సంభాషించారు. ఆ తర్వాత బుధవారం భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా ఫోన్లో మాట్లాడుతూ. ...ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేసినట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది. వాస్తవానికి ఈ డర్టీ బాంబు అనేది రేడియోధార్మిక, జీవ సంబంధమైన రసాయన పదార్థాలతో కూడిన బాంబు. ఇది మానవాళికి అత్యంత ప్రమాదకరమైన బాంబు దాడి. రష్యా మాత్రం పదేపదే నాటో ప్రత్యర్థులతో కలిసి ఉక్రెయిన్ డర్టీ బాంబు ఉపయోగించాలని చూస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఒకవైపు అవన్నీ అబద్ధాలు అని ఉక్రెయిన్ కొట్టిపారేస్తోంది. ఈ మేరకు మాస్కో ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ....ఉక్రెయిన్ డర్టీ బాంబు ఉపయోగించనుందన్న పక్కా సమాచారం మా వద్ద ఉంది. అటువంటి విధ్వంసకర చర్యలను నియంత్రించేలా ప్రంపంచ దృష్టికి తీసుకు రావడమే గాక అందుకు తగు చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పారు. (చదవండి: వీడియో: ఉక్రెయిన్‌పై అణుదాడికి అంతా రెడీ?.. పుతిన్ పర్యవేక్షణలోనే!) -
స్వదేశీ ఆయుధ సంపత్తి
విజయదశమి.. ఆయుధపూజ వేళ... భారత వాయుసేన (ఐఏఎఫ్) అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (ఎల్సీ హెచ్) ‘ప్రచండ’ చేరికతో మన సైన్యానికి కొత్త జవసత్వాలు సమకూరాయి. జోద్పూర్ వైమానిక కేంద్రం వేదికగా సోమవారం సైనిక ఉన్నతాధికారులతో కలసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలివిడతగా నాలుగు హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. పలు విధాలుగా ఇది కీలక ఘట్టం. పొరుగున చైనా నుంచి పొంచివున్న ముప్పు నేపథ్యంలో ప్రధానంగా ఎల్తైన పర్వత ప్రాంతాల్లో సైతం శత్రువులపై పోరాడే దేశవాళీ ఛాపర్ ఇప్పుడు మన చేతిలో ఉన్నట్టయింది. ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్ – హాల్) తయారు చేసిన ఈ లోహవిహంగం గణనీయంగా ఆయుధాలు, ఇంధనం తీసుకొని 5 వేల మీటర్ల ఎత్తున కూడా కిందకు దిగగలదు. టేకాఫ్ తీసుకోగలదు. ప్రపంచంలో అలాంటి యుద్ధ హెలికాప్టర్ ఇదొక్కటే అని నిపుణుల మాట. అతి వేడిగా ఉండే ఎడారుల్లో, రక్తం గడ్డ కట్టించే అతి ఎల్తైన ప్రాంతాల్లో, విద్రోహ చర్యల్ని విచ్ఛిన్నం చేసే వేళల్లో – ఇలా అన్ని యుద్ధ సందర్భాల్లో గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించ గలగడం ఈ లోహ విహంగాల ప్రత్యేకత. వెరసి, సైనిక ఆయుధాలను విదేశాల నుంచి కొనడానికే పేరుబడ్డ భారత్ ఈ దేశీయ తయారీ యుద్ధ హెలికాప్టర్లతో కనీసం ఇంతవరకైనా బయ్యర్ నుంచి బిల్డర్‌గా మారింది. ‘మేకిన్ ఇండియా’ స్వప్నసాకారంలో ఒక అడుగు ముందుకు పడింది. 1999 నాటి కార్గిల్ యుద్ధవేళ దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అవసరం తొలిసారిగా మనకర్థమైంది. అప్పటికి మన దగ్గర చేతక్, చీతా లాంటి హెలికాప్టర్లే ఉన్నాయి. కానీ మరింత చురుగ్గా, బహు పాత్రపోషణ చేయగలవి అవసరమయ్యాయి. ఆ పరిస్థితుల్లో తొలి దశ చర్చల తర్వాత 2006 అక్టోబర్‌లో ప్రభుత్వం ఎల్సీహెచ్ ప్రాజెక్ట్‌ను ‘హాల్’కు మంజూరు చేసి, వాటిని అభివృద్ధి చేసే బాధ్యతను అప్పగించింది. అలా పైలట్, కోపైలట్లు ఒకరి వెనుక మరొకరు కూర్చొనేలా ఈ రెండు ఇంజన్ల, 5.8 టన్నుల లోహ విహంగాన్ని డిజైన్ చేశారు. అనేక కఠిన పరీక్షల అనంతరమే ఈ ఛాపర్లకు అనుమతినిచ్చి, సైన్యంలోకి తీసుకున్నారు. అందుకు 2010– 2015 మధ్య 4 నమూనా ఛాపర్లు సిద్ధం చేసి, రకరకాల ఎత్తుల్లో, 2 వేలకు పైగా గగనయాన పరీక్షలు చేశారు. 2017లో వైమానిక దళ నమూనాకూ, 2019లో ఆర్మీ నమూనాకూ తొలిదశ అనుమతి వచ్చింది. నిరుడు నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రతీకాత్మకంగా ఎల్సీహెచ్ను భారత వైమానిక దళానికి అప్పగించి, ఆఖరి ఘట్టానికి తెర తీశారు. ఈ మార్చిలో భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సంఘం వాయుసేనకు 10, ఆర్మీకి 5 – మొత్తం 15 ఎల్‌సీహెచ్‌ల తయారీకి ఆమోదం తెలిపింది. దరిమిలా సెప్టెంబర్ 29న బెంగళూరులో ఆర్మీలోకీ, ఇప్పుడు జోద్‌పూర్‌లో వాయుసేనలోకీ ఎల్‌సీహెచ్‌లను లాంఛనంగా ప్రవేశపెట్టారు. ఇలాంటి ఎల్‌సీహెచ్‌లు 160 దాకా మనకు అవసరం. గంటకు 268 కి.మీ గరిష్ఠ వేగంతో వెళ్ళగల ఈ ‘ప్రచండ’ ఛాపర్లలో అనేక ప్రత్యేకతలున్నాయి. 6.5 కి.మీ ఎత్తున ఎగరగల సత్తా ఈ లోహ విహంగం సొంతం. 20 ఎంఎం టరెట్ గన్, 70 ఎంఎం రాకెట్లు, గగనతల క్షిపణి వ్యవస్థలతో ఇది యుద్ధసన్నద్ధమై ఉంటుంది. శత్రు రాడార్ల గురి నుంచి రక్షణవ్యవస్థ ఉండే ఈ ఛాపర్ ముష్కరుల గగనతల భద్రతావలయాన్ని ఛేదించి, విద్రోహ చర్యలను తిప్పికొడుతుంది. తొలి దేశీయ యుద్ధ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ జలప్రవేశం చేసి నెల తిరిగేసరికి ఇప్పుడు ఈ యుద్ధ హెలికాప్టర్లు మన వైమానికదళానికి సమకూరడం సంతోషమిచ్చే పరిణామం. వీటికన్నా ముందే ఈ జూన్‌లో తీరప్రాంత గస్తీ దళంలోకి దేశవాళీ అడ్వాన్స్›్డ లైట్ హెలికాప్టర్ ఎంకె–3 వచ్చి చేరింది. భారత రక్షణ రంగానికి ఇవన్నీ శుభసూచనలు. రక్షణ రంగంలో ఒకపక్క దిగుమతులు తగ్గించుకొంటూనే, మరోపక్క అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకుంటున్న ట్టయింది. గత అయిదేళ్ళలో మన రక్షణ ఎగుమతులు 334 శాతం పెరిగాయని సర్కారు వారి మాట. ప్రస్తుతం 75కి పైగా దేశాలకు మన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. మన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌పై మలేసియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, అమెరికా, ఇండొనేసియా, ఫిలిప్పైన్స్ సైతం ఆసక్తి కనబరచడం విశేషం. రక్షణ ఉత్పత్తుల దేశవాళీ డిజైనింగ్, అభివృద్ధి, తయారీకై కొన్నేళ్ళుగా తీసుకుంటున్న విధాన నిర్ణయాలు క్రమంగా ఫలితమిస్తున్నట్టున్నాయి. విదేశాల నుంచి రక్షణ ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకోవడం 2012–16తో పోలిస్తే, 2017–21లో దాదాపు 21 శాతం తగ్గాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెబుతోంది. అయితే, ఇప్పటికీ ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలో మనం ముందు వరుసలోనే మిగిలాం. రష్యన్ తయారీ ఆయుధాలపై భారీగా ఆధార పడ్డాం. ఈ పరిస్థితి మారాలంటే, తక్కువ వ్యయంతోనే ప్రపంచ ప్రమాణాలను అందుకొనే సాంకేతి కతను అభివృద్ధి చేయాలి. అదే అతి పెద్ద సవాలు. చిక్కులు లేకుండా ప్రభుత్వం అవసరమైన వనరుల్ని అందించి, పరిశోధన – అభివృద్ధిని ప్రోత్సహిస్తే, కీలక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి ఆ సవాలును అధిగమించవచ్చు. రక్షణ రంగంలో దిగుమతులు తగ్గించుకొని, సొంత కాళ్ళ మీద నిలబడవచ్చు. దృఢసంకల్పం ఉంటే అది అసాధ్యమేమీ కాదని ‘ప్రచండ్’ రూపకల్పన చెబుతోంది. సాధించిన ఘనతతో పాటు సాధించాల్సిన లక్ష్యాలను మరోసారి గుర్తుచేస్తోంది. -
భారత వైమానిక దళంలోకి మన ప్రచండ్ (ఫొటోలు)
-
శత్రువుల పాలిట ‘ప్రచండ’మే
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. సోమవారం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ వైమానికస్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4 లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్లో రాజ్‌నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు. పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వతప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంక్‌లు, బంకర్లు, డ్రోన్లపై ఇవి సులభంగా దాడిచేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కల ఇప్పుడు నెరవేరిందని రాజ్‌నాథ్ అన్నారు. 1999లో పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధకాలంలో పర్వతప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందన్నారు. ఇంకొన్ని ప్రత్యేకతలు ఈ హెలికాప్టర్లు గరిష్ట సంఖ్యలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలవు. గాలిలో ఎక్కువసేపు ఉండటానికి సరిపడా ఇంథనాన్ని నింపొచ్చు. ఎడారుల్లో, మంచుమయమైన హిమాలయ పర్వతాల్లోనూ పోరాడగలవు. ట్విన్ ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ బరువు 5.8 టన్నులు. శత్రువుకు కనపడని రంగులో, తక్కువ శబ్దం చేస్తూ, రాడార్‌కు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్లగలవు. హెలికాప్లర్లను అడవులు, పట్టణ ప్రాంతాలలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలోనూ మొహరించవచ్చు. ఇక సైనిక వెర్షన్లో 96 హెలికాప్టర్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Prachand: రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది
జైపూర్: భారత సైన్యం రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. వైమానిక దళంలోకి మేడ్ ఇన్ ఇండియా ఘనత వచ్చి చేరింది. తేలికపాటి యుద్ద హెలికాఫ్టర్(LCH) ‘ప్రచండ్’ను ఇవాళ(సోమవారం) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశపెట్టారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. దేశీవాళీ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ను జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వ్ ధరమ్ ప్రార్థన సైతం నిర్వహించారు. Made-in-India light combat helicopters 'Prachand' inducted into IAF Read @ANI Story | https://t.co/S6zR9sWphB#LCH #Prakhand #RajnathSingh #IAF pic.twitter.com/nh36KANOdz — ANI Digital (@ani_digital) October 3, 2022 చాలా కాలంగా.. దాడుల కోసం తేలికపాటి హెలికాప్టర్ల అవసరం ఉంది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆ అవసరాన్ని తీవ్రంగా భావించింది మన సైన్యం. LCH అనేది రెండు దశాబ్దాల పరిశోధన-అభివృద్ధి ఫలితం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రచండ్ ప్రవేశం రక్షణ ఉత్పత్తిలో ఒక కీలకమైన మైలురాయి. ప్రచండ్ సమర్థవంతంగా శత్రు నిఘా నుంచి తప్పించుకోగలదు. వివిధ రకాల మందుగుండు సామగ్రిని మోసుకెళ్ళగలదు. దానిని త్వరగా యుద్ధ ప్రాంతాలకు అందించగలదు. ఇది వివిధ భూభాగాలలో మన సాయుధ దళాల అవసరాలను సంపూర్ణంగా తీరుస్తుంది. ఇది మన సైన్యం, వైమానిక దళం రెండింటికీ ఆదర్శవంతమైన వేదిక అని ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రి రాజ్‌నాథ్ సింగ్. For a long time, there was a need for attack helicopters & during the 1999 Kargil war, its need was felt seriously. The LCH is a result of research & development for two decades. And its induction into IAF is an important milestone in defence production: Defence Minister R Singh pic.twitter.com/zU5KrCUjwk — ANI (@ANI) October 3, 2022 ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రూపొందించింది. 5,000 మీటర్ల (16,400 అడుగులు) ఎత్తులో గణనీయంగా ఆయుధాలు, ఇంధనంతో.. భారత సాయుధ దళాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రచండ్ ల్యాండ్-టేకాఫ్ చేసుకోగలదు. ప్రపంచంలోనే ఈ తరహా దాడులు చేయగలిగిన ఏకైక హెలికాప్టర్ ఇదే కావడం గమనార్హం. There is no need to define ‘Prachand’, the LCH itself is capable of sending out a message to the enemy: Defence Minister Rajnath Singh after his LCH sortie at Jodhpur IAF airbase pic.twitter.com/KQoRtRjvfH — ANI (@ANI) October 3, 2022 అవసరమైన చురుకుదనం, యుక్తి, విస్తరించిన శ్రేణి, అధిక ఎత్తులో పనితీరు, అన్ని వేళలా.. వాతావరణం ఎలాంటిదైనా సరే పోరాట సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ప్రచండ్. భారత సైన్యం.. ప్రత్యేకించి వైమానిక దళం కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ప్రచండ్ ఒక శక్తివంతమైన వేదిక అవుతుందని అధికారులు చెప్తున్నారు. మార్చిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ (CCS) రూ. 3,887 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 15 పరిమిత శ్రేణి ఉత్పత్తి (LSP) తేలికపాటి యుద్ధ విమానాల సేకరణకు ఆమోదం తెలిపింది. IAF కోసం పది హెలికాప్టర్లు, భారత సైన్యం కోసం ఐదు హెలికాప్టర్లు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: 8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు -
‘పీవోకే’ అంశంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు!
సిమ్లా: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విషయంలో 1971లో భారత్-పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్, కంగ్రా జిల్లాలోని బదోలిలో అమరవీరుల కుటుంబాల సంత్కరించుకునే కార్యక్రమం వేదికగా పీవోకేపై మాట్లాడారు రాజ్‌నాథ్. ‘1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకొని స్వర్ణోత్సవ వేడుకలను ఇటీవలే ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ యుద్ధం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఇది ఆస్తుల కోసమో, అధికారం కోసమో జరిగిన యుద్ధం కాదు, మానవత్వం కోసం పోరాడి ప్రత్యర్థిపై విజయం సాధించాం. కానీ, ఒకింత బాధగా కూడా ఉంది. పీవోకే అంశంలో అప్పట్లోనే నిర్ణయం తీసుకోవాల్సింది.’ అని పేర్కొన్నారు రాజ్‌నాథ్. అనంతరం హమిర్పుర్ జిల్లాలోని నదౌన్‌లో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాలుపంచుకున్నారు. గతంలో భారత్ రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 25 ఎగుమతిదారుల్లో ఒకటిగా భారత్ నిలిచిందన్నారు. 8 ఏళ్ల క్రితం రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.900 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.13,000 కోట్లు చేరిందని గుర్తు చేశారు రాజ్‌నాథ్. 2047 నాటికి రూ.2.7లక్షల కోట్లకు చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేషించుకున్నట్లు చెప్పారు. మానవత్వం కోణంలో భారత్ ఏదేశంపై దాడులు చేయాలేదని, ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించుకోలేదన్నారు. కానీ, భారతలో శాంతికి విఘాతం కలిగంచాలని చూస్తే ధీటైన సమాధానం ఇస్తామని శత్రుదేశాలకు హెచ్చరికలు చేశారు. పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, అదే వైఖరికి తాము కట్టుబడి ఉన్నామంటూ ఇటీవలే రాజ్‌నాథ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఎంతో భక్తితో కొలుచుకునే శారదా శక్తి పీఠం అక్కడే ఉందని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్నప్పటికీ పీవోకేలో ఒక్క కుటుంబానికి కూడా ఎలాంటి నష్టం జరగనీయబోమని తెలిపారు. భారత్ పై దుష్ట పన్నాగాలు పన్నేవారికి తగిన సమాధానం ఇచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపారు. ఇదీ చదవండి: ఔరా! ఒంటి చేత్తో నగరంలోని సైకిళ్లన్నీ మాయం చేసిన దొంగ -
కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన రాజ్‌నాథ్ సింగ్ (ఫొటోలు)
-
దశదిన కర్మరోజు వద్దామనుకున్నా.. అందువల్లే ఈ రోజు వచ్చా: రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, హైదరాబాద్: గోహత్య నిషేదంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు ప్రవేశపెట్టింది కృష్ణంరాజు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తర్వాత కాలంలో యోగి ఆదిత్యనాథ్ కూడా గోహత్య నిషేద బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారని కృష్ణంరాజు సంతాపసభలో రాజ్‌నాథ్‌సింగ్ గుర్తుచేసుకున్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన నేరుగా కృష్ణంరాజు ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభకు హాజరై ప్రసంగించారు. Joining condolence meeting in remembrance of Late Krishnam Raju Garu. https://t.co/piAGuhVpgQ — Rajnath Singh (@rajnathsingh) September 16, 2022 'కృష్ణంరాజుని నేను అన్నగారు అని సంభోధించేవాడిని. ఆయన దశదిన కర్మరోజు వద్దామనుకున్నా. కానీ షెడ్యూల బీజీ కారణంగా ఈ రోజే వచ్చాను. బాహుబలి సినిమా చూడాలని కృష్ణంరాజు కోరారు. మా ఫ్యామిలీ, కృష్ణంరాజు ఫ్యామిలీ కలిసి బాహుబలి సినిమా చూశాం. చాలా బాగుంది. ఆయన మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు. కృష్ణంరాజు తెలుగు ప్రజలకు రాజకీయ నాయకుడు, సినిమా స్టార్, రెబల్ స్టార్. కానీ ఆయన స్వగ్రామంలో మాత్రం తాను అందరికీ సొంత వ్యక్తి. గ్రామంలో ప్రతీ ఒక్కరిని కృష్ణంరాజు గుర్తు పడతారు.. అందరినీ పేరుతో పిలుస్తారు' అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (ప్రభాస్‌తో ఫోన్లో మాట్లాడినా ఏదో వెలితి ఉందన్నారు: కిషన్‌రెడ్డి) -
కృష్ణంరాజు కుటుంబానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: దివంగత సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన నేరుగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అక్కడ కృష్ణంరాజు సతీమణి శ్యామల, ఆయన కుమార్తెలు, ప్రభాస్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మృతిపట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన వెంట ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్) -
16న నగరానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నగరానికి వస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత యూవీ కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ఈ సందర్భంగా 16న నిర్వహించే కృష్ణంరాజు సంస్మరణ సభలో రాజ్‌నాథ్‌సింగ్, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. -
ఆఫీసుకు రోజూ ఇలానే వస్తున్నారు..!
ఆఫీసుకు రోజూ ఇలానే వస్తున్నారు..! -
మంగోలియా, జపాన్లలో నేటి నుంచి రాజ్‌నాథ్ పర్యటన
న్యూఢిల్లీ: మంగోలియా, జపాన్లలో ఐదు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం బయలుదేరి వెళ్లారు. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు దేశాలతో వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పర్యటన సాగనుందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. 5 నుంచి 7 వరకు మంగోలియాలో ఆయన పర్యటన ఉంటుంది. భారత రక్షణ మంత్రి ఒకరు మంగోలియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అనంతరం 8, 9 తేదీల్లో జపాన్ పర్యటన సందర్భంగా జరిగే 2+2 విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశాల్లో రాజ్‌నాథ్‌తోపాటు జై శంకర్ కూడా పాల్గొంటారు. -
డీఆర్డీవో చీఫ్‌గా సమీర్ వి కామత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(డీడీఆర్‌డీ) సెక్రటరీగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, ప్రస్తుత డీఆర్డీవో చీఫ్ జి.సతీశ్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కామత్ డీఆర్డీవోలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామత్, సతీశ్‌రెడ్డిల నియామకాలను కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు కామత్ నూతన బాధ్యతల్లో కొనసాగుతారని కూడా వివరించింది. డీఆర్డీవో చీఫ్‌గా జి.సతీశ్‌రెడ్డి రెండేళ్ల పదవీ కాలానికి గాను 2018లో నియమితులయ్యారు. 2020 ఆగస్ట్‌లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. తాజాగా ఆయనకు రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు బాధ్యతలు అప్పగించింది. -
ఆర్మీలో చేరాలనుకున్నా.. కానీ!: రాజ్‌నాథ్ సింగ్ భావోద్వేగం
ఇంఫాల్: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం మణిపూర్‌లో ఉన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా ఆయనతోపాటు ఉన్నారు. ఆర్మీ అధికారులు, సైనికులను శుక్రవారం రాజ్‌నాథ్ సింగ్ కలిశారు. వారితో కలిసి అల్ఫాహారం చేశారు. ఇంఫాల్‌లో అస్సాం రైఫిల్స్ ఇండియన్ ఆర్మీలోని 57వ మౌంటైన్ డివిజన్ సైనికులను ఉద్ధేశించి మాట్లాడారు. ఈ మేరకు జవాన్ల ధైర్యసాహసాలను రాజ్‌నాథ్ కొనియాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి తన జీవితంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఇండియన్ ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని కలలు కన్నట్లు తెలిపారు. పరీక్ష కూడా రాసినట్లు పేర్కొన్నారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా చేరలేకపోయానని వెల్లడించారు. చదవండి: Video: ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం ‘నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు నేను కూడా భారత సైన్యంలో చేరాలని అనుకున్నాను. అందుకు తగిన విధంగా ప్రిపేర్ అయ్యాను. ఒకసారి షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్ష కూడా రాశాను. కానీ కుటుంబంలో ఎదురైన అనుకోని పరిస్థితులు, మా తండ్రి మరణంతో సైన్యంలో చేరలేకపోయాను.’ అంటూ ఎమోషనల్ అయ్యారు. సైనిక దుస్తులను చిన్నపిల్లవాడికి ఇచ్చినా అతడి వ్యక్తిత్వంలో దేశభక్తితో కూడిన మార్పు కనిపిస్తుందన్నారు. అలా ఆర్మీ యూనిఫామ్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది’ అని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి సైనికులను కలుస్తానని తెలిపారు. ఆర్మీ అధికారులను కలవడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. ‘మణిపూర్ పర్యటనను ప్లాన్ చేసినప్పుడు కూడా అస్సాం రైఫిల్స్, 57వ మౌంటైన్ డివిజన్ అధికారులను కలవాలనుకుంటున్నానని (ఆర్మీ చీఫ్) పాండేకు చెప్పాను. డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఓ విధంగా దేశానికి సేవ చేస్తున్నారు. కానీ మీరు నిర్వర్తించే బాధ్యతలు ఓ వృత్తి, సేవ కంటే గొప్పదని నేను నమ్ముతున్నాను. చాలా మందిని ఆర్మీలోకి తీసుకురావడంలో అస్సాం రైఫిల్స్ ముఖ్యపాత్ర పోషిస్తుంది’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చదవండి: నిజంగా విడ్డూరమే! మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు, వైరల్ వీడియో -
కేంద్రం కీలక నిర్ణయం.. వారికి రూ.3వేల ఆర్థిక సాయం
Rajnath Singh.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్రం వారికి ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. కాగా, సైనికుల అనాథ పిల్లలకు నెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 3వేలకు పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.అయితే, అనాథ పిల్లలకు ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,000 చెప్పున ఇస్తున్నారు. కాగా, రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అనాథ పిల్లలు(కుమార్తె, కుమారుడు)21 సంవత్సరాల లోపు ఉండాలి. వారికి వివాహం కాకపోతే వారు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇక, కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: స్మృతి ఇరానీ కూతురు బార్ కేసులో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలకు షాక్ -
ప్రపంచ సంక్షేమానికే రక్షణ ఉత్పత్తులు
పటాన్చెరు: రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలనే లక్ష్యంతో సాధిస్తున్న విజయాలు, మిస్సైళ్లు, ఇతర సాంకేతిక ఉత్పత్తులు వంటివి ఏ దేశాన్నో భయపెట్టేందుకు కాదని.. అవి కేవలం ప్రపంచ సంక్షేమానికేనని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పరిశ్రమలో కొత్తగా ఏర్పాటు చేసిన వార్ హెడ్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో బీడీఎల్ కంచన్ బాగ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రక్షణ రంగ సాంకేతికత ఆర్ఎఫ్ సీకర్ను.. ఏపీలోని వైజాగ్‌లో నెలకొల్పిన రక్షణ రంగం సెంట్రల్ స్టోర్స్‌ను, పశ్చిమ గోదావరిలోని మిలటరీ, మాధవరంలో బీడీఎల్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన స్కూల్, జిమ్, కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం దేశ రక్షణ రంగంలో ఎవరూ ఊహించని విధంగా గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిందని.. అందులో అగ్నిపథ్ కూడా ఒకటని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ దేశాల్లోని విధివిధానాలను అధ్యయనం చేశాకే అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టామన్నారు. బీడీఎల్ పరిశోధనలు, యుద్ధ ట్యాంకుల తయారీ, సాంకేతికతలో రక్షణ రంగానికి తోడ్పాటునందిస్తున్న తీరు హర్షణీయమని చెప్పారు. శాస్త్రవేత్తలను, బీడీఎల్ ఉద్యోగుల పనితీరును అభినందించారు. రక్షణ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలన్నారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే పరిశోధనలు జరగాలని.. ఇందుకోసం రక్షణ రంగ పరిశోధనలకు, విద్యా సంస్థల అనుసంధానం అవసరమని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ) ఉండేవని.. ఇప్పుడు 250 సీపీఎస్ఈలు సుమారు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులతో కొనసాగుతున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. -
ప్రతీ నిర్ణయం పేదల కోసమే..
తమ ప్రభుత్వానికి పేదలే ప్రధానమని, ప్రధాని మోదీ ప్రతి నిర్ణయాన్ని పేదలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్య వర్గ సమావేశాల తొలిరోజు విశేషాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, గరీబ్ కల్యాణ్ యోజనపై తొలిరోజు సమావేశాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ బలపర్చారని తెలిపారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద దేశంలోని 80 కోట్ల మంది జనాభాకు లబ్ధి చేకూరుతోందన్నారు. కరోనా సంకట కాలంలో ఈ పథకం పేదలకు ఎంతో మేలు చేసిందని, గత 25 నెలలుగా రూ.2.6 లక్షల కోట్లను పేదలకు అందించామని చెప్పారు. 2014 మేలో అధికారం చేపట్టినప్పుడు ప్రధాని మోదీ తొలిసారి చేసిన ప్రసంగంలో ఇచ్చిన హామీ మేరకు పేదలు, మహిళలు, యువత, దళితులు, బడుగు, బలహీనవర్గాల కోసం తమ ప్రభు త్వం పని చేస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పా రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, సౌభాగ్య, ప్రతి ఇం టికి నల్లా నీరు, జన్‌ధన్ బ్యాంకు ఖతాలు, ముద్ర యోజన వంటి పథకాలు మంచి ఫలి తాలు ఇచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ ప్రభా వం ఉన్నా.. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలతో గత 8 ఏళ్లలో విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు పెరిగాయని.. మన దేశం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోనే మహా శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దడం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యమన్నారు. -
పైలట్ రహిత విమానం.. ప్రయోగం విజయవంతం
సాక్షి బెంగళూరు: రక్షణ రంగ సంస్థ డీఆర్డీవో తన తొలి మానవ రహిత విమానాన్ని విజయవంతంగా ఎగరవేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో శుక్రవారం ఈ పరీక్ష చేపట్టింది. పైలట్ లేకుండా ఎగిరిన ఈ విమానం ల్యాండింగ్ వరకు అన్ని పనులను స్వయంగా నిర్వహించింది. విమానం చక్కగా ఎగిరిందని అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా సెల్ఫ్ కంట్రోల్ డ్రైవింగ్‌తో పనిచేస్తుందన్నారు. మానవ రహిత విమానాల అభివృద్ధిలో ఇదొక గొప్ప విజయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. -
Agnipath Scheme: అగ్నిపథ్‌పై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులు అగ్నిపథ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా డీఎంఏ అడిషన్ సెక్రటరీ అనిల్‌పురి మాట్లాడుతూ.. ‘‘అగ్నిపథ్‌పై రెండేళ్లుగా అధ్యయం చేశాము. అగ్నిపథ్‌పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారు. 1989 నుంచి అగ్నిపథ్ పెండింగ్‌లో ఉంది. సగటు వయస్సును తగ్గించేందుకు సంస్కరణలు తీసుకువచ్చాము. సైన్యాన్ని యువకులతో నింపాలన్నదే లక్ష్యం. ఆర్మీలోకి వచ్చి వెళ్లేందుకు చాలా అవకాశాలు కల్పించాము. మా కంటే ఇప్పడున్న యువత చాలా శక్తివంతమైనది. సెల్ఫోన్లు, డ్రోన్లతో యువత అద్భుతాలు చేస్తున్నారు. రానున్న కాలంలో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర. నేటి యువతకు టెక్నాలజీపై మంచి పట్టుంది. ఈసారి ఎక్కువ మందిని నియమించాలని భావించాము. అగ్నివీర్లు సైన్యంలో కొనసాగే వీలుంది. 'అగ్నివీర్స్' దేశ సేవలో తన జీవితాన్ని త్యాగం చేస్తే కోటి రూపాయల పరిహారం అందుతుంది. ప్రస్తుతం 46వేల మంది అగ్నివీర్ల నియామకం చేపడుతున్నాము. వచ్చే నాలుగైదు ఏళ్లలో రిక్రూట్మెంట్ సంఖ్య 50వేల నుంచి 60వేల వరకు ఉంటుంది. దీన్ని క్రమంగా 90 వేల నుంచి లక్ష వరకు పెంచుతాం. భవిష్యత్తులో ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుతుంది. అగ్నివీర్లకు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాయి. ఆందోళనలకు ముందే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ నెల ఎయిర్‌ఫోర్స్‌లో 24 నుంచి తొలి బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూలై 24 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఫేజ్-1 ఆన్లైన్ టెస్టు ఉంటుంది. డిసెంబర్ 30 నాటికి తొలిబ్యాచ్ ట్రైనింగ్‌కు వెళ్తారు. త్రివిధ దళాల్లో ఇకపై సాధారణ నియామకాలు ఉండవు. అగ్నిపథ్ ద్వారానే ఇకపై నియామకాలు జరుగుతాయి. సైన్యానికి క్రమశిక్షణ తప్పనసరి. విధ్వంసాలకు పాల్పడిన వారికి సైన్యంలో చోటులేదు. యువత ఆందోళనల్లో పాల్గొనవద్దు. కేవలం అగ్నిపథ్ వల్లే ఆర్మీ నుంచి సిబ్బంది బయటకు వెళ్తారన్న వాదన సరికాదు. త్రివిధ దళాల నుంచి ఏటా సగటున 17,600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నారు. వీరంతా రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారని ఎవరూ అడగడం లేదు ’’ అని వ్యాఖ్యానించారు. 'Agniveers' will get a compensation for Rs 1 crore if he sacrifices his life in service of the nation: Lt Gen Anil Puri https://t.co/p4navR0VRZ pic.twitter.com/Z9Pj58L9Ew — ANI (@ANI) June 19, 2022 -
Agnipath scheme: అగ్నివీరులకు మరో ఆఫర్
న్యూఢిల్లీ: నిరసనలను చల్లార్చేందుకు అగ్నిపథ్ పథకానికి కేంద్రం మార్పుచేర్పులు చేసింది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం బయటికొచ్చే అగ్నివీరుల్లో అర్హులకు రక్షణ శాఖ ఖాళీల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శనివారం ఆమోదముద్ర వేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివీలియన్ పోస్టులతో పాటు రక్షణ శాఖ పరిధిలోని 16 ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్స్ (సీఏపీఎఫ్), అసోం రైఫిల్స్‌లో కూడా అగ్నివీర్లకు 10 శాతం కోటా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర హోం శాఖ కూడా ఆమోదముద్ర వేసింది. అంతేగాక వారికి గరిష్ట వయోపరిమితిని మూడేళ్లు పెంచింది. అగ్నిపథ్ నియామకాలకు ఈ ఏడాది గరిష్ట వయో పరిమితిని ఇప్పటికే రెండేళ్లు పెంచడం తెలిసిందే. ఆ లెక్కన తొలి బ్యాచ్ అగ్నివీర్లకు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్‌లో నియామకాలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుందంటూ హోం శాఖ ట్వీట్ చేసింది. వారికి మరిన్ని ఉపాధి కల్పన అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే చర్చలు జరిపింది. పెట్రోలియం శాఖలోనూ అవకాశాలు అగ్నివీరులను సర్వీసు అనంతరం హౌసింగ్, పెట్రోలియం శాఖల్లో తీసుకుంటామని ఆ శాఖల మంత్రి హరదీప్‌సింగ్ పురీ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే అగ్నివీరులకు పలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించాయి. పోలీసు, సంబంధిత సర్వీసుల్లో వారికి ప్రాధాన్యమిస్తామని యూపీ, మధ్యప్రదేశ్, అసోం పేర్కొన్నాయి. అద్భుత పథకం: కేంద్రం మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి హామీ ఎక్కడుంది: రాజ్‌నాథ్ అగ్నిపథ్‌ను కేంద్రం గట్టిగా సమర్థించింది. మాజీ సైనికాధికారులు తదితరులతో రెండేళ్ల పాటు విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరమే ఏకాభిప్రాయంతో పథకానికి రూపకల్పన చేసినట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. పథకంపై దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో శనివారం ఆయన సమీక్ష జరిపారు. ‘‘సైనిక నియామక ప్రక్రియలో అగ్నిపథ్ విప్లవాత్మక మార్పులు తెస్తుంది. రాజకీయ అవసరాల కోసం కొందరు దీనిపై అపోహలు వ్యాప్తి చేస్తున్నారు. దాంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. నాలుగేళ్ల తర్వాత బయటికొచ్చాక ఉపాధి హామీ లేదనడం సరికాదు. లక్షలు పెట్టి మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న యువతకు కూడా ఉపాధి హామీ లేదు కదా!’’ అన్నారు. వారికి సైనికోద్యోగాలు రావు హింసాత్మక నిరసనలకు పాల్పడే వారికి సైనికోద్యోగాలకు దారులు శాశ్వతంగా మూసుకుపోతాయని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి అన్నారు. కేసుల్లో ఇరుక్కుంటే పోలీస్ క్లియరెన్సులు రావన్నారు. -
అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్ ఆందోళనలు చల్లార్చేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఉద్యోగాల్లో 10 శాతం అగ్నివీర్ రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు రిజర్వేషన్‌కు శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్, సివిల్ డిఫెన్స్ పోస్టులతో పాటు 16 విభాగాల్లో రిజర్వేషన్‌ను వర్తింపజేయనుంది. త్వరలోనే నియామక నిబంధనల్లో మార్పులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది కేంద్ర రక్షణ శాఖ. ఇదిలా ఉంటే.. అగ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ఇదివరకే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సీఏపీఎఫ్(Central Armed Police Forces), అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు హోంశాఖ స్పష్టం చేసింది. అగ్నిపథ్ నిరసనలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. మాజీ సైనికులతో సహా విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే అగ్నిపథ్ ప్రకటించబడింది. రాజకీయ కారణాల వల్ల అభ్యర్థుల్లో అపార్థం వ్యాపిస్తోంది. అగ్నిపథ్.. సాయుధ బలగాల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. దీనిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కొత్త పథకం కాబట్టి ప్రజల్లో కొంత గందరగోళం ఉండవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. -
అగ్నిపథ్‌పై త్రివిధ దళాధిపతులపై రాజ్‌నాథ్ సింగ్ భేటీ
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత కారణంగా త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన హింస్మాతక, విధ్వంసక ఘటనలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే, అగ్నిపథ్‌పై మరోసారి కూలంకషంగా త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ చర్చించనున్నారు. #WATCH | Agnipath Recruitment Scheme: Defence Minister Rajnath Singh to hold a meeting with the service chiefs in Delhi. Navy Chief Admiral R Hari Kumar and IAF chief Air Chief Marshal Vivek Ram Chaudhari arrive at the Defence Minister's residence. pic.twitter.com/pakZMCHtmv — ANI (@ANI) June 18, 2022 ఇది కూడా చదవండి: అగ్నిపథ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు -
Agnipath Scheme:..అయినా ముందుకే!
న్యూఢిల్లీ: ‘అగ్నిపథ్’పై ఓవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా, ఈ పథకం కింద సైన్యంలో నియామకాలు అతి త్వరలో మొదలవుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఇందుకోసం సన్నద్ధం కావాలని యువతకు పిలుపునిచ్చారు. ‘‘సైనిక దళాల్లో చేరి దేశ సేవ చేయాలని కోరుకునేవారికి కొత్త మోడల్ సువర్ణావకాశం. పైగా గరిష్ట వయోపరిమితిని ఈ ఏడాది 21 నుంచి 23 ఏళ్లకు పెంచడం వల్ల మరింత మంది సైన్యంలో చేరే వీలు కలిగింది’’ అంటూ ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. రెండేళ్లుగా సైన్యంలో నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలామంది సైన్యంలో చేరలేకపోయారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రధా ని మోదీ సూచన మేరకు వయోపరిమితి పెంచామని చెప్పారు. స్కిల్డ్ వర్క్‌ఫోర్స్ కోసమే దేశ రక్షణ సన్నద్ధతతో పాటు ఆర్థికాభివృద్ధికి అవసరమైన నిపుణులైన యువతను తయారు చేయడానికి అగ్నిపథ్ తోడ్పడుతుందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ పేర్కొంది. ‘‘ఈ దిశగా సైనిక దళాల భాగస్వామ్యంతో స్కిల్ ఇండియా, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ యువతకు శిక్షణ ఇస్తాయి. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌తో సమానమైన సిలబస్‌ను బోధిస్తారు. దీంతో వారిలో నైపుణ్యాలు పెరుగుతాయి. సర్వీసులో ఉండగానే స్కిల్ ఇండియా సర్టిఫికెట్లు ఇస్తారు. తద్వారా వ్యాపార రంగంలో, ఉద్యోగాల్లో ఎన్నో అవకాశాలు దక్కుతాయి’’ అని చెప్పింది. వాయుసేనలో 24 నుంచే ప్రక్రియ అగ్నిపథ్ నియామకాలకు త్వరలో శ్రీకారం చుడతామని త్రివిధ దళాలు ప్రకటించాయి. 2023 జూన్ నాటికి తొలి బ్యాచ్‌లను ఆపరేషనల్, నాన్–ఆపరేషన్ విభాగాల్లో చేర్చుకొ నే దిశగా సన్నద్ధమవుతున్నట్లు సీనియర్ మిలటరీ అధికారులు చెప్పారు. వైమానిక దళంలో అగ్నిపథ్ నియామక ప్రక్రియ ఈ నెల 24 నుంచే మొదలవుతుందని వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి చెప్పారు. ఆర్మీలోనూ అతి త్వరలో నియామక షెడ్యూల్ ప్రకటిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే శిక్షణ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉన్నత సైనికాధికారులు తెలిపారు. నేవీలోనూ అగ్నిపథ్ నియామక ప్రక్రియ అతి త్వరలోనే మొదలవనుంది. మోదీ పథకాలన్నీ అట్టర్ ఫ్లాపే ప్రధాని మోదీ తన మిత్రుల మాటే వేదవాక్కు. ఇంకెవరి మాటా వినరు. అలా మిత్రుల మాట ప్రకారం జీఎస్టీ తెస్తే వ్యాపారులు తిరస్కరించారు. సాగు చట్టాలు తెస్తే రైతులు తిప్పికొట్టారు. నోట్ల రద్దును సామాన్యులు తిరస్కరించారు. ఇప్పుడు అగ్నిపథ్‌నూ యువత ముక్త కంఠంతో వద్దంటోంది. అయినా మోదీకి దేశ ప్రజల గోడు పట్టదు! అగ్నిపథ్‌ను తక్షణం వెనక్కు తీసుకోవాలి. – కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక సెక్యూరిటీ కంపెనీల తరహా పథకమిది ప్రైవేట్ కంపెనీలకు సెక్యూరిటీ గార్డులను తయారు చేసే తరహా పథకాన్ని మోదీ తీసుకొచ్చారు. సైన్యాన్ని సెక్యూరిటీ గార్డుల ట్రైనింగ్ సెంటర్‌గా మారుస్తున్నారు. యువత ఆగ్రహ జ్వాలల్లో దేశం మండిపోకముందే అగ్నిపథ్‌ను కేంద్రం తక్షణం వెనక్కు తీసుకోవాలి. ఇందుకోసం మేమూ శనివారం నిరసన కార్యక్రమాలు చేపడతాం. – ఆప్ నేత సంజయ్‌సింగ్ అనవసర రాద్ధాంతం అగ్నిపథ్ చక్కని పథకం. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టి అగ్నిపథ్ వివాదం సృష్టిస్తున్నాయి. మొదలవకముందే ఏమిటీ రగడ? – కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ తక్షణం సమీక్షించాలి దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో పథకాన్ని మోదీ ప్రభుత్వం తక్షణం సమీక్షించాలి. యువత ఆగ్రహావేశాలను చల్లార్చాలి. – జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ యువతకు గొప్ప భవిత దేశ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ తెచ్చని మంచి పథకమిది. వయో పరిమితి పెంపు వారికి సువర్ణావకాశం. – కేంద్ర హోం మంత్రి అమిత్ షా -
అగ్నిపథ్‌పై నిరసనలు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, పలుచోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనల సందర్భంగా రైల్వే పోలీసుల కాల్పుల్లో నిరసనకారులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా లేదు. గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నాం. రేండేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్స్ జరుగనందునే ఈ మినహాయింపు ఇస్తున్నాము. యువతను రక్షణరంగంలోకి తీసుకెళ్లే అద్భుత పథకం అగ్నిపథ్. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత మాతకు సేవ చేసేందుకు ఇదో సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని యువత ఉపయోగించుకోవాలి’’ అని సూచించారు. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ‘అగ్నిపథ్’ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సుమారు ఐదు వేల మంది ఆందోళనకారులు సికింద్రాబాద్‌కు పోటెత్తడంతో.. తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు.. నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. అటు బీహార్‌లో సైతం నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇది కూడా చదవండి: అగ్నిపథ్ విషయంలో యువతను తప్పుదారి పట్టించడం మంచిది కాదు -
‘అగ్నివీరుల’ ఆగమనం!
దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచే త్రివిధ దళాల్లో సంస్కరణలకు అంకురార్పణ చేస్తూ కేంద్రం ‘అగ్నిపథం’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేర్చుకునేవారికి కూడా ఘనమైన పేరే పెట్టారు. వారిని ‘అగ్నివీర్’లు అంటారు. 17.5– 21 ఏళ్ల మధ్యవయస్కులను సైనికులుగా ఎంపిక చేస్తారని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటించారు. ఇది నాలుగేళ్ల కాంట్రాక్టు నియామకానికి సంబంధించిందే అయినా, మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించేవారి సర్వీసు కొనసాగుతుంది. ఏటా నాలుగోవంతు మంది బయటకు రాకతప్పదు. సాంకేతిక నైపు ణ్యాలు తప్పక అవసరమైన వైమానిక, నావికా దళాలకు ఈ పథకం సాధ్యపడకపోవచ్చు. కనుక ప్రధానంగా సైనికదళంలోనే ఈ ‘అగ్నివీర్’ల ఉనికి ఉంటుందనుకోవాలి. ఈ పథకానికి లభించే ఆదరణనుబట్టి ప్రస్తుత నియామక విధానానికి క్రమేపీ స్వస్తి పలుకుతారు. సైనిక వ్యవస్థలో సంస్కర ణలు తీసుకురావాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. కార్గిల్ యుద్ధ సమయం నుంచీ అది తరచు ప్రస్తావనకొస్తూనే ఉంది. కానీ జరిగిందేమీ లేదు. 2014లో అధికారంలోకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 2016లో ఒక కమిటీని నియమించింది. ఫలితంగా ఈ ‘అగ్నిపథం’ ఆవిష్కృతమైంది. పరిపాలకు లెలా ఉండాలో, ఆర్థిక రాజకీయ వ్యవహారాలు ఎలా చక్కబెట్టాలో చెప్పిన చాణక్యుడు ఏ పనైనా మొదలెట్టినప్పుడు పాలకులు మూడు ప్రశ్నలు వేసుకోవాలన్నాడు. ‘ఎందుకు చేస్తున్నాను... ఇలాచేస్తే రాగల ఫలితం ఏమిటి... ఈ కృషిలో విజయం సాధిస్తానా’ అనేవి ఆ ప్రశ్నల సారాంశం. ప్రపంచవ్యాప్తంగా సైనికరంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతం మాదిరి దీర్ఘకాలిక యుద్ధాలకు ఇప్పుడు పెద్దగా అవకాశం లేదు. చాలా యుద్ధాలు మొదలైనంత వేగంగా ముగిసిపోతున్నాయి. పైగా వీటిలో సాంకేతిక నైపుణ్యానిదే పైచేయి. రిమోట్ కంట్రోల్ ఆయుధాలు, లక్ష్యంవైపు మారణాయుధాలతో దూసుకుపోగల డ్రోన్లు, కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే స్వయంచాలిత ఆయుధాలదే ఇప్పుడు కీలకపాత్ర. అందుకే అమెరికా మొదలుకొని చైనా వరకూ సైనిక రంగంలో సంస్కరణలు మొదలై చాన్నాళ్లయింది. అయితే అమెరికాకైనా, ఇతర పాశ్చాత్య దేశాలకైనా జనాభా తక్కువ గనుక సైనిక రిక్రూట్మెంట్ మొదటినుంచీ సమస్యే. మనకుండే సమస్యలు వేరు. మన త్రివిధ దళాలు సంఖ్యాపరంగా చూస్తే దాదాపు 14 లక్షలు. ఇందులో పౌర సిబ్బంది దాదాపు 3.75 లక్షలు. మొత్తంగా ఏటా రిటైరయ్యేవారి సంఖ్య 55,000. సంస్కరణలు ప్రతి పాదించే కమిటీలన్నీ సైన్యంకన్నా పౌరసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని సూచిస్తూనే ఉన్నాయి. కానీ అనేక కారణాలవల్ల కేంద్రంలో ఎవరున్నా వారి జోలికిపోరు. పైగా ఈ పౌర సిబ్బందికి జీతాలు, రిటైర్మెంట్ తర్వాత వచ్చే పింఛన్ అదే క్యాడర్లో సైన్యంలో పనిచేస్తున్నవారికన్నా చాలా ఎక్కువ. ఎందుకంటే సైన్యంలో కనిష్ఠంగా పదేళ్లకు రిటైర్ కావొచ్చు. పౌరసిబ్బంది దాదాపు మూడున్నర దశాబ్దాల సర్వీసు పూర్తిచేస్తారు. అంకెలు ఘనంగా కన్పించవచ్చుగానీ ద్రవ్యోల్బణాన్ని పరిగణన లోకి తీసుకుంటే 80వ దశకం మధ్యనుంచీ మన రక్షణ కేటాయింపులు క్రమేపీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం మన జీడీపీలో ఆ రంగం వాటా 1.5 శాతం. ఇందులో గణనీయమైన భాగం జీతాలకూ, పింఛన్లకూ పోతుందంటారు. సంస్కరణలను వ్యతిరేకించాల్సిన పని లేదు. కానీ అవి ఎక్కడ, ఎలా ఉండాలన్నదే ప్రశ్న. కార్గిల్ యుద్ధం ముగిశాక ఆనాటి సీనియర్ అధికారులు మన దగ్గర కాలం చెల్లిన ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రి అధికమని ఎత్తిచూపారు. ఎన్డీఏ అధికారంలోకొచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఈ విషయంలో పెద్దగా మారిందేమీ లేదు. నిజమే... రాఫెల్ యుద్ధ విమానాలవంటి అత్యంతాధునిక యుద్ధ విమానాలు, అణు క్షిపణులను అడ్డుకోగల సామర్థ్యం ఉండే ఎస్–400 క్షిపణి వ్యవస్థ వంటివి మన రక్షణ అమ్ములపొదిలో వచ్చి చేరాయి. శత్రువును నిలువరించడంలో, మట్టికరిపించడంలో అవి తిరుగులేని అస్త్రాలు. కానీ ఇతరత్రా రక్షణ సామగ్రి మాటేమిటి? సాధారణ సైనికులకు అవసరమైన ఆయుధాల సంగతేమిటి? కాంట్రాక్టు పద్ధతిలో చేర్చుకుంటే పెన్షన్, ఇతరత్రా ప్రయోజనాలకయ్యే వ్యయం చాలా వరకూ తగ్గుతుందనీ, ఆ మొత్తాన్ని సైనికదళాల ఆధునికీకరణకు ఖర్చు చేయొచ్చనీ ‘అగ్నిపథం’ పథకాన్ని సమర్థిస్తున్నవారు చెబుతున్నారు. కానీ ఆమేరకు సామాజిక అశాంతి ప్రబలదా? రిటైరైనప్పుడు వచ్చే మొత్తం మినహా మరేంలేకపోతే కుటుంబాలన్నీ ఎలా నెట్టు కొస్తాయి? అసలు వచ్చింది కొలువో, కాదో తెలియని అయోమయం... నాలుగేళ్ల తర్వాత బయటికి రావడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈ పథకం ప్రకటించి 24 గంటలు తిరగకుండానే బిహార్‌లో నిరసన స్వరాలు వినిపించాయి. నాలుగేళ్లు సైన్యాన్ని నమ్ముకుని పనిచేశాక మళ్లీ కొత్త కొలువు కోసం వేట మొదలుపెట్టాలా అన్నది వారి ప్రశ్న. నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని మాత్రమే సర్వీసులో కొనసాగిస్తారు. 75 శాతం మంది బయటకి రావాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెబుతున్నట్టు వారందరికీ కొత్త ఉపాధి చూపడం సాధ్యమేనా? అక్కడ నేర్చుకున్న విద్యలతో, కొలువుపోయిందన్న అసంతృప్తితో పెడదోవ పట్టేవారుండరా? అసలు ‘అగ్నివీర్’లను సాధారణ సైనికుల మాదిరి పరిగణించి బాధ్యతలు అప్పగించడం ఆచరణలో అధికారులకు సాధ్యమేనా? అనుకోని పరిణామాలు వచ్చిపడితే ఇతర సైనికుల తరహాలో ‘అగ్నివీర్’లు పూర్తి సంసిద్ధత ప్రదర్శించగలరా? కేంద్రం జాగ్రత్తగా ఆలోచించి అడుగులేయాలి. -
రక్షణ శాఖ సంచలన నిర్ణయం.. ఆర్మీలో చేరే వారు తప్పక తెలుసుకోండి
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా తెచ్చిన ఈ పథకానికి మంగళవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది. అనంతరం వివరాలను త్రివిధ దళాధిపతులతో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. దేశభక్తి, స్ఫూర్తి కలిగిన యువతకు జాతిసేవకు వీలు కల్పించే అద్భుత పథకంగా దీన్ని అభివర్ణించారు. తద్వారా దేశ రక్షణ కూడా మరింత బలోపేతమవుతుందన్నారు. ‘‘నాలుగేళ్ల సర్వీసు అనంతరం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యాలున్న యువత సమాజంలోకి తిరిగొస్తుంది. దేశానికి వెల కట్టలేని ఆస్తిగా మారుతుంది. ఇలా రెండు రకాలుగా ప్రయోజనం’’ అని వివరించారు. సైన్యంలో ప్రస్తుతం పదేళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్ నియామకాలు అమల్లో ఉన్నాయి. టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడీ)గా కూడా పిలిచే అగ్నిపథ్‌కు వచ్చే ఆదరణను బట్టి వీటితో పాటు ప్రస్తుత నియామక పద్ధతులన్నింటినీ నిలిపేస్తారని సమాచారం. కొత్త శకానికి నాంది: త్రివిధ దళాధిపతులు త్రివిధ దళాల్లో మానవ వనరుల విధానంలో కొత్త శకానికి అగ్నిపథ్ నాంది పలుకుతుందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పథకం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పింది. దీనిపై త్రివిధ దళాధిపతులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సైనిక నియామక ప్రక్రియలో సమూల మార్పులకు అగ్నిపథ్ శ్రీకారం చుట్టనుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. ‘‘భవిష్యత్తు సవాళ్లకు సైన్యాన్ని సర్వ సన్నద్ధంగా ఉంచడంలో, సైన్యం సగటు వయసును ప్రస్తుత 32 ఏళ్ల నుంచి 26 ఏళ్లకు తగ్గించడంలో అగ్నిపథ్ ప్రధాన పాత్ర పోషించనుంది’’ అన్నారు. కొత్త నియామకాల్లో అర్హత ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని చెప్పారు. సైన్యం పనితీరు, సామర్థ్యం, సరిహద్దుల వెంబడి సన్నద్ధత తదితరాలను యథాతథంగా కొనసాగిస్తామని వివరించారు. ఈ పథకం కింద మహిళలను కూడా తీసుకుంటామని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వివరించారు. యువ ప్రతిభను వాయుసేన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధురి అన్నారు. అగ్నిపథ్‌ను దేశ యువతకు గొప్ప అవకాశంగా యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ అభివర్ణించారు. వారి సర్వీసు నైపుణ్యాలకు యూజీసీ గుర్తింపు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. విపక్షాల పెదవి విరుపు అగ్నిపథ్ పథకాన్ని విప్లవాత్మక నిర్ణయంగా బీజేపీ అభివర్ణించగా విపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఇది, ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల ప్రకటన కార్యరూపమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బంగారు భవిత కోసం యువతకు ఇదో అద్భుత అవకాశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, పార్టీ అగ్ర నేతలు అన్నారు. రక్షణ రంగంలో పెన్షన్ల భారం తదితరాలను తగ్గించుకోవడానికి దేశ భద్రతను కేంద్రం పణంగా పెడుతున్నట్టు కన్పిస్తోందని కాంగ్రెస్, ఇతర విపక్షాలు విమర్శించాయి. మాజీల మిశ్రమ స్పందన కొత్త పథకంపై మాజీ సైనికాధికారులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఇది త్రివిధ దళాలకు మరణ శాసనంతో సమానమని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా విమర్శించారు. సైన్యంలో తరాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాలు, నైతిక విలువలు, చిత్తశుద్ధి తదితరాలు ఇకపై లోపిస్తాయని మేజర్ జనరల్ (రిటైర్డ్) సత్బీర్సింగ్ అన్నారు. సైన్యం సామర్థ్యాన్ని కూడా ఈ పథకం దెబ్బ తీస్తుందన్నారు. రక్షణ రంగంలో దీర్ఘకాలిక సంస్కరణలకు ఇది తొలి అడుగని మేజర్ జనరల్ (రిటైర్డ్) బీఎస్ ధనోవా అభిప్రాయపడ్డారు. పథకం స్వరూపం... ► ఇది ఆఫీసర్ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్) నియామక ప్రక్రియ. ► త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు. ► ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి. 90 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. ► వయో పరిమితి 17.7–21 ఏళ్లు. ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి. ► త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. ► సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ‘ఆలిండియా–ఆల్ క్లాస్’ విధానంలో రిక్రూట్మెంట్ ఉంటుంది. దీంతో రాజ్‌పుత్, మరాఠా, సిక్కు, జాట్ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి. ► విధుల్లో చేరేవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకు లు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు. ► వేతనం తొలి ఏడాది నెలకు రూ.30,000. రూ.21 వేలు చేతికిస్తారు. రూ.9,000 కార్పస్ నిధికి వెళ్తుంది. కేంద్రమూ అంతే మొత్తం జమ చేస్తుంది. నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందుతుంది. ► నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనిపై ఆదాయ పన్నుండదు. ► సర్వీసు కాలావధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఉంటుంది. ► గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ► ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు. ► మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం. रक्षा क्षेत्र को मजबूत करने के लिए क्रांतिकारी पहल - #Agnipath योजना, योजना के माध्यम से #BharatKeAgniveer को मिलेगा राष्ट्र सेवा का अवसर!!@DefenceMinIndia @adgpi@indiannavy @IAF_MCC @SpokespersonMoD pic.twitter.com/lIBWzQFNzv— PIB in Bihar 🇮🇳 (@PIB_Patna) June 14, 2022 #Agnipath model is based on the All India merit-based selection process we are looking at the best to serve the armed forces between the age of 17.5 to 21 years. After the selection. pic.twitter.com/LB4zWFR7Pd— Krishana_Rajput# (@RajputKrishana) June 14, 2022 -
Presidential election: బీజేపీ ‘ఏకాభిప్రాయ’ మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలని బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మిత్రులతో పాటు వితిపక్ష యూపీఏ భాగస్వాములతోనూ, ప్రాంతీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నా«థ్సింగ్లకు ఈ బాధ్యత అప్పగించింది. అన్ని పార్టీ ల నేతలతో వారు చర్చలు జరుపుతారని ఆదివారం ప్రకటించింది. వారిద్దరూ త్వరలో రంగంలోకి దిగనున్నారు. రాజ్‌నాథ్‌కు పార్టీలకు అతీతంగా అందరు నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. 2107 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్‌ను అభ్యర్థిగా ఖరారు చేశాక చివరి క్షణాల్లో తమను సంప్రదించాయని విపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఈసారి వాటికా అవకాశం ఇవ్వరాదన్నదే బీజేపీ తాజా నిర్ణయం వెనక ఉద్దేశమని చెబుతున్నారు. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించడంపై 15న చర్చించుకుందామంటూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు పలు పార్టీలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాయడం తెలిసిందే. ఆ మర్నాడే బీజేపీ ఏకాభిప్రాయ సాధనకు తెర తీయడం ఆసక్తిగా మారింది. 2017లోనూ రాష్ట్రపతి ఎన్నికపై చర్చలు, సంప్రదింపులు జరిపిన బీజేపీ కమిటీలో అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుతో పాటు ఆయన కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బరిలో దిగడం తెలిసిందే. -
రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మేకపాటి
సాక్షి, నెల్లూరు: ఉదయగిరికి ప్రత్యేక గుర్తింపునిచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను కేంద్ర మంత్రి మంగళవారం ముంబైలో ప్రారంభించారన్నారు. ఇందులో ఒకదానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడం హర్షణీయమన్నారు. దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌకకు ఉదయగిరి పేరును పెట్టడడం చాలా సంతోషంగా ఉందని, ఇది జిల్లాకే గర్వకారణంగా ఉందన్నారు. ఉదయగిరిలోని అతిపెద్ద పర్వతాలను పరిగణనలోకి తీసుకుని యుద్ధ నౌకకు ఆ పేరు పెట్టడం మంచిపరిణామమని కొనియాడారు. చదవండి: (ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్: రాజ్‌నాథ్) -
ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్: రాజ్‌నాథ్
ముంబై: ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. మంగళవారం ముంబైలోని మాజగావ్ డాక్స్‌లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ (డీఎన్డీ) రూపొందించింది. నౌకలు, జలాంతర్గాముల తయారు చేసే ముంబైకి చెందిన రక్షణ రంగ అనుబంధం సంస్థ మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) వాటిని తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారని సంస్థ వెల్లడించించి. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతమైందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ అన్నారు. దేశీయ అవసరాలను తీర్చుకోవడమే గాక మున్ముందు ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్ ఎదుగుతుందని ధీమా వెలిబుచ్చారు. ఆత్మనిర్భర్ భారత్‌లో విక్రాంత్ యుద్ధ విమాన తయారీ ఒక మైలు రాయి అయితే,ఇసూరత్, ఉదయగిరిల తయారీతో మన రక్షణ సామర్థ్యం హిందూ మహా సముద్రం నుంచి ఫసిఫిక్, అట్లాంటిక్ దాకా విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: (బారాత్‌లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు) ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక పీ15బి క్లాస్‌కు చెందినది. క్షిపణుల్ని ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. దీన్ని బ్లాక్ నిర్మాణ పద్ధతుల్లో తయారు చేశారు. అంటే విడిభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో తయారు చేసి వాటిని ఎండీఎల్‌లో జోడించారు. దీనికి గుజరాత్ వాణిజ్య రాజధాని సూరత్ పేరు పెట్టారు. నౌకల తయారీలో సూరత్‌కు ఘనచరిత్ర ఉంది. 16వ శతాబ్దంలోనే ఇక్కడ నౌక నిర్మాణం మొదలైంది. ఇక్కడ తయారైన వందేళ్ల నాటి నౌకలు ఇంకా చెక్కు చెదరలేదు. ఐఎన్ఎస్ సూరత్ దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. 17ఏ ఫ్రిగేట్స్ ప్రాజెక్టులో ఇది మూడో యుద్ధ నౌక. పీ17 ఫ్రిగేట్స్ (శివాలిక్ క్లాస్) కంటే దీన్ని మరింత ఆధునీకరించారు. మెరుగైన రహస్య ఫీచర్లు, అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్ఫారం నిర్వహణ వ్యవస్థల్ని పొందుపరిచారు. పీ17ఏ కార్యక్రమం కింద మొత్తం ఏడు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. దీని నిర్మాణంలో తొలిసారిగా కొత్త పద్ధతుల్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. -
‘మేజర్’ ట్రైలర్‌ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Minister Rajnath Singh Watch Adivi Sesh Major Movie Trailer: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: బాక్సాఫీసు వద్ద తలపడబోతున్న సమంత, నాగచైతన్య అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే నేడు 'మేజర్' ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఓ వీడియో రూపంలో మే 9న ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఈమూవీ ట్రైలర్‌ను భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ వీక్షించారు. ఈ ట్రైలర్ చూసిన ఆయన మూవీ టీంను అభినందించడమే కాక ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా మేజర్ స్టోగన్ను విడుదల చేయించింది మూవీ టీం. చదవండి: రూ. 400 కోట్ల క్లబ్‌లోకి కేజీయఫ్ 2, హిందీలో ఈ 2 దక్షిణాది సినిమాలే టాప్ ఇక ఈ సినిమాలో మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో యంగ్ హీరో అడివి శేష్ ప్రాణం పెట్టి నటించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. దేశభక్తిని చాటిచెప్పే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. చిత్రంలో హీరోయిన్లుగా సయూ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ఓ ప్రత్యేకమైన పాత్రలో రేవతి అలరించనున్నారు. Jaan Doonga Desh Nahi - जान दूँगा देश नहीं 🇮🇳#Major squad with Shri Rajnath Singh, Minister of Defence of India.#MajorTrailer on May 9 💥#MajorTheFilm#MajorOnJune3rd @AdiviSesh @sobhitaD @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @majorthefilm pic.twitter.com/PfmDMUGSnf — Sony Pictures Films India (@sonypicsfilmsin) May 6, 2022 -
బార్డర్ దాటడానికి వెనకాడం: రాజ్‌నాథ్ వార్నింగ్
గుహవాటి(గౌహాతి): ఉగ్రవాద చర్యలతో దేశ సరిహద్దు బయట నుంచి భారత్‌ను టార్గెట్ చేస్తే.. తాము సైతం సరిహద్దులు దాటడానికి వెనకాడబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన శనివారం 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న మాజీ అసోం వెటరన్స్ సన్మానసభలో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో భారత దీటూగా వ్యవహరిస్తుందన్న సందేశాన్ని ప్రపంచదేశాలకు చెప్పడంలో విజయవంతమయ్యామని తెలిపారు. ఉగ్రవాదలు సరిహద్దు బయట నుంచి భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం.. భారత్ సైతం బార్డర్ దాటడానికి వెనకడుగు వేయదని రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే దేశ పశ్చిమ సరిహద్దుతో పోల్చితే.. తూర్పు సరిహద్దులో శాంతి, స్థిరత్వం నెలకొందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ స్నేహపూర్వక పొరుగు దేశమని అందుకే తూర్పు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు లేవని తెలిపారు. ఈశాన్య ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను కేంద్రం ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. శాంతి పరిస్థితులు మెరుగుపడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటుందని పేర్కొన్నారు. ఏఎఫ్ఎస్పీఏ అమల్లో ఉండాలని సైన్యం కోరుకుంటుందనటం ఒక అపోహని ఆయన స్పష్టం చేశారు. చదవండి: Hanuman Chalisa Row: ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్ కౌర్ అరెస్ట్, పోలీసులతో వాగ్వాదం, ఆపై ఫిర్యాదు -
తగ్గేదేలే.. చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. తూర్పు లఢక్ విషయంలో చైనాను ఉద్దేశించి రాజ్‌నాథ్ ఈ మేరకు డ్రాగన్ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత అమెరికన్లు ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భారత సైనికుల వీరోచిత సేవలను ప్రశంసించారు. లఢక్ సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైన్యాన్ని ఎదుర్కొన్న భారత సైనికుల ధైర్యాన్ని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ కొనియాడారు. భారత ప్రభుత్వం, ఆర్మీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో తాను బహిరంగంగా చెప్పలేనని అన్నారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘భారత్’ ప్రపంచ పటంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్‌ను నిలువరించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ కొన్ని విషయాల్లో రష్యాకు భారత్ అనుకూలంగా నిలిచింది. ఈ వ్యవహారంలో భారత్‌పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అమెరికాను కూడా పరోక్షంగా రాజ్‌నాథ్ హెచ్చరించారు. ‘జీరో-సమ్ గేమ్’ దౌత్యాన్ని భారత్ విశ్వసించదని పేర్కొన్నారు. ఇలాంటి దౌత్యాన్ని భారత్ ఎప్పటికీ ఎంచుకోదని స్పష్టం చేశారు. అలాగే, అంతర్జాతీయ సంబంధాల్లో జీరో-సమ్ గేమ్‌పై మాకు నమ్మకం లేదని.. విన్-విన్ ఆధారంగా మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలని భారత్ కోరుకుంటుందని వెల్లడించారు. -
‘10 టన్నుల’ హెలికాప్టర్లపై దృష్టి పెట్టాలి
కంటోన్మెంట్(హైదరాబాద్): దేశ రక్షణ, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘చేతక్’హెలికాప్టర్ డైమండ్ జూబ్లీ కాన్క్లేవ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘చేతక్.. దేశానికి సేవలందించిన గొప్ప యుద్ధవిమానం. రాణాప్రతాప్ గుర్రాన్ని గుర్తు చేసుకునేలా ఈ హెలికాప్టర్‌కు ‘చేతక్’అనే నామకరణం చేశారు. ఇది ఎప్పటికప్పుడూ రూపాంతరం చెందుతూ నేటికీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. భారత్.. ఐదు టన్నుల సామర్థ్యం కలిగిన హెలికాప్టర్ల డిజైన్, డెవలప్మెంట్, ఆపరేషన్లతో సత్తా చాటింది. ఇక 10 టన్నుల సామర్థ్యం కలిగిన హెలికాప్టర్ల రూపకల్పనపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయంగా రక్షణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ‘ఆత్మ నిర్భరత’ను సాధించాల్సిన అవసరం ఉంది. దేశీయ ఆయుధ సంపత్తి, సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ మేరకు రక్షణ దళాలు, శాస్త్రవేత్తలు, రక్షణ ఉత్పత్తిదారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దేశీయ పరిశ్రమలకు సైతం డీఆర్డీఓ ద్వారా శాస్త్ర, సాంకేతిక సహకారం అందించనుంది. ఈ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. భారత్ ఏనాడూ అధికారం, ఆక్రమణ, ఆధిపత్యం కోసం యుద్ధం చేయలేదు. ప్రజాస్వామ్యం, మానవత్వ పరిరక్షణ కోసమే యుద్ధం చేసింది. ఈ కాన్క్లేవ్ దేశ సేవలో అమరులైన వారికి ఘన నివాళి వంటింది’అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సహా త్రివిధ దళాల హెలికాప్టర్ విభాగం ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్, హెచ్ఏఎల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ఓడినా.. సీఎంగా ఆయనే!
సాక్షి డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సీఎం ఎవరంటూ...గత 11 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మళ్లీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి కొనసాగుతారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం డెహ్రాడూన్‌లో జరిగిన బీజెపీ శాసనసభా పక్షం సమావేశం తదనంతరం రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజెపీ నాయకులు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నాయకురాలు మీనాక్షి లేఖి తదితరలు పాల్గొన్నారు. ఈ క్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ..పుష్కర్ సింగ్ ధామి శాసనసభా పక్ష నాయకుడిగా ప్రకటిస్తున్నాం. నేను ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో ఉత్తరాఖండ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని నేను విశ్వసిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 46 సీట్లు గెలుచుకుని వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉదంసింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయారు. 2012, 2017లో ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన పుష్కర్ సింగ్ ధామి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6 వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఆయన మార్చి 11న ఉత్తరాఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ భారీ విజయానికి ధామీని చేసిని కృషి బీజెపీ నాయకులు అభిమానాన్ని చూరగొంది. అదే ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించేలా చేసింది. అయితే ఈ అత్యున్నత పదవీ కోసం దాదాపు అరడజను మంది పేర్లు తెరపైకి వచ్చాయి కానీ వారందరీలో పుష్కర్ సింగ్ ధామి పేరే అధికంగా వినిపించడంతో ఓడిపోయినప్పటికీ.. మళ్లీ సీఎంగా ఐదేళ్లు పదవిలో కొనసాగే ఛాన్స్ కొట్టేశారు. (చదవండి: ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం) -
కేవలం 45 రోజుల్లో ఏడంతస్తుల భవనం...దేశ నిర్మాణ చరిత్రలోనే రికార్డు
న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం బహుళ-అంతస్తుల భవన నిర్మాణాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చేసింది. ఈ ఏడంతస్తుల భవనాన్ని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఏడీఈ) వద్ద నిర్మించింది. దీన్ని సంప్రదాయ, ప్రీ-ఇంజనీరింగ్, ప్రీకాస్ట్ మెథడాలజీతో కూడిన హైబ్రిడ్ టెక్నాలజీతో పూర్తి చేసింది. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ) ప్రోగ్రాం కోసం నిర్మించిన ఈ భవనాన్ని ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఏవియోనిక్స్ అభివృధికి వినియోగిస్తారు. ఈ ఐదవతరం స్వదేశీ ఏఎంసీఏ రీసెర్చ్ అండ్ డెలవలప్మెంట్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ఏడంతస్తుల భవనాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బెంగళూరులో గురువారం ప్రారంభించారు. అంతేకాదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు భవనంలోనే ప్రాజెక్ట్‌పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు డిఆర్డిఓ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయన 45 రోజుల తక్కువ వ్యవధిలో కాంపోజిట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ద్వారా మౌలిక సదుపాయాలు అందిచాలని చెప్పారని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన నవంబర్ 22, 2021న జరిగిందని, నిర్మాణం ఫిబ్రవరి 1, 2022న ప్రారంభమైందని తెలిపారు. హైబ్రిడ్ నిర్మాణ సాంకేతికతతో ఏడు అంతస్తుల శాశ్వత భవనాన్ని పూర్తి చేయడం ఒక ప్రత్యేకమైన రికార్డు అని అన్నారు. దేశ నిర్మాణ పరిశ్రమ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. అంతేకాదు ఇది సాంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే సమయం, శ్రమను తీవ్రంగా తగ్గిస్తుందని చెప్పారు. ఈ అత్యాధునిక భవనంలో ప్రామాణిక జాతీయ భవనం కోడ్ ప్రకారం విద్యుత్ వ్యవస్థ, ఫైర్ ప్రోటెక్షన్ తోపాటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఉంటుందని అన్నారు. ఈ భవన నిర్మాణాం అన్ని నిబంధనలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నిర్మాణంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ బృందాలు సాంకేతిక సహాయాన్ని అందించాయని తెలిపారు. (చదవండి: ఇంతకీ ఐపీఎస్ అధికారి సూట్ కేస్‌లో ఏముందో తెలుసా!) -
క్షిపణి మిస్‌ఫైర్‌పై రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
-
మిస్సైల్ ప్రమాదం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన
పాకిస్థాన్ భూభాగంలోకి భారత్ మిస్సైల్ దూసుకెళ్లిన ఘటన రచ్చ రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వంకతో పాక్, భారత్‌పై రెచ్చిపోయి ఆరోపణలు చేయగా.. భారత్ మాత్రం పొరపాటున జరిగిందంటూ కూల్‌గా తప్పు ఒప్పేసుకుంది. ఈ తరుణంలో Missile Mishap మిస్సైల్ ఘటనపై పార్లమెంట్ సాక్షిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. మార్చి 9న రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు. మిస్సైల్ యూనిట్లో రోజూవారీ తనిఖీలు నిర్వహిస్తుండగా.. పొరపాటున ఒక మిస్సైల్ దూసుకెళ్లింది. తర్వాతే అది పాక్ భూభాగంలో పడిందని తెలిసింది. ఈ ఘటన జరగడం విచారకం. కానీ, ఎలాంటి నష్టం జరగనందుకు సంతోషం. పాక్ ఆరోపిస్తున్నట్లు ఈ ఘటనను.. మేం తమాషాగా చూడట్లేదు. మా ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది. అందుకే పొరపాటు ఎలా జరిగిందోత తెలుసుకునేందుకు.. అత్యున్నత విచారణకు ఆదేశించాం. విచారణ జరిగితే.. అసలు కారణం ఏంటో తెలిసేది’’ అని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ ఘటనతో భారత క్షిపణి వ్యవస్థపై అనుమానాలు అక్కర్లేదన్న రక్షణ మంత్రి.. అది అత్యంత సురక్షితమైనదని సభకు హామీ ఇచ్చారు. ‘‘మా భద్రతా విధానాలు, ప్రోటోకాల్‌లు అత్యధిక క్రమాన్ని కలిగి ఉంటాయి. ఎప్పటికప్పుడు సమీక్షించబడతాయి. మన సాయుధ దళాలు సుశిక్షితమైనవి అని స్పష్టం చేశారు. We give highest priority to safety&security of our weapon system. If any shortcoming found in this context, it'll immediately be rectified. I'd like to assure the House that our missile system is highly reliable & safe. Our safety procedure & protocols are high level: Defence Min pic.twitter.com/4miUumF5Na — ANI (@ANI) March 15, 2022 2005 ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల క్షిపణి పరీక్షలు గనుక నిర్వహిస్తే.. మూడు రోజుల ముందు తెలియజేయడంతో పాటు, ఇరు దేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం జరగకుండా నిర్ణీత వ్యవధిలోనే ఆ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కానీ, గత బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలింది. మియా చన్ను సమీపంలో అది పడిపోయిందని, ఇది పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే అని భారత్‌పై ఆగ్రహం వెల్లగక్కింది పాకిస్థానీ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని పాక్ ఆరోపణల తర్వాత భారత్ వివరణ ఇచ్చుకుంది. భారత్ చెప్పింది కదా పాక్ భూభాగంలోకి మిస్సైల్ దూసుకెళ్లిన ఘటనపై అమెరికా స్పందించింది. అది ప్రమాదం అని భారత్ చెప్పింది కదా.. పైగా దర్యాప్తునకు ఆదేశించింది. మరేం ఉద్దేశాలు ఉండకపోవచ్చనేం భావిస్తున్నాం. ఇంతకు మించి ఈ పరిస్థితుల్లో ఏం చెప్పలేం. అని భద్రతా కార్యదర్శి నెడ్ ప్రైస్ మీడియాకు తెలిపారు. -
విశాఖకు ప్రముఖల తాకిడి.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట(విశాఖ దక్షిణ): ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పీఎఫ్ఆర్) కోసం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు ఆదివారం విశాఖ రానున్నారు. ప్రముఖుల రాకతో పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సాయంత్రం 5.30 గంటలకు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖ చేరుకుంటారు. ఆయనకు ఆహ్వానం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఐఎన్ఎస్ డేగాలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తరువాత సాయంత్రం 5.55 గంటకు సీఎం తిరుగు పయనమవుతారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్‌సింగ్ చౌహన్, కేంద్ర మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ మంత్రి రూపాల పురుషోత్తమ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్‌కుమార్, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి (ఎక్స్ సర్వీసెమెన్ వెల్ఫేర్) బి.ఆనంద్, కేంద్ర ఎర్త్ అండ్ సైన్స్ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్, గవర్నర్ కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెకట్రరీ ఆర్.పి.సిసోడియా, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు రఘునాధరావు, బి.కృష్ణమోహన్ తదితరులు వస్తున్నారు. -
త్రివిధ దళాధిపతీ అందుకో వందనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత త్రివిధ దళాధిపతికి నావికా దళం వందనానికి సర్వ సన్నద్ధమైంది. సముద్రంలో బారులు తీరిన యుద్ధ నౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ సాగర తీరం సందడి చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ థీమ్‌తో భారత నావికాదళ సేవలు, పరాక్రమం ఉట్టిపడేలా సోమవారం (21న) 12వ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్) అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నౌకా దళ సామరధ్యన్ని సమీక్షిస్తారు. ఇందుకోసం రాష్ట్రపతి ఆదివారం సాయంత్రం 5.20 కు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకొంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తూర్పు నావికా దళం అధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఆయనకు సాదర స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ఆదివారం రాత్రి తూర్పు నావికా దళం (ఈఎన్సీ) ప్రధాన కార్యాలయంలో బస చేస్తారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఫ్లీట్ రివ్యూ మొదలవుతుంది. 21 గన్లతో రాష్ట్రపతికి సెల్యూట్ చేయడంతో కార్యక్రమం ప్రారంభమై, 11.45 గంటల వరకూ జరుగుతుంది. ఈ రివ్యూలో నావికాదళంతో పాటు కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన సుమారు 60 నౌకలు, నౌకా దళం జలాంతర్గాములు, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటాయి. 10 వేల మంది నావికాదళ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు పీఎఫ్ఆర్ గ్రూపు ఫోటో దిగడంతో పాటు తపాలా బిళ్లను, పోస్టల్ కవర్‌ను రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. 22వ తేదీ ఉదయం 10.20 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. వేడుకలు ఇలా.. త్రివిధ దళాలకు అధిపతి హోదాలో భారత రాష్ట్రపతి తన పదవీకాలంలో యుద్ధ నౌకలను సమీక్షించే కార్యక్రమమే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. విశాఖ తీరంలో 44 యుద్ధ నౌకలను ఒక్కో వరుసలో 11 చొప్పున నాలుగు వరుసల్లో నిలిపి ఉంచారు. వీటిని విశాఖ బీచ్ నుంచి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ప్రజలు కూడా వీక్షించవచ్చు. రాత్రి సమయంలో యుద్ధ నౌకలు విద్యుద్దీపాలంకరణతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి నౌకాదళ సమీక్ష కోసం ఐఎన్ఎస్ సుమిత్ర నౌకను ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. ప్రెసిడెంట్ యాచ్‌గా పిలిచే ఈ నౌక డెక్‌పై రాష్ట్రపతి ఆశీనులవుతారు. ఆయన పక్కన అశోక చక్ర ఎంబ్లమ్ కూడా ఉంటుంది. ఇదే యాచ్‌లో వేడుకల్లో పాల్గొనే కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు కూడా ఆశీసులయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి అధిరోహించిన ఐఎన్ఎస్ సుమిత్ర తమ చెంతకు రాగానే ఒక్కో యుద్ధనౌకలో ఉన్న నౌకా దళాల అధికారులు, సిబ్బంది టోపీలను చేతిలో ఉంచుకుని తిప్పుతూ గౌరవ వందనం సమర్పిస్తారు. చివరగా నౌకా దళ యుద్ధ విమానాలు ఏకకాలంలో పైకి ఎగురుతూ.. రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తాయి. అనంతరం సెయిలర్స్ పరేడ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వాటర్ ఫ్రంట్ యాక్టివిటీస్, సముద్రంలో యుద్ధ విన్యాసాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్, మార్కోస్ నిర్వహించే వాటర్ పారాజంప్ వంటి విన్యాసాల్ని రాష్ట్రపతి తిలకిస్తారు. అనంతరం గ్రూప్ ఫొటో దిగుతారు. తపాలా బిళ్ల, పోస్టల్ కవర్ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్ జె చౌహాన్, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి కూడా పాల్గొంటారు. విశాఖ కేంద్రంగా మూడోసారి గతంలో విశాఖ కేంద్రంగా ఒక ఫ్లీట్ రివ్యూ, ఒక అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగాయి. 2006లో తొలిసారి పీఎఫ్ఆర్ జరిగింది. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భారత నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించారు. అనంతరం 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) జరిగింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఇప్పుడు జరుగుతున్నది రెండో పీఎఫ్ఆర్. భారత దేశంలో మొదటి ఫ్లీట్ రివ్యూ 1953 అక్టోబరు 19న ముంబైలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పటివరకు 11 పీఎఫ్‌ఆర్‌లు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నది 12వ ఫ్లీట్ రివ్యూ. -
బీజేపీని గెలిపిస్తే గ్యాస్ సిలిండర్ ఫ్రీ: రాజ్‌నాథ్ సింగ్
ఉత్తరప్రదేశ్‌ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో యూపీపై వరాల జల్లు కురిపిస్తోంది. తాజాగా మూడో ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో .. రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. బీజేపీకి ఓటేసి గెలిపిస్తే.. పండుగలకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా పంచుతామని ప్రకటించారు. శనివారం గోండా కల్నల్‌గంజ్‌లో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్‌లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఓటేసి బీజేపీని గనుక అధికారంలోకి తీసుకొస్తే.. ఏర్పాటు కాబోయే ప్రభుత్వం హోలీ, దీపావళి పండుగలకు ఓటర్లకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తుందని హామీ ప్రకటించారు. ఇదిలా ఉంటే యూపీ మూడో ఫేజ్ ఎన్నికలు రేపు(ఫిబ్రవరి 20, ఆదివారం) జరగనున్నాయి. 16 జిల్లాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక తొలి రెండు ఫేజ్ ఫలితాల అంచనాపై స్పందించిన రాజ్‌నాథ్.. అంతర్గత సర్వేలు, పోల్ అనలిస్టులు కిందటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ కావొచ్చని చెప్తున్నాయని తెలిపారు. సరిహద్దు అంశాలపై రాహుల్ గాంధీ చేసిన ‘చైనా-పాక్’ కామెంట్లు గురించి ప్రస్తావించిన రాజ్‌నాథ్ సింగ్..బహుశా రాహుల ఆధునిక భారత చరిత్ర చదవకుండానే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడేమో అని ఎద్దేవా చేశారు రాజ్‌నాథ్. -
ఈ పుష్పలో ఫ్లవరూ ఉంది.. ఫైరూ ఉంది
ప్యాన్ ఇండియా మూవీ ప్రచారంతో రిలీజ్ అయిన అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా ఊహించని రేంజ్లో సక్సెస్ అయ్యింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ.. నెగెటివ్ టాక్ నుంచి క్రమక్రమంగా పుంజుకుని భారీ సక్సెస్‌ను అందుకోవడం విశేషం. సౌత్‌నే కాదు.. నార్త్‌లోనూ పుష్పమేనియా మామూలుగా కొనసాగడం లేదు. స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీల నుంచి ప్రస్తుత ఎన్నికల తరుణంలో రాజకీయ నాయకుల దాకా పుష్పను అనుకరణ.. అనుసరణ చేసేస్తున్నారు. తాజాగా బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్ సింగ్ సైతం ఈ లిస్ట్‌లో చేరిపోయారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ 'పుష్ప' సినిమాను ప్రస్తావించారు. ఈ సినిమాకు, సీఎం పుష్కర్ కు మధ్య పోలిక తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని... ఆ సినిమా పేరు 'పుష్ప' అని రాజ్ నాథ్ చెప్పారు. ఉత్తరాఖండ్ లో కూడా ఒక పుష్ప (సీఎం పుష్కర్ థామి) ఉన్నారని అన్నారు. ఈ పుష్ప చాలా సౌమ్యంగా, సింపుల్ గా ఉంటారని, కాంగ్రెస్ ఈయన్ని ఉత్త పుష్ప అనుకుంటోంది. కానీ, ఈయనలో ఫ్లవర్(పేరులో అని ఆయన ఉద్దేశం) ఉంది ఫైర్ కూడా ఉందని చెప్పారు. పుష్కర్ ను ఎవరూ ఆపలేరని... ఈయన తగ్గేదేలే అని వ్యాఖ్యానిస్తూ జనాల్లో ఉత్సాహాన్ని నింపారు. తగ్గేదేలే, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగులు ప్రస్తుతం ఎన్నికల సీజన్లో జనాలకు ఎట్రాక్ట్ చేయడానికి తెగ వాడేస్తున్నారు మరి!. ఇంకోపక్క ‘పుష్ప ఇన్స్పిరేషన్తో..’ నేరాలు చోటు చేసుకుండడం గమనార్హం. -
సమతాస్ఫూర్తికి ప్రాణప్రతిష్ట.. వైభవంగా అంకురార్పణ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: దేశంలో భారీ ఆధ్యాత్మిక, ధార్మిక కేంద్రాల్లో ఒకటిగా భాసిల్లే స్థాయిలో రూపు దిద్దుకున్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి బుధవారం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జీయర్ స్వాములు, మఠాధిపతులు, ద్వైత, అద్వైతంలో పెద్దవారంతా పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామనుజ జైస్వామి వారు కార్యక్రమ వైభవాన్ని తెలిపారు. మంగళ శాసనాలు అందించారు. శంషాబాద్ ముచ్చింతల్‌లోని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామి ఆశ్రమ ప్రాంగణంలో రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో 45 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ అద్భుత, దివ్య క్షేత్రం.. భక్తుల సందర్శనకు వీలుగా త్వరలో ప్రారంభం కాబోతోంది. 1,035 కుండాలతో కూడిన లక్ష్మీనారాయణ మహా యాగంతో వేడుకలను ప్రారంభిస్తున్నారు. తొలుత ఆ ప్రాంత భూమి పూజ, వాస్తు పూజ చేస్తారు. వివిధ సంప్రదాయా లను అనుసరించే 5 వేల మంది రుత్వికులు దీక్షధా రణ చేసి పూజల్లో పాల్గొంటారు. సాయంత్రం కుండల్లోని పుట్టమట్టిలో నవధాన్యాలను అలకటం ద్వారా అంకురార్పణ చేయనున్నారు. ఈ ఉత్సవాలు ఈ నెల 14 వరకు కొనసాగనున్నాయి. భారీ విగ్రహం.. 108 ప్రధాన క్షేత్రాలు 216 అడుగుల ఎత్తులో కూర్చున్న భంగిమలో దేశంలో తొలి, ప్రపంచంలో రెండోదిగా కీర్తికెక్కిన రామానుజుల భారీ పంచలోహ సమతామూర్తి విగ్రహం ఈ కేంద్రంలో ప్రధానాకర్షణగా నిలవ నుంది. భారీ విగ్రహమే కాకుండా వైష్ణవ సంప్రదా యంలో అత్యంత ప్రాధాన్యమున్న దివ్య దేశాలుగా పేర్కొనే దేశంలోని 108 ప్రధాన క్షేత్రాల నమూ నాలు ఇక్కడ నిర్మించారు. భారీ విగ్రహం దిగువన 120 కిలోల స్వర్ణమయ 54 అంగుళాల రామాను జుల అర్చామూర్తితో కూడి ఆలయం కూడా ఆకట్టు కోనుంది. ఈ బృహత్తర క్షేత్రంలో అడుగడుగునా ఆధునిక సాంకేతికతను వాడి సంతృప్తిదాయక క్షేత్ర సందర్భన అనుభూతి కలిగేలా రూపొందించారు. సమానత్వ స్ఫూర్తి చాటేలా.. వెయ్యేళ్ల కిందట ఎన్నో వైషమ్యాలు, వైరుధ్యాలు.. అంటరానితనం కరాళనృత్యం చేస్తున్న సమ యంలో ప్రాణికోటి అంతా ఒకటేనని, మనుషుల మధ్య తేడాల్లేవని ప్రబోధించి సమానత్వ భావాలు నాటారు ఆచార్య రామానుజులు. మళ్లీ ఇప్పుడు అసమానతలు దేశ పురోగతికి కంటకంగా మారు తున్న నేపథ్యంలో ఆయన స్ఫూర్తి మరోసారి సమా జంలో పాదుకోవాల్సిన అవసరం ఉందంటూ చినజీయర్ స్వామి ఈ బృహత్ క్షేత్ర నిర్మాణానికి పూనుకున్నారు. దాతల విరాళాలతో ఆరేళ్లలోనే ఈ భారీ కేంద్రం రూపుదిద్దుకుంది. రామానుజులు అవ తరించి వెయ్యేళ్లు గడుస్తున్న నేపథ్యంలో శ్రీ రామా నుజ సహస్రాబ్ది సమారోహంగా ఈ క్రతువును ప్రారంభిస్తున్నారు. ఈ క్షేత్రాన్ని ఓ గుడిలా భావించకుండా, సమాజంలో సమానత్వ భావనల ను విస్తరించేలా చేసేందుకు రామానుజుల ప్రబోధాలు జనంలోకి వెళ్లేలా రూపొందించారు. ఆధునిక అగుమెంటెడ్ రియాలిటీ ఆధారిత 18 నిమిషాల లేజర్ షో ద్వారా నిత్యం భక్తుల మదిని తాకేలా ఏర్పాట్లు చేశామని జీయర్ స్వామి చెబుతున్నారు. సమాజానికి అందించిన అద్భుతమైన 9 గ్రంథాల సారాన్ని అందించేలా డిజిటల్ లైబ్రరీ, సమానత్వ భావాలను సమాజానికి అందించిన విశ్వవ్యాప్త సమతామూర్తుల వివరాలు అందించే హాల్ ఆఫ్ ఫేమ్‌ను సిద్ధం చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 5న వేడుక లకు హాజరుకాను న్నారు. రామానుజుల భారీ సమతామూర్తి విగ్ర హాన్ని ఆవిష్కరించను న్నారు. 7న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, 8న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. 13న రాష్ట్రపతి ఉత్సవ మూర్తిని దర్శించుకోనున్నారు. అలాగే 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల కీలక నేతలు, ఆధ్యాత్మిక వేత్తలు, వివిధ పీఠాధిపతులు కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. భక్త జనం కూడా భారీగా తరలివస్తున్నారు. -
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ దాడి మళ్లీ మొదలైంది. రోజువారీ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధుల వరకు అందరూ మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, స్వల్వ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested. — Rajnath Singh (@rajnathsingh) January 10, 2022 -
రక్షణమంత్రికి సీడీఎస్ చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదిక
-
బిపిన్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటన.. ప్రమాదమే!
సాక్షి, న్యూఢిల్లీ: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేసింది. హెలికాప్టర్ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. డిసెంబర్ 8న తమిళనాడులో బిపిన్ రావత్ ప్రయాణించిన భారత వాయుసేనకు చెందిన MI-17V5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 14మంది దుర్మరణం పాలయ్యారు. ‘కోయంబత్తూరు నుంచి వెల్లింగ్టన్కు బయల్దేరిన MI-17V5 హెలికాప్టర్ కనూర్ సమీపంలో దట్టమైన మేఘాలల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా దారి స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్ ఇబ్బందులు పడ్డాడు. మేఘాల్లో చిక్కుకోవడంతో ముందున్న దృశ్యాలు అస్పష్టంగా కనిపించాయి. దారి కోసం రైల్వే లైన్‌ను హెలికాప్టర్ పైలట్ అనుసరించాడు. ఎత్తయిన శిఖరం అంచును హెలికాప్టర్ అనూహ్యంగా ఢీకొట్టింది. అదేవేగంతో హెలికాప్టర్ కిందికి పడిపోయింది’ అని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నివేదికలో వెల్లడించింది. -
యోగి స్వింగర్లను విపక్షాలు ఆడలేకపోతున్నాయి
ఝాన్సీ (యూపీ): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేసే ఇన్స్వింగర్లు, ఔట్ స్వింగర్లను విపక్షాలు ఆడలేకపోతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. క్రికెట్ పరిభాషను వాడుతూ... యోగిని ఆల్‌రౌండర్‌గా అభివర్ణించారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్.. ఎవరూ ఆయన ధాటికి నిలువలేకపోతున్నారని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఆదివారం ఏడుచోట్ల నుంచి జనవిశ్వాస్ యాత్రల పేరిట మెగా ర్యాలీలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజ్‌నాథ్ ఝాన్సీలో ఆదివారం ఒక ర్యా లీని ప్రారంభించి మాట్లాడారు. గతంలో క్రిమినల్స్ రాత్రి కాగానే నాటు తుపాకులు పట్టుకొని వీధుల్లో తిరిగేవారని, ఇప్పుడలా చేసే సాహసం ఎవరూ చేయలేరన్నారు. యోగి అద్భుతాలు చేశారని కొనియాడారు. సమాజ్‌వాది పార్టీ పాలనలో అవినీతి, అన్యాయం, పేదలపై దౌర్జన్యాలు జరిగాయని లక్నోలో జనవిశ్వాస్ యాత్రను ఆరంభించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వారసత్వ రాజకీయాల్లేని పార్టీ బీజేపీయే అన్నారు. -
అగ్ని ప్రైమ్ పరీక్ష విజయవంతం
బాలాసోర్: అగ్ని ప్రైమ్(అగ్ని– పి) క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధాలు మోసుకవెళ్లే సామర్ధ్యమున్న ఈ బలాస్టిక్ మిసైల్‌ను ఒడిషా తీరంలోని అబ్దుల్‌కలామ్ ద్వీపం నుంచి శనివారం దిగ్విజయంగా పయ్రోగించినట్లు డీఆర్డీఓ తెలిపింది. ఇందులో పలు అత్యాధునిక ఫీచర్లు పొందుపరిచామని తెలిపింది. 1000– 2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈ క్షిపణిని ఉపరితలం నుంచి ప్రయోగిస్తారు. పరీక్షలో క్షిపణి కచ్ఛితమైన లక్ష్యసాధన చేసిందని డీఆర్డీఓ వెల్లడించింది. ఈ సందర్భంగా సైంటిస్టుల బృందాన్ని రక్షణమంత్రి రాజ్‌నాధ్ ప్రశంసించారు. అగ్ని– పి పరీక్ష విజయవంతం కావడంపై డీఆర్డీఓ చైర్మన్ సతీశ్‌రెడ్డి హర్షం ప్రకటించారు. తొలిసారి ఈ క్షిపణిని జూన్ 28న పరీక్షించారు. నేడు జరిపిన రెండో పరీక్షతో క్షిపణి పూర్తి స్థాయి అభివృద్ధి సాధించిందని, వీలయినంత త్వరలో దీన్ని సైన్యంలో ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తున్నామని డీఆర్డీఓ తెలిపింది. -
సైనిక వాహనాల ఎగ్జిబిషన్ అదుర్స్
-
ఎంఐ–17వీ5 ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు
న్యూఢిల్లీ: ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రారంభమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు సాగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడి, సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లైఫ్ సపోర్టు సిస్టమ్‌పై ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్‌నాథ్ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడారు. హెలికాప్టర్ దుర్ఘటన గురించి తెలియజేశారు. ఐఏఎఫ్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందం బుధవారమే తమిళనాడులోని వెల్లింగ్టన్కు చేరుకుందని, వెంటనే రంగంలోకి దిగి, దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తోపాటు ఇతర సైనికుల అంత్యక్రియలను పూర్తి సైనిక లాంఛనాలతో నిర్వహిస్తామన్నారు. ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి ‘జనరల్ రావత్ షెడ్యూల్ ప్రకారం వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో విద్యార్థులు, అధికారులతో భేటీ కావాల్సి ఉంది. ఇందుకోసం సూలూరు ఎయిర్‌బేస్ నుంచి బుధవారం ఉదయం 11.48 గంటలకు వాయుసేనకు చెందిన ఎంఐ–17వీ5 హెలికాప్టర్లో బయలుదేరారు. 12.15 గంటలకు వెల్లింగ్టన్లో దిగాల్సి ఉండగా, సూలూరులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో హెలికాప్టర్‌కు మధ్యాహ్నం 12.08 గంటలకు సంబంధాలు తెగిపోయాయి. కూనూరు వద్ద అడవిలో మంటలు చెలరేగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న హెలికాప్టర్ శిథిలాలు వారికి కనిపించాయి. స్థానిక అధికారులు, సహాయక సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను బయటకు తీసి, వెల్లింగ్టన్లోని మిలిటరీ హాస్పిటల్‌కు తరలించారు. మాకు అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో 13 మంది మరణించారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరిని సంఘటనా స్థలానికి పంపించాం’’ అని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఉభయ సభల్లో నివాళులు తమిళనాడు నీలగిరి కొండల్లో చోటుచేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారికి లోక్‌సభ, రాజ్యసభలో ఎంపీలు నివాళులర్పించారు. మృతుల ఆత్మశాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించారు. జనరల్ బిపిన్ రావత్ మృతిపట్ల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం తెలిపారు. దేశం ఒక గొప్ప యోధుడు, వ్యూహకర్త, అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిపిన్ రావత్ అసాధారణమైన, ఎనలేని పేరు ప్రఖ్యాతలు కలిగిన సైనికాధిపతి అని రాజ్యసభలో డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ కొనియాడారు. రావత్ సంతాప సందేశాన్ని సభలో చదివి వినిపించారు. ఆయన అందించిన సేవలను దేశ ప్రజలు, సైనికులు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతిచెందడం బాధాకరం, దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్యసభలో ఎంపీలు మౌనం పాటించారు. బ్లాక్ బాక్స్ లభ్యం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ దంపతులతోపాటు మరో 11 మందిని బలిగొన్న ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై ఆర్మీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలకమైన ఫ్లైట్ డేటా రికార్డర్(బ్లాక్ బాక్స్)ను గురువారం వెలికితీశారు. ఘటనా స్థలంలో గాలింపు చేపడుతుండగా 300 మీటర్ల దూరంలో ఇది లభ్యమైందని చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్‌లోని సమాచారం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ బాక్స్‌ను ఢిల్లీ లేదా బెంగళూరుకు తరలించి, సమాచారాన్ని విశ్లేషించాలని యోచిస్తున్నారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి గురువారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. సీనియర్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. హెలికాప్టర్ ప్రమాదంపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో హెలికాప్టర్ వీడియో తమిళనాడులోని నీలగిరి కొండల్లో నేలకూలిన ఎంఐ–17వీ5 హెలికాప్టర్ పేరిట ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని నెటిజన్లు విస్తృతంగా షేర్ చేశారు. కొండపై దట్టమైన పొగమంచులో వెళ్తున్న హెలికాప్టర్ కొన్ని క్షణాల తర్వాత అదృశ్యమైనట్లు ఈ వీడియోలో రికార్డరయ్యింది. ఈ దృశ్యాన్ని ఓ పర్యాటకుడు చిత్రీకరించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ వీడియోపై వైమానిక దళం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. -
హెలికాప్టర్ ప్రమాదం: అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
-
హెలికాప్టర్ ప్రమాదం.. లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో దేశ ప్రథమ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్‌తో పాటు మరో 11 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్‌సభలో ప్రకటన చేశారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ►బుధవారం వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది ►సూలూరు ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 11:48 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. ►మధ్యాహ్నం 12:08 గంటలకుహెలికాప్టర్కు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ►కాసేపటికి హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారు. భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లారు. ►అప్పటికే హెలికాప్టర్ మంటల్లో ఉంది. ►గాయపడ్డవారిఇన సహాయక బృందాలు వెల్లింగ్టన్ ఆస్పత్రికి తరలించాయి. ►హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. రావత్‌తో పాటు ఆయన భార్య మృతి చెందడం బాధాకరం. ►భౌతికకాయాలు గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరతాయి. ►హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది అని తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన అనంతరం లోక్‌సభ స్పీకర్ హోం బిర్లా, సభ్యులు బిపిన్ రావత్ సహా మిగతా వారి మృతికి సంతాపం తెలిపారు. చదవండి: బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే -
అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు వక్ర భాష్యాలా?
ముంబై: భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డ్రాగన్ దేశం చైనాపై మరోసారి పరోక్షంగా నిప్పులు చెరిగారు. కొన్ని బాధ్యతారాహిత్యమైన దేశాలు సంకుచిత ప్రయోజనాలే లక్ష్యంగా ఆధిపత్య ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని ఆరోపించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు(యూఎన్క్లాస్) వక్ర భాష్యాలు చెబుతూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయని విమర్శించారు. కొన్ని దేశాలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ చట్టాలను బలహీన పరుస్తుండడం ఆందోళనకరమని అన్నారు. దేశీయంగా నిర్మించిన క్షిపణుల విధ్వంసక వాహక నౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ఆదివారం మహారాష్ట్రలోని ముంబై తీరంలో రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా అరేబియాలో సముద్రంలో జల ప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన భారత్ బాధ్యతాయుతంగా పనిచేస్తోందని, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవిస్తోందని చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని తాము కోరుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఇక్కడ అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు రక్షణ లభించాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో దేశాల స్థిరత్వం, ఆర్థిక పురోగతి, ప్రపంచాభివృద్ధి కోసం నిబంధనలతో కూడిన స్వేచ్ఛాయుత నౌకాయానం, సముద్ర మార్గాల రక్షణ చాలా అవసరమని వివరించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు సొంత భాష్యాలు చెబుతూ ఉల్లంఘిస్తుండడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటివి స్వేచ్ఛాయుత నౌకాయానికి అడ్డంకులు సృష్టిస్తాయని చెప్పారు. భారత నావికాదళం పాత్ర కీలకం ఇండో–పసిఫిక్ ప్రాంతం కేవలం ఇక్కడి దేశాలకే కాదు, మొత్తం ప్రపంచానికి చాలా కీలకమని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఈ ప్రాంత భద్రత విషయంలో భారత నావికాదళం తనవంతు కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారతదేశ ప్రయోజనాలు హిందూ మహాసముద్రంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇండో–పసిఫిక్ ప్రాంతం ఒక ఆయువు పట్టు అని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సైనిక సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. ఆయుధాలు, సైనిక రక్షణ పరికరాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ ఖర్చు 2.1 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. రక్షణ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో భారత్‌ను కేంద్ర స్థానంగా మార్చాలన్నారు. శత్రువుల పాలిట సింహస్వప్నం ఐఎన్ఎస్ విశాఖపట్నం.. హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణలో కీలకంగా మారనుంది. సముద్ర ఉపరితలం నుంచి సముద్ర ఉపరితలానికి, సముద్ర ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోసుకెళ్లనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. బరువు: 7,400 టన్నులు పొడవు: 163 మీటర్లు వెడల్పు: 17.4 మీటర్లు వేగం: గంటకు 30 నాటికల్ మైళ్లు పరిధి: ఏకధాటిగా 4,000 నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగలదు ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ ర్యాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్లు నాలుగు, రెండు జలాంతర్గామి విధ్వంసక రాకెట్ లాంచర్లు, కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్, రాకెట్ లాంచర్, అటోమేటెడ్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్. – సాక్షి, విశాఖపట్నం -
‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ జల ప్రవేశం.. ప్రత్యేకతలివే..
ముంబై: విశాఖపట్నం అంటే సముద్ర తీరంలోని ఓ నగరం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఓ యుద్ధ నౌక కూడా విశాఖపట్నం పేరిట నిర్మితమైంది. విశాఖ నగర ప్రాధాన్యత తో పాటు చరిత్ర ఆధారంగా నేవీ ఓ యుద్ధ నౌకకు విశాఖపట్నం నామకరణం చేసింది. ఈ యుద్ధనౌక ప్రాధాన్యతలను ఇటీవల తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైఎస్ అడ్మిరల్ ఆజేంద్ర బహదూర్ సింగ్ తాడేపల్లిలో సీఎం జగన్మోహన్రెడ్డికి కూడా వివరించారు. ఆదివారం ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘విశాఖపట్నం యుద్ధనౌక’ను ప్రారంభించారు. ఈ యాంటీ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక రక్షణ రంగంలో కీలక భూమిక పోషించనుంది. చదవండి: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు విశాఖ నగరానికి రక్షణ రంగానికి ఎంతో అనుబంధం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి విశాఖ నగరంపై శత్రుదేశాల దృష్టితో పాటు ఈ నగరం కేంద్రంగా శత్రు దేశాలు ఎదుర్కోడానికి భారత్ రక్షణ దళం కూడా ప్రత్యేక స్థావరాలు కొనసాగించింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో కైలాసగిరి.. యారాడ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేక సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అరకులో పద్మాపురం గార్డెన్స్ నుంచి సైనికులకు కూరగాయలు ప్రత్యేకంగా సరఫరా చేసేవాళ్లు. 1971లో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించడంలో విశాఖ కేంద్రంగా కొనసాగుతున్న తూర్పు నౌకాదళం ప్రధాన భూమిక పోషించింది. దీనికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దశలో విశాఖ నగర ఖ్యాతి ప్రాధాన్యతను గుర్తిస్తూ నావికాదళం ఇటీవల విశాఖపట్నం అని పేరు పెట్టింది. 2011 జనవరి 18 నుంచి రూపకల్పన జరిగిన ఈ యుద్ధనౌక డైరెక్టర్ ఆఫ్ నావెల్ డిజైన్. ఇండియన్ నేవీ సంయుక్తంగా యుద్ధనౌక రూపకల్పన డిజైన్ చేసింది గంటకు 30 నాటికా మైళ్ల వేగంతో ప్రయాణం చేసే యుద్ధనౌక ఏకదాటిగా నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసే సామర్థ్యం పూర్తిగా 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ విశాఖపట్నం మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక సముద్రంలో ట్రయిల్ రన్ పూర్తిచేసుకుని రక్షణ రంగంలో సేవలకు సిద్ధమైంది. ముంబైలో రూపొందిన ఈ యుద్ధనౌకను గత నెల 31వ తేదీన తూర్పు నౌకాదళ అధికారులకు అప్పగించారు. ఈ దశలో ఈ యుద్ధ నౌక విశాఖ కేంద్రం సేవలు అందించనుంది. సీఎం వైఎస్ జగన్ విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన దశలో ఆ నగరం పేరిట యుద్ధనౌక రూపొందడం గొప్ప విషయంగా ప్రజలు భావిస్తున్నారు. దీన్ని లాంఛనంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు ప్రారంభించడంపై విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.