శ్రీకాంత్ కొడుకు రొమాంటిక్ కామెడీ సినిమా.. వీడియో రిలీజ్ | Roshan Meka Emo Emo Idi Movie Glimpse | Sakshi
Sakshi News home page

Emo Emo Idi Movie: 'హిట్' చిత్రాల దర్శకుడు తీసిన తొలి ప్రేమకథ

Feb 14 2026 2:47 PM | Updated on Feb 14 2026 3:35 PM

Roshan Meka Emo Emo Idi Movie Glimpse

'హిట్' ఫ్రాంచైజీ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను.. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అన్నీ థ్రిల్లర్సే తీశాడు. ఇప్పుడు రూటు మార్చి తొలిసారి ఓ ప్రేమకథని తెరకెక్కిస్తున్నాడు. అదే 'ఏమో ఏమో ఇది'. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో కాగా ప్రీతి ముకుందన్ హీరోయిన్. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ బ్రీజ్ పేరిట సినిమా కాన్సెప్ట్ ఏంటనే విషయాన్ని రివీల్ చేశారు.

సింగల్ మదర్ పెంపకంలో పెరిగే అభయ్(రోషన్).. ఓ కెఫే యజమాని అయిన అపూర్వ(ప్రీతి ముకుందన్)తో ఎలా ప్రేమలో పడ్డాడు? ఈ జర్నీలో ఏమేం జరిగింది? అనేది సినిమా స్టోరీలా అనిపిస్తుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరాకే థియేటర్లలోకి మూవీ వస్తుందని ప్రకటించారు. గతంలో 'పెళ్లి సందD', 'ఛాంపియన్' చిత్రాలు చేసిన రోషన్.. వాటితో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈసారి ఏం చేస్తాడో చూడాలి?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement