'అర్ధరాత్రి 2 గంటలకు అతనికే కాల్ చేస్తా'.. అనుపమ షాకింగ్ ఆన్సర్ | Dhruv Vikram, Anupama Parameswaran spark dating rumours with cute selfie | Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: 'అర్ధరాత్రి 2 గంటలకు అతనికే కాల్ చేస్తా'.. అనుపమ షాకింగ్ ఆన్సర్

Feb 19 2026 7:41 PM | Updated on Feb 19 2026 7:51 PM

Dhruv Vikram, Anupama Parameswaran spark dating rumours with cute selfie

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గతేడాది వరుస సినిమాలతో అలరించింది. బైసన్, పరదా, కిష్కింధపురి చిత్రాలతో అభిమానులను మెప్పించింది. అయితే ప్రస్తుతం ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. దర్శకుడు ఆర్జే షాన్ కాంబినేషన్‌లో మరోసారి కనిపించనుంది.

అయితే ఇటీవల ముంబయిలో ఓ అవార్డ్ వేడుకలో పాల్గొన్న అనుపమ అందరి దృష్టిని ఆకర్షించింది. బైసన్ కో స్టార్ ధృవ్ విక్రమ్‌తో కలిసి సందడి చేసింది. ఈ వేదికపై అనుపమకు హ్యాపీ బర్త్ డే అంటూ ధృవ్ విక్రమ్ విషెస్ తెలిపాడు. ఆ తర్వాత యాంకర్‌ అనుపమకు ఓ ప్రశ్న వేసింది. ఇండస్ట్రీలో అర్ధరాత్రి రెండు గంటలకు కాల్ చేయాలంటే ఎవరికీ చేస్తావ్ అని ప్రశ్నించింది. దీనికి అనుపమ ఆసక్తికర సమాధానమిచ్చింది. నేను ధృవ్‌కు కాల్ చేస్తానని నవ్వుతూ ఆన్సరిచ్చింది.

ఇది చూసిన నెటిజన్స్‌ వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట డేటింగ్‌లో ఉన్నారంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన మరో అవార్డుల ఫంక్షన్‌లోనూ అనుమపతో ఉన్న సెల్ఫీని ధృవ్ విక్రమ్  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి డేటింగ్‌ రూమర్స్  మరింత బలంగా వినిపిస్తున్నాయి. అయితే తమపై వస్తున్న రూమర్స్‌పై ఎవరూ కూడా స్పందించలేదు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement