హీరోయిన్ సమంత.. ఈ నెల ప్రారంభంలో రెండో పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్ల నుంచి వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దగా సోషల్ మీడియాలో సామ్ కనిపించలేదు. ఇప్పుడు భర్తతో కలిసి ఫారిన్ ట్రిప్‌లో ఉన్నట్లు ఫొటోలు పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: అడ్రస్ చెప్పిన మారుతి.. కడుపు నింపేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్)
డిసెంబరు 1న సమంత పెళ్లి జరగ్గా.. నాలుగు రోజులకే సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయింది. 'మా ఇంటి బంగారం' పేరుతో తీస్తున్న ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తోంది. నిర్మాత కూడా ఈమెనే. ఇప్పుడు చిత్రీకరణలో కాస్త గ్యాప్ దొరకడంతో భర్త రాజ్‌తో కలిసి పోర్చుగల్‌లోని లిస్బన్ సిటీకి వెళ్లిపోయింది. అక్కడే షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చెప్పాలంటే సమంతకు ఇది హనీమూన్ ట్రిప్ అనొచ్చు!
సమంత గతంలో నాగచైతన్యని పెళ్లిచేసుకుంది. కానీ నాలుగేళ్లకే విడిపోయారు. గత కొన్నాళ్ల నుంచి ఒంటరిగానే ఉంటున్న సామ్.. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్‌కి కనెక్ట్ అయింది. ఇతడికి గతంలో శ్యామోలి అనే రచయితతో పెళ్లయింది. కానీ ఆమెకు విడాకులు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అలా పెళ్లి బంధంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్న వీళ్లిద్దరూ.. రీసెంట్‌గా కలిసి కొత్త జీవితం ప్రారంభించారు. సమంత నిర్మిస్తున్న సినిమాలకు రాజ్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)




