breaking news
bulliraju
-
ఒక్క సినిమాతో క్రేజ్.. బుల్లిరాజు పారితోషికం తెలిస్తే షాక్..!
గతేడాది సంక్రాంతికి వస్తున్నాం ఎంతలా హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అలరించారు.ఇదంతా పక్కన పడితే ఈ మూవీతో అందరి కళ్లు తనవైపు తిప్పుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ బుడ్డోడు. ఈ మూవీ తర్వాత రేవంత్ పేరు కాస్తా బుల్లిరాజుగా మారిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది రిలీజైన మెగాస్టార్ మూవీ మనశంకర వరప్రసాద్ చిత్రంతో బుల్లిరాజు మరోసారి అభిమానులను అలరించారు.ఇక ఇటీవలే వెంకీమామ- అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. ఈ చిత్రంలోనూ బుల్లిరాజు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వరుసగా ముచ్చటగా మూడోసారి అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన బుల్లిరాజు సందడి చేయనున్నారు.స్టార్స్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తోన్న ఈ బుడ్డోడు రెమ్యునరేషన్ గురించి టాక్ నెట్టింట వైరలవుతోంది. మన బుల్లిరాజు ఒక్క రోజుకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని లేటేస్ట్ టాక్. దీంతో ఒక్క సినిమాతో మనోడి రేంజ్ ఎలా మారిపోయిందోనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
బుల్లిరాజు.. రోజుకు రూ.లక్ష?
కొన్నిసార్లు సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ కొందరు యాక్టర్స్ వైరల్ అయిపోతుంటారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. బుల్లిరాజు అలియాస్ రేవంత్.. ఏ క్షణాన 'సంక్రాంతికి వస్తున్నాం' చేశాడో గానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అందుకు తగ్గట్లే తెలుగులో వరస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇతడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం)'సంక్రాంతికి వస్తున్నాం' హిట్ తర్వాత చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు', సింగిల్ తదితర చిత్రాల్లో కనిపించిన బుల్లిరాజు.. అనిల్ రావిపూడి తీస్తున్న వెంకటేశ్-కల్యాణ్ రామ్ మూవీలోనూ అవకాశం అందుకున్నాడట. ఇప్పుడీ బాలనటుడు రోజుకు రూ.లక్ష పారితోషికం అందుకుంటున్నాడట. కేవలం సినిమాలే కాదు మాల్స్ ఓపెనింగ్, టీవీ షోలు, యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. ఓ వీడియో వల్ల వైరల్ అయిన ఇతడిని చూసిన అనిల్ రావిపూడి సినిమాలోకి తీసుకున్నాడు. అదే 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది రిలీజైన తర్వాత బుల్లిరాజుగా హీరో వెంకటేశ్ కంటే ఎక్కువ వైరల్ అయిపోయాడనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్) -
బుల్లిరాజు కొత్త సినిమా.. పవర్‌పుల్‌గా టీజర్
అనన్య శర్మ, ఎస్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు ఎస్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే యూత్‌ఫుల్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు క్రైమ్ స్టోరీని తలపించేలా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు(రేవంత్) ఈ టీజర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించాడు. కాగా.. ఈ సినిమాలో రేవంత్ (బుల్లిరాజు), పల్లవి దొర, కృష్ణ కమల్, సాయికృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వికాస బాదిసా సంగీతమందిస్తున్నారు. -
బక్కచిక్కిన బుల్లిరాజు.. ఆ రెండు కారణాల వల్లే..
ఒక్క సినిమాతో ఫుల్ ఫేమస్ అయిపోయాడు బుల్లిరాజు. వెంకటేశ్ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో బుల్లిరాజు నోరు తెరిస్తే బూతులు.. అయినా సరే కొలికేత్త.. కొలికేత్త అంటూ బుల్లిరాజు చేసిన కామెడీకి జనాలు పడీపడీ నవ్వారు. ఇతడి కామెడీ టైమింగ్‌కు చిరంజీవి సినిమాలోనూ ఆఫర్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.డబుల్ ధమాకాఅలా 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీలోనూ మెప్పించాడు. గతేడాది బుల్లిరాజు నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలాగైతే బ్లాక్‌బస్టర్ కొట్టిందో ఈ 'మన శంకరవరప్రసాద్‌గారు' కూడా అంతే మెగా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. దీంతో బుల్లిరాజు అలియాస్ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ దశ తిరిగిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాదు, నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' మూవీలోనూ కీలక పాత్రలో మెరిశాడు. ఈ మూవీ కూడా విజయపథంలో నడుస్తుండటంతో ఈసారి సంక్రాంతికి డబుల్ ధమాకా అందుకున్నాడు.అందుకే సన్నబడ్డాడా?అయితే సినిమా ఈవెంట్స్‌లో మాత్రం కాస్త బక్కచిక్కి కనిపించాడు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి.. అతడికి వైరల్ ఫీవర్ వచ్చింది. రెండు.. తెరపై కాస్త సన్నగా కనిపించాలని బుల్లిరాజే భావించాడట! ఓ ఈవెంట్లో రేవంత్ మాట్లాడుతూ.. నేను దాదాపుగా 10 సినిమాలు చేస్తున్నాను. అన్ని సినిమాల్లో ఒకలాగే కనిపిస్తే ఏం బాగుంటుంది? ఒక మూవీలో కాస్త డిఫరెంట్‌గా కనిపిద్దాం అని డైట్ చేశా.. అందుకే సన్నబడ్డా..రెండో సినిమాయే మెగాస్టార్‌తో..ఇండస్ట్రీలో ఎవరైనా చిరంజీవిగారితో సినిమా చేయాలనుకుంటారు. నేను తీసిన మొదటి సినిమాకే ఆయనతో నటించే ఆఫర్ వచ్చింది. అది నా జీవితంలోనే ఎంతో సంతోషకరమైన విషయం.. సంక్రాంతికి వస్తున్నాంలో బూతులు తిట్టా.. కానీ, మన శంకర వరప్రసాద్లో బూతులు తిట్టలేదు. అదే తేడా.. అన్నాడు. మొత్తానికి ఒక్క సినిమాతోనే బిజీ స్టార్ అయిపోయాడు బుల్లిరాజు. సంక్రాంతి బ్లాక్బస్టర్లు ఖాతాలో వేసుకుంటూ సంక్రాంతి బుల్లోడుగా మారిపోయాడు.చదవండి: తొలి సినిమా హీరోతో అలనాటి హీరోయిన్.. 37 ఏళ్ల తర్వాత.. -
జాతీయ ఉత్తమ రైతుగా బులిరాజు
కొత్తపేట : కొత్తపేటకు అభ్యుదయ రైతు దండు సత్యనారాయణరాజు (బులిరాజు) కేరళ రాష్ట్రం కాసరగడ్‌లోని ఇండియ¯ŒS కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), సెంట్రల్ ప్లాంటేష¯ŒS క్రాప్స్ రీసెర్చ్ ఇ¯ŒSస్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ)ల నుంచి జాతీయ ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. బులిరాజు మందపల్లి సమీపంలోని తన కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు, సేంద్రియ విధానం, మైక్రో ఇరిగేష¯ŒSతో మొక్కలకు ఎరువులు, పురుగు మందుల వంటి పద్ధతుల్లో అధిక దిగుబడులు, ఆదాయం సాధిస్తున్నారు. బులిరాజు శనివారం కాసరగడ్‌లో రీసెర్చ్ ఇ¯ŒSస్టిట్యూట్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచ¯ŒS మొహపాత్ర, డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప, సోషల్ సైన్సెస్ హెడ్ డాక్టర్ ఒ.తంబ¯ŒS చేతుల మీదుగా జాతీయ ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు.


