ఆప్‌ నేత దారుణ హత్య.. సీసీటీవీ విజువల్స్ | AAP leader murdered in Punjab | Sakshi
Sakshi News home page

ఆప్‌ నేత దారుణ హత్య.. సీసీటీవీ విజువల్స్

Feb 6 2026 3:52 PM | Updated on Feb 6 2026 4:38 PM

 AAP leader murdered in Punjab

చండీఘడ్‌: పంజాబ్‌లో దారుణం జరిగింది. ఆమ్ ఆద్మీపార్టీ నేత ఒబెరాయ్‌ దారుణహత్యకు గురయ్యారు. జలంధర్‌ ప్రాంతంలో దుండగులు బ్లాక్ హూడీ ధరించి, ఓబెరాయ్ వాహనం దగ్గరికి వచ్చి 10 సెకన్లలో ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన ఒబెరాయ్ ప్రాణాలు వదిలారు. కాల్పుల కలకలంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

గురుద్వారాలోని మోడల్‍ టౌన్ ‍ప్రాంతంలో జీప్‌లో ఉండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన జలందర్ కారులోనే కుప్పకూలారు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దర్యాప్తులో ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. నిందితులు బ్లాక్‌ హుడీ ధరించిన దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, గతంలో ఒబెరాయి సతీమణి అక్కడి మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement