అప్పుడు నాకు 7ఏళ్లు.. 'ఉదయ్ కిరణ్' మేనల్లుడు వీడియో విడుదల | Uday Kiran Nephew Teja Comments On Manasantha Nuvve movie | Sakshi
Sakshi News home page

అప్పుడు నాకు 7ఏళ్లు.. 'ఉదయ్ కిరణ్' మేనల్లుడు వీడియో విడుదల

Feb 9 2026 11:04 AM | Updated on Feb 9 2026 11:17 AM

Uday Kiran Nephew Teja Comments On Manasantha Nuvve movie

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘మనసంతా నువ్వే’ సినిమా రీ రిలీజ్‌ కానుంది. 25ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి ఈ హిట్‌ మూవీ రానుంది. ఉదయ్‌కిరణ్, రీమా సేన్, తనూ రాయ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని దర్శకుడు వీఎన్‌ ఆదిత్య తెరకెక్కించగా ఎమ్‌.ఎస్‌. రాజు నిర్మించారు. అయితే, రీ-రిలీజ్‌ సందర్భంగా ఉదయ్‌కిరణ్‌ మేనల్లుడు తేజ ఒక వీడియో విడుదల చేశారు.

‘మనసంతా నువ్వే’ సినిమా గురించి ఉదయ్‌కిరణ్‌ మేనల్లుడు ఇలా అన్నారు. 'మా మామయ్య నటించిన ఈ చిత్రం 25ఏళ్ల తర్వాత రీ-రిలీజ్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా మామయ్య పట్ల ఇంత ప్రేమ, ఆదరణ ఉటుందని నేను ఊహించలేదు. మనసంతా నువ్వే మ్యాజిక్‌ను మళ్లీ చూసేందుకు ఫిబ్రవరి 14న థియేటర్స్‌కు వెళ్లండి. ఈ మూవీ విడుదల సమయంలో నా వయసు 7ఏళ్లు మాత్రమే.. నేను కూడా థియేటర్‌కు వెళ్లి మూవీ చూస్తాను. కుటుంబం మొత్తం కలిసిచూడాల్సిన సినిమా అని చెబుతాను.' అంటూ తేజ ఒక వీడియో విడుదల చేశారు.

2001లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా మనసంతా నువ్వే నిలిచింది. అప్పటికే చిత్రం, నువ్వు నేను సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఉదయ్‍కిరణ్‌కు ఇది హ్యాట్రిక్ విజయంగా నిలిచింది. ఈమూవీకి సంగీతం ఆర్.పి.పట్నాయక్ వ్యవహరించగా, పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి,  చైతన్యా రెడ్డి, రఘురామ్‌ రెడ్డి, రవికాంత్‌ రెడ్డి రీ రిలీజ్‌ చేస్తున్నారు. ‘‘ఈ సినిమా ఈ తరం యువతను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement