ఒక్క సినిమాతో క్రేజ్.. బుల్లిరాజు పారితోషికం తెలిస్తే షాక్..! | Bulli Raju aka Revanth remunaration for Venkatesh movie goes viral | Sakshi
Sakshi News home page

Bulli Raju: ఒక్క సినిమాతో క్రేజ్.. బుల్లిరాజు పారితోషికం ఎంతంటే?

Jun 29 2026 4:48 PM | Updated on Jun 29 2026 5:15 PM

Bulli Raju aka Revanth remunaration for Venkatesh movie goes viral

గతేడాది సంక్రాంతికి వస్తున్నాం ఎంతలా హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ‍అలరించారు.

ఇదంతా పక్కన పడితే ఈ మూవీతో అందరి కళ్లు తనవైపు తిప్పుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ బుడ్డోడు. ఈ మూవీ తర్వాత రేవంత్ పేరు కాస్తా బుల్లిరాజుగా మారిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది రిలీజైన మెగాస్టార్ మూవీ మనశంకర వరప్రసాద్‌ చిత్రంతో బుల్లిరాజు మరోసారి అభిమానులను అలరించారు.

ఇక ఇటీవలే వెంకీమామ- అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. ఈ చిత్రంలోనూ బుల్లిరాజు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వరుసగా ముచ్చటగా మూడోసారి అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన బుల్లిరాజు సందడి చేయనున్నారు.

స్టార్స్‌ హీరోల సినిమాల్లో ఛాన్స్‌ కొట్టేస్తోన్న ఈ బుడ్డోడు రెమ్యునరేషన్ గురించి టాక్ నెట్టింట వైరలవుతోంది. మన బుల్లిరాజు ఒక్క రోజుకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని లేటేస్ట్ టాక్. దీంతో ఒక్క సినిమాతో మనోడి రేంజ్‌ ఎలా మారిపోయిందోనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement