ప్రేమలో మోసపోయే అమ్మాయి కథ.. ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా | Beauty Movie Telugu OTT Streaming Details Update | Sakshi
Sakshi News home page

Beauty OTT: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌పై ప్రకటన

Dec 30 2025 3:43 PM | Updated on Dec 30 2025 4:14 PM

Beauty Movie Telugu OTT Streaming Details Update

ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. రెగ్యులర్ స్టోరీలానే అనిపించినప్పటికీ సమాజంలో జరిగే విషయాల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'బ్యూటీ'. ప్రేమలో మోసపోయే అమ్మాయి కథతో తీసిన ఈ మూవీలో తండ్రి ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండాయి. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

అంకిత్, నీలఖి, నరేశ్, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బ్యూటీ'. టీనేజీ ప్రేమకథకు తోడు తండ్రి ఎమోషన్స్‌తో తీశారు. సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 02 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు.

(ఇదీ చదవండి: మహిళా అభిమాని పెళ్లి.. సర్‌ప్రైజ్ చేసిన హీరో సూర్య)

'బ్యూటీ' విషయానికొస్తే.. నారాయణ (నరేశ్) మధ్య తరగతి వ్యక్తి. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. కూతురు అలేఖ్య(నీలఖి) అంటే నారాయణకు ప్రాణం. ఆమె అడిగింది కొనిస్తూ, అందులో తన ఆనందాన్ని వెతుక్కుంటుంటాడు. ఇంటర్ చదివే అలేఖ్య.. అనుకోకుండా పెట్ ట్రైనర్ అర్జున్ (అంకిత్)తో ప్రేమలో పడుతుంది. ఇంట్లో ప్రేమ విషయం తెలిసిపోవడంతో అర్జున్‌తో పాటు అలేఖ్య లేచిపోతుంది. అలా కూతురుని వెతుక్కుంటూ నారాణయ.. హైదరాబాద్ వెళ్తాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఈ మూవీ స్టోరీ అంతా మనం రోజూ చూసినట్లే ఉంటుంది గానీ.. చూపించిన విధానం, పాత్రల తీరుతెన్నులు కట్టిపడేస్తాయి. బ్యూటీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కాలేజ్‌కి పంపిన 18 ఏళ్ల కూతురు ప్రేమలో పడుతుంది. దాని వల్ల కన్న తల్లితండ్రులు ఎంత బాధపడ్డారు? లేచిపోయిన కూతురు ఎలాంటి ఇబ్బందుల్లో పడిందీ అని కళ్లకు కట్టినట్లు చూపించారు. తండ్రిగా నరేశ్ ఆకట్టుకునే ఫెర్ఫార్మాన్స్ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ అందుకే చీర బహుమతిగా ఇచ్చాడు.. రాజాసాబ్ హీరోయిన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement