బుల్లిరాజు కొత్త సినిమా.. పవర్‌పుల్‌గా టీజర్ | Tollywood Movie HIGH Teaser out now | Sakshi
Sakshi News home page

HIGH Movie Teaser: బుల్లిరాజు కొత్త సినిమా.. పవర్‌పుల్‌గా టీజర్

Feb 9 2026 5:03 PM | Updated on Feb 9 2026 5:08 PM

Tollywood Movie HIGH Teaser out now

అనన్య శర్మ,  ఎస్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు ఎస్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు.  

ఈ టీజర్ చూస్తుంటే యూత్‌ఫుల్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో సన్నివేశాలు క్రైమ్ స్టోరీని తలపించేలా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు(రేవంత్) ఈ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించాడు. కాగా.. ఈ సినిమాలో  రేవంత్‌ (బుల్లిరాజు), పల్లవి దొర, కృష్ణ కమల్‌, సాయికృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వికాస బాదిసా సంగీతమందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement