ఏడేళ్లుగా మంచానికే పరిమితం.. హైదరాబాద్‌లో ముమైత్‌ ఖాన్‌ | Mumaith Khan Against her past live viral social media | Sakshi
Sakshi News home page

ఏడేళ్లుగా మంచానికే పరిమితం.. హైదరాబాద్‌లో ముమైత్‌ ఖాన్‌

Feb 7 2026 1:57 PM | Updated on Feb 7 2026 2:13 PM

Mumaith Khan Against her past live viral social media

మహేష్‌ బాబు పోకిరి సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..' అంటూ ముమైత్‌ ఖాన్‌ ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌తో తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. బిగ్‌బాస్‌లో కూడా ఛాన్స్‌ దక్కించుకుంది.  ఆ తర్వాత ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ, హైదరాబాద్‌లో విలైక్‌ అనే అకాడమీని స్థాపించి మేకప్‌కు సంబంధించిన కోర్సులను నేర్పిస్తోంది. అయితే, తనకు జరిగిన ప్రమాదం గురించి ఆమె మరోసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్‌ అవుతున్నాయి.

బాలీవుడ్‌లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ముమైత్‌ ఖాన్‌ తన జీవితం గురించి పేర్కొంది. 2016లో ఓ రోజు తన ఇంట్లోనే కాలు జారి కింద పడింది. ఆ సమయంలో తన తల.. మంచం అంచులకు బలంగా తగిలింది. పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆస్పత్రికి వెళ్లలేదు. కానీ తల నొప్పి తీవ్రమవడంతో ఆస్పత్రికి వెళ్లింది. మూడు రోజులుగా ఆమెకు మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి ఆపరేషన్‌ చేశారు. దాదాపు 15 రోజులపాటు ముమైత్‌ కోమాలో ఉంది. ఆ తర్వాత ఆమె ఆ గాయం నుంచి కోలుకుంది. అయితే,  డాక్టర్లు సలహా మేరకే తాను ఇండస్ట్రీకి దూరం కావలసి వచ్చిందని ముమైత్ ఖాన్ తెలిపింది.

తన మెదడులో కూడా కొన్ని నరాలు దెబ్బ తినడం వల్ల  ఫిట్స్ వచ్చే ఛాన్స్‌ కూడా ఉంటుందని వైద్యులు చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకుంది. వైద్యులు సూచించిన మందులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల తన బరువు కూడా పెరిగిందని పేర్కొంది. సుమారు 7ఏళ్ల పాటు మంచానికే పరిమతం అయ్యానని ఆమె తెలిపింది. అయితే, తాను గతేడాదిలోనే పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నానని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement