విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్తున్నారా?.. తరుణ్ భాస్కర్‌ ఏమన్నారంటే? | Tharun Bhascker Dhaassyam Comments on Vijay Devarakonda marriage | Sakshi
Sakshi News home page

Tharun Bhascker: విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్తున్నారా?.. తరుణ్ భాస్కర్‌ ఏమన్నారంటే?

Feb 9 2026 2:43 PM | Updated on Feb 9 2026 4:04 PM

 Tharun Bhascker Dhaassyam Comments on Vijay Devarakonda marriage

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ ఇటీవలే హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు.  ఓం శాంతి శాంతి శాంతిః. అనే మలయాళ రీమేక్‌తో పలకరించారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించింది.  అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. అంతలోనే మరో సినిమాకు రెడీ అయిపోయారు తరుణ్ భాస్కర్. ఆయన హీరోగా వస్తోన్న.  కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం. తాజాగా ఈ మూవీ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ ఈవెంట్‌కు హాజరైన తరుణ్ భాస్కర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు హీరోగా చేసిన సినిమా హిట్‌ కొట్టలేదు కదా.. మీతో సినిమా చేయడానికి నిర్మాత ఎలా ధైర్య చేశారని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందించారు. మీరు స్టోరీ రాసి ప్రొడ్యూస్‌ చేయండి.. ఆ సినిమాతో హిట్ కొడదామన్నారు. అయితే లైఫ్‌లో ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఏదీ ఆపొద్దు.. ది అందరికీ చెబుతున్నా. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని అన్నారు.  అయినా ఎందుకు సార్ నేను ఫెయిల్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారని ఫన్నీగా చమత్కరించారు.

ఇదే ఈవెంట్‌లో తరుణ్ భాస్కర్‌కు మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ దేవరకొండ మ్యారేజ్‌కి మీరు కూడా వెళ్తున్నారా? అని అడిగారు. ఇది విన్న తరుణ్.. నాకైతే ఇప్పటి వరకు ఆహ్వానం లేదు.. ఒక వేళ ఇన్విటేషన్ వస్తే మీకు వెంటనే వాట్సాఫ్‌లో ఫార్వార్డ్ చేస్తాను.. మనిద్దరం కలిసి విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్దామని తరుణ్ భాస్కర్ ఫన్నీగా పంచ్‌లు వేశారు.

కాగా.. గాయపడ్డ సింహం చిత్రానికి ‘డోన్ట్‌ లాఫ్‌... ఇట్స్‌ ఏ సీరియస్‌ మేటర్‌’ (నవ్వొద్దు... ఇది సీరియస్‌ మేటర్‌) అనేది  క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాకు కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతెన, భానుకిరణ్‌ ప్రతాప, విజయ్‌ కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సల్‌  నిర్మిస్తున్నారు.  పొలిటికల్‌ సెటైర్, క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement