చిన్నప్పటి నుంచి తను నా పెళ్లాం అనుకున్నారా! | Roshan And Sridevi Band Melam Movie Latest Glimpse | Sakshi
Sakshi News home page

Sridevi-Roshan: 'కోర్ట్' జంట మరో సినిమా.. కొత్త గ్లింప్స్ రిలీజ్

Feb 14 2026 2:25 PM | Updated on Feb 14 2026 3:27 PM

Roshan And Sridevi Band Melam Movie Latest Glimpse

'కోర్ట్' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన జంట శ్రీదేవి-రోషన్. వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. వచ్చే నెల 13వ తేదీన థియేటర్లలోకి రానుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు. బ్రేకప్ అయినప్పుడు హీరో బాధపడుతున్నట్లు ఇందులో చూపించారు.

'కోర్ట్' మూవీ ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఇది తెలంగాణ నేపథ్యంగా ఉండనుంది. సతీష్ జవ్వాజి దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించాడు. మరి రోషన్-శ్రీదేవి ఈసారి ఏం చేస్తారో చూడాలి? గ్లింప్స్‌లో ఎమోషన్ చూపించినప్పటికీ.. హీరో, తన ఫ్రెండ్‌కి తాళి కట్టడం ఫన్నీగా అనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement