సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న యామినీ ఈఆర్.. టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'క్వీన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే ప్రస్తుత సొసైటీతో ముడిపడి ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాళ్లమీద పేర్లతో కొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. తాజ్ మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమ కథ అని చెప్పుకొచ్చారు.
తను ప్రేమించిన వ్యక్తి కలని నిజం చేస్తూ, అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో స్ఫూర్తి కలిగించేలా చూపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే మూవీలో కాలకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్. ఈ మూవీలో కీలకమైన తండ్రి పాత్ర కోసం 90స్ హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు.


