'ది రాజాసాబ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరాఠీ బ్యూటీ రిద్ది కుమార్ మాట్లాడుతూ.. తనకు ప్రభాస్ గిఫ్ట్‌గా ఒక చీరను ఇచ్చారని చెప్పిన విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత అదే చీరను ఈ కార్యక్రమం కోసం కట్టుకొని వచ్చానని ఆమె చెప్పింది. అయితే, రిద్ది కుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆమెకు చీర గిఫ్ట్‌గా ప్రభాస్ ఎందుకు ఇచ్చాడు అంటూ పలు రకాలుగా కామెంట్లు వచ్చాయి. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసలు కారణం చెప్పింది.
ప్రభాస్ పుట్టినరోజు నాడు ఆయనకు ఒక గిఫ్ట్‌ను ఇచ్చానని అందుకు రిటర్న్‌గా ఒక చీరను ఇచ్చారని రిద్ది కుమార్ ఇలా చెప్పారు. 'మూడేళ్ల క్రితం నేను రాజా సాబ్ సెట్‌లో ఎంట్రీ ఇచ్చిన నాడే ప్రభాస్ పుట్టినరోజు.. ఆయనకు ఏదైనా ఒక కానుక ఇవ్వాలనుకున్నాను. ఆ సమయంలో కుదరలేదు. తర్వాత దీపావళి ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కర్ణుడి స్టోరీకి సంబంధించిన ఒక పుస్తకాన్ని ప్రభాస్‌కు ఇచ్చాను.

నిజజీవితంలో కూడా ప్రభాస్ స్వభావం కర్ణుడికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆయనకు ఆ బుక్ ఇచ్చాను. దానికి రిటర్న్ గిఫ్ట్‌గా నాకు హనుమాన్ చాలీసా పుస్తకంతో పాటు కొన్ని చాక్లెట్స్, వైట్ శారీ ఇచ్చారు. ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాను. నాటి నుంచి ఆ హనుమాన్ చాలీసా బుక్ నా బ్యాగ్‌లోనే ఉంది. అయితే, కొద్దిరోజుల తర్వాత కల్కి సినిమాలో కర్ణుడిగా ప్రభాస్ నటించారని తెలిసి ఆశ్చర్యపోయాను.' అని రిద్ది కూమార్ చెప్పారు.
ది రాజా సాబ్ సినిమా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతం అందించాడు.


