ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ, ఆ పాప పుడుతూనే అదృష్టాన్ని మోసుక్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. అదెలాగంటే స్టార్ హీరోలకు పాప పుట్టాక దశ తిరిగిపోయింది. హిట్లు, సూపర్ హిట్లు కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ చూశారు. ఆ సంగతులు ఓసారి చూసేద్దాం..
పాప తెచ్చిన సంతోషం
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ 2023లో 'యానిమల్' మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా రూ.917 కోట్లు రాబట్టింది. రణ్‌బీర్ కెరీర్‌లోనే ఇది అత్యధికం. అయితే ఈ సినిమా కంటే ముందు అతడి జీవితంలో ఓ అద్భుతం జరిగింది. 2022లో రణ్‌బీర్- ఆలియా భట్ పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహా పుట్టింది. పాప పుట్టిన వేళా విశేషం.. రణ్‌బీర్‌కు బాగా కలిసొచ్చింది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో రికార్డులు తిరగరాశాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా యానిమల్ పార్క్ రాబోతోంది.
అదృష్టం
బాలీవుడ్‌లో మరో స్టార్ జోడీ రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొణె. వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు అంటే 2024 నవంబర్‌లో ఈ దంపతులకు కూతురు పుట్టింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా జన్మించడంతో తనకు దువా అని నామకరణం చేశారు. పాప పుట్టాక రణ్‌వీర్ కెరీర్‌కు కూడా మంచి బూస్ట్ లభించింది. 2025 చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కూడా సీక్వెల్ వస్తోంది. ఈ ఏప్రిల్ 17న ధురంధర్ 2 విడుదల కానుంది.
పెద్ది కూడా బ్లాక్‌బస్టర్!
టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్‌చరణ్-ఉపాసన పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఉపాసన కడుపుతో ఉండగానే చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. RRR మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో సగర్వంగా నిలబెట్టింది. ఈసారి చరణ్‌కు కవలలు (పాప, బాబు) పుట్టారు. చరణ్ నెక్స్ట్ మూవీ పెద్ది. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి హీరోలు ఊహించలేనంత విజయాల్ని అందుకుంటున్నారు. ఈ లెక్కన చరణ్‌కు మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ రావడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.
చదవండి: 50 మంది సెలబ్రిటీలు.. వీరిలో కరెక్ట్ విన్నర్‌ను గెస్ చేస్తే రూ.50 లక్షలు!


