దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి అందరికీ సుపరిచితమే.. ఆమె నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.
హన్షిత తాజాగా 'ది గుడ్ సైడ్' ప్రీమియర్ మేకప్ స్టూడియోను ప్రారంభించారు.
ఈ మేకప్ స్టూడియో ప్రారంభోత్సవంలో సినీ నటుడు అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


