అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్ | Allu Arjun Wife Sneha Mobbed By Fans Cafe Niloufer | Sakshi
Sakshi News home page

Allu Arjun: రీసెంట్ టైంలో ఇది మరీ ఎక్కువవుతోంది!

Jan 4 2026 7:19 PM | Updated on Jan 4 2026 7:19 PM

Allu Arjun Wife Sneha Mobbed By Fans Cafe Niloufer

ఎప్పటినుంచో ఈ సమస్య ఉన్నప్పటికీ.. రీసెంట్ టైంలో ఇది మరీ ఎక్కువగా అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం 'రాజాసాబ్' ప్రమోషన్‌లో భాగంగా ఓ మాల్‌కి నిధి అగర్వాల్ వచ్చింది. వెళ్లే క్రమంలోనే అక్కడున్న జనం ఈమెని చాలా ఇబ్బంది పెట్టేశారు. అందుకు సంబంధించిన మాల్ యాజమాన్యంపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఇలానే అల్లు అర్జున్, అతడి భార్య కాస్త ఇబ్బంది పడ్డారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రకుల్ రొమాంటిక్ కామెడీ సినిమా)

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఇకపోతే హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు సినిమాస్ పేరిట కొత్తగా పెద్దగా థియేటర్‌ని నిర్మించాడు. దీని లాంచింగ్ తర్వాత తిరిగెళ్లే క్రమంలో హైటెక్ సిటీలోని ఓ కేఫేకి భార్య స్నేహతో కలిసి వెళ్లాడు. దీని నుంచి బయటకొచ్చే క్రమంలోనే వీళ్లని అక్కడున్న జనం చుట్టుముట్టారు. దీంతో బన్నీ, అతడి భార్య కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇదే కాదు కొన్నిరోజుల క్రితం ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత వెళ్లి వస్తున్న టైంలో ఇలాంటిదే జరిగింది. మలేసియాలో 'జన నాయగణ్' ఈవెంట్ ముగించుకుని చెన్నై తిరిగొచ్చిన తర్వాత విమానాశ్రయంలో అయితే హీరో విజయ్‌ని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఇతడు దాదాపు కిందపడిపోయేంత ఇబ్బంది పెట్టారు. ఏదేమైనా ఈ మధ్య సెలబ్రిటీలు బయట తిరగడం చాలా కష్టమైపోతోంది.

(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్‌ వచ్చేసింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement