అతడి వల్లే 4 ఏళ్లు సినిమాలకు దూరమయ్యా: మాధవన్‌ | R Madhavan about 4 Year Break from Movies | Sakshi
Sakshi News home page

నేనేంటో చూపిస్తానన్నంత కోపం.. చివరకు సినిమాలకు బ్రేక్‌

Feb 4 2026 11:41 AM | Updated on Feb 4 2026 12:00 PM

R Madhavan about 4 Year Break from Movies

ఒకతను చేసిన చిన్న పని వల్ల నాలుగేళ్లు సినిమాలకే దూరంగా ఉన్నానంటున్నాడు ప్రముఖ నటుడు ఆర్‌.మాధవన్‌. సాలా ఖడూస్‌ (2016) సినిమాకు ముందు బ్రేక్‌ తీసుకున్నానని, అది తనకెంతో పనికొచ్చిందంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధవన్‌ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో ఓ తమిళ పాట చిత్రీకరణ కోసం ఆరెంజ్‌ ప్యాంట్‌, గ్రీన్‌ షర్ట్‌ ధరించి రోడ్డు మధ్యలో నిల్చున్నాను. 

నేనెవరో చూపిస్తా అన్నంత కోపం
అక్కడే కూర్చున్న ఓ రైతు నన్ను నిర్లక్ష్యంగా ఓ చూపు చూశాడు. అది నాకసలు నచ్చలేదు. చెన్నైకి రా.. నేనెవరో నీకు చూపిస్తా అని మనసులో అనుకున్నాను. కానీ ఎందుకో ఆ చూపు నన్ను వెంటాడింది. నన్ను ఆలోచింపజేసేలా చేసింది. నిజంగానే అసలు నేనేం చేస్తున్నాను అని అంతర్మథనానికి లోనయ్యాను. అందుకే బ్రేక్‌ తీసుకున్నాను. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను. 

అదిప్పటికీ పనికొస్తోంది
సినిమాలు మానేసి ప్రదేశాలు తిరగడం మొదలుపెట్టాను. రిక్షా తొక్కేవారి దగ్గరి నుంచి చాలామందితో మాట్లాడాను. వారి జీవనశైలి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ఇలా అన్నింటినీ పరిశీలించాను. ఆ పర్యటన నాకెన్నో పాఠాలు నేర్పింది. ఎలాంటి పాత్రలు చేయాలి? ఎలాంటి సినిమాల్లో కనిపించాలన్నదానిపై స్పష్టత వచ్చింది. ఆ నాలుగేళ్లలో నేర్చుకున్నదాని ఫలితాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మాధవన్‌ చివరగా ధురంధర్‌ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ధురంధర్‌ 2తో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాడు.

చదవండి: నాకు స్టార్‌డమ్‌ తెచ్చిన మూవీ అదే.. : మహేశ్‌బాబు

Advertisement
 
Advertisement
Advertisement