breaking news
star actors
-
గణేశుడి సన్నిధిలో విజయ్ దేవరకొండ..(ఫోటోలు)
-
సినిమాల్లో స్టార్.. రియల్ లైఫ్‌లో ఫెయిల్.. ఓ హీరోయిన్ జీవిత కథ..!
సినిమా వాళ్ల జీవితం మనం ఊహించనంతగా ఈజీగా ఉండదు. గ్లామర్ ఫీల్డ్ రంగుల ప్రపంచమే అయినప్పటికీ.. వాళ్ల జీవితంలో అలాగే ఉంటుందనుకుంటే తొక్కపై కాలేసినట్లే. అందరి లైఫ్ లగ్జరీగా ఉంటుందనుకుంటే పెద్ద పొరపాటే. వెండితెరపై కనిపించినంత కలర్ఫుల్గా వ్యక్తిగత జీవితం ఉండదు. అలాంటి కథే ఈ మలయాళ స్టార్ హీరోయిన్ చర్మిలాది. సినిమాల్లో స్టార్‌గా ఎదిగిన ఈ భామ.. రియల్ లైఫ్‌లో మాత్రం దారుణ పరిస్థితులు ఎదుర్కొంది.తమిళనాడులో జన్మించిన చర్మిలా.. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఎదిగింది. శివాజీ గణేషన్ నటించిన ‘నల్లతోరు కుటుంబం’ (1979) చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ చిత్రం ‘ఒయిలట్టం’ (1991)తో హీరోయిన్గా పరిచయమైంది. అయితే చర్మిలకు మోహన్‌లాల్ సరసన వరుస చిత్రాలలో నటించే అవకాశం లభించింది. ధనం(1991), అంకుల్ బన్ (1991) చిత్రాలు ఆమెను ఓ స్థాయికి తీసుకెళ్లాయి. ఆ తర్వాత కేలి మూవీతో స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అంతేకాకుండా 90 దశకంలో తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా కనిపించారు.రియల్ లైఫ్‌లో ఫెయిల్..సినిమాల్లో స్టార్‌గా ఎదిగిన చర్మిలా మాత్రం రియల్ లైఫ్‌లో సక్సెస్ కాలేకపోయింది. బాబు ఆంటోనీతో మొదలైన ఆమె ప్రేమ ప్రయాణం.. ఆ రిలేషన్ విచ్చిన్నం కావడంతోనే మొదలైంది. ఆ తర్వాత ఆమె జీవితం మరింత పతనమైంది. రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ చివరికీ విడాకులు తీసుకుంది.మలయాళంలో 'కడల్' (1994) అనే చిత్రంలో ఆమె నటించారు. ఈ మూవీలో బాబు కూడా ఒక కీలక పాత్ర పోషించారు. అక్కడే వారిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వారు 'రాజధాని', 'కంబోలం' వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు. అదే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు నాలుగేళ్ల పాటు కలిసి ఉన్నప్పటికీ.. చివరికి విడిపోయారు. తన తండ్రికి బాబు అంటే అస్సలు ఇష్టం లేదని ఆమె ఒకసారి వెల్లడించారు. నా తండ్రి కఠిన వైఖరే తనను బాబుకు మరింత దగ్గర చేసిందని ఆమె పేర్కొంది.కిషోర్ సత్యతో సీక్రెట్ పెళ్లి..అయితే బాబు ఆంటోనీతో విడిపోయాక.. అప్పట్లో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న నటుడు కిషోర్ సత్యకు ఆమె దగ్గరైంది. చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లే ఆమె సినీ కెరీర్ పతనానికి నాంది పలికింది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని కిషోర్ నన్ను అడిగాడని చెప్పింది. ఆ తర్వాత కిషోర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అలా నాలుగేళ్లపాటు అతను అక్కడ.. నేను ఇక్కడ ఉన్నామని తెలిపింది. ఒక షో కోసం నేను దుబాయ్ వెళ్లి అతన్ని కలిశా.. ఈ మన బంధాన్ని కొనసాగించడం తనకు ఇష్టం లేదని కిషోర్ చెప్పిన విషయాన్ని చర్మిల గుర్తుచేసుకుంది. కేవలం నా పాపులారిటీ వల్లే నన్ను పెళ్లి చేసుకున్నాడని గ్రహించి..ఆ తర్వాత మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని వెల్లడించింది.రెండో పెళ్లి కూడా..ఒక పెళ్లి విఫలమైనప్పటికీ.. చర్మిల మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన రాజేశ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడింది. అతను చర్మిల సోదరి ఫ్రెండ్ కావడం విశేషం. అయితే మా ఇద్దరికీ ఓ కుమారుడు జన్మించాడు. అయితే నేను క్రిస్టియన్ కావడంతో తన కొడుకు కూడా అదే మతం అనుసరించాలని కోరుకున్నా..కానీ రాజేశ్ హిందూ మతంలోకి మారాలని కోరడంతో మా ఇద్దరికీ విభేదాలొచ్చాయని తెలిపింది. దీంతో మేము చట్టపరంగా విడాకులు తీసుకున్నామని తెలిపింది. అయినప్పటికీ అతనితో టచ్‌లో ఉన్నాం.. కోర్టు విచారణ సమయంలో నా కొడుకు నాతో ఉండాలనుకుంటున్నానని చెప్పాడని.. రాజేశ్ తరచుగా నా కొడుకును కలవడానికి వస్తుంటాడని తెలిపింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలలో లేనప్పటికీ.. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఆమె పలు టెలివిజన్ షోలలో కూడా కనిపించారు. -
రూ.70 కోట్ల పారితోషికం.. అది తెలివితక్కువ పని: నటుడు
సినిమాలు ఆడినా, ఆడకపోయినా పారితోషికం మాత్రం పైసా తగ్గకుండా ఖతాలో పడాల్సిందే! అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు స్టార్ హీరోలు. కనీసం సినిమా బడ్జెట్‌ను కూడా పరిగణనలోకి తీసుకోకుండా భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్.స్టార్ హీరోల కెపాసిటీఇతడు నటించడంతో పాటు సహనిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం 'బ్రేక్ కే బాద్'. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు సినిమా బడ్జెట్‌ను బట్టి హీరోలను ఎంపిక చేసేవారు. అది చాలా మంచి పద్ధతి. స్టార్ హీరోకు ఎక్కువమంది జనాల్ని థియేటర్‌కు రప్పించే సత్తా ఉంది. కొందరు నటులకు అంత కెపాసిటీ ఉండదు.బాధ్యత కనిపించట్లే..కాబట్టి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా తీస్తున్నప్పుడు స్టార్ హీరోలను ఎంపిక చేసుకోవడంలో తప్పు లేదు. అయితే నా ముందున్న తరాలు సినిమా కోసం ఎంతో కష్టపడేవి. అలా అని వారి జేబులో నుంచి డబ్బు తీసి పెట్టేవారు కాదు. కాకపోతే సినిమా కోసం బాధ్యతగా పనిచేసేవారు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోలే సినిమాను చంపేస్తున్నారు. ఉదాహరణకు ఒక సినిమా బడ్జెట్ రూ.30 కోట్లు అనుకుందాం. సినిమా గురించి ఆలోచించరా?నేను మాత్రం అదేం పట్టించుకోకుండా నా రెమ్యునరేషన్ రూ.40 కోట్లు తీసుకుంటే అప్పుడు బడ్జెట్ ఒక్కసారిగా రూ.70 కోట్లు అవుతుంది. ఇదెంతవరకు కరెక్ట్? సినిమా బడ్జెట్‌ను కచ్చితంగా లెక్కలోకి తీసుకోవాలి. కొన్ని డీసెంట్‌గా ఉండే సినిమాలకు అంత డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఆమిర్ ఖాన్.. మూవీ రిలీజయ్యాక వచ్చే ఫలితాన్ని బట్టి దాంట్లో వాటా తీసుకుంటాడు. అది తెలివితక్కువ పనిఅంతే తప్ప.. నేను స్టార్ హీరోని, రూ.60 కోట్లు ఇవ్వు, రూ.75 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేయడు. అలా చేస్తే అంతకంటే తెలివితక్కువపని మరొకటి ఉండదు. సినిమాను మీరే దెబ్బతీసినవాళ్లవుతారు. సినిమాను నాశనం చేసి మీరు మాత్రం ఎదిగినవాళ్లవుతారు. ఇదెలా ఉంటుందంటే.. మీరెలాంటి చెత్త సినిమా తీస్తున్నారో ఎవరికి తెలుసు? నా డబ్బులైతే నాకిచ్చేయండి. సినిమా ఎటు పోతే నాకేంటి? అని గాలికొదిలేసినట్లుగా ఉంటుంది అని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: కూతురే నా సర్వస్వం.. నా బ్యాగ్‌లో ఏముందో తెలుసా?: దీపికా -
అల్లు అర్జున్-అట్లీ కాంబో.. ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్!
పుష్ప -2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని నెలలుగా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అంతే కాకుండా మరో ముగ్గురు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని టాక్ నడిచింది.ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సీతారామం బ్యూటీ హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మృణాల్ షూట్లో కూడా పాల్గొన్నారని లేటేస్ట్ అప్డేట్. అంతేకాకుండా అల్లు అర్జున్‌తో కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో మృణాల్ ఎంట్రీలో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ సైతం నటిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.Buzz is that actress Mrunal Thakur has joined Allu Arjun in Atlee’s upcoming sci-fi action spectacle “AA22xA6”. Backed by Sun Pictures, the film is said to be a high-octane futuristic thriller packed with massive action sequences, time-travel elements, and cutting-edge VFX. The… pic.twitter.com/xqnzdR7DlJ— SIIMA (@siima) October 28, 2025 -
అమ్మవారి సేవలో స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ హీరో కార్తీ ప్రస్తుతం సత్య సుందరం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మూవీకి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా హీరో కార్తీ, చిత్రబృందం విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు.మూవీ సూపర్ హిట్ కావడంతో విజయవాడలో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బెజవాడ చేరుకున్న కార్తీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టమని తెలిపారు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ వచ్చాను.. మా సినిమా చూసి నాగార్జన అభినందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. టాలీవుడ్ మూవీ ఊపిరితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నాగార్జునకు తమ్ముడి పాత్రలో అభిమానులను మెప్పించారు.(ఇది చదవండి: డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్: నాగార్జున)కాగా.. కార్తి , అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మెయ్యజగన్. ఈ చిత్రాన్ని సత్యం సుందరం పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక దీనిని నిర్మించారు. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతమందించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న కార్తీ ✨🙏#Karthi #SathyamSundaram #PremKumar #TeluguFilmNagar pic.twitter.com/vnflnQV50R— Telugu FilmNagar (@telugufilmnagar) September 30, 2024 -
స్టార్ నటుల యాంకరింగ్‌పై దుమారం
బెంగళూరు: స్టార్ నటులు టీవీ యాంకరింగ్ చేయడంపై కన్నడ సినీమా రంగంలో పెద్ద దుమారం లేచింది. అన్ని భాషల హీరోలు, హీరోయిన్లు ఇటీవల టీవీ యాంకర్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. శాండల్‌వుడ్ స్టార్లుగా వెలుగొందుతున్న వారు యాంకర్లుగా మారుతుండడంపై కన్నడ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టార్ యాంకర్ల కార్యక్రమాలు వారాంతాల్లో ప్రసారం అవుతుండడంతో థియేటర్లకు రావాల్సిన అభిమానులు టీవీ చూడ్డానికే పరిమితమవుతున్నారని నిర్మాతలు చెబుతున్నారు. యాంకర్లుగా వ్యవహరిస్తున్న స్టార్ నటులను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని నిర్మాతల సంఘం కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలికి ఫిర్యాదు చేసింది.


