విజయ్‌ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్‌..? | Vijay Deverakonda And Rashmika Mandanna Will Get Marriage On This Date, Rumours Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

విజయ్‌ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్‌..?

Dec 30 2025 9:17 AM | Updated on Dec 30 2025 10:57 AM

Vijay devarakonda and rashmika will get marriage this date

హీరో విజయ్‌ దేవరకొండ, హీరో­యిన్‌ రష్మిక మందన్నా నిశ్చితార్థం   జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ వారు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ, సరైన సమయంలో ఆ విషయం గురించి చెబుతానని ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్‌లోని విజయ్‌ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.  అయితే, ఇప్పుడు పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.

సోషల్‌మీడియాలో వస్తున్న తాజా సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరి 26న విజయ్‌-రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్‌ జరుగుతుంది.  ఘనంగా పెళ్లి జరిపేందుకు  ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నారని టాక్‌. అయితే,  ఇందులో నిజమెంతో తెలియాలంటే విజయ్‌-రష్మికలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement