స్పిరిట్‌ నుంచి అవుట్‌? ప్రకాశ్‌ రాజ్‌ రియాక్షన్‌ ఇదే! | Prakash Raj Gives Clarity on Prabhas Spirit Exit Rumours | Sakshi
Sakshi News home page

ఇంకా షూటింగే మొదలు కాలేద్రా బాబూ.. స్పిరిట్‌ రూమర్స్‌కు కౌంటర్‌!

Feb 9 2026 3:03 PM | Updated on Feb 9 2026 3:08 PM

Prakash Raj Gives Clarity on Prabhas Spirit Exit Rumours

ప్రభాస్‌ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా స్పిరిట్‌. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఆ మధ్య వాయిస్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. అందులో ప్రకాశ్‌ రాజ్‌, ప్రభాస్‌ డైలాగులు వినిపించాయి తప్ప మనుషులు కనిపించలేదు. అయినప్పటికీ ఆడియో గ్లింప్స్‌తోనే స్పిరిట్‌కు మంచి హైప్‌ వచ్చింది.

స్పిరిట్‌పై రూమర్‌
అయితే ఈ సినిమా నుంచి ప్రకాశ్‌ రాజ్‌ తప్పుకున్నాడంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్‌తో వచ్చిన విభేదాల కారణంగానే ప్రకాశ్‌రాజ్‌ సినిమా నుంచి సైడ్‌ అయిపోయాడని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఈ ప్రచారంపై ప్రకాశ్‌ రాజ్‌ ఘాటుగానే స్పందించాడు. 

మీ ప్రచారాలు తగలెయ్య
స్పిరిట్‌ మూవీ గురించి విషపూరిత ప్రచారం చేస్తున్న అందరికీ చెప్పొచ్చేదేంటంటే.. ఇంకా సినిమాలో నా సీన్స్‌ షూటింగే మొదలవలేదు. కానీ, అంతలోనే వాట్సాప్‌ ఫ్యాక్టరీలో ఏవేవో కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కోండి, పోయి మీ పని మీరు చూసుకోండి ట్వీట్‌ చేశాడు. దీనికి నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. 

సినిమా
దీంతో స్పిరిట్‌ నుంచి ప్రకాశ్‌ రాజ్‌ తప్పుకున్నాడన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. స్పిరిట్‌ విషయానికి వస్తే.. ప్రభాస్‌, ప్రకాశ్‌రాజ్‌తో సహా వివేక్‌ ఒబెరాయ్‌, తృప్తి డిమ్రి, కాంచన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం 2027 మార్చి 5న విడుదల కానుంది.

 

 

చదవండి: బలవంతంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నా: ప్రిన్స్‌

Advertisement
 
Advertisement
Advertisement