విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన సూపర్ హిట్ సినిమా బైసన్(Bison) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం మొదట తమిళ్ ఆ తర్వాత అక్టోబర్ 24న తెలుగులో రిలీజ్ అయింది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్‌టెయిన్‌మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సినిమాతో ధ్రువ్‌కు నేషనల్ స్థాయిలో అవార్డ్ రావచ్చని కూడా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.
బైసన్(Bison) సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. నవంబర్ 21 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ఆ సంస్థ ఒక పోస్టర్‌తో ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ఈ వీకెండ్‌లో ఓటీటీలో చూసేయండి.

కథేంటంటే?
తమిళనాడుకు చెందిన కబడ్డీ క్రీడాకారుడైన మనతి గణేశన్ జీవితం ఆధారంగా బైసన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ మొత్తం 1990 దశకం నేపథ్యంలో సాగుతుంది. వనతి కిట్టన్(ధ్రువ్ విక్రమ్) జపాన్‌లో జరుగుతున్న 12వ ఆసియా క్రీడలకు ఎంపికవుతాడు. ఎన్నోఏళ్లపాటు ఎదురుచూస్తున్న తన కల ఎట్టకేలకు నెరవేరిందని తన గ్రామం మొత్తం సంతోషంలో ఉంటారు. కానీ, పలు కారణాల వల్ల అతను మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం దొరకదు. తనలో ప్రతిభ ఉన్నప్పటికీ ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా బెంచ్‌కి పరిమితం అవుతాడు. ఈ క్రమంలోనే ఇండియా, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దవుతుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక అయిన తర్వాత కూడా తనని బరిలోకి దింపకపోవడంతో నిరాశకు గురవుతాడు. అలాంటి సమయంలో కిట్టన్ ఏం చేశాడు.. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కిట్టన్ పాక్ జట్టుతో పోటీకి దిగాడా.. అతన్ని అడ్డుకున్నది ఎవరు.. అనేది తెలియాలంటే బైసన్ చూడాల్సిందే.


