ఓటీటీలు వచ్చిన తర్వాత మూవీ లవర్స్ కూడా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు. ఇలా థ్రిల్లర్, హారర్ జానర్ చిత్రాలకు ఎక్కువగా ఆదరణ ఉంటోంది. ఇప్పుడు అలా ఓ తమిళ హిట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. డబ్బుల దోపిడీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
(ఇదీ చదవండి: ప్రేమలో మోసపోయే అమ్మాయి కథ.. ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా)
తమిళ యువ హీరో కవిన్ లేటెస్ట్ మూవీ 'మాస్క్'. రుహానీ శర్మ హీరోయిన్ కాగా ఆండ్రియా విలన్‌గా చేసింది. సహ నిర్మాతగానూ వ్యవహరించింది. నవంబరు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించింది. మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జీ5లో జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి తమిళ వెర్షన్ గురించి మాత్రమే క్లారిటీ ఇచ్చారు. త్వరలో తెలుగులోనూ తీసుకొస్తారేమో చూడాలి?
'మాస్క్' విషయానికొస్తే.. వేలు (కవిన్) అనే డిటెక్టివ్‌కి భూమి(ఆండ్రియా) అనే లేడీ బ్రోకర్ దగ్గర నుంచి రూ.440 కోట్లు దొంగిలించిన సొమ్ము రికవరీ చేయమని ఓ డీల్ వస్తుంది. అసలు ఇంత డబ్బు భూమి దగ్గరకు ఎలా వచ్చింది? రాజకీయ నాయకుడు మణివన్నన్‌కి, రాబోయే ఎన్నికలకు, రూ.440 కోట్లకు ఏంటి సంబంధమనేదే ఈ సినిమా స్టోరీ. కవిన్ హీరోగా అదరగొట్టేయగా, ఆండ్రియా కూడా బాగానే చేసింది. డబ్బుల దోపిడీ తరహా థ్రిల్లర్ మూవీస్ ఇష్టముంటే ఇది ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఓ లుక్కేసేయండి.
(ఇదీ చదవండి: చిరు-వెంకటేశ్.. మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్)
2025 Massive Heist Thriller #Mask Premieres On Jan 9th On ZEE5💰@Kavin_m_0431 @andrea_jeremiah @tsmgo_official @Vikyashok16 @gvprakash @BlackMadras1 @iRuhaniSharma @thilak_ramesh @KalloriVino #Charle #ArchanaChandhoke @RDRajasekar #RamarEditor @jacki_art @cine_santhosh… pic.twitter.com/qR5YgE7F0z
— ZEE5 Tamil (@ZEE5Tamil) December 30, 2025


