బాలీవుడ్‌ మూవీ.. పైసా తీసుకోని తమన్నా, విక్రాంత్‌! | Vishal Bhardwaj: Vikrant Massey, Tamannaah Bhatia Did Not Take a Penny for O'Romeo | Sakshi
Sakshi News home page

మాట మీద నిలబడ్డ హీరో.. తమన్నా కూడా అన్ని రోజులు ఉచితంగా..

Feb 9 2026 6:23 PM | Updated on Feb 9 2026 6:26 PM

Vishal Bhardwaj: Vikrant Massey, Tamannaah Bhatia Did Not Take a Penny for O'Romeo

వాలంటైన్స్‌ డే కానుకగా అనేక సినిమాలు రిలీజవుతున్నాయి. అలా ప్రేమికుల దినోత్సవానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న బాలీవుడ్‌లో 'ఓ రోమియో' రిలీజవుతోంది. విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షాహిద్‌ కపూర్‌, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. విక్రాంత్‌ మాస్సే, దిశా పటానీ, తమన్నా భాటియా, నానా పటేకర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

స్టార్‌ అవడానికి ముందే..
అయితే విక్రాంత్‌ మాస్సే, తమన్నా ఈ సినిమాను ఉచితంగానే చేశారట! ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ స్వయంగా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితమే విక్రాంత్‌ మాస్సే 'ఓ రోమియో' చేసేందుకు ఒప్పుకున్నాడు. 12th ఫెయిల్‌ తర్వాత అతడు పెద్ద స్టార్‌ అయ్యాడు. ఆ తర్వాత తనను మళ్లీ కలిశాను. విక్రాంత్‌ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అయితే ఉచితంగానే నటిస్తానన్నాడు. 

ఉచితంగానే..
నేను డైరెక్ట్‌ చేసిన మఖ్బూల్‌ సినిమా చూసి ప్రేరణ పొందే సినిమాల్లోకి వచ్చానని, అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు. అందుకు బహుమతిగా ఈ మూవీలో ఉచితంగా యాక్ట్‌ చేశాడు. 8-9 రోజులపాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. తమన్నా కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే యాక్ట్‌ చేసింది. తన పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాలో అదే కీలకం. తమన్నా దాదాపు 12 రోజులపాటు షూటింగ్‌కు వచ్చింది. అంతేకాకుండా రిహార్సల్స్‌కు కూడా వచ్చింది అని విశాల్‌ భరద్వాజ్‌ గుర్తు చేసుకున్నాడు.

చదవండి: సెట్‌లో దోసెలు వేసిన ఐశ్వర్య రాజేశ్‌

Advertisement
 
Advertisement
Advertisement