బలవంతంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నా: ప్రిన్స్‌ యావర్‌ | Bigg Boss Fame Prince Yawar Revealed He Engaged | Sakshi
Sakshi News home page

Prince Yawar: నా నెంబర్‌ తీసుకుంది తనే.. ఫ్యామిలీ ఒత్తిడి వల్లే నిశ్చితార్థం!

Feb 9 2026 2:32 PM | Updated on Feb 9 2026 3:06 PM

Bigg Boss Fame Prince Yawar Revealed He Engaged

దగ్గరి బంధువే తనను నిండా ముంచాశాడని ఇటీవలే ఓ వీడియో రిలీజ్‌ చేశాడు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, మోడల్‌ ప్రిన్స్‌ యావర్‌. అయితే కుటుంబ సభ్యుల బలవంతం వల్ల అతడి కూతుర్ని ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నానని చెప్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ప్రిన్స్‌ యావర్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎవర్నీ నమ్మడానికి లేదు. నేను నా దగ్గరి బంధువు చేతిలోనే మోసపోయాను. 

బలవంతంగా నిశ్చితార్థం
అతడు నన్ను ఓ ఫంక్షన్‌కు రమ్మని బలవంతం చేశాడు. అక్కడికి అతడి కూతురు కూడా వచ్చింది. ఆమెకు నేనంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నా నెంబర్‌ తీసుకుంది. అలా ఇద్దరం తరచూ ఫోన్‌ మాట్లాడుకునేవాళ్లం. ఆమెకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ! నా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల తనను ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాను. కానీ పెళ్లి మాత్రం జీవితంలో సెటిలయ్యాక చేసుకుంటానన్నాను. అందులో తప్పేముంది?

మోసం
ఆమె తండ్రి.. ల్యాండ్‌లో రూ.30 లక్షలు పెడితే రూ.50 లక్షలు తిరిగిస్తానన్నాడు. అంత సొమ్ము నా దగ్గర లేదు. అయినా తనను నమ్మి నేను కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఇచ్చేశాను.  నా దగ్గరున్న రూ.18 లక్షలు, నా స్నేహితుడిని అడిగి మరో రూ.5 లక్షలు.. అంటే మొత్తం రూ.23 లక్షలు ఇచ్చాను. బదులుగా రూ.40 లక్షలిస్తానన్న అతడు తర్వాత మాట మార్చేశాడు. నెలలు గడుస్తున్నా పైసా ఇవ్వలేదు. నా బ్రదర్‌కి రూ.7 లక్షలు ఇచ్చానంటున్నాడు. 

డిప్రెషన్‌
నాకు ఒక్కమాటైనా చెప్పకుండా వేరేవాళ్లకు ఎలా ఇస్తాడన్నది నా ప్రశ్న. నా డబ్బు నాకు తిరిగివ్వకపోగా తన కూతురిని అడ్డుపెట్టుకుని సింపతీ డ్రామాలు ఆడుతున్నాడు. నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడు. వాళ్ల వల్ల నేను 8 నెలలుగా డిప్రెషన్‌లో ఉన్నాను. మానసిక ప్రశాంతతను కోల్పోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అని ప్రిన్స్‌ యావర్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

చదవండి: ఫస్ట్‌ ఎవరు ప్రపోజ్‌ చేశారో చెప్పిన కరీనా కపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement