బక్కచిక్కిన బుల్లిరాజు.. ఆ రెండు కారణాల వల్లే.. | Child Artist Bulliraju Alias Revanth Success with Sankranthi Movies | Sakshi
Sakshi News home page

సంక్రాంతి బుల్లోడు 'బుల్లిరాజు'.. స్టార్‌ హీరోల కన్నా ఫుల్‌ బిజీ!

Jan 15 2026 2:45 PM | Updated on Jan 15 2026 3:14 PM

Child Artist Bulliraju Alias Revanth Success with Sankranthi Movies

ఒక్క సినిమాతో ఫుల్‌ ఫేమస్‌ అయిపోయాడు బుల్లిరాజు. వెంకటేశ్‌​ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో బుల్లిరాజు నోరు తెరిస్తే బూతులు.. అయినా సరే కొలికేత్త.. కొలికేత్త అంటూ బుల్లిరాజు చేసిన కామెడీకి జనాలు పడీపడీ నవ్వారు. ఇతడి కామెడీ టైమింగ్‌కు చిరంజీవి సినిమాలోనూ ఆఫర్‌ ఇచ్చాడు అనిల్‌ రావిపూడి.

డబుల్‌ ధమాకా
అలా 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీలోనూ మెప్పించాడు. గతేడాది బుల్లిరాజు నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలాగైతే బ్లాక్‌బస్టర్‌ కొట్టిందో ఈ 'మన శంకరవరప్రసాద్‌గారు' కూడా అంతే మెగా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. దీంతో బుల్లిరాజు అలియాస్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ రేవంత్‌ దశ తిరిగిపోయిందని ఫ్యాన్స్‌ అంటున్నారు. అంతేకాదు, నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' మూవీలోనూ కీలక పాత్రలో మెరిశాడు. ఈ మూవీ కూడా విజయపథంలో నడుస్తుండటంతో ఈసారి సంక్రాంతికి డబుల్‌ ధమాకా అందుకున్నాడు.

అందుకే సన్నబడ్డాడా?
అయితే సినిమా ఈవెంట్స్‌లో మాత్రం కాస్త బక్కచిక్కి కనిపించాడు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి.. అతడికి వైరల్‌ ఫీవర్‌ వచ్చింది. రెండు.. తెరపై కాస్త సన్నగా కనిపించాలని బుల్లిరాజే భావించాడట! ఓ ఈవెంట్‌లో రేవంత్‌ మాట్లాడుతూ.. నేను దాదాపుగా 10 సినిమాలు చేస్తున్నాను. అన్ని సినిమాల్లో ఒకలాగే కనిపిస్తే ఏం బాగుంటుంది? ఒక మూవీలో కాస్త డిఫరెంట్‌గా కనిపిద్దాం అని డైట్‌ చేశా.. అందుకే సన్నబడ్డా..

రెండో సినిమాయే మెగాస్టార్‌తో..
ఇండస్ట్రీలో ఎవరైనా చిరంజీవిగారితో సినిమా చేయాలనుకుంటారు. నేను తీసిన మొదటి సినిమాకే ఆయనతో నటించే ఆఫర్‌ వచ్చింది. అది నా జీవితంలోనే ఎంతో సంతోషకరమైన విషయం..  సంక్రాంతికి వస్తున్నాంలో బూతులు తిట్టా.. కానీ, మన శంకర వరప్రసాద్‌లో బూతులు తిట్టలేదు. అదే తేడా.. అన్నాడు. మొత్తానికి ఒక్క సినిమాతోనే బిజీ స్టార్‌ అయిపోయాడు బుల్లిరాజు. సంక్రాంతి బ్లాక్‌బస్టర్లు ఖాతాలో వేసుకుంటూ సంక్రాంతి బుల్లోడుగా మారిపోయాడు.

చదవండి: తొలి సినిమా హీరోతో అలనాటి హీరోయిన్‌.. 37 ఏళ్ల తర్వాత..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement