breaking news
Roshan Meka
-
‘ఛాంపియన్’లో ఈ నటుడిని గుర్తుపట్టారా?
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడు రోషన్ మేకా హీరోగా నటించిన తాజా చిత్రం ఛాంపియన్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలై పాజిటిట్ టాక్ని సంపాదించుకుంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఓ ఆటగాడి నేపథ్యంలో చూపిస్తూనే.. ఓ చక్కని ప్రేమ కథను చెప్పారు. ఈ చిత్రంలోని రంగయ్య పాత్ర అందరిని ఆకట్టుకుంది. తక్కువ నిడివే ఉన్నప్పటికీ..సినిమా చూసినవాళ్లకు ఆ పాత్ర కూడా గుర్తిండిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచిన ఆ కారెక్టర్లో నటించింది విజయ్ దేవరకొండ మేనమామ యశ్ రంగినేని.నిర్మాతగా హిట్ సినిమాలు!యశ్ రంగినేని నిర్మాతగా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.నటన పై ఇష్టంతో..నిర్మాతగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. యశ్‌కి నటన అంటే చాలా ఇష్టం. అందుకే వచ్చిన అవకాశం వదులుకోలేదు. ఛాంపియన్‌లో వీరయ్య పాత్ర కోసం తనను సంప్రదించగానే.. కథ నచ్చి వెంటనే ఓకే చెప్పేశాడట. ఓ చదువు రాని వ్యక్తిగా, గ్రామీణ జీవితాలకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా వీరయ్య పాత్రలో యశ్ రంగినేని ఒదిగిపోయారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రహించడం, లోలోపల అగ్ని జ్వాలలు రగిలేట్టుగా భావాలతో ఉండే ఈ పాత్రలో యశ్ రంగినేని చక్కగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. -
‘ఛాంపియన్’ మూవీ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఛాంపియన్’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు వచ్చింది.తొలి షోకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ..మొదటి రోజు అత్యధికంగా రూ. 4.5 కోట్లు రాబట్టింది. అయితే రెండో రోజు మాత్రం కలెక్షన్స్ తగ్గిపోయాయి. శుక్రవారం ఈ సినిమాకు రూ. 2.4 కోట్ల కలెక్షన్స్ లభించాయి. మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ ఫుట్‌బాల్ ఆటగాడిగా నటించి, మెప్పించాడు. అనస్వర రాజన్ హీరోయిన్గా నటించగా.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. (ఛాంపియన్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఛాంపియన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘ఛాంపియన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నిర్మాలా కాన్వెంట్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా..పెళ్లి సందడి మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని పీరియాడికల్ ఫిల్మ్ ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘ఛాంపియన్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రోషన్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1747-48 ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్(రోషన్)కి ఫుట్‌బాల్ ఆట అంటే చాలా ఇష్టం. ఈ ఆటతోనే ఎప్పటికైనా ఇంగ్లాండ్ వెళ్లి..అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఓసారి ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం వస్తుంది. కానీ అతని తండ్రి చేసిన ఓ పని వల్ల వెళ్లలేకపోతాడు. దొంగమార్గాన ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటాడు. దాని కోసం కొన్ని తుపాకులను ఒక చోటుకి తరలించాల్సి వస్తుంది. ఆ పని చేసే క్రమంలో పోలీసుల కంటపడతారు. వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరాన్‌పల్లి అనే గ్రామానికి వస్తాడు. అదే ఊరికి చెందిన చంద్రకళ(అనస్వర రాజన్)తో పరిచయం.. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు రోషన్‌లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? పోలీసు అధికారి బాబు దేశ్‌ముఖ్ (సంతోష్ ప్రతాప్)తో మైఖేల్ గొడవ ఏంటి? బైరాన్‌పల్లి ప్రజల కోసం మైఖేల్ చేసిన త్యాగమేంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..ప్రపంచంలోని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి చాలా ప్రత్యేకత ఉంది. అందులో బైరాన్‌పల్లి గ్రామస్తులు చేసిన పోరాటం మరింత ప్రత్యేకం. ప్రాణాలు పోతాయని తెలిసినా.. నిజాం పాలకులపై ఎదురుదాడి దిగారు. ఒకనొక దశలో రజాకార్లకే ముచ్చమటలు పట్టించారు. ఆ ఊరి ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్నే ‘చాంపియన్’లో మరోసారి చూపించారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చినప్పటికీ.. ఓ ఆటగాడి కోణంలో సాయుధ పోరాటాన్ని చూపించడం.. అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చెప్పడం ‘ఛాంపియన్’ స్పెషల్. అది తప్పితే ఈ సినిమా కథంతా రొటీన్‌గానే సాగుతుంది. పైగా చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. ఆపరేషన్ పోలోకి దారి తీసిన సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రజాకార్ల అరచకాలు.. బైరాన్‌పల్లి ప్రజల పోరాటాన్ని చూపించి.. కథను సికింద్రాబాద్‌కి మార్చాడు. అక్కడ ఆంగ్లో ఇండియన్ కుర్రాడిగా హీరో పరిచయం.. ఫుట్‌బాల్ టోర్నమెంట్, కోవై సరళ, వెన్నెల కిశోర్ సన్నివేశాలన్నీ కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో ఎప్పుడైతే బైరాన్ పల్లి గ్రామానికి వస్తాడో.. అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌తో పరిచయం.. నాటక ప్రదర్శన.. 'గిర్రా గిర్రా.. పాట ఇవన్నీ ఎంటర్టైనింగ్గా సాగుతాయి. బైరాన్పల్లిపై రజాకార్ల దాడి జరగడం.. హీరో ఊరి పోరాటంలో భాగమవ్వడం.. అవ్వడంతో సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరుగుతుంది. అయితే ద్వితియార్థంలోనూ డ్రామాపైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేశాడు. కథనాన్ని పరుగులు పెట్టించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఎమోషనల్ సన్నివేశాలనే హైలెట్ చేశాడు. కానీ అవి పూర్తిగా వర్కౌట్ కాలేదు. ప్రేమ కథ ఒకవైపు.. సాయుధ పోరాటం మరోవైపు.. ఈ రెండిటిలో దేనికి ప్రేక్షకుడు పూర్తిగా కనెక్ట్ కాలేదు. రజాకార్లలో అసలు పోరాటం మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి నేపథ్యం.. ఆయన చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. హీరో తండ్రి పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించడం ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. భావేద్వేగానికి గురి చేసేలా క్లైమాక్స్ ఉంటుంది. ఎవరెలా చేశారంటే..మైఖేల్ సి విలియమ్స్ పాత్రలో రోషన్ ఒదిగిపోయాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్‌ని అదరగొట్టేశాడు. డ్యాన్స్ కూడా ఇరగదీవాడు. యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. తాళ్లపూడి చంద్రకళగా అనస్వర తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది. రాజిరెడ్డి పాత్రకు నందమూరి కల్యాణ్ చక్రవర్తి అంతగా సెట్ అవ్వలేదు. తెలంగాణ యాసను పలకడంలో ఆయన తడబడ్డాడు. పాత్ర సుందరయ్యగా మురళీశర్మ ఆకట్టుకుంటారు. రచ్చరవి, మురళీధర్ గౌడ్, బలగం సంజయ్, అర్చనతో పాటు మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తోటతరణి ఆర్ట్ వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా.. మెలోడీ సాంగ్ రిలీజ్
నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్.. బాలనటుడిగా కాస్త పరిచయమే. 'రుద్రమదేవి' మూవీలో అలా నటించాడు. కాస్త పెద్దోడు అయిన తర్వాత 'నిర్మల కాన్వెంట్' చిత్రంతో హీరో అయ్యాడు. 2021లో 'పెళ్లి సందD' అనే సినిమా చేశాడు. దీనితోనే శ్రీలీల.. హీరోయిన్గా టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ మూవీ తర్వాత శ్రీలీల వరస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ అయిపోయింది. రోషన్ మాత్రం మరో మూవీ చేయలేకపోయాడు. ఇన్నాళ్లకు ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. అదే 'ఛాంపియన్'.(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్ రాంబాయి' నిర్మాత ఎమోషనల్)డిసెంబరు 25న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకుడు కాగా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్. ఈమెకు ఇదే తొలి తెలుగు మూవీ. విడుదలకు మరో నెల ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలి పాటని రిలీజ్ చేశారు. 'గిర గిర గింగిరిగిరే' అంటూ సాగే రామ్ మిర్యాల పాడిన ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా) -
నాలుగేళ్ల తర్వాత రోషన్ కొత్త సినిమా.. గ్లింప్స్ రిలీజ్
హీరోగా 100కి పైగా తెలుగు సినిమాలు చేసిన శ్రీకాంత్.. ఇప్పుడు విలన్, సహాయ పాత్రలు చేస్తున్నాడు. ఈయన కొడుకు రోషన్.. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందD లాంటి మూవీస్ చేశాడు గానీ బ్రేక్ రాలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని 'ఛాంపియన్' మూవీ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ)2021లో పెళ్లి సందడి వచ్చింది. శ్రీలీల తొలి తెలుగు సినిమా ఇది. ఈ నాలుగేళ్లలో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోగా.. అదే మూవీలో హీరోగా చేసిన రోషన్.. ఇప్పుడు మరో మూవీ మొదలుపెట్టాడు. ఈ రోజు ఇతడి పుట్టినరోజు. ఈ క్రమంలోనే గ్లింప్స్ రిలీజ్ చేశారు. చూస్తుంటే 90స్ బ్యాక్ డ్రాప్ లో ఫుట్ బాల్ గేమ్ డ్రామాతో నడిచే సినిమా అని అర్థమైంది. మహానటి, సీతారామం చిత్రాల్ని నిర్మించిన వైజయంతీ సంస్థ నిర్మిస్తుండగా.. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. మరి ఈ ఏడాది రిలీజ్ చేస్తారో వచ్చే ఏడాది మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్) -
క్రికెట్ గాడ్ సచిన్‌తో ఉన్న ఈ తెలుగు హీరోను గుర్తుపట్టారా?
పై ఫోటోలో ఉన్న పిల్లాడిని గుర్తుపట్టారా? క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రేమగా పట్టుకున్న ఆ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా సైమా అవార్డు సైతం అందుకున్నాడు. శ్రీలీలతోనూ ఓ సినిమా చేశాడు. ఇతడి తండ్రిటాలీవుడ్లో సీనియర్ నటుడు.. ఈపాటికే ఇతడెవరో గుర్తుపట్టే ఉంటారు. తొలి సినిమాతోనే క్రేజ్ సచిన్ టెండూల్కర్‌తో ఉన్న ఆ పిల్లాడు మరెవరో కాదు.. సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ మేక. శ్రీకాంత్ ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తండ్రిలోని నటనను పుణికి పుచ్చుకున్న రోషన్ రుద్రమదేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. నిర్మల కాన్వెంట్‌తో హీరోగా మారాడు. ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం రిలీజైన ఐదేళ్ల తర్వాత పెళ్లి సందD మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ సినిమాకు పాజిటివ్ స్పందన లభించింది. ఇప్పుడేం చేస్తున్నాడు? ప్రస్తుతం రోషన్.. వృషభ సినిమా చేస్తున్నాడు. ది వారియర్ అరైజ్ అనేది ఉపశీర్షిక. ఇందులో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రా నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 2024లో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Roshann meka (@iamrshn) View this post on Instagram A post shared by Roshann meka (@iamrshn) చదవండి: మంజుల ఇల్లు చూశారా? ఇంటీరియర్ అదిరింది.. ఏకంగా ఆరు బాల్కనీలు..


