సెట్‌లో దోసెలు వేసిన ఐశ్వర్య.. వీడియో వైరల్‌ | Aishwarya Rajesh Prepares Dosa in Sets, Shares Video | Sakshi
Sakshi News home page

వేడిగా దోసెలు వేసి వడ్డించిన హీరోయిన్‌.. ఇదే ఇష్టమంటూ!

Feb 9 2026 5:26 PM | Updated on Feb 9 2026 5:55 PM

Aishwarya Rajesh Prepares Dosa in Sets, Shares Video

సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఐశ్వర్య రాజేశ్‌ దశ తిరిగిపోతుందనుకున్నారంతా! స్టార్‌ హీరోల సినిమాల్లో ఆఫర్‌ అందుకుని ఫుల్‌ బిజీ అవుతుందనుకున్నారు! కానీ, అలాంటిదేమీ జరగలేదు. పెద్ద సినిమాల ఆఫర్లు రాలేదు. దీంతో తెలుగులో చిన్న సినిమా అయినప్పటికీ కథ నచ్చడంతో 'ఓ సుకుమారి'లో కథానాయికగా నటిస్తోంది.

స్వయంగా వడ్డించిన హీరోయిన్‌
అలాగే తమిళంలో రెండు, కన్నడలో ఒక మూవీ చేస్తోంది. తాజాగా తను సెట్‌లో చెఫ్‌గా మారింది. సెట్‌లో ఉన్నవారికి స్వయంగా దోసెలు/ ఊతప్పం వేసి వడ్డించింది. సెట్‌లో ఈ పని చేయడమంటే నాకెంతో ఇష్టం అంటూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

కీర్తి ఫేవరెట్‌
పద్ధతిగా చీర కట్టుకున్న ఐష్‌.. పెనంపై చిన్న దోసెలు వేస్తూ, వాటిని తిరగేస్తూ వేడివేడిగా వడ్డించింది. ఇంకా ఎవరికి కావాలి, రండి అంటూ అక్కడున్నవారితో ఇట్టే కలిసిపోయింది.  ఈ వీడియో వైరల్‌గా మారగా కీర్తి సురేశ్‌ హే, దోసె.. దోసె అంటూ ఫన్నీ కామెంట్‌ పెట్టింది. అందుకు ఐష్‌ స్పందిస్తూ.. అవును, నీ ఫేవరెట్‌ అని రిప్లై ఇచ్చింది.

 

 

చదవండి: 

Advertisement
 
Advertisement
Advertisement