breaking news
Dhruv Vikram
-
విక్రమ్ తనయుడి బైసన్.. ఓటీటీకి వచ్చేది ఆ రోజే!
కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించిన చిత్రం బైసన్. ఇటీవలే దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని కబడ్డీ బ్యాక్ డ్రాప్లో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను ఓ వారం రోజుల గ్యాప్ తర్వాత అక్టోబర్ 24న తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ధ్రువ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రం నవంబర్ 21 నుంచి డిజిటల్‌గా అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ నెలలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్‌న్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమే బైసన్. #BisonKaalamaadan is expected to be streaming on November 21 in #Netflix !#SaiSango #TAMILTVHouse #DhruvVikram #Pasupathy #AnupamaParameswaran #BisonKaalamaadanOnNetflix pic.twitter.com/QxFLAk6e7x— TAMIL TV House (@tamiltvhouse) November 10, 2025 -
'బైసన్' తర్వాత టాలెంటెడ్ దర్శకుడితో 'ధ్రువ్' కొత్త సినిమా
కోలీవుడ్‌లో ఆదిత్య వర్మ చిత్రంతో విక్రమ్ వారసుడిగా ధ్రువ్ పరిచయం అయ్యాడు. అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్‌గా తమిళ్లో విడుదలైంది. అలా తొలి చిత్రంతోనే నటనలో సత్తా చాటుకున్న ధ్రువ్‌కు ఆ చిత్రం ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాతి చిత్రం మహాన్ కూడా నేరుగా ఓటీటీలో స్ట్రమింగ్ కావడంతో సరైన థియేటరికల్ చిత్రం కోసం చాలా రోజులు వేచి చూశారు. అలాంటి సమయంలో దర్శకుడు మారీ సెల్వరాజ్ దృష్టిలో ధ్రువ్ పడ్డారు. ఫలితంగా బైసన్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 17వ తేదీన తమిళ్లో విడుదలైంది. అక్కడ అనూహ్య విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా ఇదే టైటిల్‌తో అక్టోబర్ 24న విడుదల కానుంది. ఈ చిత్రం ఒక్కసారిగా అతన్ని లైమ్ టైమ్‌లో తీసుకొచ్చింది. దీంతో ధ్రువ్ విక్రమ్ తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా డాడా చిత్రం ఫేమ్ గణేష్ బాబు దర్శకత్వంలో ధ్రువ్ విక్రమ్ తదుపరి నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. డాడా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు గణేష్ బాబు నటుడు ధ్రువ్ కోసం మంచి కథను సిద్ధం చేసినట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దర్శకుడిగా గణేష్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధ్రువ్‌తో సినిమా చేస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. -
హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ ‘బైసన్’ మూవీ ఈవెంట్ (ఫొటోలు)
-
నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి: విక్రమ్ వారసుడు
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్(Dhruv Vikram) నటించిన కొత్త సినిమా బైసన్(Bison Kaalamaadan) . ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ధృవ్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాని మారి సెల్వరాజ్ తెరకెక్కించగా.. పా.రంజిత్ సమర్పించారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కోసం ధ్రువ్ చాలానే కష్టపడ్డాడు. తమిళ్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బైసన్ ఈనెల 24న తెలుగులో కూడా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో బైసన్ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. అయితే, టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ధ్రువ్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'మీతో మాట్లాడటానికి మూడేళ్లు వెయిట్ చేశాను.. ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. మా నాన్న విక్రమ్ మాదిరే నేను చాలా కష్టపడతాను. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి. నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. నాకు తెలుగులో సినిమాలు చేయాలని ఉంది.. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి.' అంటూ తెలుగులోనే స్పీచ్ అదరగొట్టారు. ఏదో ఒక రోజు నాకు కొడుకు పుట్టి ఇలాగే సూట్‌కేస్ కొనడానికి వెళ్తే షాప్ ఓనర్ మీ నాన్న #Dhruv అంటే నాకు చాలా ఇష్టం అనిపించుకోవాలి... రాసుకొచ్చి తెలుగులో ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చిన Hero #DhruvVikram 👌👏 pic.twitter.com/ZthsjHBCks— Rajesh Manne (@rajeshmanne1) October 21, 2025 -
అనుపమ పరమేశ్వరణ్ కొత్త సినిమా.. లవ్ సాంగ్ చూశారా?
తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా బైసన్.. ఈ చిత్రంలో హీరోగా విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి తీరేనా.. వేదన అనే మెలోడీ పాటను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళంలో ఈ నెల 17న విడుదల కానుండగా.. తెలుగులో ఇదే నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథలా ఈ చిత్రం వుండనుంది. -
స్టార్ హీరో కొడుకు కోసం ముగ్గురు హీరోయిన్లు?
తమిళ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. అయినా సరే ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో 'బైసన్' అనే మూవీ చేస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రం చివరిదశకు చేరుకుంది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీలో ధ్రువ్‌కి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ)మరోవైపు హిందీలో గతేడాది హిట్ అయిన 'కిల్' చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మ దీన్ని తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్ కోసం ధ్రువ్ విక్రమ్ హీరోగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులోనే ధ్రువ్‌కి జంటగా కాయదు లోహార్, అనుపమ పరమేశ్వరన్, కేతిక శర్మని తీసుకున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఒరిజినల్ హిందీ వెర్షన్లో ఒక హీరోయినే ఉంటుంది. కానీ తమిళం, తెలుగు భాషల్లోకి వచ్చేసరికి 'కిల్' చిత్ర కథలో మార్పులు చేసి ముగ్గురు హీరోయిన్లని ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?) -
మరో లవ్‌స్టోరీతో రాబోతున్న మణిరత్నం.. హీరో ఎవరంటే?
జయాపజయాలు అనేవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. ఇంకా చెప్పాలంటే అపజయాలను ఎదుర్కోని మనిషే ఉండడు. సినిమా రంగం ఇందుకు అతీతం కాదు. ముఖ్యంగా మణిరత్నంకు ఇండియన్ ఏస్ డైరెక్టర్ అనే పేరు ఉంది. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు అలాంటివి. ఓ నాయకన్, ఒక దళపతి ,ఒక ముంబాయి ఇలా చెప్పుకుంటూ పోతే మణిరత్నం దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇటీవల కూడా పొన్నియన్ సెల్వన్ అంటే చారిత్రిక కథా చిత్రాన్ని ఆయన అద్భుతంగా సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించారు. అలాంటి దర్శకుడు తాజాగా దర్శకత్వం వహించిన థగ్‌లైఫ్ చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయనపై విమర్శల దాడే జరిగింది. అలాగని మణిరత్నం కృంగిపోలేదు. అలాగైతే ఆయన అన్ని సూపర్ హిట్ చిత్రాలను అందించే వారే కాదు.తాజాగా మరో యూత్ ఫుల్ లవ్‌స్టోరీతో రావడానికి సిద్ధమవుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. అందుకు ఆయన యువ నటుడు, స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నట్లు, కథానాయిక రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ధ్రువ్ విక్రమ్ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈయన మారిసెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. క్రీడా నేపథ్యంగా రూపొందుతున్న బైసన్ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. కాగా తదుపరి ధ్రువ్‌విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రుక్మిణి వసంత్ జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రాన్ని సెప్టెంబర్‌లో సెట్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా త్వరలో వెలుపడే అవకాశం ఉంది. -
స్టార్ హీరో తనయుడి యాక్షన్ చిత్రం.. దీపావళి బాక్సాఫీస్ వద్ద పోటీ!
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం'బైసన్ కాలమడాన్'. హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.ఇది ఫుట్‌బాల్ క్రీడ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథా చిత్రమని చెప్పారు. ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. షూటింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నటి అనుపమ పరమేశ్వరన్ నాయకిగా నటించిన ఇందులో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో నటుడు ధృవ్ విక్రమ్ చాలా కొత్తగా ఉండి చిత్రంపై మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. బైసన్ కాలమడాన్ చిత్రం అప్లాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు తమిళ చిత్ర పరిశ్రమలో మరో మైలు రాయిగా నిలిచిపోతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. విభిన్న కథ, బలమైన కథనం, ఉత్తమ సాంకేతిక కళాకారుల శ్రమ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. -
తనకంటే చిన్నోడితో.. అనుపమా ఇదేంటమ్మా..?
-
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్‌కి ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్‌కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్‌చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్‌చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్‌కి తీసుకొచ్చారు రామ్‌చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్‌తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్‌గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్‌గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్‌గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్‌బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్‌ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
స్టార్ హీరో తనయుడితో అజయ్ భూపతి కొత్త సినిమా!
తొలి సినిమా ‘ఆర్.ఎక్స్ 100’తోనే టాలీవుడ్లో ఓ సంచలనం సృష్టించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత తెరకెక్కించిన ‘మహా సముద్రం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ‘మంగళవారం’మూవీతో మళ్లీ కల్ట్ హిట్ కొట్టాడు. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలలతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. (చదవండి: దేవర..ఇక్కడ 20.. అమెరికాలోనూ 20కి పైనే!)ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించాడు. దీంతో అజయ్ నెక్ట్స్ మూవీ అదే అకున్నారు. కానీ దాని కంటే ముందు ఓ భారీ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట అజయ్.యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఓ మంచి స్టోరీ రెడీ చేశాడట. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు పాటు తమిళ్లో కూడా విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిందట. ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఓ భారీ నిర్మాత సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ చిత్ర ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.


