ఫుల్ హ్యాపీగా సమంత- రాజ్ నిడిమోరు.. ఎందుకంటే? | Tollywood actress Samantha celebrating Her Team win at Pickle Ball Event | Sakshi
Sakshi News home page

Samantha: ఫుల్ హ్యాపీగా సమంత- రాజ్ నిడిమోరు.. వీడియో వైరల్

Feb 9 2026 3:19 PM | Updated on Feb 9 2026 3:24 PM

Tollywood actress Samantha celebrating Her Team win at Pickle Ball Event

టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో వీరిద్దరి వివాహా వేడుక జరిగింది. డిసెంబర్ 1, 2025న భూత శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుక నిర్వహించారు. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.

అయితే సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీలో నటిస్తోంది.  ఓ బేబీ మూవీ తర్వాత సామ్‌తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ కావడం విశేషం. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై భర్త రాజ్‌ నిడిమోరుతో కలిసి ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్‌ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం సామ్‌ తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్‌ లీగ్‌ను ఆస్వాదిస్తోంది. ఈ లీగ్‌లో తన టీమ్‌ విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ సందడి చేసింది. అదే సమయంలో రాజ్ నిడిమోరు కూడా అక్కడే ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సామ్, రాజ్ నిడిమోరు సినిమాల్లో కలిసి పనిచేశారు.  రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల్లో సామ్ నటించారు.  ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement