మలయాళంలో ఈ ఏడాది ది బెస్ట్ ఫిల్మ్ అనిపించుకున్న వాటిలో 'ఎకో' ఒకటి. మూవీ లవర్స్ ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలానే ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు దానికి తెరపడింది. ఓటీటీలోకి వచ్చింది. అయితే తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి రాకపోవడంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ తెలుగు వెర్షన్ రిలీజ్ ఎప్పుడు?
నవంబరులో థియేటర్లలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'(Eko Movie). అద్భుతమైన హిట్ అనిపించుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఓటీటీలో డబ్బింగ్ వస్తుందని తెలిసి ఆనందపడ్డారు. లెక్క ప్రకారం ఈరోజు(డిసెంబరు 31) అన్ని భాషలు అందుబాటులోకి వచ్చేయాలి. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం మలయాళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. వచ్చే బుధవారం(జనవరి 07) తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వెర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.
(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)
'ఎకో' విషయానికొస్తే ఇదో ఫారెస్ట్ థ్రిల్లర్. ఐదేళ్లుగా కనిపించకుండా పోయిన కురియాచన్ అనే వ్యక్తి కోసం చాలామంది వెతుకుతుంటారు. కుక్కల సంరక్షకుడిగా పేరున్న ఇతడికి ఎన్నో నేరాలతో సంబంధముందనేది అందరూ నమ్మే నిజం. భార్య మ్లాతి కూడా ఈ రహస్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది. నక్సలైట్లని వేధించడంతో పాటు ఎందరినో హింసించడం వెనక ఇతడి హస్తం ఉందని నమ్మి.. పోలీసులు, విలన్స్ వెంటపడుతూ ఉంటారు. అయితే అడవిలో ఉన్న క్రూరమైన కుక్కలకు, బయటకు కనిపించని మాఫియా ప్రపంచానికి లింక్ ఏంటనేదే మిగతా స్టోరీ.
కేరళలోని అటవీ ప్రాంతాల్లో రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమా తీయడం విశేషం. గతంలో మలయాళంలో వచ్చిన సూక్ష‍్మదర్శిని, కిష్కిందకాండం లాంటి డబ్బింగ్ మూవీస్ నచ్చితే దీన్ని అస్సలు మిస్ కావొద్దు. స్టోరీ నెమ్మదిగా సాగుతుంది అనిపించినప్పటికీ ట్విస్టులు మైండ్ బ్లాక్ చేస్తాయి. 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, సందీప్ ప్రదీప్, వినీత్ తదితరు అదరగొట్టే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
(ఇదీ చదవండి: యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు)


