ఫస్ట్‌ సినిమా హీరోతో అలనాటి హీరోయిన్‌.. 37 ఏళ్లకు! | Actress Kanaka Re Union with First Co Star Ramarajan | Sakshi
Sakshi News home page

పూర్తిగా మారిపోయిన స్టార్‌ హీరోయిన్‌.. 37 ఏళ్ల తర్వాత రీయూనియన్‌

Jan 15 2026 11:40 AM | Updated on Jan 15 2026 12:32 PM

Actress Kanaka Re Union with First Co Star Ramarajan

ముఖానికి ఇంత మేకప్‌ వేసుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పటి అందాల తార కనక. తమిళ సినీ ప్రపంచంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన దేవిక కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తమిళ, మలయాళ భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సడన్‌గా వెండితెరపై కనిపించకుండా పోయింది. 

వివాదాలతో వార్తల్లో..
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ మధ్యలో కనకకు క్యాన్సర్‌ అని, చనిపోయిందని రూమర్స్‌ రాగా అవన్నీ ఉట్టివే అని తేలిపోయాయి. తండ్రితో వివాదం కారణంగానూ వార్తల్లో నిలిచింది. కనక మానసిక పరిస్థితి సరిగా లేదని తండ్రి కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. కనక చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు దేవిక, దర్శకుడు దేవదాస్‌ విడిపోయారు. 

ఫస్ట్‌ సినిమా హీరో
తల్లీకూతురు ఒంటరిగా ఉండేవారు. తల్లి చనిపోయాక కనక మరింత ఒంటరితనం అనుభవించింది. ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని జీవించేది. వివాదాలతోనే జీవితాన్ని గడిపిన కనక తాజాగా తన మొదటి హీరోను కలిసింది. కరకట్టక్కరన్‌ అనే తమిళ చిత్రం ద్వారా కనక హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. రామరాజన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఏడాదిపాటు విజయవంతంగా ఆడింది. 

37 ఏళ్ల తర్వాత కలయిక
తాజాగా హీరో రామరాజన్‌ను కలిసింది కనక. వీరివెంట మ్యూజిక్‌ డైరెక్టర్‌ దరన్‌ కుమార్‌ కూడా ఉన్నాడు. 37 ఏళ్ల తర్వాత కలయిక అంటూ ఈ రీయూనియన్‌ ఫోటోను అతడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇది చూసిన అభిమానులు వాటే సర్‌ప్రైజ్‌ అని ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో కనకకి మేకప్‌ కొంచెం ఎక్కువైందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కనక.. తెలుగులో బ్రహ్మర్షి విశ్వామిత్ర, వాలు జడ తోలు బెల్టు సినిమాలు చేసింది.

 

చదవండి: జైలర్‌ 2లో యాక్ట్‌ చేశా.. రజనీకాంత్‌ కోసమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement