'పిల్లలందరికీ తండ్రులే హీరోలురా'.. ఆసక్తిగా గ్లింప్స్ | Legend Saravanan latest movie Leader Title Glimpse in Teluu | Sakshi
Sakshi News home page

Title Glimpse in Telugu: 'పిల్లలందరికీ తండ్రులే హీరోలురా'.. ఆసక్తిగా గ్లింప్స్

Feb 4 2026 3:44 PM | Updated on Feb 4 2026 3:53 PM

Legend Saravanan latest movie Leader Title Glimpse in Teluu

బిజినెస్‌మేన్‌గా కెరీర్ ప్రారంభించి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అరుల్ శరవణన్. ది లెజెండ్‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన లెజెండ్‌ శరవణన్‌గా ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లీడర్. ఈ మూవీకి దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది. ఫైట్ సీన్స్ చూస్తుంటే కూతురి కోసం తండ్రి ఎంతవరకైనా వెళ్తాడనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చివర్లో పిల్లలందరికీ తండ్రులే హీరోలురా అంటూ చెప్పే డైలాగ్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement