అభిమానుల పెళ్లికి సినిమా హీరో లేదా హీరోయిన్లు వెళ్లడం టాలీవుడ్‌లో ఎప్పుడైనా చూశారా? అస్సలు చూసుండరు. మహా అయితే వ్యక్తిగత సిబ్బంది పెళ్లి జరిగితే కొన్నిసార్లు కనిపిస్తారంతే. కానీ కోలీవుడ్‌లో మాత్రం ఫ్యాన్స్ పెళ్లిలో హీరోలు కనబడటం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. హీరో సూర్య ఇప్పుడు అలానే ఓ లేడీ ఫ్యాన్‌కి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో షాక్ అవడం ఆమె వంతైంది.
(ఇదీ చదవండి: ప్రభాస్ అందుకే చీర బహుమతిగా ఇచ్చాడు.. రాజాసాబ్ హీరోయిన్)
అరవింద్ అనే కుర్రాడు కాజల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు కాబోయే భార్యకు హీరో సూర్య అంటే చాలా ఇష్టం. దీంతో రిక్వెస్ట్ చేసి సూర్య తన వివాహానికి వచ్చేలా ఒప్పించాడు. ఈ విషయాన్ని చివరి నిమిషం వరకు కాజల్‌కు చెప్పలేదు. సడన్‌గా కల్యాణ మండపంలో సూర్యని చూసి ఆమె షాకైంది. ఈ మొత్తాన్ని వీడియోగా తీసి కొత్త పెళ్లి జంట.. దాన్ని తమ ఇన్ స్టా పేజీ 'కాదల్స్'లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇదే కాదు గతంలోనూ సూర్య.. పలువురు అభిమానుల పెళ్లికి హాజరై సర్‌ప్రైజ్ చేశాడు. తమిళ హీరో విశాల్, ఆర్య, కార్తీ, ధనుష్ తదితర హీరోలు కూడా ఫ‍్యాన్స్ వివాహాలకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో హీరోలు ఇలా చేస్తున్నారు. మరి తెలుగులో ఇలా అభిమానుల పెళ్లికి గానీ శుభకార్యాలకు గానీ అటెండ్ అయిన హీరోలు ఎంతమంది ఉన్నారు?
(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?)


