
రాహుల్ గాందీకి రాజ్‌నాథ్ సింగ్ సవాల్
పట్నా: ఓట్ల చౌర్యానికి పాల్పడుతున్న ఎన్నికల సంఘంపై అణు బాంబు లాంటి సాక్ష్యం ఉందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. దమ్ముంటే ఒక్కసారి అణు బాంబు పేల్చి చూపించాలని రాహుల్‌కు సవాల్ విసిరారు. అది పేలేటప్పుడు హాని జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు.
పార్లమెంట్‌లో భూకంపం సృష్టిస్తానని రాహుల్ గతంలో హెచ్చరించారని, చివరకు తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. శనివారం బిహార్ రాజధాని పాటా్నలో ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని రాహుల్ కించపరుస్తున్నారని ఆరోపించారు. నిజానికి రాహుల్ పార్టీ చేతులే రక్తంతో తడిశాయని విమర్శించారు. 1975లో ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయతి్నంచిందని రాజ్‌నాథ్ ధ్వజమెత్తారు.