పుష్ప -2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని నెలలుగా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అంతే కాకుండా మరో ముగ్గురు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని టాక్ నడిచింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సీతారామం బ్యూటీ హీరోయిన్‌గా కన్‌ఫామ్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మృణాల్ షూట్‌లో కూడా పాల్గొన్నారని లేటేస్ట్ అప్‌డేట్. అంతేకాకుండా అల్లు అర్జున్తో కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో మృణాల్ ఎంట్రీలో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ సైతం నటిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
Buzz is that actress Mrunal Thakur has joined Allu Arjun in Atlee’s upcoming sci-fi action spectacle “AA22xA6”. Backed by Sun Pictures, the film is said to be a high-octane futuristic thriller packed with massive action sequences, time-travel elements, and cutting-edge VFX. The… pic.twitter.com/xqnzdR7DlJ
— SIIMA (@siima) October 28, 2025


