రూ.70 కోట్ల పారితోషికం.. అది తెలివితక్కువ పని: నటుడు | Imran Khan Slams Star Actors Burdening Films with Their Remuneration | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ కంటే ఎక్కువ పారితోషికం.. స్టార్‌ హీరోలే సినిమాను చంపేస్తున్నారు!

Feb 2 2026 2:24 PM | Updated on Feb 2 2026 2:48 PM

Imran Khan Slams Star Actors Burdening Films with Their Remuneration

సినిమాలు ఆడినా, ఆడకపోయినా పారితోషికం మాత్రం పైసా తగ్గకుండా ఖతాలో పడాల్సిందే! అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు స్టార్‌ హీరోలు. కనీసం సినిమా బడ్జెట్‌ను కూడా పరిగణనలోకి తీసుకోకుండా భారీ మొత్తం డిమాండ్‌ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌.

స్టార్‌ హీరోల కెపాసిటీ
ఇతడు నటించడంతో పాటు సహనిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం 'బ్రేక్‌ కే బాద్‌'. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు సినిమా బడ్జెట్‌ను బట్టి హీరోలను ఎంపిక చేసేవారు. అది చాలా మంచి పద్ధతి. స్టార్‌ హీరోకు ఎక్కువమంది జనాల్ని థియేటర్‌కు రప్పించే సత్తా ఉంది. కొందరు నటులకు అంత కెపాసిటీ ఉండదు.

బాధ్యత కనిపించట్లే..
కాబట్టి భారీ బడ్జెట్‌ యాక్షన్‌ సినిమా తీస్తున్నప్పుడు స్టార్‌ హీరోలను ఎంపిక చేసుకోవడంలో తప్పు లేదు. అయితే నా ముందున్న తరాలు సినిమా కోసం ఎంతో కష్టపడేవి. అలా అని వారి జేబులో నుంచి డబ్బు తీసి పెట్టేవారు కాదు. కాకపోతే సినిమా కోసం బాధ్యతగా పనిచేసేవారు. కానీ, ఇప్పుడు స్టార్‌ హీరోలే సినిమాను చంపేస్తున్నారు. ఉదాహరణకు ఒక సినిమా బడ్జెట్‌ రూ.30 కోట్లు అనుకుందాం. 

సినిమా గురించి ఆలోచించరా?
నేను మాత్రం అదేం పట్టించుకోకుండా నా రెమ్యునరేషన్‌ రూ.40 కోట్లు తీసుకుంటే అప్పుడు బడ్జెట్‌ ఒక్కసారిగా రూ.70 కోట్లు అవుతుంది. ఇదెంతవరకు కరెక్ట్‌? సినిమా బడ్జెట్‌ను కచ్చితంగా లెక్కలోకి తీసుకోవాలి. కొన్ని డీసెంట్‌గా ఉండే సినిమాలకు అంత డిమాండ్‌ చేయడం కరెక్ట్‌ కాదు. ఆమిర్‌ ఖాన్‌.. మూవీ రిలీజయ్యాక వచ్చే ఫలితాన్ని బట్టి దాంట్లో వాటా తీసుకుంటాడు. 

అది తెలివితక్కువ పని
అంతే తప్ప.. నేను స్టార్‌ హీరోని, రూ.60 కోట్లు ఇవ్వు, రూ.75 కోట్లు ఇవ్వమని డిమాండ్‌ చేయడు. అలా చేస్తే అంతకంటే తెలివితక్కువపని మరొకటి ఉండదు. సినిమాను మీరే దెబ్బతీసినవాళ్లవుతారు. సినిమాను నాశనం చేసి మీరు మాత్రం ఎదిగినవాళ్లవుతారు. ఇదెలా ఉంటుందంటే.. మీరెలాంటి చెత్త సినిమా తీస్తున్నారో ఎవరికి తెలుసు? నా డబ్బులైతే నాకిచ్చేయండి. సినిమా ఎటు పోతే నాకేంటి? అని గాలికొదిలేసినట్లుగా ఉంటుంది అని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చదవండి: కూతురే నా సర్వస్వం.. నా బ్యాగ్‌లో ఏముందో తెలుసా?: దీపికా

Advertisement
 
Advertisement
Advertisement