breaking news
Allu Sneha Reddy
-
ఫ్యామిలీతో అల్లు అర్జున్ డిన్నర్.. అర్హకు ఇబ్బంది కలగొద్దని..
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటాడు అల్లు అర్జున్ (Allu Arjun). బన్నీ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. భార్య స్నేహ, కుమారుడు అయాన్, కూతురు అర్హతో కలిసి ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లాడు. కుటుంబంతో కలిసి భోజనం చేసి బయటకు వస్తుండగా మీడియా వారి ఫోటోలు క్లిక్‌మనిపించే పనిలో పడింది. ఈ క్రమంలో కెమెరాలు అదేపనిగా ఫ్లాష్ అవుతుండటంతో బన్నీ.. కూతురి కళ్లపై చేయి అడ్డుపెట్టాడు.కూతురిపై ఎంత ప్రేమో!అర్హ కళ్లకు ఇబ్బందికలగకుండా కూతురి కళ్లపై చేయి పెట్టే ముందుకు నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. కూతురిపై ఐకాన్ స్టార్‌కు ఎంత ప్రేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ చివరగా పుష్ప 2 చిత్రంలో నటించాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లకుపైగా రాబట్టింది. ప్రస్తుతం బన్నీ.. అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో దీపికా పదుకొణె, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఇంట్లో కూర్చుని బాధపడలేను.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తా! -
నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ
మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) మాట్లాడే విధానంపై చాలామంది సరదాగా జోకులేస్తుంటారు. ఆమె యాస.. తెలుగు భాషను ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నట్లుగా ఉంటుందని అంటుంటారు. తెలుగును ఖూనీ చేస్తున్నావని విమర్శించేవాళ్లు కూడా లేకపోలేదు. అయితే లక్ష్మి మాటల్ని చూశాక అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అర్హకు ఓ డౌట్ వచ్చింది.ఎన్నాళ్లుగానో వెయిటింగ్తనసలు తెలుగమ్మాయేనా? అన్న ప్రశ్న మదిలో మెదిలింది. మంచు లక్ష్మి కనిపిస్తే అడిగేయాలని ఎన్నాళ్లుగానో వేచి ఉన్నట్లుంది. ఇన్నాళ్లకు ఆ సమయం రానే వచ్చింది. తాజాగా మంచు లక్ష్మి.. సరదాగా కాసేపు బన్నీ ఇంటికి వెళ్లింది. పిల్లలంటే ఇష్టమని చెప్పే ఆమె అర్హ (Allu Arha)తో కబుర్లాడకుండా ఉంటుందా? తనను కూర్చోబెట్టుకుని ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలోనే నన్నేదో అడగాలనుకున్నావంట కదా.. ఏంటది? అని ప్రశ్నించింది. ఎందుకంత డౌట్?అందుకు అర్హ.. నువ్వు తెలుగువేనా? అని నవ్వుతూనే క్వశ్చన్ వేసింది. ఊహించని ప్రశ్నకు అవాక్కయిన మంచు లక్ష్మి.. నేను తెలుగే (తెలుగమ్మాయినే) పాప.. నీకంత డౌట్ ఎందుకొచ్చింది? నీతో తెలుగులోనే కదా మాట్లాడాను అని నవ్వేసింది. అయినా ఎందుకలా అడిగావు? అనగా నీ యాక్సెంట్ అట్లానే ఉంది అని నవ్వుతూ బదులిచ్చింది అర్హ. దీంతో లక్ష్మి.. నీ యాస కూడా అలాగే ఉందంటూ అర్హను పట్టుకుని నవ్వేసింది. ఈ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇన్స్టాగ్రామ్స్టోరీలో షేర్ చేసింది. LMAO, arha got not chills 🤣😭[ #AlluArjun • #AlluSnehaReddy • #AlluArha ] pic.twitter.com/8V2zDf027l— Reshmaˢᵃⁱʸᵃᵃʳᵃ ᵉⁿᵗʰᵘˢⁱᵃˢᵗ (@_Reshma_Classy) August 7, 2025 చదవండి: విడాకుల బాటలో మరో సీనియర్ హీరోయిన్! -
పార్టీ మూడ్‌లో బన్నీ భార్య.. ఫ్రెండ్ ఒడిలో తమన్నా
ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్న అల్లు స్నేహారెడ్డిఫ్రెండ్ షిప్ డే.. వీడియో పోస్ట్ చేసిన తమన్నాబీచ్లో స్పెషల్ యాచ్‌లో సోనాల్ ఎంజాయ్వరలక్ష్మి వ్రతం చేసిన హీరోయిన్ అనన్య నాగళ్లశ్రావణ మాసం.. పద్ధతిగా రెడీ అయిన బిగ్‌బాస్ హారికనిండు చంద్రుడ్ని చూస్తూ ఆస్వాదిస్తున్న మౌనీ రాయ్ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
ఏప్రిల్ నెల స్వీట్ మెమొరీస్ అంటూ ఫోటోలు షేర్ చేసిన 'అల్లు స్నేహ'
-
తోడుగా, నీడగా.. ఐకాన్ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్
విమర్శలు ఎక్కుపెట్టినవారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు.. అతడి ప్రయాణం చూసిన ఎవరైనా ఔరా అనాల్సిందే! ఈసారి పాన్ ఇండియాను కాకుండా పాన్ వరల్డ్ బాక్సాఫీస్‌కే ఎక్కుపెట్టాడు బన్నీ. అట్లీతో సినిమా.. దీనికి హాలీవుడ్ టెక్నీషియన్స్ వీఎఫ్ఎక్స్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.గడిచిన ఏడాది కష్టంగా..సాదాసీదా హీరో నుంచి ఐకాన్ స్టార్ వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు బన్నీ. అయితే ఆయన సంతోషాన్నే కాకుండా కష్టాన్ని కూడా ఇష్టంగా పంచుకుంది భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy). గడిచిన ఏడాది బన్నీ పుష్ప 2 హిట్‌తో భారీ విజయం అందుకున్నాడు. కానీ అతడు సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్‌కు వెళ్లినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందడం.. ఆ కేసు తన మెడకు చుట్టుకోవడంతో ఆ సంతోషమే లేకుండా పోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టయి ఒక రాత్రి జైలులో గడపడం అతడి జీవితంలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.43వ బర్త్డేఅతడు జైలు నుంచి తిరిగి ఇంటికి చేరుకోగానే స్నేహ చంటిపిల్లలా అతడిని హత్తుకుంది. ఆ సమయంలో కుటుంబాన్ని తనే జాగ్రత్తగా చూసుకుంది. తాజాగా ఆమె అల్లు అర్జున్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నా జీవితంలో ప్రేమను పంచిన నీకు 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జీవితంలో నీతో కలిసి నడుస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఫ్యామిలీ సంతోషంగా ఉన్న వీడియో క్లిప్పింగ్స్‌ను పొందుపరిచింది. అలాగే బన్నీతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు బన్నీకి మీరే బలం అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు: కీర్తి భావోద్వేగం -
Allu Arjun: ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' పుట్టినరోజు.. మధురమైన జ్ఞాపకాలు (ఫోటోలు)
-
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి (Allu Sneha Reddy)కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. సినిమాల్లో నటించకపోయినా ఓ స్టార్ హీరోయిన్‌కు ఉన్నంత ఫాలోవర్స్‌లో ఆమెకు ఉన్నారు. తరచు అల్లు అయాన్, అర్హ ఫోటోలను షేర్ చేయడంతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు హెల్త్ టిప్స్ కూడా ఇస్తుంటారు. అందుకే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను పెద్ద ఎత్తున ఫాలో అవుతుంటారు.తాజాగా స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఓ అమ్మాయికి బ్లడ్ ఎక్కిస్తున్నట్లుగా ఓ ఫోటో షేర్ చేశారు. ‘నాకు ప్రస్తుతం ఏం కావాలంటే’ అంటూ దీనికి క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ బ్లడ్ ప్యాకెట్‌పై ట్రావెల్ అని రాసుంది. దీనిని చూసిన అల్లు అభిమానులు అల్లు కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయ్యిందా అని ఆందోళన చెందుతున్నారు. ఆమెకే హెల్త్ బాగోలేక ఆస్పత్రిలో చేరిందని, ఈ విషయాన్ని చెప్పడానికే ఆ ఫోటోని షేర్ చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అల్లు స్నేహ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.కాగా,అల్లు అర్జున్-స్నేహల వివాహం 2011 మార్చి 6న జరిగింది. ఈ జంటకి 2014లో అయాన్ జన్మించగా.. 2016లో అర్హ పుట్టింది. అల్లు అర్జున్ సినిమాలు, షూటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉంటే..స్నేహ ఫ్యామిలీని చూసుకుంటూ భర్తకు తోడుగా ఉంటుంది. -
ఐకాన్ స్టార్ వారసుడి బర్త్ డే.. బన్నీ దంపతుల స్పెషల్ విషెస్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు అని ముద్దుగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సైతం అయాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.అయాన్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ప్రత్యేకంగా వీడియోను షేర్ చేసింది. అయాన్‌తో సంతోషంగా ఉన్న క్షణాలను వీడియో రూపంలో పంచుకుంది. నువ్వు మా జీవితంలో భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ స్నేహా రెడ్డి పోస్ట్ చేసింది. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) Many many happy returns of the day to the love of my life … Happy Birthday my Chinni Babu #AlluAyaan 😘😘😘 pic.twitter.com/1r6fn7xXdc— Allu Arjun (@alluarjun) April 3, 2025 -
కుంభమేళాకు వెళ్లిన హీరో విజయ్ దేవరకొండ ఫొటోలు వైరల్
-
వరల్డ్ ఫేమస్ లవర్.. పుష్ప గాడు ప్రేమిస్తే అట్టా ఉంటది మరి
-
ఇన్‌స్టాలో ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్న అల్లు అర్జున్.. ఎవరంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. ఇప్పుడీ పేరు యావత్ సినీ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ గుర్తింపు కోసం బన్నీ చాలా కష్ట పడ్డాడు.వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనదైన నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘ఐకాన్ స్టార్’ స్థాయికి వచ్చాడు. సినిమాల రికార్డులను బద్దలు కొట్టడమే కాదు.. సోషల్ మీడియాలోనూ బన్నీ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య 28.5 మిలియన్స్‌కి చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు.(చదవండి: మెగా వర్సెస్ అల్లు.. అసలేం జరుగుతుంది?)ఒక్కే ఒక్కరుఇన్స్టాలో బన్నీకి 28.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే.. ఆయన మాత్రం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. ఆ ఒక్కరు ఎవరంటే అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డినే. ఆమెను మాత్రమే బన్నీ ఫాలో అవుతున్నాడు. ఇన్‌స్టాలో స్నేహరెడ్డికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆమెకు 9.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. బన్నీతో పాటు రామ్ చరణ్, చిరంజీవి, ఉపాసనలను కూడా స్నేహా రెడ్డి ఫాలో అవుతోంది. బన్నీ మాత్రం మొదటి నుంచి ఎవరిని ఫాలో అవ్వడం లేదు. కానీ రామ్ చరణ్ మొన్నటి వరకు అల్లు అర్జున్‌ని ఫాలో అయ్యాడు. సడెన్‌గా ఏం జరిగిందో కానీ.. తాజాగా చరణ్ కూడా బన్నీని అన్ ఫాలో చేశాడు. ప్రస్తుతం చరణ్‌కి ఇన్‌స్టాలో 26 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. ఆయన 38 మందిని ఫాలో అవుతున్నారు. అందులో అల్లు శిరీష్,చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఉన్నారు.బయటపడ్డ విభేధాలుఅల్లు అర్జున్‌ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో స్నేహంగా ఉండే బన్నీ, చరణ్‌ల మధ్య ఏం జరిగింది? ఎందుకు అన్ ఫాలో చేశారనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఇరు కుటుంబాల విభేదాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన పని.. ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
క్యూట్ గెటప్‌లో అల్లు అర్హ, అయాన్ డ్యాన్స్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాన్నైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన పిల్లలు అర్హ (Allu Arha), అయాన్లకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అందులో పిల్లలిద్దరూ క్యూట్ గెటప్‌లో కనిపించారు. క్లాస్‌మేట్స్‌తో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. అర్హ, అయాన్ తమ స్కూల్ ఈవెంట్లో ఇలా వింత గెటప్‌తో డ్యాన్స్ చేసినట్లు కనిపిస్తోంది. అర్హ ముందు వరుసలో ఉంటే అయాన్ మాత్రం వెనకాల నిల్చున్నాడు.పుష్ప 2తో కలెక్షన్ల ఊచకోతఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. రూ.1800 కోట్ల పైనే వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. సునీల్, జగపతిబాబు, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు.సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాబన్నీ తన నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయనున్నట్లు తెలుస్తోంది. శివుడి కుమారుడు కార్తికేయుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అటు థియేటర్ యాజమాన్యంతోపాటు ఇటు అల్లు అర్జున్ను సైతం అరెస్ట్ చేశారు. దీనిపై బన్నీ కోర్టును ఆశ్రయించగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.చదవండి: గొర్రెల కాపరిగా కొనసాగుతా.. నాకదే ఇష్టం!: బిగ్‌బాస్ విన్నర్ -
అల్లు అర్జున్ భార్య భావోద్వేగం
-
తిరుమలలో కుండపోత.. స్వామి వారిని దర్శించుకున్న స్నేహారెడ్డి, రాధిక (ఫొటోలు)
-
నేడు అల్లు అర్జున్ కేసు తుది తీర్పు.. తిరుమలలో సతీమణి స్నేహారెడ్డి
ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌పై నమోదైన కేసుకు సంబంధించి నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల(2024) సమయంలో తనపై నంద్యాలలో నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, దానిని కొట్టివేయాలంటూ అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.అల్లు అర్జున్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టు పరిశీలించింది. అయితే నవంబరు 6న తుది తీర్పు ఇవ్వనున్నట్లు ధర్మాసనం ప్రకటించడంతో ఆయన ఆభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తిరుమలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డిబుధవారం తెల్లవారుజామున బన్నీ సతీమణి స్నేహరెడ్డి తిరుమల చేరుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పురోహితుల నుంచి వేదాశీర్వచనం పొందారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమెతో పాటుగా అల్లు అర్జున్ లేరని తెలుస్తోంది. మరో నెలరోజుల్లో పుష్ప విడుదల కానున్నండంతో ఆయన సినిమా షెడ్యూల్ విషయంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. -
అల్లు స్నేహా అట్లతద్ది పూజ.. ఇది ఎందుకు చేస్తారంటే?
ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే కొందరు ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తుంటారు. అల్లు అర్జున్ స్నేహా కూడా ప్రతి పండగని వదలకుండా జరుపుతూ ఉంటుంది. సంక్రాంతి, ఉగాది, వరలక్ష్మి వ్రతం.. ఇలా ఎప్పటికప్పుడు వాటిని చేస్తూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అట్లతద్ది చేసుకుంది.(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది అశ్విని మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే తదియ, చతుర్థి నాడు 'అట్ల తద్ది'ని జరుపుకొంటారు. ఉత్తరాదిలో అయితే దీన్ని 'కర్వా చౌత్' అంటారు. పెళ్లి కానీ అమ్మాయిలు.. మంచివాడు భర్తగా రావాలని దేవుడికి ఈ పూజ చేస్తారు. ఇక పెళ్లయిన వాళ్లయితే భర్త ఆయురారోగ్యలతో ఉండాలని ప్రార్థిస్తారు.అల్లు స్నేహా కూడా వేకువజామునే లేచి అట్లతద్ది చేసుకుంది. ఎర్ర చీరలో అందంగా ముస్తాబై మరీ భర్త బాగోగులు కోసం పూజ చేసింది. ఆ ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లు స్నేహ బర్త్‌డే స్పెషల్: ఐకాన్ స్టార్.. స్టైలిష్ వైఫ్ (ఫోటోలు)