ఓటీటీలో 'తన్వి ది గ్రేట్' సినిమా.. సడెన్‌గా స్ట్రీమింగ్‌ | Tanvi The Great Movie Now Streaming OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'తన్వి ది గ్రేట్' సినిమా.. సడెన్‌గా స్ట్రీమింగ్‌

Mar 3 2026 1:08 PM | Updated on Mar 3 2026 1:15 PM

Tanvi The Great Movie Now Streaming OTT

బాలీవుడ్‌ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించి, నటించిన 'తన్వి ది గ్రేట్' (2025) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది విడుదలైన ఈ చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించిన విషయం తెలిసిందే. ఆటిజంతో బాధపడుతున్నప్పటికీ ఆర్మీలో చేరాలనే ఒక యువతి కల జీవితమే ఈ సినిమా.. ఇందులో శుభంగి దత్తా ప్రధాన పాత్ర పోషించంది. జాకీష్రాఫ్, అరవిందస్వామి, బొమన్‌ ఇరానీ, పల్లవి జోషి, నాజర్‌  వంటి స్టార్స్‌ ఈ మూవీలో నటించారు.

‘తన్వి ది గ్రేట్‌’ (Tanvi The Great) మూవీ సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది.  ఇరవై రెండేళ్ల తర్వాత అనుపమ్ ఖేర్ మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్‌’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించిన  అనుపమ్‌ ఖేర్‌.. గతేడాది ‘తన్వీ ది గ్రేట్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం.ఈ చిత్రాన్ని ఎన్‌ఎఫ్‌డీసీతో కలిసి అనుపమ్‌ స్టూడియోస్‌ నిర్మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement