'మీనా' నటించిన థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..? | Psychological Thriller Series Roslin Locks Streaming Date | Sakshi
Sakshi News home page

'మీనా' నటించిన థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Feb 9 2026 10:18 AM | Updated on Feb 9 2026 10:44 AM

Psychological Thriller Series Roslin Locks Streaming Date

ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌ సరికొత్త వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్నట్లు గతేడాదిలో  ప్రకటించింది.  ‘సౌత్‌ అన్‌బాండ్‌’ (jio hotstar south unbound) పేరుతో దాదాపు 18 ప్రాజెక్ట్‌ల వివరాలను తెలుపుతూ వాటి వివరాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా రోస్లిన్‌  అనే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్‌ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ను దర్శకుడు సుమేష్ నందకుమార్ తెరకెక్కించారు.  ‘దృశ్యం’ మూవీ దర్శకుడు జీతూ జోసెఫ్ దీనికి షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఈ వెబ్‌ సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

రోస్లిన్(Roslin) వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 27 విడుదల కానుందని జియోహాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ప్రమోషనల్ ఈవెంట్‌ల సమయంలో తేదీని వెల్లడించారు. త్వరలో ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తామని పేర్కొన్నారు. ఈ సిరీస్‌ తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్‌కు రానుంది. రోస్లిన్ టైటిల్‌ పాత్రలో సంజన దిపు అనే అ‍మ్మాయి నటించింది. మలయాళ హిట్‌ సినిమా మూథోన్‌తో మెప్పించిన సంజన.. మలయాళ పరిశ్రమలో గుర్తింపు పొందింది. దర్శకుడు జీతూ జోసెఫ్ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సుమేష్‌ ఇప్పుడు రోస్టిన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement