టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఛాంపియన్’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు వచ్చింది.తొలి షోకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ..మొదటి రోజు అత్యధికంగా రూ. 4.5 కోట్లు రాబట్టింది.
అయితే రెండో రోజు మాత్రం కలెక్షన్స్ తగ్గిపోయాయి. శుక్రవారం ఈ సినిమాకు రూ. 2.4 కోట్ల కలెక్షన్స్ లభించాయి. మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ ఫుట్‌బాల్ ఆటగాడిగా నటించి, మెప్పించాడు. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించగా.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. (ఛాంపియన్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


