మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్నిరోజుల ముందే ఈ మూవీలోని రెండు పాటల్ని రిలీజ్ చేయగా.. వాటిలో మీసాల పిల్ల బాగా వైరల్ అయింది. మరో సాంగ్ మాత్రం అంతంత మాత్రంగానే బాగుందనిపించింది. ఇప్పుడు మరో గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో చిరు, వెంకీ కలిసి స్టెప్పులేయడం విశేషం.
(ఇదీ చదవండి: ప్రేమలో మోసపోయే అమ్మాయి కథ.. ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా)
చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా చెప్పాడు. అలానే చిరు-వెంకీ కలిసి ఓ పాటలో డ్యాన్స్ కూడా చేస్తారని అన్నాడు. ఇప్పుడు దాన్ని 'మెగా విక్టరీ సాంగ్' పేరిట విడుదల చేశారు. పాట విషయానికొస్తే బీట్ బాగుంది కానీ ట్యూన్ మాత్రం ఎక్కడో విన్నామో అనిపించేలా ఉందనిపించింది.
ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న.. 'మన శంకర వరప్రసాద్ గారు' థియేటర్లలోకి వస్తోంది. దీని కంటే ముందు 9వ తేదీన 'రాజాసాబ్'.. తర్వాత 13వ తేదీన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15వ తేదీన శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' రాబోతున్నాయి. మరి వీటిలో ఈసారి ఏయే చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయనేది చూడాలి?
(ఇదీ చదవండి: మహిళా అభిమాని పెళ్లి.. సర్‌ప్రైజ్ చేసిన హీరో సూర్య)


