మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో వెంకటేశ్ ముఖ్యమైన పాత్రలో నటించారు. నయనతార హీరోయిన్. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పటివరకూ చూడని సరికొత్త చిరంజీవిని ఈ చిత్రంలో చూడబోతున్నారంటూ అనిల్ రావిపూడి చెప్పడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.
తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. తనదైన మార్క్‌తో ఈ ట్రైలర్‌ను అనిల్ కట్ చేశారు. కామెడీ పంచ్లతో పాటు చిరంజీవి మెరుపులు కూడా చూడొచ్చు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా చిరును ఫుల్ యాక్షన్ మోడ్‌లో కూడా చూపించినట్లు తెలుస్తోంది.


