ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి నిన్న మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన దానికంటే ఇందులో కథని మరింత రివీల్ చేశారు. విజువల్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. దీని దెబ్బకు మూవీపై హైప్ కూడా కాస్త పెరిగింది. ట్రైలర్‌కి హిట్ టాక్ రావడం ఏమో గానీ దర్శకుడు మారుతిని ప్రభాస్ ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. మారుతి ఇంటికి ఓ సర్‌ప్రైజ్ పంపించారు. ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో 'రాజాసాబ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమా ఏ మాత్రం డిసప్పాయింట్ చేసిన తనని విమర్శించొచ్చని చెబుతూ కొండాపూర్‌లోని తన ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడు.
(ఇదీ చదవండి: చిరు-వెంకటేశ్.. మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్)
లేటెస్ట్ ట్రైలర్ చూసి తెగ సంబరపడిపోతున్న ప్రభాస్ అభిమానులు.. మారుతి ఇంటికి బిర్యానీ పార్సిల్స్ పంపిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు తన ట్విటర్‌లో బయటపెట్టాడు. ఓ ఫొటో కూడా పోస్ట్ చేశాడు. ట్రైలర్‍కే ఈ రేంజ్ అభిమానం చూపిస్తున్నారంటే.. మూవీ గనక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇంకెన్ని పార్సిల్స్ పంపిస్తారో ఏంటో?
'రాజాసాబ్' మూవీ జనవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ముందురోజు రాత్రి అంటే 8వ తేదీన రాత్రి ప్రీమియర్ల వేయనున్నారు. ఈ సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)
Meerentraaa intha violent ga unnaru…
Address ichindi vere daniki
Meeru ila kooda vaadeskuntunnaru 🤣🤣 https://t.co/8EJ1KZhH9y— The RajaSaab (@rajasaabmovie) December 30, 2025


