'గాయపడ్డ సింహం' వచ్చేసింది.. | Gaya Padda Simham Movie Teaser out now | Sakshi
Sakshi News home page

'గాయపడ్డ సింహం' వచ్చేసింది..

Feb 9 2026 1:26 PM | Updated on Feb 9 2026 1:44 PM

Gaya Padda Simham Movie Teaser out now

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం’ టీజర్‌ వచ్చేసింది. ఈ చిత్రానికి ‘డోన్ట్‌ లాఫ్‌... ఇట్స్‌ ఏ సీరియస్‌ మేటర్‌’ (నవ్వొద్దు... ఇది సీరియస్‌ మేటర్‌) అనేది  క్యాప్షన్‌ ఇచ్చారు. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ టీజర్‌లో తరుణ్‌ భాస్కర్‌ పంచ్‌ డైలాగ్‌ కిక్‌ ఇచ్చేలా ఉంటుంది. 'పెళ్లి చూపులు సినిమా యావరేజ్.. కానీ, ఓవర్ హైప్ అయింది అంతే' అంటూ ఆయన డైలాగ్‌ పేలుస్తాడు.

దర్శకుడు పవన్‌ సాధినేని సమర్పణలో కాశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కల్యాణ చక్రవర్తి మంతిన, భానుకిరణ్‌ ప్రతాప, విజయ్‌ కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  పొలిటికల్‌ సెటైర్, క్రైమ్, కామెడీ వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా సాగుతుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement